నితిన్ ‘భీష్మ’ రివ్యూ

First Published | Feb 21, 2020, 1:09 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

మహా భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన మరువలేని పాత్ర భీష్ముడిది. భీష్ముడు.. ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయినవాడు, సత్యవర్తనుడు, పరాక్రముడు. అలాంటి భీష్ముడుని గుర్తు చేసే టైటిల్ ని పెట్టినప్పుడు ఖచ్చితంగా కథలో  ఆ పాత్ర లక్షణాలు లేదా చర్యలతో కూడిన కంటెంట్ ఏదైనా ఉంటుందేమో ఆశిస్తాం. (అఫ్ కోర్స్ అది పురాణాలు గురించి తెలిసినవారికైతేనే..). మరి ఈ మోడరన్ భీష్ముడు కేవలం టైటిల్ లోనే పురాణ పాత్రను గుర్తు చేసుకున్నాడా లేక నిజంగా ఆ పాత్ర లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడా. ఎవరీ భీష్మ,అతని లక్ష్యమేమిటి..లక్షణమేమిటి..చివరకు సాధించిందేమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

కథేంటి.. : భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ యజమాని భీష్మ( అనంత్ నాగ్) స్వయం శక్తితో పైకి వచ్చినవాడు. తన కంపెనీతో వ్యవసాయ రంగానికి సాయిం చేస్తున్నవాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. దాంతో...వారసులు లేని ఆయన.... తను రిటైర్ అయితే...తన కంపెనీని నిలబెట్టే వారసుడు కోసం సెర్చింగ్ లో ఉంటాడు. తనలాగే కష్టపడే తత్వం ఉండే వాడు తన కంపెనీకి వారసుడు అయితే బాగుంటుందని ఆయన భావన. మరో ప్రక్క ఈయన పేరు గల అల్లరి కుర్రాడు భీష్మ (నితిన్). జీవితంలో ఏ విధమైన లక్ష్యం లేకుండా సింగిల్ గా లైఫ్ వెళ్ల దీస్తూంటాడు. అయితే అతని జీవితం...చిత్ర (రష్మిక)తో ప్రేమలో పడ్డాక టర్న్ తీసుకుంటుంది. ఆమె భీష్మ కంపెనీలో జాబ్ చేస్తూంటుంది. మనవాడి చేష్టలకు..ఆమె కూడా కొద్ది రోజులుకు జూ.భీష్మ తో ప్రేమలో పడుతుంది. అయితే ఈ విషయం ఆమె తండ్రి ఎసీపి దేవా (సంపత్)కు తెలుస్తుంది. దాంతో ఆయన నా కూతురునే లైన్లో పెట్టాలని చూస్తావా అని సీరియస్ అవుతాడు.
undefined
మనవాడిని కాల్చి పారేస్తానంటూ ఎగురుతాడు. అప్పుడు తన కొడుకుని రక్షించుకోవటానికి అప్పటికప్పుడు ..ఓ అబద్దం ఆడతాడు జూ.భీష్మ తండ్రి (నరేష్). అదేమిటంటే..నా కొడుకు భీష్మ నువ్వునుకుంటున్నట్లు అల్లాటప్పావాడేమీ కాదు..భీష్మ కంపెనీకు వారసుడు అంటాడు. అంతే వాళ్లు షాక్. మన జూ.భీష్మ కూడా షాక్. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో భీష్మ.. “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” కి వర్కింగ్ సీఈవో అవుతాడు. ఇక సీఈవో అయ్యాక ప్రూవ్ చేసుకుందామనుకున్న భీష్మకు అసలు కష్టం మొదలవుతుంది. రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. భీష్మ ఆర్గానిక్ కంపెనీకి వ్యతిరేకంగా పనిచేసే, క్రిమినల్ మైండ్ కలిగిన కార్పొరేట్ కంపెనీ హెడ్ రాఘవన్(జిష్ణు సేన్ గుప్త)తో పోటీ పడాల్సి వస్తుంది.
undefined

Latest Videos


తనపై నిరంతం నిఘా పెట్టే ప్రక్క కంపెనీ ఎంప్లాయి రఘుబాబు,తనతో పాటు తిరుగుతూ తన వెనకే గోతులు తీసే వెన్నెల కిషోర్ ని సైలెంట్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అటు కెరీర్ ని, ఇటు ప్రేమని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాడు, రాఘవన్ ని ఏం మైండ్ గేమ్ లు ఆడి ఎదుర్కొన్నాడు.. అసలు అంత పెద్ద భీష్మ కంపెనీ బాధ్యతలు నితిన్ చేతిలో ఎలా పెట్టారు..? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఎలా ఉంది.. : మీరు పైన చదివిన కథ పెద్దగా ఇంప్రెసివ్ గా ఉండదు. ఎందుకంటే ఇది కథ కన్నా కథనానికి ప్రాధాన్యత ఇచ్చిన సినిమా. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ టచ్ తో నడుస్తుంది. చిన్న స్టోరీ లైన్ ని పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో ...రెండు గంటల సినిమా గా విస్తరించటమే థ్యేయంగా పెట్టుకుని వర్క్ చేసారు.ముఖ్యంగా సెకండాఫ్ లో ఎక్కడా డల్ మూవ్ మెంట్ లేకుండా సినిమాని పరుగెట్టించటంతో చాలా లాజిక్స్ పట్టుకునే అవకాసం ఇవ్వనివ్వడు దర్శకుడు. అలాగే రష్మిక మరోసారి అదరకొట్టింది. అయితే విలన్ థ్రెడ్ వీక్ అని చెప్పాలి. నెగిటివ్ రోల్ లో కనిపించిన జిష్ణు సేన్ గుప్త పాత్రను మరింత స్ట్రాంగ్ గా పెట్టి ఉంటే ఇంపాక్ట్ వేరే విధంగా ఉండేది. అయితే సినిమాలో అది సబ్ ప్లాట్ గానే తీసుకున్నాడు కాబట్టి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోయినా నష్టం కనపడలేదు.
undefined
హిట్టులు.. : నితిన్ ఫెరఫార్మెన్స్, మీమ్స్ డైలాగులు, అనంతనాగ్ మరియు నితిన్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్, హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్త్రీ, ఆద్యంతం కామెడీ తో సినిమాని నడిపిన విధానం, వెన్నెల కిశోర్ క్యారక్టర్, సంపత్ రాజ్, నితిన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్
undefined
ఫట్ లు.. : ప్రెడిక్టుబుల్ స్టోరీ లైన్, క్లైమాక్స్ పాటలు ఇంకాస్త హిట్ లక్షణాలతో ఉండాల్సింది
undefined
దర్శకత్వం,మిగతా విభాగాలు.. : దర్శకుడు వెంకీ కుడుముల..ఛలో సినిమాలాగే ఈ సినిమాను నాన్ స్టాఫ్ ఫన్ గా మలుచుకున్నాడు. అందుకు కథ అడ్డం పడకూడదని చాలా సన్నని లైన్ తీసుకున్నాడు. ప్రెష్ సీన్స్, ఫన్ డైలాగ్స్ ప్లస్ అయ్యాయి. రైటింగే ఈ సినిమాకు అన్ని విధాల కలిసొచ్చింది. ఇందులో మరో విశేషం ఏమిటి అంటే రొటీన్ గా అనిపిస్తూనే... దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేసి ఆ ఫీల్ రాకుండా లాక్ చేయటం.ఇక మహతి స్వర సాగర్ సంగీతం మరో ప్లస్. సాంగ్స్ ప్లిసింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ట్రెండీగా సాగింది. ఎడిటింగ్ కూడా సినిమాని ఎక్కడా ఆగి,బోర్ కొట్టే పరిస్దితి రానవ్వకుండా పరుగెత్తించింది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. ఎప్పటిలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అసభ్యత, హింస కు చోటు లేకపోవటం, ప్రతీ సీన్ ని ఫన్ తో ప్యాక్ చేయటంతో ఫ్యామిలీలకు ఈ సినిమా పడుతుంది.
undefined
ఫైనల్ ధాట్ : శిఖండని అడ్డుపెట్టుకోలేకపోతే కనుక ఆ భీష్మని ఓడించడం ఎవరి తరమూ అయ్యేది కాదు. అలాగే ఫన్, రష్మిక ఆదుకోకపోతే యూత్ ని గెలవటం ఈ భీష్మ (నితిన్) తరం అయ్యేది కాదు.
undefined
Rating: 35
undefined
click me!