
రామాయణం ఆధారంగా గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ప్రభాస్ `ఆదిపురుష్` చేశాడు. ఇది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్‌లో `రామాయణం` మూవీ తెరకెక్కింది. నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందిన `రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ మూవీని రూపొందించారు. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నేడు గురువారం (నవంబర్ 5)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కొత్తగా ఉందా లేదా? మూవీ హిట్టా ఫట్టా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకొని ఈ సినిమాని రూపొందించారు. యుగయుగాలుగా అసురులకు, దేవతలకు జరిగిన యుద్ధంలో దేవతలే విజయం సాధించారు. దేవతల పక్షపాతిగా విష్ణువు నిలిచారు. దీన్ని అసురులు జీర్ణించుకోలేరు. ఆయన్ని అంతం చేయాలని లంకా నగరంలోని అసురులు నిర్ణయించుకుంటారు. అందుకు దశాననని సిద్ధం చేయిస్తుంది వాళ్ల అమ్మ(శోభన). దీంతో ఆయన బ్రహ్మకోసం తపస్సు చేసి ఎవరి ద్వారా తనకు మరణం సంభవించకుడదనే వరం పొందుతాడు. దీంతో దేవతలను ఓడించి లంకకి అధిపతిగా పట్టాభిషేకం చేస్తాడు రావణుడు(యష్) అవుతాడు.
లంకకి మాత్రమే కాదు ముల్లోకాలకు తనే అధిపతిగా చేలామణి అవుతుంటాడు. ఇదే జరిగితే లోకానికి నష్టమని ఇంద్రుడు విష్ణువుని కోరుకుంటాడు. దీంతో అప్పుడు రాముడిని పుట్టిస్తారు. ఆయోధ్యలో దశరథ మహారాజు యజ్జఫలంగా వారి ముగ్గురు భార్యలకు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు రాముడు(రాముడు). చిన్నప్పట్నుంచి అన్ని విద్యల్లోనూ ఆరితేరతాడు. యోధుడిగా తయారవుతాడు. ఆయన్ని విశ్వమిత్రుడు తన యాగానికి రక్షణగా నియమించుకుంటాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది. తాను లోక కల్యాణం కోసం జన్మించానని.
అనంతరం సీత(సాయిపల్లవి) పరిచయం, ఆమె కోసం స్వయంవరంలో పాల్గొని శివ ధనస్సుని విరిచి ఆమెని వివాహం చేసుకుంటాడు. అయితే రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న సమయంలోనే కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన మాట ప్రకారం భరతుడికి రాజుగా పట్టాభిషేకం చేయాలని, రాముడికి 14ఏళ్ల వనవాసం అని కోరుతుంది. ఆమె కోరిక మేరకు రాముడు సీతతో కలిసి వనవాసం వెళ్తారు. వారితోపాటు లక్ష్మణుడు(రవి దుబే) కూడా వెళ్తాడు. అక్కడ పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడం, అడవికి విముక్తి ఇవ్వడం, సూర్పణక రాముడిపై మోజు పడటం, లక్ష్మణుడు ఆమె ముక్కుకోయడం, దీంతో రావణుడు వచ్చి సీతని ఎత్తుకుపోవడం వరకు ఈ సినిమాలో చూపించారు.
రామాయణం మన తెలుగువారికి చాలా బాగా తెలుసు. చిన్నప్పట్నుంచి రామాయణం వింటూ, రామాయణంపై వచ్చిన సినిమాలు, సీరియల్స్ చూస్తూ, కథలు చదువుతూ, వింటూ పెరిగాం. కథగా ఇదేమి కొత్త కాదు. కానీ ఈ `రామాయణం` మూవీని ఎలా చూపించారనేది ఇందులో ఆసక్తికరం. ఆడియెన్స్ ని ఎలా ఎంగేజ్ చేశారనేది ఇందులో మెయిన్. అలా చూస్తే ఈ సినిమాని విజువల్ ట్రీట్‌గా ప్రజెంట్ చేశారు.
వీఎఫ్‌ఎక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఆడియెన్స్ కి కనువిందు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని చోట్ల అటు ఇటుగా ఉన్నా, మెయిన్‌గా మాత్రం విజువల్ కనువిందు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తెలిసిన కథ కావడంతో కొత్తదనం ఫీలింగ్ అనిపించదు. అయితే ఈ సినిమాని రావణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం విశేషం. అది కొత్త పాయింట్. తమకు ఇలాంటి గతి పట్టించిన విష్ణువు అంతం చేయాలనే కసితో రావణాసురుడు ఉంటాడు. ఆయనకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు.
ప్రారంభంలో అరగంటకుపైగా రావణాసుడి కోణమే ఉంటుంది. ఆ తర్వాత అతన్ని అంతం చేయడానికి రాముడిని పుట్టించడం ఉంటుంది. అట్నుంచి కథ పూర్తిగా రాముడి వైపు వెళ్తుంది. అయితే రాముడు గొప్ప వాడు అని విశ్వమిత్రుడు, వాళ్ల అమ్మలు పదే పదే చెప్పడం చూపించారు. దానికి సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా చూపించలేదు. డైరెక్ట్ గా రాముడు గొప్ప అని ప్రొజెక్ట్ చేయడం అసహజంగా అనిపించింది. విశ్వమిత్రుడు యాగం చేసే సమయంలో అడవిలో వచ్చే యాక్షన్ కొంత వరకు బాగుంది.
ఆ తర్వాత సీత ఎపిసోడ్ వస్తుంది. సీత స్వయంవరం అంతా ఊహించినట్టుగానే ఉంటుంది. అందులో కిక్ లేదు. రాముడు, సీత అనేది జంటని విశ్వమిత్రుడి ద్వారా ప్రొజెక్ట్ చేయడం కన్విన్సింగ్‌గా లేదు. ధనస్సు విరవడం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత రాముడి పట్టాభిషేకం సమయంలో అయోధ్యలో దశరథుడు, కైకేయి, రాముడి మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్‌గా ఉన్నాయి. అక్కడ ఎమోషనల్ కనెక్షన్ కుదిరింది. అ తర్వాత అంతా డ్రామా వైపు టర్న్ తీసుకుంటుంది. వనవాసం ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది.
ఆ తర్వాత సీన్లు కొంత వరకు సాగదీతగానే ఉంటాయి. దశరథుడు చనిపోయిందని భరతుడు చెప్పే సీన్ ఓకే అనిపిస్తుంది. వనవాసం సీన్లు తెలిసిన సీన్లే కావడంతో బోరింగ్‌గా అనిపిస్తాయి. కానీ అక్కడ యుద్ధం కొంత వరకు మెప్పిస్తుంది. జటాయువు రావణుడితో చేసే యాక్షన్, చివర్లో రాముడి ప్రతిజ్ఞ వంటి సీన్లు మెప్పించేలా ఉన్నాయి. అదే సమయంలో సూర్పణక భర్తతో రావణుడి ఫైట్ కొత్తగా ఉంది. ఇలా కొన్ని కొత్త ఎలిమెంట్లని యాడ్ చేశారు. కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
సినిమాలో మెయిన్‌గా కథ ముందే తెలియడం, దీనికితోడు రాముడు గొప్పవాడు అని పదే పదే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కన్విన్సింగ్‌గా లేదు. ఆ సస్పెన్స్ ని నీరుగార్చినట్టుగా ఉంది. అలాగే రాముడు, సీత కలయికలోని డ్రామా కూడా తేలిపోయినట్టుగా ఉంది. దీనికితోడు రావణుడిని అంతం చేయడమే తన లక్ష్యం అని రాముడు అనుకోవడం, విష్ణువే రాముడిగా మానవుడిగా జన్మించాడని, తనకు మానవులతోనే ముప్పు ఉందనే విషయాన్ని పదే పదే చెప్పడంలోనూ కిక్ మిస్ అయ్యింది. ఆ సస్పెన్స్ చివరి వరకు ఉంచి రివీల్ చేస్తే బాగుండేది, ఇలా చాలా విషయాలో లాజిక్ మిస్ అయ్యారు. దీంతో చాలా ఎలివేట్ అవ్వాల్సిన సీన్లు చప్పగా సాగిపోయాయి. ఏమాత్రం కిక్ ఇవ్వలేకపోయాయి.
సినిమా చాలా లెంన్తీగా ఉంది. రెండు పార్ట్ లుగా చెప్పడం కోసం కథని బాగా సాగదీసినట్టుగా ఉంది. డీటెయిలింగ్‌కి ప్రయారిటీ ఇచ్చారు. అవి కొంత వరకు ఓకే, కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక రాముడికి పరుశురాముడు ఎదురుపడటం,వీరిద్దు సవాల్ విసురుకోవడం కిక్ ఇచ్చే అంశం. కానీ అది అంతగా పేల లేదు. ఇలాంటి చాలా చోట్ల ఎలివేట్ కావాల్సిన అంశాలను నీరుగార్చేశారు దర్శకుడు. దీంతో కొంత వరకు మెప్పించినా, మరికొంత నిరాశ పరుస్తుంది.
రాముడిగా రణ్‌బీర్ కపూర్ పాత్రలో ఒదిగిపోయాడు. అదరగొట్టాడు. తన పాత్రల్లో వేరియేషన్ చూపించడంలో రణ్ బీర్ కపూర్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. లుక్, మాట, బాడీ లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా బాగా చేశాడు. డబ్బింగ్ కన్విన్సింగ్‌గా లేదు. ఇంకా బెటర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పెట్టాల్సింది. ఇక రావణుడిగా యష్ ఇరగదీశాడు. పాత్రలో ఒదిగిపోయాడు, పాత్రకి ప్రాణం పోశాడు. తనదైన నటనతో దుమ్ములేపాడు యష్. ఆయన పాత్ర ఎలివేషన్, యాక్షన్ బాగుంది. కాకపోతే కొన్ని చోట్ల రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలను తలపించేలా ఆయన సీన్లు ఉండటం గమనార్హం. ఇక సీతగా సాయిపల్లవి చాలా బాగా చేసింది. చాలా సెటిల్డ్ గా చేసి మెప్పించింది. లుక్ పరంగానూ బాగానే ఉంది. సూర్పనకగా రకుల్ ప్రీత్ సింగ్ మెప్పించింది. సూర్పనక భర్తగా వివేక్ ఒబెరాయ్ మెప్పించాడు. లక్ష్మణుడు రవి దుబే మెప్పించాడు. ఆయన పాత్ర అలరిస్తుంది. రావణుడి తల్లి కైకాషిగా శోభన ఆకట్టుకుంది. మండోదరిగా కాజల్ కనిపించింది. ఆమె పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. మిగిలిన పాత్రలు ఆకట్టుకున్నాయి. ఎవరికి వాళ్లు పాత్రలకు ప్రాణం పోశారు.
సినిమాకి నితేష్ తివారి దర్శకత్వం బాగుంది. దర్శకుడిగా ఆయన సినిమా బాగా తెరకెక్కించాడు. కానీ డ్రామా పరంగా, ఎమోషన్స్ పరంగా మరింత కేర్ తీసుకోవాల్సింది. సినిమాటిక్ ఫ్రీడమ్ ఎక్కువగా తీసుకున్నట్టుగా ఉంది. కొన్ని సీన్లు తనకు నచ్చినట్టుగా రాసుకున్నట్టుగా ఉంది. కథలో డైవర్షన్ కనిపిస్తుంది. అయితే చాలా వరకు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యాడు. హై మూమెంట్స్, సస్పెన్స్ అంశాల విషయంలో డిజప్పాయింట్ చేశాడు. ముందుగానే ఇతర పాత్రలతో ఆ సస్పెన్స్ రివీల్ చేయించడంతో ఆయా సీన్లు తేలిపోయాయి.
ఇక రైటింగ్ పరంగా శ్రీధర్ రాఘవన్, నితేష్ తివారి చాలా కేర్ తీసుకున్నారు. బాగా వర్క్ చేశారు. డిటెయిలింగ్ కి ప్రయారిటీ ఇచ్చారు. కొత్త వారికి నచ్చేలా తెరకెక్కించారు. నితేష్ తివారి, శ్రేయాస్ జైన్ డైలాగ్‌లు కూడా బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాకి పాటలు, సంగీతం మెయిన్ అసెట్. రెహ్మాన్, హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ బాగుంది. పాటలు తెరపై ఆకట్టుకున్నాయి. ఆర్‌ఆర్, బీజీఎం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఎమోషనల్ సీన్లలో బాగా ఎలివేట్ అయ్యింది. పంకజ్ కుమార్, మహేష్ లిమయే కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ సినిమాకి హైలైట్స్, బ్యాక్ బోన్. వీఎఫ్‌ఎక్స్ అదిరిపోయాయి. హుజుఫా లోకండ్‌వాలా ఎడిటింగ్ ఫర్వాలేదు. కొంత షార్ప్ చేయోచ్చు.
రామాయణం మన తెలుగు వారికి, ఇండియన్స్ కి తెలిసిన గాథ. దాన్ని ఎంత ఆకట్టుకునేలా తెరకెక్కిస్తారు, తీసుకెళ్తారు, ఎంత అలరించేలా నడిపిస్తారు, చూపిస్తారనేది ముఖ్యం. ఇందులో ఆ విషయంలో విజువల్ గ్రాండియర్ పరంగా ఎక్కువ ఫోకస్ కనిపించింది. దీనికితోడు ఇందులో కొన్ని కొత్త ఎలిమెంట్లని చూపించి ఫ్రెష్ ఫీలింగ్ తెప్పించారు. అదే సమయంలో ఎమోషన్స్ ని ఇంకా బాగా రాసుకోవాల్సింది. డ్రామాపై కూడా వర్క్ చేయాల్సింది. మెయిన్‌గా సస్సెన్స్ అంశాలు, వాహ్ ఫ్యాక్టర్స్ పై ఇంకా ఫోకస్ పెట్టాలి. అవి ఇందులో ఆశించిన స్థాయిలో లేవు. కానీ ఓవరాల్‌గా మాత్రం ఒక విజువల్ ట్రీట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కొంత వరకు ఆకట్టుకుంటుంది.
రేటింగ్
రామాయణం ఆధారంగా సినిమా కాబట్టి. అది మన ఎమోషన్. ఎవరు ఎలా చెప్పినా నచ్చే వారికి నచ్చుతుంది. రేటింగ్ ఇవ్వాల్సి వస్తే.. 3