రామ్ “డబుల్ ఇస్మార్ట్” సినిమా రివ్యూ & రేటింగ్!

First Published | Aug 15, 2024, 1:19 PM IST

2019  లో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపి బాగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఇది. 

పూరి జగన్నాథ్ సినిమాలంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. క్యారక్టర్ డ్రైవెన్ ప్లాట్లతో అవి నడిచేవి, కేవలం హీరో క్యారక్టరైజేషన్ ని నమ్ముకుని అవి తెరకెక్కేవి. డైలాగులు అయితే డైరక్ట్ గా హీరో మనస్సులోంచి  వచ్చినట్లు ఉండేవి. అయితే ఆ మ్యాజిక్ గత కొన్నేళ్లుగా తగ్గింది. వరస ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాంతో ఇస్మార్ట్ శంకర్ కథ రాసుకుని తనేంటో మళ్లీ ప్రూవ్ చేసుకుని భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపాడు పూరి. అయితే వెంటనే వచ్చిన లైగర్ ఆ సంతోషాన్ని ఎంతోకాలం నిలబడ నివ్వలేదు. దాంతో వెంటనే తన సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కే సీక్వెల్ రాసి తెరకెక్కించి మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఎలా ఉంది...ఈ కథలో మెయిన్ ట్విస్ట్ ఏమిటి..అనుకున్న స్దాయిలో సినిమా ఉందా వంటి విషయాలు చూద్దాం. 

Double Ismart

కథేంటి

అనగనగా ఓ పెద్ద డాన్. ఆయన గన్స్ గట్రా సప్లై చేస్తూంటాడు. ఇంటర్నేషనల్ గా పెద్ద పేరున్న ఈ డాన్ పేరు  బిగ్ బుల్ (సంజయ్ దత్). మల్టీ మిలియనర్ అయిన అతను ఏళ్లకి ఏళ్లు బతికి  ఇంటర్నేషనల్ డాన్ గా తన ప్రస్తానాన్ని కొనసాగించాలనుకుంటాడు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు  తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకడని బయిటపడుతుంది. చికిత్స లేని ఆ  రోగాన్ని జయంచలేను అని తెలిసినా ఎలాగైనా బ్రతకాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఈ క్రమంలో  సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) కలుస్తాడు. అతనో ఐడియా చెప్తాడు. అదే మెమరీ ట్రాన్స్‌ఫర్ . దాని ద్వారా మరణం లేకుండా జీవించవచ్చని చెప్తాడు. 


Double Ismart Ram Pothinenis f


అయితే ఈ మెమరీ ట్రాన్సఫర్ అనేది అంత తేలిగ్గా సక్సెస్ అయ్యే వ్యవహారం కాదు.  ఎవరి మీద చేసినా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇస్మార్ట్ శంకర్ (రామ్ ) గురించి తెలుస్తుంది. అతని మీద ఆల్రెడీ ఈ ప్రయోగం చేసి  సక్సెస్ అయ్యారని తెలుసుకుంటాడు. దాంతో  హైదరబాద్ లో ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) ని తీసుకొచ్చి తన పని చేసుకోవాలని ట్రై చేస్తాడు. అందుకు  ఇస్మార్ట్ శంకర్‌ ఒఫ్పుకున్నారా...ఇస్మార్ట్ శంకర్... బిగ్ బుల్ గా మారాడా?  ..అలాగే బిగ్ బుల్ ఎవరు? ఇస్మార్ట్ శంకర్ తల్లి పోచమ్మకి (ఝాన్సీ), బిగ్ బుల్ కి సంబంధం ఏంటి? ....చివరకు బిగ్ బుల్ ఏమయ్యాడు...అనే విషయాలు తెలియాలంటి సినిమా చూడాల్సిందే.

Ali, Double iSmart


విశ్లేషణ 


సీక్వెల్ తీయడం ఈజీనే కానీ సక్సెస్ కొట్టడం మాత్రం అంత సులువు కాదు. ఎందుకంటే అప్పటికే  ప్రేక్షకులు అందరికీ తెలిసిన క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు తో కథ నడపాలి. హీరోని కొత్త సమస్యలో పడేయాలి. అప్పుడే  నెక్ట్స్ సీన్   మీద గానీ, తర్వాత తెరపై ఏం జరుగుతుంది? అని క్యూరియాసిటీ క్రియేట్ చేయగలుగుతారు. ఈ విషయంలో దర్శక రచయితలు వర్క్ ఎక్కువ చేయాలి.  పూరీ  అండ్ టీమ్ ఆ విషయంలో అనుకున్న స్దాయిలో వర్క్ చేయలేదనే అనిపించింది. రెగ్యులర్ యాక్షన్ మూమెంట్ అయినా సరే... స్టన్నింగ్ గా ఉండే విధంగా తీర్చిదిద్దే పూరి ఇక్కడ తడబడ్డారు. అందుకు కారణం... ఆయనపై హిట్ కొట్టక పోతే సమస్యల్లో పడతాననే ప్రెజర్ కావచ్చు.

Ali, Double iSmart

బిగ్ బుల్..బిగ్ నిల్ 

సినిమా ప్రారంభమైన కాసేపటికి ప్రేక్షకుడు ఏదైతే ఊహిస్తాడో అదే తెరపై కనపడటం మొదలవుతుంది. ఎక్కడా పొరపాటున కూడా  కొత్త ట్విస్ట్ లు, టర్న్ లు తగలవు.  ఇస్మార్ట్ శంకర్ అనే హైపర్ క్యారక్టర్ ని ఎలివేట్ చేయం వరకూ బాగానే ఉంది కానీ అందుకోసం బిగ్ బుల్ అనే సంజయ్ దత్ లాంటి పాత్రను డౌన్ చేసేయటం నచ్చదు. ఎప్పుడైతే సినిమాలో నెగిటివ్ పాత్ర బిగ్ బుల్ ...కాన్సర్ తో చచ్చిపోతాడని తెలిసిందో ఆ పాత్రపై మనకు కోపం అయితే రాదు. అతనిపై సానుభూతి తెలియకుండానే వచ్చేస్తుంది. అలాగే అతను తన ప్రాణం కాపాడుకోవటం కోసం చేసే ప్రయత్నాలు తప్పు అనిపించవు. విలన్ పాత్ర స్ట్రాంగ్ గా లేకపోతే హీరో పాత్ర ఎంత ఎనర్జీగా ఉంటే ఏమిటి..ఏం చేస్తే ఏమిటి...ప్యాసివ్ గా మారిపోతుంది. అదే ఇక్కడ జరిగింది. 


అలాగే సినిమాలో చాలా  సీన్స్  చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ గుర్తు వస్తూంది. ఆ రిపీట్నెస్ కనపడింది.  హీరోయిన్ తో లవ్ ట్రాక్ బోల్డ్ గా లౌడ్ గా సాగుతుంది. ఇంట్రవెల్ దాకా అలా నడిచి నడిచి.. ప్రీ .ఇంట్రవెల్ లో శంకర్ తలలోకి మెమరీ ట్రాన్సఫర్ చేస్తారు. దాంతో సెకండాఫ్ ..ఇక శంకర్...బిగ్ బుల్ గా ఇరకొట్టేస్తాడు అనుకుంటాం. సెకండాఫ్ లో సాదాసీదాగానే సాగుతుంది. నావెల్ ఎలిమెంట్ అయిన మెమరీ ట్రాన్సఫర్ కార్యక్రమం పస్ట్ పార్ట్ ఇస్మార్ట్ శంకర్ లోనే చూసేసాం కాబట్టి పెద్దగా ఎగ్జైట్ అయ్యేది ఉండదు. నావెల్టీగా అనిపించదు.  సెకండాఫ్ లో అంతకు మించి అన్నట్లు ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటే థ్రిల్లింగ్ గా కొత్తగా ఉండేది. ఏదో నడుస్తోందిలే అనుకుంటే మదర్ సెంటిమెంట్ సీన్స్  ఫోర్సెడ్ గా రావటం మొదలవుతాయి. ఇలా ఇస్మార్ట్ శంకర్ నే పాలిష్ చేసి మళ్లీ అందించినట్లుగా అనిపిస్తుంది.  క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుంది ఎక్సపెక్ట్ చేస్తాం  కానీ అక్కడా దెబ్బతింటాం.  సాదాసీదా క్లైమాక్స్ మాత్రమే .అన్నిటికన్నా సినిమాకి పెద్ద మైనస్..అలీ క్యారక్టర్. బాగా నాశిరకంగా , చీప్ గా ఉంది. 
 


టెక్నికల్ గా ...

సినిమాకు కీలకమైన స్క్రిప్టు దగ్గరే ఈ సినిమా చీదేసింది. అలాగే పూరి మేకింగ్ స్టైల్ ఒకప్పుడు కొత్తగా అనిపించేది. కానీ ఇప్పుడు అద్బుతమైన కొత్త జనరేషన్ మేకర్స్ వస్తున్న సమయంలో సామాన్యంగా అనిపిస్తోంది. మణిశర్మ ఇచ్చిన రెండు  పాటలు  ‘స్టెప్పామార్’, ‘మార్ ముంతా చోడ్ చింతా’ థియేటర్ లో మంచి కిక్ ఇచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్. సినిమాటోగ్రఫీ సోసోగా ఉంది. ఎడిటింగ్,  స్క్రీన్ ప్లే పెద్దగా ఇంపాక్ట్  క్రియేట్ చేయలేదు.  ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి. 


ఆర్టిస్ట్ లలో రామ్ ఎనర్జీని బీట్ చేసేవాళ్లు ఈ జనరేషన్ లో లేరనిపిస్తుంది కొన్ని సీన్స్ లో. అయితే కొన్ని సీన్స్ లో ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయాడు అని అర్దమవుతుంది. అయితే స్క్రిప్టులో ఉన్నది ఉన్నట్లు చేయగలడు అంతకు మించి ఏం చేస్తారు. బిగ్ బుల్..భారీ ఇంట్రడక్షన్ తర్వాత చేయటానికి ఏమీ లేదు. సంజయ్ దత్ స్దాయి పాత్ర కాదు. జన్నత్ పాత్రలో కావ్య థాపర్ హాట్ గా కనపడింది. మిగతా ఆర్టిస్ట్ లు అందరూ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు.

Double iSmart


ప్లస్ లు 


రామ్ ఎనర్జీతో కూడిన ఫెరఫార్మెన్స్
ఫైట్స్, 
పాటలు బిగ్ బుల్ గా   సంజయ్ దత్ లుక్,

మైనస్ లు

స్క్రీన్ ప్లే
రన్ టైమ్ ఎక్కువ
చూసిన సినిమా మళ్లీ చూసినట్లు అనిపించటం


ఫైనల్ థాట్

మొత్తం మీద లైగర్ కన్నా బెస్ట్...ఇస్మార్ట్ శంకర్ కన్నా లీస్ట్. డబుల్ టైటిల్ లోనే ఉంది కానీ కంటెంట్ లో లేదు. పూరిని అవుట్ డేట్ అనలేం కానీ ఈ సినిమా మాత్రం అప్ టు డేట్ మాత్రం లేదు. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5

Ram Pothineni Double ISMART
  •  నటినటులు: రామ్‌ పోతినేని, కావ్య థాపర్‌, సంజయ్‌ దత్‌, సాయాజీ షిండే, అలీ, గెటప్‌ శ్రీను తదితరులు

  • నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్‌

  • నిర్మాతలు: పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌

  • దర్శకత్వం:పూరీ జగన్నాథ్‌

  • సంగీతం: మణిశర్మ

  • సినిమాటోగ్రఫీ: సామ్‌ కె. నాయుడు, జియాని జియానెలి

  • విడుదల తేది: ఆగస్ట్‌ 15, 2024

Latest Videos

click me!