`రాఘవరెడ్డి` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Jan 5, 2024, 3:10 PM IST

రాశీ, నందిత శ్వేత, శివ కంఠంనేని ప్రధాన పాత్రల్లో నటించిన `రాఘవరెడ్డి` మూవీ నేడు విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

తన అందంతో, అద్భుతమైన నటనతో టాలీవుడ్‌ని ఊపేసింది నటి రాశీ. హీరోయిన్‌గా ఆమె ఇప్పుడున్న సీనియర్‌ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. కానీ మధ్యలో బ్రేక్‌ తీసుకుంది. వ్యక్తిగత జీవితంపై ఫోకస్‌ పెట్టడంతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. మళ్లీ ఇటీవల ఆమె నటిగా మెప్పిస్తుంది. అయితే సీరియల్స్ చేస్తుండటం గమనార్హం. చాలా రోజుల తర్వాత ఆమె సినిమా చేసింది. `రాఘవరెడ్డి` అనే చిత్రంలో మెరిసింది. శఙవ కంఠంనేని హీరోగా నటించిన చిత్రమిది. ఆయనకు జోడీగా కనిపించింది. నందిత శ్వేత కీలక పాత్రలో నటించిన చిత్రమిది. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించారు. కెఎస్‌ శంకర్‌ రావు, జీ రాంబాబు యాదవ్‌, ఆర్‌ వెంకటేశ్వర్‌ రావు నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(జనవరి 5)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
రాఘవరెడ్డి(శివ కంఠంనేని) కాలేజ్‌ ప్రొఫేసర్‌. నేరాలకు  సంబంధించిన క్రిమినల్స్ ని పట్టుకోవడంలో, క్లిష్టమైన కేసులను సాల్వ్ చేస్తుంటాడు. పోలీస్‌లకు సపోర్ట్ నిలుస్తుంటాడు. ఆయన పనిచేసే కాలేజ్‌లోకి లక్కీ(నందితా శ్వేత) స్టూడెంట్‌గా వస్తుంది. తన యాటిట్యూడ్‌తో, ఆరొగెన్సీతో రచ్చ చేస్తుంది. అందరు భయటపడే రాఘవరెడ్డి ప్రఫేసర్‌ని కూడా లెక్కచేయదు. రౌడీ బేబీలా వ్యవహరిస్తుంటుంది. ఈ క్రమంలో రాఘవరెడ్డికి, లక్కీకి అస్సలు పడదు. ఒకానొక సమయంలో ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తుంది. ఇంతలో దేవకీ(రాశీ) కనిపిస్తుంది. ఆమెని చూస్తే పరిగెత్తుతుంటాడు రాఘవరెడ్డి. అందరికి చెమటలు పట్టించే రాఘవరెడ్డి ఆమెని చూసి ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు? కట్‌ చేస్తే లక్కీ కిడ్నాప్‌ అవుతుంది. తన బిడ్డని కాపాడాలని, 72 గంటల్లో తన కూతురు తన వద్ద ఉండాలని, లేదంటే తను బతకనని చెబుతుంది దేవకి. మరి దేవకీ.. రాఘవరెడ్డికి ఎందుకు సవాల్‌ విసురుతుంది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లక్కీ ఎవరు? ఆమె ఎందుకు కిడ్నాప్‌ అయ్యింది? రాఘవరెడ్డి ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? అనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః
కమర్షియల్‌ సినిమాల ట్రెండ్‌ ఎప్పుడో పోయింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలను కమర్షియల్‌ వేలో చెబుతూ సక్సెస్‌ కొడుతున్నారు మేకర్స్. సినిమాని సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కూతురు సెంటిమెంట్‌ని, డ్యూటీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకోవడం వంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ విషయంలో `రాఘవరెడ్డి` చిత్ర మేకర్స్ ఓ సాహసం చేశారని చెప్పొచ్చు. అయితే ఇలాంటివి వచ్చి చాలా రోజులే అవుతుంది. చాలా గ్యాప్‌ వచ్చినా,  ఆ సెంటిమెంట్‌ని కనెక్ట్ అయ్యేలా తీయడంలో సక్సెస్‌ అయ్యారు. కథ పాతదే అయినా, దాన్ని కొత్త సీసాలో కాస్త కమర్షియల్‌ అంశాలు జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. 

సినిమా మొదటి భాగం రాఘవరెడ్డి పాత్రని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన ఎంత స్టిక్ట్ ప్రొఫేసర్‌ అని, అదే సమయంలో ఎంతటి క్లిష్టమైన కేసులను అయినా ఇట్టే ఎలా సాల్వ్ చేయగలడనేది చూపించారు. ఆయన పాత్ర తాలుకూ ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో సినిమాల్లో ఎలివేషన్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలోనూ హీరో పాత్రలో అవి కనిపిస్తాయి. దీంతోపాటు ఓ వైపు హీరో పాత్ర అటు కేసులను సాల్వ్ చేయడం, మరోవైపు ప్రొఫేసర్‌గా ఉండటం ఈ రెండు ఎలిమెంట్లని బాగా మ్యానేజ్‌ చేశారు. అదే సమయంలో నందిత శ్వేత పాత్ర డామినేషన్‌ కూడా కనిపిస్తుంది. ఆమె డేరింగ్‌ స్టూడెంట్‌గా, రౌడీ బేబీలా వ్యవహరించడం, ఆమె పక్కనే ఉండే శ్రీనివాస్‌ రెడ్డి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. మరోవైపు రౌడీలను కనిపెడుతూ వాళ్లకి ముంచెమటలు పట్టించే సమయంలో ఓ వైపు యాక్షన్‌, మరోవైపు ఫన్‌ అలరిస్తుంది.
 

ఇంటర్వెల్‌ వరకు ఇలా సరదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు కథ మలుపు తిరుగుతుంది. రాఘవరెడ్డి పాత్ర ప్లాష్‌ బ్యాక్‌లోని సీన్లు, తన భార్యతో గొడవ, ఫ్యామిలీకి దూరం కావడం వంటి అంశాలు చూపించారు. కూతురుని చూడాలని అతను పడే తపన, బాధ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ద్వితీయార్థం చాలా ఎమోషనల్‌ టచ్‌ ఇస్తుంది. క్లైమాక్స్ సైతం ఎమోషన్‌గా పిండేస్తుంది.అయితే సినిమా చాలా స్లోగా సాగడం మైనస్‌.  సీన్లలో సహజత్వం లేదు. పాత్రల నుంచి మంచి నటన తీసుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ కాలేదనిపిస్తుంది. అదే సమయంలో చాలా చోట్ల సీరియల్‌ని తలపిస్తుంది. దర్శకుడిలో అనుభవ లేమి కనిపిస్తుంది. ల్యాగ్‌లు, స్లో నెరేషన్‌, లాజిక్‌ లెస్‌ సీన్లు కాస్త ఇబ్బంది పెడతాయి. డ్రామా ఓవర్‌గా అనిపిస్తుంది. నందిత శ్వేత కిడ్నాప్‌ ఎపిసోడ్‌ సైతం కాస్త ఓవర్‌ డ్రామా అనిపిస్తుంది. కానీ ఎమోషనల్‌గా, సెంటిమెంట్‌తో చివర్లో పిండేస్తూ ముగించడం రిలీఫ్‌ నిచ్చే అంశం. 

నటీనటులుః 
సినిమాలో రాఘవరెడ్డి పాత్రలో శివ కంఠంనేని బాగా చేశాడు. యాక్షన్‌ సీన్లు,ఎలివేషన్లలో అదరగొట్టాడు. ఎమోషనల్‌ సీన్లు, సెంటిమెంట్‌ సీన్లలో పిండేశాడు. నటుడిగా మెప్పించాడు. మాస్‌ హీరో రేంజ్‌లో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత రాశీ తనదైన యాక్టింగ్‌తో చేసుకుంటూ వెళ్లింది. ఆమె సహజమైన నటన అలరిస్తుంది. లక్కీ పాత్రలో నందిత శ్వేత అదరగొట్టింది. శివకంఠంనేని, రాశీలను డామినేట్‌ చేసింది. సినిమాకి అసెట్‌ అయ్యింది. ఎప్పటిలాగే ప్రవీణ్‌ మెప్పించాడు. అలాగే బిత్తిరి సత్తి నవ్వించాడు. శ్రీనివాస్‌ రెడ్డి సైతం కామెడీని పంచాడు. అజయ్‌ ఘోష్‌ విలనిజం బాగుంది. అజయ్‌ మరోసారి తన మార్క్ నెగటివ్‌ పాత్రతో మెప్పించాడు. ఇతర పాత్రలు ఓకే అని చెప్పొచ్చు. 

టెక్నీషియన్లు..
సంజీవ్‌ మేగోటి దర్శకత్వం జస్ట్ ఓకే అనిపిస్తుంది. అనుభవ లేమి కనిపిస్తుంది. కానీ ఎమోషనల్‌ సీన్లు మాత్రం బాగా డీల్‌చేశాడు. సెంటిమెంట్ల సీన్లలో తన మార్క్ చూపించారు. అయితే సినిమాలో ఒక ఫీల్‌, ఒక సోల్‌ ఉంటుంది. దాన్ని సరిగ్గా క్యారీ చేయలేకపోయాడు. స్క్రీన్‌ప్లే పై దృష్టిపెట్టాల్సింది. అలాగే సీన్లని కట్‌ కట్‌ లాగాకాకుండా ఓ థ్రెడ్‌లా నడిపిస్తే బాగుండేది. బట్‌ ఓకే అనిపించాడని చెప్పొచ్చు. మ్యూజిక్ ని కూడా దర్శకుడు సంజీవ్ మేగోటి .. సుధాకర్ మారియోతో కలిసి అందించారు. పాటలు ఫర్వాలేదు. మాస్‌ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. ఎస్‌ ఎన్‌ హరీష్‌ కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సైతం ఫర్వాలేదు. సినిమా రేంజ్‌ని బట్టి నిర్మించారు. 

ఫైనల్‌గాః కూతురి కోసం తండ్రి పడే తపన, ఫ్యామిలీ కోసం ఆరాటం అలరిస్తాయి. 

రేటింగ్‌ః2.5

నటీనటులు :

శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి  తదితరులు.

సాంకేతిక వర్గం:

బ్యానర్ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్, సమర్పణ : స్పేస్ విజన్ నరసింహ రెడ్డి, డైలాగ్స్ : అంజన్, లిరిక్స్ : సాగర్ నారాయణ, పి.ఆర్.ఒ: సురేంద్ర నాయుడు - ఫణి (బియాండ్ మీడియా), మ్యూజిక్ : సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో, ఫైట్స్ : సింధూరం సతీష్, డాన్స్ : భాను, సన్ రే మాస్టర్ (సూర్య కిరణ్), ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ : కేవీ రమణ, DOP : S. N. హరీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఘంటా శ్రీనివాస్ రావు, నిర్మాతలు : K. S.  శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి.

click me!