ధనుష్ 'రాయన్'మూవీ రివ్యూ

First Published | Jul 26, 2024, 2:11 PM IST

నటుడిగా, దర్శకుడిగా ధనుష్‌కు రాయన్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సినిమా ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించారు. 

Raayan Movie Review


ధనుష్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్టే ఉంది. సార్ సినిమాతో అది నిలదొక్కుకుంది. దాంతో ఆయన డబ్బింగ్ సినిమా అంటే ఇక్కడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. దానికి తోడు గ్యాంగస్టర్ డ్రామా అంటే ఓ వర్గానికి ఎప్పుడూ ఆసక్తే. కానీ ఆ డ్రామా మనవాళ్ల నేటివిటికి పోల్చుకునేలా ఉండాలి. మనకు తెలుసున్న పాత్రే అనిపించాలి.లేదా ఫుల్ ఎంటర్ట్నైమెంట్ అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఈ సినిమా దేన్ని ఎంచుకుంది. మన వాళ్లకు నచ్చే చిత్రమేనా...తెలుగు హీరో సందీప్ కిషన్ కెరీర్ కు ఇది ఏ మాత్రం ప్లస్ అవుతుంది చూద్దాం.

Actor Dhanushs Raayan review

స్టోరీ లైన్

కార్తవ రాయన్(ధనుష్) కు తన  తమ్ముళ్లు ముత్తువేల్ రాయన్(సందీప్ కిషన్), మాణిక్యం రాయన్(కాళిదాస్ జయరామ్), తన చెల్లి దుర్గ(దుషారా విజయన్) అంటే ప్రాణం. కానీ చిన్నప్పుడే తల్లి,తండ్రి తమను వదిలేసి వెళ్లిపోవటంతో వాళ్ల భాద్యతను తనే తీసుకుంటాడు. వాళ్లపై ఈగ వాలినా కూడా సహించడు.  ఈ క్రమంలో  రాయన్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండి నడుపుకుంటూ ఉంటాడు. చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. అయితే ముత్తువేల్ మాత్రం కాస్త తేడా. ఎప్పుడూ  ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ తగువులు తెస్తూ  ఉంటాడు. 


Dhanush Raayans


ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(SJ సూర్య)లు  ఇద్దరు లోకల్ గ్యాంగస్టర్. తమ గ్యాంగ్ లతో వీరవిహారం చేస్తూంటారు. అలాగే అదే ఊరికి ఈ గ్యాంగ్ ల అంతు చూడటానికి  పోలీసాఫీసర్(ప్రకాష్ రాజ్)  వస్తాడు. అతను వీళ్లను అంతం చేయాలనుకోవటానికి వేరే కథ ఉంటుంది. ఇలా ఎవరిపనిలో వాళ్లు ఉంటారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అనుకొనే   సీతారాం (ఎస్‌జే సూర్య)తో చేతుల కలిపిన ముత్తు, మాణిక్యం తన అన్నయ్య రాయన్‌పై హత్యా ప్రయత్నం చేస్తారు. అలా ఎందుకు చేసారు. అప్పుడు తన ప్రాణంగా భావించే తమ్ముళ్లే శత్రువులు అయితే రాయన్ ఎలా స్పందించాడు. ఈ లోగా చెల్లి వైపు కథ మలుపు తిరుగుతుంది. అదేమిటి వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 


విశ్లేషణ

ధనుష్ డైరక్షన్, అదీ అతను నటుడుగా  50వ సినిమా అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రానికి ఏదో ఒక కొత్త పాయింట్ ని ఎంచుకుని హిట్ కొడతాడనే నమ్ముతాము. అయితే ధనుష్ ...ఎన్నో సార్లు నలిగిన రొటీన్ పాయింట్ తోనే సక్సెస్ సాధించాలనుకున్నాడు. అప్పట్లో వచ్చిన అమితాబ్ హమ్...ఆ తర్వాత వచ్చిన భాషాకు,తెలుగులో వచ్చిన ఆ ఫార్మెట్ చిత్రాలకు ఓ వెర్షన్ లా ఈ సినిమా అనిపిస్తుంది.  బాషా కథకు పెద్దన్నయ్య, హిట్లర్ సినిమాలు కలిపి వండినట్లు అనిపిస్తుంది.  ఎలాగూ తమిళ అతి ఉండనే ఉంటుంది. అది  చెల్లి సెంటిమెంట్ గట్టిగానే జోడించారు. అయితే కథలో గ్యాంగ్ లు ఉన్నాయి. తమ్ముళ్లు ఎదురు తిరిగారు. ఇన్ని ఉన్నా బలమైన కాంప్లిక్ట్స్  సెట్ చేయలేకపోయారు. అన్ని అలా జరిగిపోతాయంతే. 

Raayan Review


తన కుటుంబం కోసం ఎంతకైనా ,దేనికైనా సిద్దపడే రాయన్ గా కనిపించాడు. ఇందులో కథగా కొత్తేముంది అనిపిస్తుంది. అయితే దీన్ని ధనుష్ టెక్నాలిజితో కప్పిపుచ్చే ప్రయత్నం చేసాడు. అలాగే ఎక్కువ శాతం గ్యాంగ్ వార్స్ కు ప్రయారిటీ ఇచ్చాడు. అయితే జనం గ్యాంగ్ వార్స్ చూసి బోరెత్తిపోయారు. ధనుష్ సినిమాల్లో రెగ్యులర్ గా అది కనిపిస్తూనే ఉంటోంది. అయితే అక్కడక్కడ కొన్ని ట్విస్ట్ లు బాగానే పేలాయి. కానీ అవేమీ కథనానికి మనని కట్టిపారేయటానికి పెద్దగా ఉపయోగపడే ఎలిమెంట్స్ గా మారలేదు. ఇక ధనుష్ ...సందీప్ కిషన్ పాత్రకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. క్లైమాక్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.  ఏదైమైనా తెలుగు వాళ్లు ఇంత డార్క్ మోడ్ లో స్లోగా  సాగే డ్రామాని ఆసక్తిగా చూస్తారా అనేది చూడాలి.
 

Raayan


టెక్నికల్ గా ...
దర్శకుడుగా ధనుష్ తనేంటో తన స్టాండర్డ్స్ ఏంటో  ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసారనిపిస్తుంది.  రెహ‌మాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అనిరిధ్ కు పోటీ ఇచ్చేలా ఉన్నాయి.   ఫొటోగ్ర‌ఫీ, ఎడిటింగ్…అన్ని విభాగాలు ఓ మూడ్ ని కథకు సెట్ చేసాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

Raayan


నటీనటుల్లో ...

ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన తమ్ముళ్లు, చెల్లి కోసం ఎంతదూరమైనా వెళ్లే అన్నయ్యగా పీక్స్ చూపించాడు. కళ్లలో ఇంటెన్స్ పలికించిన సీస్ హైలెట్. సందీప్ కిషన్  ఈ సినిమాలో కొత్తగా చేసాడనే చెప్పాలి. రెగ్యులర్ కు భిన్నంగా ఉన్నాడు. ప్రకాష్ రాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇద్దరూ పెద్దగా చెప్పుకోవటానికి వీలు లేని పాత్రలు. ఇప్పుడు ఎస్ జే సూర్య హవానే నడుస్తోంది. బాగా చేసాడనే చెప్పాలి కానీ కాస్తంత ఓవర్ అనిపించింది. సెల్వరాఘవన్ తన తమ్ముడు డైరక్షన్ లో బాగా చేసాడు అనాలా?అపర్ణా బాలమురళీ ఫ్యాన్స్ కాస్తంత నిరాశపడతారు. 
 

Actor Dhanush Raayan


ఫైనల్ థాట్
 
 ప్యూర్ తమిళ్ రా అండ్ రస్టిక్ మేకింగ్ చేసిన ఈ సినిమా తమిళ సినిమాలు ఆరాధించేవాళ్లకు ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు సోసోగా సోబర్ గా అనిపిస్తుంది. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5
 

ఎవరెవరు..

బ్యానర్: సన్ పిక్చర్స్ 
నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, ఎస్ జే సూర్య, సెల్వరాఘవన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
 ఎడిటింగ్: ప్రసన్న జీకే
 సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్ 
 రచన, దర్శకత్వం: ధనుష్
 నిర్మాత: కళానిధి మారన్ 
రిలీజ్ డేట్: 2024-07-26

Latest Videos

click me!