#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?

Published : Oct 30, 2026, 04:35 PM IST

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం `#కల్ట్`. ఇండియన్‌ తొలి స్లాషర్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందంటే?

PREV
16
కల్ట్ మూవీ రివ్యూ

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ మరోసారి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం `#కల్ట్`. ఇందులో ఆయనే హీరో. ఇండియాలోనే తెరకెక్కిన తొలి స్లాషర్‌ ఫిల్మ్ ఇది. గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంతో తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, విశాఖ్‌ నాయర్‌, కార్తికేయ, అనేరుధ్‌ భాస్కర్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ మ్యూజిక్‌ అందించారు. తారక్‌ సినిమాస్‌ పతాకంపై సందీప్‌ కాకరాల నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(అక్టోబర్ 30)న విడుదల అయ్యింది. అత్యంత హింసాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
కల్ట్ మూవీ కథ

గోవా మంత్రి(మురళీ శర్మ) కొడుకు ఎల్విన్‌(తారక్‌ పొన్నప్ప) తన బర్త్ డేని గోవాలో కల్ట్ అనే పబ్‌లో ప్లాన్‌ చేస్తాడు. తన ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకొని పార్టీని ఎంజాయ్‌ చేస్తుంటాడు. అక్కడికి మన తెలుగు కుర్రాళ్లు స్క్రిప్ట్ రాయడం కోసం వెళ్తారు. డబ్బుల విషయంలో మోసపోతారు. దొంగతనం చేసి కల్ట్ పబ్‌లో పార్టీకి వెళ్తారు. ప్రారంభంలో సరదాగా, ఎంజాయ్‌గా సాగిన పార్టీ అనూహ్యంగా మలుపుతీసుకుంటుంది. ఒక అమ్మాయి పై నుంచి పడిపోతుంది. కానీ ఆ అమ్మాయి ఫ్రాంక్‌ చేస్తుంది. ఆ తర్వాత పెద్ద స్క్రీన్‌లో ఒక టాయ్‌.. పార్టీకి వచ్చిన వారితో గేమ్‌ ఆడుతుంది. చైర్ గేమ్‌లో చైర్‌ దొరక్క నిల్చున్న వారిని చంపేస్తారు. ఎవరు చంపుతున్నారో అర్థం కాదు ఒక్కసారిగా పబ్‌లో భయానక వాతావరణం నెలకొంటుంది.

స్క్రీన్‌పై టాయ్‌ చెప్పినట్టుగా చేయకపోతే ఒక్కొక్కరిని చంపేస్తానని బెదిరిస్తుంది. బయటకు పారిపోకుండా డోర్లకి ఆర్‌డీఎక్స్ ఫిక్స్ చేస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక భయపడుతుంటారు. అదే పార్టీలోకి డీఎస్పీ సంకల్ప్ వస్తాడు. బాగా మందు ఎక్కువై అందులో పడిపోతాడు. అతను ప్రాంతీయ వివక్ష చూపితే తట్టుకోలేడు. గోవాలో అలాంటి సీన్‌ చూసి తెలంగాణ నుంచి గోవాకి ట్రాన్స్ ఫర్‌ చేయించుకుంటాడు. కానీ కమిషనర్‌ భార్య విషయంలో అతి చేసి సస్పెండ్‌ అవుతాడు. అతను పబ్‌లో జరిగే హత్యలను ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఓ దశ తర్వాత తనకు కూడా పాజిబుల్‌ కాదు.

కానీ మంత్రికి తన కొడుకుని సేఫ్‌గా తీసుకొస్తానని మాటిస్తాడు. కానీ అందులో ఉన్న అదృశ్య వ్యక్తి అనేక గేమ్స్ ద్వారా చాలా మందిని చంపేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో సంకల్ప్ ఈ క్రైమ్‌ని ఎలా ఆపాడు? దానికి కారణమైన వ్యక్తిని ఎలా పట్టుకున్నాడు? ఈక్రైమ్‌కి పిచ్చాసుపత్రికి ఉన్న లింకేంటి? నేరస్థుడికి, ఎల్విన్‌కి ఉన్న సంబంధం ఏంటి? హత్యలకు కారణం ఏంటి? అక్కడి వారిని కాపాడేందుకు సంకల్ప్ ఏం చేశాడు? ఇందులోని ట్విస్ట్ లేంటి? అనేది మిగిలిన కథ.

36
కల్ట్ మూవీ విశ్లేషణ

తెలుగులో స్లాషర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలు ఇప్పటి వరకు రాలేదని చెప్పొచ్చు. విశ్వక్‌ సేన్‌ తెలుగు ఆడియెన్స్ కోసం ఈ ప్రయోగం చేశాడు. ఇది మన ఆడియెన్స్ కి కొత్త ఎక్స్ పీరియెన్స్ అని చెప్పొచ్చు. ఇంటెన్స్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించాడు విశ్వక్‌ సేన్‌. అయితే ప్రయోగం బాగుంది. కానీ దాన్ని చుట్టూ అల్లుకున్న కథ అంతగా కన్విన్సింగ్‌గా లేదు. ఇలాంటి స్లాషర్ మూవీలకు కథ పెద్దగా ఉండదు, స్క్రీన్‌ ప్లే మెయిన్‌ ఇంపార్టెంట్‌. దాన్ని ఎంత బాగా తీస్తే అంత బాగా వస్తుంది, ఆకట్టుకుంటుంది. గ్రిప్పింగ్‌గా నడిపించాలి, నెక్ట్స్ మినిట్‌ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉండాలి, భయం పుట్టాలి. అప్పుడే సినిమా ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో విశ్వక్‌ కొంత తడబడ్డాడు.

గోవాలోని కల్ట్ పబ్‌ కి వెళ్లేంత వరకు కథని, పాత్రలని ఎస్లాబ్లిష్‌ చేశాడు. పార్టీ జరిగాక వచ్చిన వాళ్లు ఎంజాయ్‌ చేస్తుంటారు. ఉన్నట్టుండి ఒక మహిళ పడిపోవడంతో కథ సీరియస్‌గా మారుతుంది. ఆ తర్వాత వరుసగా హత్యలు జరగడం, ఒక్కొక్కరిని చంపేయడం భయం పుట్టిస్తుంది. వణికిస్తుంది. చైర్ గేమ్‌ తర్వాత కథ మరింత సీరియస్‌గా, భయానకంగా మారిపోతుంది. ఆ టైమ్‌లోనే ఎంట్రీ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌ పబ్ లో విలన్లని ఎదుర్కొంటాడు. తన మార్క్ స్టయిల్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్ అదిరిపోయింది.

ఇక సెకండాఫ్‌లో పబ్‌లోనే సీన్లు ఉంటాయి. యాక్షన్‌ వీరోచితంగా ఉంటుంది. రక్తపాతం ఏరులై పారేలా ఉంటుంది. సస్పెన్స్ క్రియేట్‌ చేస్తూ ఈ యాక్షన్‌ ఉంటుంది. ఎవరు వస్తున్నారో, ఎందుకు చంపుతున్నారో అర్థం కాదు, మతిపోయేలా ఉంటుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది. హీరో కూడా నిస్సాహాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో కథనం స్లో అయిపోతుంది. బోరింగ్‌ గా అనిపిస్తుంది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ రివీల్ కావడం బాగుంది. క్లైమాక్స్ లో దానికి కారణం చెబుతారు. ఫినిషింగ్‌ మాత్రం సాగదీసినట్టుగా ఉంది.

46
కల్ట్ మూవీలో మైనస్‌లు

బలమైన పాయింట్‌ లేకపోవడంతో కథనం వీక్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లు మాత్రమే కొన్ని మెప్పిస్తాయి. విశ్వక్‌ సేన్‌ అందులో ఉండి కూడా ఏం చేయలేని స్థితిలో ఉండటం అంతగా బాగా లేదు. సెకండాఫ్‌ చాలా వరకు డల్‌ అయ్యింది. సినిమాలో ఒక కోర్‌ పాయింట్‌ ఉంటుంది. అందులో ఉండే ఎమోషన్‌ కనెక్ట్ అయితే సినిమా బాగుంటుంది, యాక్షన్‌ బాగుంటుంది, లేదంటే నిర్జీవం అని చెప్పొచ్చు. ఇందులో మెయిన్‌ ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. దీంతో రక్తపాతం, హింసనే కనిపిస్తాయి. అతి హింస, అతి యాక్షన్‌ జుగుప్సాకరంగా ఉంటుంది. అసహజంగా అనిపిస్తుంది. అంత అవసరమా అనేలా ఉంటుంది. అదే సమయంలో సినిమా లెన్తీ ఫీలింగ్‌ కలుగుతుంది. కథ లేకపోవడంతో ఎంతసేపూ అవే సీన్లు చూపించడంతో బోరింగ్‌గా అనిపిస్తాయి. ఎక్కువసేపు ఎంగేజ్‌ చేయలేకపోయాయి. రొటీన్‌ ఫీలింగ్‌ తెప్పిస్తాయి. టెక్నికల్‌గా మూవీ ఫర్వాలేదు, కానీ కథనాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడం, ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ కాలేదు. ఆయా అంశాలు బాగుంటే సినిమా బాగుండేది.

56
కల్ట్ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

డీఎస్పీ సంకల్ప్ నాయక్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ నటించాడు. ఆయన పాత్ర కొన్ని చోట్ల పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ యాక్షన్‌ సీన్లలో నిరాశపరుస్తుంది. విశ్వక్‌ సేన్‌ మాత్రం అదరగొట్టాడు. ఆయనకు, కమిషనర్‌కి మధ్య సీన్లు బాగున్నాయి. నవ్విస్తాయి. మంత్రి కొడుకు ఎల్విన్‌గా తారక్‌ పొన్నప్ప బాగా చేశాడు, ఆకట్టుకున్నాడు. ఆయన పాత్రలోని వేరియేషన్స్ బాగున్నాయి. గాయత్రి భరద్వాజ్‌ సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటన నవ్విస్తుంది. అలరించేలా ఉంటుంది. మురళీ శర్మ మంత్రిగా ఒదిగిపోయారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. విలన్‌గా చేసిన వ్యక్తి అదరగొట్టాడని చెప్పొచ్చు.

66
కల్ట్ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

దర్శకుడిగా విశ్వక్ సేన్ విజువల్ ప్రజెంటేషన్, యాక్షన్ సన్నివేశాల విషయంలో మంచి ప్రయత్నం చేశారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ సినిమాకు డార్క్ అట్మాస్ఫియర్‌ను అందించింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం భయానక సన్నివేశాలకు బలాన్ని ఇచ్చింది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగున్నప్పటికీ, నిడివిని మరింత తగ్గించి ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. తరుణ్ భాస్కర్ సంభాషణలు కథకు అనుగుణంగా ఉన్నాయి. సౌండ్ డిజైన్ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. బీజీఎం అదిరిపోయింది. సౌండ్‌ ఓవర్‌గా అనిపించింది. కాకపోతే అందులో జీవిం లేదు. దర్శకుడు విశ్వక్‌ సేన్‌ చేసిన ప్రయత్నం బాగుంది. కానీ దాన్ని మన ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మాత్రం కొంత తడబాటు కనిపిస్తుంది. యాక్షన్‌కి సంబంధించిన పెయిన్‌ మిస్‌ అయ్యింది.

ఫైనల్‌గా

సినిమాలో హింస తప్ప ఎమోషన్‌ లేదు. అదే పెద్ద మైనస్‌. కానీ టెక్నీకల్‌గా బాగుంది. విశ్వక్‌ సేన్‌ చేసిన కొత్త ప్రయత్నంగానే మిగిలిపోతుంది.

రేటింగ్‌ : 2.25

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories