`జాను` మూవీ రివ్యూ

First Published Feb 7, 2020, 1:30 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ప్రతీవాళ్ల జీవితంలోనూ ఏదో ఒక ప్రేమ కథ ఉండే ఉంటుంది. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ టైమ్ లో ఇష్టపడిన వారితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రేమలు, వారి కోసం రాత్రింబవళ్లూ నిద్రాహారాలు మారి కలవరించటం, వారిని ఇంప్రెస్ చేయాలని తపన పడటం కామన్. ఈ టీనేజ్ ప్రేమ కథలు ఏ తీరం చేరినా జీవితాంతం మాత్రం తీపి జ్ఞాపకాలుగా గుర్తిండిపోతాయి. ముఖ్యంగా ఆ ప్రేమ కథ ఆ స్కూల్ లేదా కాలేజీలోనే ముగిసిపోయినప్పుడు మరీ మనస్సుని పట్టేస్తుంది. మళ్లీ అవకాసం వచ్చినప్పుడు ఆ ప్రేమ కథ గుర్తొచ్చి మైమరిపిస్తుంది. 

అలా తమ జ్ఞాపకాలను తట్టిలేపే ప్రేమకథలతో వచ్చే చిత్రాలు అరుదుగా ఉంటాయి. ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలలో చెప్పే ప్రేమ కథలలో ఆ ఫీల్ ఉండదు. కానీ కొన్ని సినిమాలు ప్రత్యేకం. అవి మన మనస్సుని ఎక్కడో తడతాయి. మనని ప్లాష్ బ్యాక్ లోకి లాగేస్తాయి. అలాంటి అరుదైన ప్రేమ కథ..తమిళంలో వచ్చి హిట్టైన `96` . త్రిష‌, విజ‌య్ సేతుప‌తి జంట‌గా రూపొందిన ఈ చిత్రం అక్క‌డ ఘన విజ‌యాన్ని సాధించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు త్రిష‌కు 11 అవార్డుల్ని అందించింది. ఆ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ తెలుగు చిత్రం ఆ స్దాయి మ్యాజిక్ ని రీక్రియేట్ చేయగలిగిందా చూద్దాం.
undefined
కథేంటి.. రామ్ అలియాస్ రామ చంద్ర (శర్వానంద్), జాను అలియాస్ జానికి దేవి (సమంత) ఇద్దరూ క్లాస్ మేట్స్. స్కూల్ లో చదివే ఆ వయస్సులోనే ఇద్దరూ లవ్ ఎట్ ఫస్ట్ అంటూ ప్రేమలో పడిపోయినవాళ్లూను. కానీ పరిస్దితులు ఈ ప్రేమికులుకు ఎదురుతిరుగుతాయి. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నాం అని తెలిసినా చెప్పుకోలేకపోతారు. ఈ టీనేజ్ ప్రేమ...మొగ్గలోనే ముగిసిపోతుంది. ఇద్దరూ విడిపోయి..ఎవరి జీవితాల్లో వాళ్లు పడిపోతారు. మళ్లీ 17 సంవత్సరాల తర్వాత వీళ్లద్దరూ గెట్ టు గెదర్ లాంటి స్కూల్ రీయూనియన్ పంక్షన్ లో కలుస్తారు.
undefined
అప్పటికి జానుకి పెళ్లైపోయింది. రామ్ మాత్రం అలాగే అవివిహాతుడుగా మిగిలిపోయాడు. ఇంతకాలం గ్యాప్ తర్వాత కలిసిన వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు. ఏం చేసారు. ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు. ఆ కొద్ది పాటి గంటల్లో ఏ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు...చివరకు ఈ ఒకనాటి ప్రేమకులు...అలనాటి ప్రేమకులుగా మిగిలిపోయారా...లేక ఇప్పుడు ఏమన్నా నిర్ణయం తీసుకుని ఒకటి అయ్యారా, అప్పుడు ఎందుకు వీళ్లిద్దరూ ఒకటి కాలేకపోయారు...వారి హృద‌యాల్లో ఏర్ప‌డిన మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల స‌మాహార‌మే ఈ సినిమా.
undefined
ఎలా ఉందంటే... ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. అందుకు తగినట్లే స్కీన్ ప్లే కూడా రాసుకున్నారు. ఎక్కువగా మాజీ ప్రేమకుల మానసిక సంఘర్షణలు, వారి మధ్య జరిగే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. మనస్సుతో చూడాల్సిన సీన్స్ చాలా ఉంటాయి. కళ్లతో కానిచ్చేసి,మైండ్ తో జడ్జిమెంట్ ఇచ్చేసే కథ కాదిది. చాలా ఫీల్ తో దర్శకుడు రాసుకున్న సీన్స్ ని ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా తెరకెక్కిచారు.
undefined
అయితే సినిమా స్లో గా సాగటం మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో మరీ వేగం తగ్గిపోతుంది. స్కూల్ లవ్ స్టోరీకి దాదాపు అందరూ కనెక్ట్ అవుతారు. అయితే అంత స్లోగా నడిచినా గుండెని పట్టేసే సీన్స్ కొన్ని ఈ సినిమాకు ప్రాణమై నిలుస్తాయి. కాకపోతే ఓ కండీషన్....ఆ సీన్స్ రిపీట్ అవుతున్నాయని ఫీలవుకూడదంతే. అలాగని సినిమా ఎక్కడా నిరాశపరచదు. అలా ప్రవాహంలా వెళ్లిపోతుంది. అలలు అక్కడక్కడా ముందుకు వెనక్కి కదులుతూంటాయి.
undefined
టెక్నికల్ గా... మ్యాజిక్ ని రిపీట్ చేయటం ఎప్పుడూ కష్టమే. తమిళంలో వచ్చిన 96 సినిమా అలాంటిదే. అదో మ్యాజిక్ ..క్లాసిక్. దాన్ని అంతే అద్బుతంగా తెరకెక్కిచటం అంటే కత్తి మీద సామే. అయితే చాలా వరకూ దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తెలుగు రీమేక్ అనే ఫీల్ లేకుండా స్ట్రైయిట్ సినిమా అనిపించగలిగాడు. ముఖ్యంగా కాస్టింగ్, ప్రొడక్షన్ విషయంలో ఈ రీమేక్ హై సక్సెస్. స్కూల్ ఎపిసోడ్స్ బాగా తీసిన దర్శకుడు, సెకండాఫ్ లో వచ్చే కీ ఎపిసోడ్స్ ని మరీ స్లో చేసేసి, అసలు సినిమా కదులుతోందా అనిపించేలా చేసాడు.
undefined
పాటలు సిట్యువేషనల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. విజువల్స్ హైలెట్ గా ఉన్నాయి. మిగతా టెక్నిషియన్స్ వర్క్ ...దిల్ రాజు వంటి సంస్ద నిర్మించే చిత్రాల మాదిరిగానే మంచి స్టాండర్డ్స్ లో ఉన్నాయి. తమిళ విజయ్ సేతుపతి,త్రిషలతో పోటీ పెట్టలేం కానీ ఇక్కడ శర్వానంద్, సమంత ఇద్దరూ బాగా చేసారు. ముఖ్యంగా ప్రేమ, విరహం, వేదన అనే అంశాలను కళ్లతోనూ , బాడీ లాంగ్వేజ్ తోనూ చూపించగలిగారు.
undefined
ఫైనల్ థాట్ తమిళం వాళ్ళు తట్టుకోగలిగే స్లో నేరేషన్ ...తెలుగు వారు ఫాలో అవ్వావలంటే కాస్త కష్టమే. ఏదైమైనా ఈ సినిమా మన మనస్సులోనూ ఓ రాయిని విసురుతుంది. ఆ తరంగాలు తట్టుకోగలం,పట్టుకోగలం అనుకుంటే థియోటర్ కు వెళ్లటమే.
undefined
Ratign: 35
undefined
click me!