ప్రభాస్‌ `కల్కి 2898 ఏడీ` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published Jun 27, 2024, 11:17 AM IST

ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు సినిమా వచ్చింది. మరి అద్బుతం అనేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

తెలుగు సినీ ప్రియులు మాత్రమే కాదు, ఇండియా మొత్తం వెయిట్‌ చేసిన మూవీ `కల్కి 2898 ఏడీ`. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తున్నాడో, ఏం చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా కావడం, ఇందులో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె వంటి భారీ కాస్టింగ్‌ ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. టీజర్, ట్రైలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ మహాభారతంకి, భవిష్యత్‌కి, `కల్కి`కి కనెక్షన్‌ ఏంటనేది క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. ఎట్టకేలకు అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా నేడు శుక్రవారం(జూన్‌ 27) విడుదలైంది. మరి నాగ్‌ అశ్విన్‌ ఏం చూపించాడు, సినిమా ఎలా ఉంది. ప్రభాస్‌ ఎలా ఆకట్టుకున్నాడు?. ఇతర కాస్టింగ్‌ చేసిన మ్యాజిక్‌ ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
కురుక్షేత్ర యుద్ధం చివరలో అశ్శత్థామని ఓడించి శపిస్తాడు శ్రీకృష్ణుడు. అశ్వత్థామ చేసిన తప్పుకి తన చివరి అవతారం `కల్కి` వరకు జీవించి ఉంటావని, గాయాలతో, కఠినమైన జీవితాన్ని గడుపుతావని, తనను చివరగా నువ్వే కాపాడాలి అని శపిస్తాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన ఆరువేల సంవత్సరాల తర్వాత.. ఈ ప్రపంచం అంతా సుప్రీమ్‌ యాస్కిన్‌(కమల్‌ హాసన్‌) కంట్రోల్‌లో ఉంటుంది. దాన్ని కాంప్లెక్స్ గా పిలుస్తారు. అందులో సకల వసతులు, రాజభోగాలు, అద్భుతమైన జీవితం, అన్ని వనరులు ఉంటుంది. సృష్టిలో భూమిపై ఉన్న వనరులన్నిటినీ సుప్రీం లాక్కుని మనుషులను బానిసలుగా చేస్తాడు. కాశీ ప్రాంతంలో జనాలు కఠిమైన జీవితం గడుపుతుంటారు. శంభాలలో రెబల్స్.. సుప్రీంకి వ్యతిరేకంగా, కాంప్లెక్స్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతుంటారు. అందులో రూమి(రాజేంద్రప్రసాద్‌), మరియా(శోభన) వంటివారుంటారు. కాశీలో యూనిట్స్(డబ్బుని యూనిట్స్ గా లెక్కిస్తుంటారు) సంపాదిస్తూ దాని ద్వారా జీవిస్తుంటారు అక్కడి జనం. టెక్నాలజీతోనే ఆ ప్రాంతం కూడా పనిచేస్తుంది. అక్కడ ఫైటర్‌ భైరవ(ప్రభాస్‌)  ఉంటాడు. తనకు బుజ్జి అనే వాహనం ఉంటుంది. ఎప్పటికైనా ఐదు మిలియన్స్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లిపోయి హాయిగా అక్కడ లగ్జరీలన్నీ అనుభవించాలని కలలు కంటుంటాడు. పెద్దాయన(బ్రహ్మానందం) ఇంట్లో అద్దెకుంటాడు. 
 

కాంప్లెక్స్ లో మహిళా గర్భం నుంచి తీసే సీరం కోసం `ప్రాజెక్ట్ కే` మిషన్‌ చేపడతారు సుప్రీం యాస్కిన్‌. ల్యాబుల్లో దానికి ప్రయోగాలు జరుగుతుంటాయి. అందుకోసం ఆడవాళ్లని కిడ్నాప్‌ చేసి ప్రత్యేకంగా వారికి సదుపాయాలు కల్పించి పెద్దయ్యాక కృత్రిమ గర్భం వచ్చేలా చేసి 150 రోజుల తర్వాత గర్భం నుంచి సీరం తీసి తాను ఎక్కించుకోవాలనుకుంటాడు సుప్రీం. కానీ ఏ మహిళ 150 రోజులపాటు గర్భాన్ని మోయలేకపోతుంటారు. దీంతో ప్రతిసారి అది విఫలమవుతుంటుంది. చివరగా సుమతి(దీపికాపదుకొనె)ని  గుర్తిస్తారు. ఆమె 150రోజులకుపైగా గర్భాన్ని నిలుపుకుంటుంది. దీంతో ఆమె గర్భం నుంచి సీరం తీయాలని వెళ్లగా, ఆ మెషన్‌ డ్యామేజ్‌ అవుతుంది. దీంతో అక్కడ నుంచి సుమతి తప్పించుకని    రెబల్‌  లేడీ సహాయంతో ఆ రెబల్‌ టీమ్‌ వాళ్ల దగ్గరకు వెళ్తుంది. ఆమె కోసం సుప్రీంకి చెందిన నాయకుడు తన సైన్యాన్ని పంపిస్తుంటాడు. ఈ క్రమంలో సుమతి రాకని గమనించిన అశ్శత్థామ గుహలో నుంచి బయటకు వచ్చి ఆమెని రక్షిస్తుంటాడు. కాశీ సమీపం నుంచే రెబల్స్ సుమతిని తీసుకెళ్తుండగా బుజ్జి ఆమెని గుర్తిస్తుంది. ఆమెని పట్టుకుంటే ఐదు మిలియన్స్ యూనిట్స్ పొందొచ్చని తెలుస్తుంది. దీంతో భైరవ తన బుజ్జితో కలిసి బయలు దేరతాడు. ఈ క్రమంలో అశ్శత్థామతో భైరవ ఫైట్‌ చేయాల్సి వస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి భీకర యుద్ధం జరిగింది? ఇందులో ఎవరు గెలిచారు? సుమతిని ఎవరు తీసుకెళ్లారు? ఇంతకి భైరవ ఎవరు? సుమతి ఎవరు? సుమతి గర్భంలో ఉన్నదెవరు?  సుప్రీం ఈ గర్భానికి సంబంధించిన సీరం మాత్రమే ఎందుకు కావాలనుకుంటున్నాడు? చివరగా ఏం జరిగింది? ఇందులో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర సల్మాన్‌, రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్‌ల పాత్రలేంటి? అనేది మిగిలిన కథ.  
 

విశ్లేషణః 
ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఇది మహాభారతంకి, భవిష్యత్‌కి ముడిపెడుతూ తీసిన సినిమా. ఈ రెండింటికి ముడిపెట్టడమే ఈ సినిమాలో హైలైట్‌ పాయింట్‌. అదే పెద్ద టఫ్ఫెస్ట్ జాబ్‌ కూడా. నాగ్‌ అశ్విన్‌ టాలెంట్‌కి, క్రియేటివిటీకిది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇలాంటి ఊహనే ఒక అద్భుతం. ప్రపంచ సినిమా చరిత్రలో ఇలాంటి ఊహ ఎవరూ చేయలేరు. `కల్కి 2898ఏడీ` సినిమా ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. కాంప్లెక్స్, శంభాల, కాశీ నగరాలకు ముడిపెడుతూ ఈ కథ రాసుకోవడమే చాలా క్లిష్టమైన విషయమంటే దాన్ని సినిమాగా వెండితెరపై ఎక్కించడం మరో బిగ్గెస్ట్ ఛాలెంజ్‌. దాన్ని కన్విన్సింగ్‌ గా చెప్పడం మరో పెద్ద టాస్క్. ఈ విషయంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చాలా వరకు సక్సెస్‌ అయ్యారు. ఓ కొత్త లోకాన్ని క్రియేట్‌ చేసి వాహ్‌ అనిపించాడు. చాలా సీన్లు విజువల్‌ వండర్‌గా ఉన్నాయి. వీఎఫ్‌ఎక్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఈ పార్ట్‌ వరకు వంద శాతం ఆయన సక్సెస్‌ కాలేదు. ఎంగేజింగ్‌గా ఆడియెన్స్ ని కూర్చోబెట్టడంలో ఆయన తన పనితనం చూపించాడు. అన్ని అంశాల మేళవించే ప్రయత్నంలో కొన్ని టప్పటడుగులు వేశారు. సినిమా కథని ట్రాక్‌ తప్పేలా చేశాడు. 
 

సినిమా మొదటి భాగం ప్రారంభంలో కురుక్షేత్రం పరిచయం సన్నివేశాలు బాగున్నాయి. యంగ్ అశ్శత్థామపాత్ర, కృష్ణుడి ఎపిసోడ్‌ చాలా బాగుంది. వామ్‌ అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత కాంప్లెక్స్ లోకి వచ్చాక మొత్తం పాత్రలని పరిచయం చేయడం, ఎవరి ఉద్దేశ్యాలేంటి? అనేది చెప్పేందుకు ఎక్కువ టైమ్‌ తీసుకున్నాడు. దీంతో స్లోగా సాగుతుంది. భైరవ, బుజ్జిల మధ్య కామెడీ ట్రాక్‌ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. అక్కడక్కడ జస్ట్ ఫన్‌ తప్ప చాలా వరకు చిరాకు తెప్పిస్తుంది. ప్రభాస్‌ పాత్ర కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఆయనచేసే లేజీ పనులు, లేజీ ఫైట్లు కూడా కొంత బోర్‌ తెప్పిస్తాయి.   ఏ క్షణంలోనైనా ఆయన సీరియస్‌గా ఫైట్‌ చేస్తాడా? సీరియస్‌గా ఉంటాడా అని వెయిట్‌ చేసినా నో యూజ్‌. నిరాశే ఎదురవుతుంది. పైగా ఆయన కాంప్లెక్స్ గురించి కనే కలలు, బ్రహ్మానందంతో కామెడీ, ఇతర విలన్లతో ఫైట్లు అంత కిక్‌ ఇచ్చేలా లేవు. ఫస్టాఫ్‌ మొత్తం చిరాకు తెప్పిస్తుంది. ఇందులో దిశా పఠానీ పాత్రని కేవలం గ్లామర్‌ కోసమే, పాట కోసమే వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె పాత్రకి జస్టిఫికేషన్‌ లేదు. సెకండాఫ్‌ తర్వాత దీపికా పదుకొనె గర్భవతి కావడం, అశ్వత్థామ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఊపందుకుంటుంది. 

సెకండాఫ్‌ మొత్తం అశ్వత్థామ పాత్ర అయిన అమితాబ్‌, భైరవ అయిన ప్రభాస్‌ల మధ్య ఫైట్‌ ఎపిసోడ్‌తోనే సాగుతుంది. ఈ ఇద్దరి మధ్య పోరు భీకరంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. మధ్య మధ్యలో స్టార్స్ పరిచయం బాగున్నా, అంత స్పెషల్‌గా అనిపించలేదు. సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్‌, ఫరియా అబ్దుల్లాతోపాటు విజయ్‌ దేవరకొండ మెరిశారు. కానీ విజయ్‌ దేవరకొండ పాత్ర మాత్రం హైలైట్‌గా నిలిచింది. సినిమాలో నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ అద్భుతం. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాని తీసుకెళ్లిన తీరు బాగుంది, క్లైమాక్స్ పీక్‌లో ఉంటుంది. కానీ సీన్ల పరంగా అంతగా పండలేదు. భారీ కాస్టింగ్‌ని సరిగ్గా వాడుకోలేకపోయాడు నాగ్‌ అశ్విన్‌. చాలా పాత్రలు తేలిపోయాయి. అలాగే భైరవ పాత్రలో అంతటి పవర్‌ ఎలా సాధ్యమనేది క్లారిటీ లేదు. ఈ సినిమాలో అసలు కథేం లేదు. జస్ట్ ఇంట్రడక్షన్‌ మాత్రమే. డ్రామా కూడా వర్కౌట్ కాలేదు. అది ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. ఏం జరుగుతుందో అనే వేచి చూడటమే తప్ప, పాత్ర ఎమోషన్‌ ఆడియెన్స్ కి ఎక్కలేదు.  రెండు మూడు పార్ట్ ల కోసం కథని దాయడం వల్ల మొదటి పార్ట్ ని అన్ని సీన్లలోనూ సాగదీత కనిపిస్తుంది. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్‌. క్లైమాక్‌ 40 నిమిషాలే అసలు సినిమా. అప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్షన్‌ సీన్లని, ప్రభాస్‌ పాత్రలోని ట్విస్ట్ ని అదిరిపోయేలా రివీల్‌ చేశాడు నాగ్‌. విజయ్‌ దేవరకొండ పాత్రని సైతం బలంగా తీసుకున్నాడు. ఆ గతాన్ని టచ్‌ చేసిన తీరు, ఏ పాత్ర ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు ట్రావెల్‌ అవుతుంది. కలి ఎవరు? కల్కి ఎవరు? సుప్రీం గర్భంలోనుంచి సీరం ఎందుకు తీస్తున్నాడు? సుమతి గర్భాన్నే ఎందుకు కోరుకుంటున్నాడు అన్నింటికి క్లైమాక్స్ లో సమాధానం దొరుకుతుంది. ఇక కమల్‌ పాత్ర చివరి ఐదు నిమిషాలు వాహ్‌ అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమా జస్ట్ క్లైమాక్స్ మాత్రమే బాగుందని చెప్పొచ్చు. 

నటీనటులుః 
భైరవ పాత్రలో ప్రభాస్‌ అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయన పాత్రలో కామెడీని చూపించాడు. అది కొంత రిలీఫ్‌నిచ్చే అంశం. కానీ ఆ కామెడీ పండకపోవడం మైనప్‌. చాలా చోట్ల ప్రభాస్‌ని పడుకోబెట్టే సీన్లే ఉంటాయి. అది కూడా కొంత అసంతృప్తిని కలిగిస్తాయి. అసలే బయట ఆయనపై ఓ అభిప్రాయం ఉంది. దాన్నే ఇందులో చూపించారా? అన్నట్టుగా ఆయా సీన్లు ఉండటం గమనార్హం. ఇక అశ్శత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ అదరగొట్టాడు. చాలా సీన్లలో బిగ్‌ బీనే హీరో అనిపించుకుంటాడు. ఈ ఏజ్‌లో ఆయనకూడా చాలా బాగా చేశాడు. పాత్రని జీవించి, నిజమైన అశ్వత్థామగా అనిపించాడు. గర్భంతో ఉన్న సుమతి పాత్రలో దీపికా పదుకొనె జీవించింది. ఆమె సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. కమల్‌ కొత్త గెటప్‌తో మరోసారి ట్రీట్‌ ఇచ్చాడు. ఆయన పాత్ర చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. అలాగే రెబల్‌టీమ్‌ నాయకురాలిగా శోభన మెప్పించారు. ఉన్నంతసేపు చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుంది ఆ పాత్ర. ఆర్జీవీ, అనుదీప్‌ నవ్వించలేకపోయారు. అవసరం అనిపిస్తుంది. ప్రభాస్‌పై రాజమౌళి కామెంట్లు నవ్వించేలా ఉంటాయి. మృణాల్‌ ఠాకూర్‌ పాత్ర ప్రారంభంలో బాగానే ఉన్నా, ఎమోషనల్‌ ఫీల్‌ తేలేదు. రాజేందప్రసాద్‌ పాత్ర కూడా అంతే. కానీ కైరా పాత్ర చేసిన అమ్మాయి బాగా చేసింది. ఎమోషనల్‌గానూ ఉంటుంది. కమల్‌ హాసన్‌ మరో కొత్త లుక్‌లో విశ్వరూపించారు. రెండు డిరెంట్‌ లుక్స్ చూపించి సర్‌ప్రైజ్‌ చేశారు. దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర పెద్దగా హైప్‌ ఇవ్వలేదు. విజయ్‌ పాత్ర మాత్రం అదిరిపోయింది. మిగిలిన వాళ్లు ఓకే అనిపించారు. 
 

టెక్నీకల్‌గాః 
టెక్నీకల్‌గా ఈ మూవీ చాలా బ్రిలియంట్‌ అని చెప్పొచ్చు. చాలా క్వాలిటీ ఉన్న ఫిల్మ్ కూడా. ఇంతటి క్వానస్‌లో `బాహుబలి` తప్ప మరే మూవీ రాలేదని చెప్పాలి. డోర్‌ డ్జే స్టోజిల్‌ కోవిక్‌ కెమెరావర్క్ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఎడిటింగ్‌ కోటగిరి వెంకటేశ్వరరావు తన పనికి న్యాయం చేయలేదు. ఫస్టాఫ్‌లో ఇంకా షార్ప్ చేయాల్సింది. మ్యూజిక్‌ పరంగా సంతోష్‌ నారాయణ్‌ సక్సెస్‌ అయ్యాడు. పాటలు ఉన్నంతలో బాగానే ఉన్నాయి. అదిరిపోయాయి అనేలా అయితే లేవు. బీజీఎం మాత్రం బాగుంది. ఎలివేషన్లు బాగున్నాయి. క్లైమాక్స్ లో అదిరింది. కాకపోతే స్పెషల్‌ హైలైట్‌ మాత్రం కాలేదు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వన్‌ మ్యాన్‌ షోకిది నిదర్శనమని చెప్పొచ్చు. టెక్నీకల్‌గా ఆయన టాలెంట్‌, క్రియేటివిటీకి నిదర్శనంగా ఈ మూవీ నిలుస్తుంది. అయితే కథ పరంగా ఏం చెప్పలేదనే వెలితి ఉంటుంది. సాగదీసే సీన్ల విషయంలో ప్రభాస్‌ పాత్రని డిజైన చేసిన విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆ కేర్‌ తీసుకుంటే సినిమా ఫలితం మరింత బాగుండేది. నిర్మాణం పరంగా క్వాలిటీ కనిపిస్తుంది. ఖర్చు కనిపిస్తుంది. 
 

`బాహుబలి`ని కొట్టేస్తుందా?..
`కల్కి 2898ఏడీ` సినిమా అద్భుతం అని అంతా అంటున్నారు. `బాహుబలి`ని కొడుతుందా? అంటే మాత్రం కష్టమనే చెప్పాలి. సీన్లలో డెప్త్, ఎమోషనల్‌, సీన్‌ బై సీన్‌కి లింక్‌ ఉండాలి. ఇందులో అది మిస్‌ అయ్యింది. చాలా సీన్లు లింక్‌లేకుండానే వచ్చిపోతాయి. దీంతో చాలా డిస్‌ కనెక్షన్స్ ఉంటాయి. చూడగలిగే సినిమానే గానీ, అద్బుతమైన సినిమా మాత్రం కాదు. చిన్నపిల్లలు చూసేలా ఉంటుంది.  

ఫైనల్ గాః `కల్కి 2898ఏడీ` ఓ కొత్తరకమైన అనుభూతినిచ్చే చిత్రం. అద్భుతమని చెప్పలేం, కానీ క్లైమాక్స్ మాత్రం అదిరింది. 

రేటింగ్‌ః 3
 

Latest Videos

click me!