‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ఓటీటి మూవీ రివ్యూ

First Published | Jun 30, 2024, 6:46 AM IST

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90కోట్లు వసూలుచేసింది. 

Guruvayoor Ambalanadayil


ఓటీటిలు వచ్చాక చాలా సినిమాలు హిట్, ప్లాఫ్ లతో సంభందం లేకుండా డబ్బింగ్ అయ్యి తెలుగు వాళ్లను అలరిస్తున్నాయి. ముఖ్యంగా మళయాళ సినిమాలు మన వాళ్లకు తెగ నచ్చుతున్నాయి.  అందులోనూ ఫృధ్వీరాజ్ సుకుమారన్ (సలార్ ఫేమ్) వంటి తెలుసుకున్న ఫేస్ లు ఉంటే ఇంకా హ్యాపీ. ఆ క్రమంలోనే రీసెంట్ గా గోట్ లైఫ్ వంటి సీరియస్ సినిమా చేసిన ఫృధ్వీరాజ్ ఇప్పుడు ఓ ఫుల్ లెంగ్త్  కామెడీతో మన ముందుకు వచ్చారు. 

Prithviraj Guruvayoor Ambalanadayil film


జయజయహే వంటి ఫన్ ఎంటర్టైనర్  డైరక్ట్ చేసిన విపిన్ దాస్ డైరక్టర్ కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన  ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil ott) మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90కోట్లు వసూలుచేసింది. ఇప్పుడు ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.  మలయాళంతో పాటు,  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా కథేంటి, సినిమా అంతలా వర్కవుట్ అవటానికి కారణాలేంటో చూద్దాం.

Latest Videos


Prithvirajs Guruvayoor Ambalanadayils


కథేంటంటే: 
దుబాయిల్ లో పనిచేసే  విను రామచంద్రన్‌ (బసిల్‌ జోసెఫ్‌) కి అన్నీ ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్). ప్రతీ విషయం షేర్ చేసుకుంటూంటాడు. అయితే విను ఓ అమ్మాయితో బ్రేకప్ అయ్యి ఆ బాధలో ఉంటున్నాడని గమనించి, దాన్నుంచి బయిటపడేయటానికి  తన చెల్లి అంజలితో   పెళ్లి నిశ్చయం చేస్తాడు. అయితే అదే సమయంలో  ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉంటుంది. ఒక ఆకాశరామన్న ఉత్తరం వాళ్ల కాపురంలో చిచ్చుపెడుతుంది. దాంతో అతని భార్య పార్వతి  (నిఖిలా విమల్‌) బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళుతుంది.  అయితే విను  తనకి ఎంతో సపోర్ట్‌గా ఉన్న ఆనంద్‌ జీవితంలో సంతోషాన్ని నింపాలని  అనుకుంటాడు. తనకు వివాహం చేస్తున్న ఆనంద్ వైవాహిక జీవితం కూడా బాగుండాలని వాళ్లిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తాడు.

Prithvirajs Guruvayoor Ambalanadayil

ఆనంద్ కు బ్రెయిన్ వాష్ చేసి తన భార్య పార్వతిని కలిసేలా చేసి పెళ్లికు ఆహ్వానించేలా చేస్తాడు.  ఓ ప్రక్కన పెళ్లి పనులు జరుగుతూంటాయి. ఆనంద్, విను  మంచి హ్యాపీగా ఉన్నసమయంలో ఓ ట్విస్ట్ పడుతుంది. ఆనంద్ ఇంటికి వచ్చిన విను  అతని భార్య పార్వతిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె మరెవరో కాదు... తన మాజీ ప్రేయసి బ్రేకప్ ఇచ్చి మనస్తాపానికి కారణమైన పార్వతి. అది పార్వతికి కూడా షాక్. ఆనంద్ కి ఎలాంటి పరిస్థితుల్లోను ఈ విషయం తెలియకూడదని భావించిన వినూ, అతని చెల్లెలితో పెళ్లిని కేన్సిల్ చేసుకోవాలని భావిస్తాడు. కానీ ఈ లోగా ఆనంద్ కు అసలు విషయం తెలిసిపోతుంది. అక్కడ నుంచి ఏమైంది...ఆనంద్, విను బంధం బీటలు తీసిందా..విను పెళ్లి అయ్యిందా...   ఆనంద్‌ తన భార్యను కలిశాడా? విను పెళ్లి ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అన్నది ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ చిత్ర కథ.

Prithviraj Guruvayoor Ambalanadayil


ఎలా ఉందంటే...

కృష్ణార్జున యుద్దం లాంటిదే ఈ సినిమా కథ కూడా. ఎంతో అన్యోన్యంగా ఉండే బావ,బావమరిది ల మధ్య వివాదం, అది పెద్ద గొడవకు దారి తీయటం, చివరకు అసలు నిజాలు తెలియటం ఈ సినిమా స్టోరీ లైన్.  సినిమాలో హీరోలిద్దరి బ్రొమాన్స్ బాగా వర్కవుట్ అయ్యింది. చాలా చోట్ల మైండ్ లెస్ ఫన్ తో ప్యాకేజ్ చేసారు. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరస పెట్టి ఫన్నీ సీన్స్ రాసుకోవటం బాగా కలిసొచ్చింది. సగంలో కొద్దిగా డ్రాప్ అయ్యినట్లు అనిపిస్తుంది కానీ మళ్లీ పుంజుకుంటుంది. ఎక్కవ ఆలోచించకుండా చూస్తే ఈ ఫన్ లో కొట్టుకుపోతాం. లాజిక్ లు ఆలోచిస్తూ కూర్చుంటే ఫన్ ని ఎంజాయ్ చేయలేం.  

Prithviraj Guruvayoor Ambalanadayil film


ఇక మన దేశంలో  పెళ్లి అనేది పెద్ద ఉత్సవం. ఆ ప్రిపరేషన్స్, మూడ్ ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తాయి. నిజానికి పెళ్లి కూతురు, పెళ్లికొడుకుకు పెద్దగా పెళ్లిలో పని ఉండదు. వాళ్ల చుట్టూనే ఉత్సవం నడుస్తూంటుంది. అయితే ఈ సినిమాలో పెళ్లి ఆపాలని కొందరు, పెళ్లి ఎలాగైనా జరపాలని కొందరు పోటీపడటం సినిమాకు కిక్ ఇస్తుంది. ఎక్కడెక్కడి పాత్రలు వచ్చి సందడి చేస్తూంటాయి. మన ఇవివి సత్యనారాయణ గారి సినిమా స్టైల్ లో నడిపారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కామెడీలు రావటం లేదు కాబట్టి నచ్చుతుంది.

Prithvirajs Guruvayoor Ambalanadayils


టెక్నికల్ గా చూస్తే...

సినిమా స్క్రిప్టుకే ఎక్కువ మార్కులు పడతాయి. సింపుల్ లైన్ ని బోలెడన్ని పాత్రలతో పరుగెత్తించటం మామూలు విషయం కాదు. అలాగే డైరక్టర్..పాత సూపర్ హిట్ ట్రాక్స్ వాడుతూ సినిమాకు ఇనిస్టెంట్ కిక్ ఇచ్చారు. మెలోడ్రామా వైపు ఈ కథను వెళ్లనీయకుండా జాగ్రత్తపడటమే ఈ టీమ్ సాధించిన విజయం. అన్ని డిపార్టమెంట్స్ బాగా చేసాయి.  నీరజ్ రవి ఫొటోగ్రఫీ .. అంకిత్ మీనన్ నేపథ్య సంగీతం .. జాన్ కుట్టి ఎడిటింగ్ ఇలా దేనికి వంకపెట్టలేని విధంగా సాగాయి. తెలుగు డబ్బింగ్ మాత్రం ఇంకాస్త శ్రద్దగా చేయాల్సింది. 
 

Prithviraj Guruvayoor Ambalanadayil Gulf collection report out


ఫైనల్ థాట్

సరదాగా నవ్వుకోవటానికి వీకెండ్ మంచి కాలక్షేపం. ఆల్రెడీ కల్కి చూసేసామనుకుంటే ఇంట్లో ఈ సినిమా చూసేయచ్చు. 

Rating:2.75
----సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎక్కడ చూడచ్చు

డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటిలో తెలుగులో ఉంది. 

click me!