Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ, బుర్రకథ కళాకారిణి జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?

Published : Oct 17, 2026, 07:01 AM IST

ఆనంది ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ `గరివిడి లక్ష్మి`. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ శనివారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?

PREV
17
గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ

ఆనంది, రాగ్‌ మయూర్‌ జంటగా, వీకే నరేష్‌, రాశి, శరణ్య, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `గరివిడి లక్ష్మి`. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. దీనికి చరణ్ అర్జున్‌ సంగీతం అందించడం విశేషం. బయోపిక్‌ తరహాలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా నేడు శనివారం (అక్టోబర్‌ 17)న విడుదలైంది. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
గరివిడి లక్ష్మి మూవీ కథ

ఒక ప్రముఖ నిర్మాత(శ్రీనివాస్‌ అవసరాల) వద్దకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌(అంకిత్‌ కొయ్య) వచ్చి సినిమా ఛాన్స్ అడగ్గా, గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా కథ రాయమని చెబుతాడు. దీంతో గరివిడి ఊరుకి వెళ్లగా, చాలా మంది లక్ష్మిలున్నట్టు తెలుసుకుంటారు. ఈ క్రమంలో గరివిడి లక్ష్మి(ఆనంది) ఫ్రెండ్‌ విజయ(శరణ్య)ని కలవగా ఆమె ముందు ఒప్పుకోదు. ఆ తర్వాత లక్ష్మి కథ చెబుతుంది. చిన్నప్పుడే తల్లి దేవకమ్మ(రాశి) తాను దేవతకు అంకితం కావడం వల్ల సంసారం చేయలేనని చెప్పడంతో భర్త వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతాడు. ఆ సమయంలో లక్ష్మి నాన్న కోసం ప్రాదేయపడగా, అమ్మ వద్దే ఉండిపోవాల్సి వస్తుంది. అమ్మ తన కొలుపు చెబుతూ బిజీగా ఉంటుంది. లక్ష్మిని పట్టించుకోదు.

దీంతో పాటకి దగ్గరవుతుంది లక్ష్మి. తానే సొంతంగా పాటలు పాడటం స్టార్ట్ చేస్తుంది. ఆమె పాట విని ఊరంతా ఆశ్చర్యపోతారు. అయితే ఓ రోజు గరివిడిలో బుర్రకథ వేసే ట్రూప్‌ వస్తుంది. వాళ్లలో లేడీ హ్యాండివ్వడంతో తమకు ఓ అమ్మాయి కావాలని చెబుతాడు సత్తిబాబు(రాగ్‌ మయూర్‌), దీంతో లక్ష్మి అమ్మని కాదని వచ్చి వారి ట్రూప్‌లో చేరి తన సొంతూరులోనే బుర్రకథ చెప్పి మెస్మరైజ్‌ చేస్తుంది. అతనితో కలిసి స్వయంగా విజయలక్ష్మి బుర్రకథని, తర్వాత గరివిడి లక్ష్మి బుర్రకథ ట్రూప్‌తో ఊరూర తిరిగి బుర్రకథలు చెబుతుంది.

అయితే ఓ దశలో తమ బుర్రకథ కూడా బోర్‌ కొట్టడంతో అందులో మార్పులు చేస్తుంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా ట్రెండీ పాటలను పాడుతూ యూవతని ఆకట్టుకుంటుంది. అనతి కాలంలోనే పాపులర్‌ అవుతుంది. ఆమె పాటలు రికార్డ్ అవుతాయి. సినిమాల్లోకి వెళ్తాయి. అయితే చిన్నప్పుడే తనకు పెళ్లి చేస్తుంది అమ్మ. కానీ అతను మోసం చేస్తాడు. ఆ తర్వాత ఒంటరిగానే ఉన్న లక్ష్మి సత్తిబాబుని ఇష్టపడుతుంది. అతను కూడా జీవితాంతం అండగా ఉంటానని చెబుతాడు, ఆ తర్వాత అతను కూడా హ్యాండిస్తాడు. మరోవైపు క్యాసెట్ల రూపంలో ఒకడు మోసం చేస్తాడు, మధ్యలోనే అమ్మ చనిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గరివిడి లక్ష్మి జర్నీ ఎలా సాగింది? ఆమె పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? ఎలాంటి మోసాలకు గురయ్యింది? చివరికి ఆమె ఏం చేసింది? అనేది మిగిలిన కథ.

37
గరివిడి లక్ష్మి మూవీ విశ్లేషణ

సినిమా కళాకారులుగానీ, ఇతర కళాకారుల జీవితాలు నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి. వారి జీవితంలోని డ్రామా, స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ఇన్‌ స్పైరింగ్‌గా ఉంటాయి. ఎలాంటి నేపథ్యంలో లేకుండా తమ టాలెంట్‌తో ఒక్కసారిగా స్టార్‌గా వెలగడం, కొన్ని తప్పులు చేయడం, జీవితంలో చోటుచేసుకునే కొన్ని సంఘటనలు వారి లైఫ్‌లను తలక్రిందులు చేస్తుంటాయి. ఆ జర్నీ ఎమోషనల్‌గా ఉంటుంది. అలాంటి జర్నీనే బుర్రకథ కళాకారిని, ఫోక్‌ సింగర్‌ గరివిడి లక్ష్మి జర్నీ. చూడ్డానికి మహానటి మూవీలోని సావిత్రి జీవితం మాదిరిగానే ఉంటుంది. ఈ సినిమా కూడా మరో మహానటిని తలపిస్తుంది.

గరివిడి లక్ష్మి చిన్నప్పుడు తనకు పాటలపై ఉన్న ఆసక్తి, బుర్రకథ వైపు టర్న్ తీసుకోవడం, తన బుర్రకథలతో పాపులర్‌ కావడం.. ఆ తర్వాత మోసం పోవడం, అది తన అనుకున్న వాళ్లే మోసం చేయడం, చివరికి జీవితాంతం అండగా ఉంటానని చెప్పి వ్యక్తి కూడా హ్యాండివ్వడం, కెరీర్‌ డౌన్‌ కావడం, స్ట్రగుల్స్ వంటి ఈ సినిమాలోని సంఘటనలు `మహానటి`లో కూడా ఉంటాయి. అందులో సావిత్రి నటి. ఇందులో లక్ష్మి బుర్రకథ కళాకారిణి, అదే తేడా, మిగిలినదంతా సేమ్‌ టూ సేమ్‌.

మూవీ ప్రారంభంలో ఆసక్తికరంగా రన్ అవుతుంది. లక్ష్మి పాటకి దగ్గరయ్యే సన్నివేశాలు ఎంగేజింగ్‌గా సాగుతాయి. చిన్నప్పటి సంఘటనలు కదిలిస్తాయి. ఇక బుర్రకథ ట్రూప్‌లోకి వెళ్లే విషయంలో అమ్మ నో చెప్పడం, కానీ లక్ష్మికి ఆసక్తి ఉన్న నేపథ్యంలో అమ్మని ఎదురించి వెళ్లడం, తానేంటో చూపించడం, అనతి కాలంలోనే పాపులర్‌ కావడం వంటి సీన్లు బాగున్నాయి. మధ్యలో కొన్ని నాటకీయపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊరు సర్పంచ్‌ పక్కలో పడుకోవాలని చెప్పడం, సత్తిబాబుని తన ఇంట్లో పెట్టుకోవడం వంటి సీన్లు ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ వరకు అలా సాఫీగా సాగుతుంది. తన వైభవం చూపించారు.

సెకండాఫ్‌లో తన డౌన్‌ ఫాల్‌, తనవాళ్లే మోసం చేయడం, తాను మోసపోవడం వంటి సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడే అసలు డ్రామా ఉంటుంది. ఆయా సీన్లు ఆకట్టుకుంటాయి. ఎంగేజ్‌ చేస్తాయి. హృదయాన్ని టచ్‌ చేస్తాయి. ఎమోషనల్‌గానూ ఉంటుంది. గరివిడి లక్ష్మి పేరుతో అనేక బుర్రకథ ట్రూప్‌లు రావడం, తన ప్లేస్‌లో వేరే వాళ్లు ఉండటం వంటి సీన్లు బాధ కలిగిస్తాయి. సెకండాఫ్‌ చాలా వరకు ఎమోషనల్‌గా వెళ్తుంది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. సినిమాని పర్‌ఫెక్ట్ మీటర్‌లో నడిపించాడు. క్లైమాక్స్ అదిరిపోయింది. భావోద్వేగభరితంగా సాగుతుంది. ఓవరాల్‌గా మూవీ అదిరిపోయిందని చెప్పొచ్చు.

47
గరివిడి లక్ష్మిలో ప్లస్‌, మైనస్‌లు

అయితే మూవీలో కొన్ని లాజిక్‌లు మిస్‌ అయ్యాయి. గరివిడి లక్ష్మి వైభవం సరిగ్గా ఎస్టాబ్లిష్‌ కాలేదనిపిస్తుంది. లక్ష్మి మోసపోయే సీన్లలోనూ ఎమోషనల్‌ డెప్త్ మిస్‌ అయ్యింది. ఆమె డౌన్‌ ఫాల్‌లో పెయిన్‌ సరిగ్గా క్యారీ కాలేదు. కొంత స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. గరివిడి లక్ష్మికి గుర్తింపు లేదనే విషయంలో లాజిక్స్ మిస్‌ అయ్యారు. ఇందులో కథ కంటే పాటలే ఎక్కువగా ఉంటాయి. పాటలు అదిరిపోయాయి. కానీ ఇలాంటి సినిమాల్లో నాటకీయత, స్ట్రగుల్స్ చాలా ముఖ్యం. వాటిని సరిగ్గా ఆవిష్కరించలేదనిపిస్తుంది. క్లైమాక్స్ ని మరింత బాగా డిజైన్‌ చేయాల్సింది. అదే సమయంలో మూవీ కొంత ఊహించేలా వెళ్తుంది. ఇక సినిమాకి మ్యూజిక్‌ హైలైట్స్. పాటలతో సినిమాని నడిపించాడు చరణ్‌ అర్జున్‌. ఆయనే ఈ మూవీకి మొదటి హీరో. ఆ తర్వాత ఆనంది అద్భుతమైన నటనతో ఇరగదీసింది. వీరిద్దరు మూవీకి బ్యాక్‌ బోన్‌గా చెప్పొచ్చు. చరణ్‌ కంటే దీనికి మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అనిపిస్తుంది. దీనికితోడు విజువల్స్, దర్శకుడు కథ, సినిమాని నడిపించిన తీరు బాగున్నాయి. ఎమోషన్స్ బాగానే పండాయి. ఇవన్నీ మూవీని మరో స్థాయికి తీసుకెళ్తాయి.

57
గరివిడి లక్ష్మి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఇరగదీసింది. వాహ్‌ అనిపించింది. డాన్సర్‌గా, సింగర్‌గా అదరగొట్టింది. పాటలతో హోరెత్తించింది. పాత్రలో జీవించి మెప్పించింది. సత్తిబాబు పాత్రలో రాగ్ మయూర్‌ నటించాడు. ఆయన పాత్రలోని డిఫరెంట్‌ షేడ్స్ తెలుస్తాయి. అతను కూడా సూపర్‌గా చేశాడు. తన బెస్ట్ ఇచ్చాడు. తనలోని కొత్త యాంగిల్‌ని ఆవిష్కరించాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ లు బాగున్నాయి. రాంబాబుగా నరేష్‌ చాలా బాగా చేశాడు. పాత్రలో జీవించాడు. లక్ష్మి అమ్మగా రాశి బాగా చేసి మెప్పించింది. విజయగా శరణ్య బాగా చేసింది. గరివిడి లక్ష్మి కథ రాద్దామనుకున్న సినిమా డైరెక్టర్‌ పాత్రలో అంకిత్‌ కోయ్య కనిపించి మెప్పించాడు. ఇతర పాత్రధారులు బాగా చేశారు.

67
గరివిడి లక్ష్మి టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి బ్యాక్‌ బోన్‌ అంటే మ్యూజిక్‌, ఆర్‌ఆర్‌. ఈ విషయంలో చరణ్‌ అర్జున్‌ ప్రాణం పెట్టాడు. సినిమాకి ప్రాణం పోశాడు. ఆయన పాటలు సినిమాని నడిపిస్తాయి. హైలైట్‌గా నిలుస్తాయి. జానపద పాటలు ఉర్రూతలూగించాయి. అదే సమయంలో ఎమోషనల్‌ సీన్లలో ఆర్‌ఆర్‌ కూడా అదిరిపోయింది. ఓవరాల్‌గా ఈ మూవీకి మ్యూజిక్‌, చరణ్‌ అర్జున్‌ ఫస్ట్ హీరో అని చెప్పొచ్చు. ఇక ఆదిత్య జవ్వాడి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కనువిందు చేస్తాయి. కొన్ని ఫ్రేమ్స్ విజువల్‌ ట్రీట్‌నిస్తాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మాణ విలువలకు కొదవలేదు. ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం గొప్ప విషయం.

దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము కథ, కథనం చాలా బాగున్నాయి. కాకపోతే చాలా వరకు `మహానటి` స్టయిల్‌నే ఫాలో అయ్యాడు. మూవీ చూస్తుంటే మహానటిలోని సీన్లే కనిపిస్తున్నాయి. ఆ ప్రభావం ఈ మూవీపై ఉందనిపిస్తుంది. పాటల డామినేషన్‌ ఉండటంతో కథ తక్కువగా ఉందనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో డ్రామా పెద్దగా పండలేదు. సెకండాఫ్‌లో అది హైలైట్‌ అవుతుంది. దీంతోపాటు కొన్ని లాజిక్కులు మిస్‌ అయ్యాయి. సెకండాఫ్‌ని మరింత ఎమోషనల్‌గా డీల్‌ చేస్తే బాగుంది. డ్రామా, స్ట్రగుల్స్, మోసాలకు సంబంధించిన సీన్లని మరింత డెప్త్ గా డీల్‌ చేస్తే ఇంకా బాగుండేది.

77
ఫైనల్‌గా

మ్యూజిక్‌ ఎమోషనల్‌ డ్రామా బయోపిక్‌ గరివిడి లక్ష్మి. పాటలతో అలరిస్తుంది. ఎమోషన్స్ తో హృదయాన్ని హత్తుకుంటుంది. సినిమా మొత్తం మహానటిని తలపిస్తుంది.

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories