Hi Nanna Review: `హాయ్‌ నాన్న` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Dec 7, 2023, 12:58 AM IST

నేచురల్‌ స్టార్‌ నాని `దసరా` వంటి ఊరమాస్ మూవీ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో వస్తున్నారు. తాజాగా ఆయన `హాయ్‌ నాన్న` అనే చిత్రం చేశారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ఈ మూవీ నేడు(డిసెంబర్‌ 7న) విడుదలయ్యింది.  ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

నేచురల్‌ స్టార్‌ నాని `దసరా` వంటి ఊరమాస్ మూవీ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో వస్తున్నారు. తాజాగా ఆయన `హాయ్‌ నాన్న` అనే చిత్రం చేశారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. శృతి హాసన్‌ గెస్ట్ రోల్‌ చేసిన మూవీ ఇది. నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. తండ్రి కూతుళ్ల బాండింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పైగా టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ నేడు(డిసెంబర్‌ 7న) విడుదలయ్యింది. ముందుగా ప్రత్యేకంగా ప్రీమియర్‌ ప్రదర్శించారు. మరి సినిమా అంచనాలను (Hi Nanna Review) అందుకుందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
విరాజ్‌(నాని) సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌. తనకు కూతురు మాయ(కియారా) స్కూల్‌ చదువుతుంది. తనకు అరుదైన అనారోగ్య సమస్య. తనని ఎంతో కేరింగ్‌గా చూసుకుంటాడు. ఓ వైపు వృత్తిరిత్య బిజీగా ఉన్నా తనకోసం టైమ్‌ కేటాయిస్తాడు. స్టోరీస్‌ చెబుతూ ఎంటర్టైన్‌ చేస్తుంటాడు. తనకు ఏ కథ చెప్పినా అందులో పాత్రలను ఊహించుకోవడం మాయకి అలవాటు. తనకు ఎప్పుడూ డాడీ స్టోరీస్‌ చెబుతున్నాడని, మమ్మీ స్టోరీస్‌ చెప్పాలని మారం చేస్తుంది మాయ. స్టడీస్‌లో ఫస్ట్ వస్తే చెబుతా అంటాడు విరాజ్‌. స్టడీస్‌లో ఫస్ట్ వస్తుంది. అయినా మమ్మి స్టోరీ చెప్పకపోవడంతో మాయ అలుగుతుంది. తన ఫ్లూటో(పెట్‌ డాగ్‌)ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆ సమయంలో యష్ణ(మృణాల్‌ ఠాకూర్) మాయకి పరిచయం అవుతుంది. యష్ణని నాన్నకి పరిచయం చేస్తుంది మాయ. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతుంది. ఆ సమయంలో మమ్మీ స్టోరీ చెప్పాలని ఫోర్స్ చేయడంతో, విరాజ్‌ మమ్మీ స్టోరీ చెబుతాడు. ఈ కథలో మమ్మీగా యష్ణని ఊహించుకుంటుందు మాయ. 
 

Latest Videos


ఆ కథ విషయానికి వస్తే.. విరాజ్‌ ఫోటోగ్రాఫర్‌ గా ప్రారంభ సమయంలో మంచి ఫోటో ఫ్రేముల కోసం చూస్తుంటాడు. ఆ సమయంలో యష్ణని ఫోటోలు తీస్తారు. ఆమె అందానికి ముగ్దుడవుతాడు. అయితే వారిది సంపన్న కుటుంబం. విరాజ్‌ అప్పుడప్పుడే ఫోటోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. ఇంకా లైఫ్‌లో సెట్ కాలేదు. ఊర్లో రెండెకరాల పొలం ఉంటుంది. తమ ప్రేమ విషయాన్ని యష్ణ తన అమ్మకి చెబుతుంది. ఆమె విరాజ్‌ని చూసి ఎక్కువ తక్కువ అనే లెక్కలు వేస్తుంది. విరాజ్‌ కోసం ఫ్యామిలీని వదిలేసి వస్తుంది యష్ణ. తనకి పిల్లలంటే ఇష్టం లేదు.  విరాజ్‌ ఒత్తిడి కారణంగా ఓకే చెబుతుంది. వీరికి కూతురు పుడుతుంది. కానీ అనారోగ్యంతో జన్మిస్తుంది. ఆ పాపని తాకలేని స్థితి. ఐసీయూలో వెంటిలేషన్‌పైనే ఉంచాల్సిన పరిస్థితి. ఇది చూసి యష్ణ తట్టుకోలేకపోతుంది. బాగా డిస్టర్బ్ అవుతుంది. అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, ప్రెగ్నెంట్‌ అయ్యానని బాధపడుతుంది. ఈ క్రమంలో విరాజ్‌కి, యష్ణకి మధ్య గొడవలు అవుతాయి. అనుకోకుండా ఓ రోజు రాత్రి కారు యాక్సిడెంట్‌ అవుతుంది. ఆ ప్రమాదంలో యష్ణకి ఏమైంది? విరాజ్‌ ఒంటరిగా తన కూతురుతోనే ఎందుకు ఉంటున్నాడు? తన రియల్‌ లైఫ్‌లో ఉన్న యష్ణ ఎవరు? తన గతం ఏంటి? పెళ్లైన విరాజ్‌కి, పెళ్లి సెట్‌ అయిన యష్ణకి మధ్య లవ్‌ స్టోరీ ఏంటి? ఆమె పెళ్లిచేసుకోబోయేది ఎవర్నీ? ఇందులో శృతి హాసన్, `బేబీ` ఫేమ్‌ విరాజ్‌, అంగద్‌ బేడీ (Hi Nanna Review) పాత్రల కథేంటి? అనేది సినిమా మిగిలిన కథ. 
 

విశ్లేషణః
గతం మర్చిపోవడం, మళ్లీ ఏదో సందర్బంలో గతం గుర్తొచ్చి కలిసిపోవడమనే కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. ఓ ఇరవై ఏళ్ల క్రితం ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. `హాయ్‌ నాన్న` కూడా అలాంటి కథే. ముప్పై ఏళ్ల నాటి కథకి ఇప్పుడు షుగర్‌ కోట్ వేసి తీస్తే ఎలా ఉంటుందో `హాయ్‌ నాన్న` సినిమా అలా ఉంటుంది. ఇందులో డ్రామా శృతి మించేలా ఉంది. నూతన దర్శకుడు శౌర్యువ్‌ పాత కథలనే కొత్తగా చెప్పేప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ఆయన ఈ కథని చెప్పడం విశేషం. చాలా కన్విన్సింగ్‌గా, చాలా ఎమోషనల్‌గా ఈ సినిమాని తీసుకెళ్లాడు. ఆద్యంతం ఎమోషనల్‌ డ్రైవ్. ఓ వైపు (Hi Nanna Review) తండ్రి కూతుళ్లు మధ్య బాండింగ్‌, మరోవైపు లవ్‌ స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని చాలా నీట్‌గా నడిపించాడు. కథలో పాత్రలను రియల్‌ లైఫ్‌ పాత్రలతో ఊహించుకోవడమనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇదే మామూలుగా అయితే ఫ్లాష్‌ బ్యాక్‌లు వేసి చెబుతారు. ఇందులో దర్శకుడు ఆ కొత్త దనం పాటించి ఫ్లేవర్‌ మార్చేశాడు. 
 

సినిమా మొదటి భాగం చాలా స్లోగా సాగుతుంది. తండ్రి కూతుళ్ల మధ్య బాండింగ్‌కి సంబంధించిన కొన్ని సీన్లు క్యూట్‌గా, ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. కానీ లవ్‌ స్టోరీ రొటీన్‌గానే అనిపిస్తుంది. పైగా ఊహించుకోవడమనేది, తీరా చూస్తే అది కథే కావడం కొంత కన్‌ ఫ్యూజ్‌ క్రియేట్‌ చేసేలా ఉంది. అదే సమయంలో ఆ లవ్‌ స్టోరీ చాలా సాగదీతగా అనిపిస్తుంది.మరోవైపు లవ్‌ స్టోరీ అంతగా పండలేదు. దీంతో ఆ ఫీల్‌ మిస్‌ అయ్యింది. ఇది స్లోగా, ల్యాగ్‌ అనే ఫీలింగ్‌ కలిగింది. సీరియల్స్ ని తలపించింది. ఇక తన తన రియల్‌ లవ్‌ స్టోరీని రివీల్‌ చేసే సీన్లలో ట్విస్ట్ వర్కౌట్‌ కాలేదు. దీంతో ఆయా సీన్లలో ట్విస్ట్ కి సంబంధించిన థ్రిల్‌ పోయింది. మొదటి భాగంలోనే చాలా స్లో (Hi Nanna Review) సన్నివేశాలు, సాగదీత డైలాగులు,స్లో మోషన్‌ సీన్లతో బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక రెండో భాగమైన పరుగులు పెడుతుంది. తన అసలు లవ్‌ స్టోరీ, గతం స్టోరీ బయటకు వస్తుందని ఆశించగా అక్కడా నిరాశే ఎదురయ్యింది. మృణాల్‌ ఠాకూర్‌ అన్ని వదిలేసుకుని చిన్నారి చుట్టూతే తిరగడం, ఆమెకి పెళ్లి కాబోతున్నా? మరోవైపు ఆ పాప కోసం ప్రయారిటీ ఇవ్వడం, నాని వాళ్ల వెంటపడటం వంటి సీన్లు సినిమాటిక్‌ గా అయినా కన్విన్సింగ్‌గా లేవు. 
 

సినిమాని ఓ వైపు తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని చాటి చెబుతూ, మరోవైపు తన లవ్‌ లోని కొత్త యాంగిల్స్ ని చెప్పడం బాగుంది. కానీ దాన్ని తీసుకెళ్లిన తీరు అంతగా పండలేదు. దీంతో కొంత కన్‌ఫ్యూజన్‌ కలుగుతుంది. ఇందులో అసలు కథేంటి అనే ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ అయినా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందంటే అక్కడ మరింతగా ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే సీన్లతో చిరాకు తెప్పించారు. కాకపోతే క్లైమాక్స్ ని బాగా తీర్చిదిద్దాడు. అక్కడ ఓ వైపు ప్రేమ, మరోవైపు కూతురు వంటి సీన్లు ఎమోషనల్‌ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ సినిమాకి పెద్ద బలం. దీంతోపాటు జయరాం పాత్రలోని ట్విస్ట్ అదిరిపోయింది. కానీ ల్యాగ్‌, సీరియల్‌ సాగినట్టుగా సాగడం బోర్‌ తెప్పిస్తుంది. దీనికితోడు ఎమోషనల్‌ డైలాగ్‌లు చెప్పే తీరు,ఆయా సీన్లు సైతం మరింత సహసాన్ని పెట్టేలా ఉంటాయి. మ్యూజిక్ బాగుంది. ఆర్‌ ఆర్‌ మాత్రం ఇరవై ఏళ్ల క్రితం బీజీఎం (Hi Nanna Review) అనేలా ఉంది. దర్శకుడు టెక్నికల్‌గా బాగా చేశాడు. సినిమాని ఆ స్థాయిలో తెరకెక్కించలేకపోయాడు. ఫీల్‌, లవ్‌ లో డెప్త్ మిస్‌ అయ్యింది. చాలా లాజిక్‌లు మిస్‌ అయ్యాయి. ఎమోషనల్‌ సీన్లలో శృతి మించి ప్లాన్‌ చేశాడు. అవి తెడా కొట్టాయి. రివర్స్ అయిన పరిస్థితి. నాని సినిమాలంటే కొంత ఫన్‌ ఆశిస్తారు. ఇందులో ఫన్‌ ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. అది అభిమానులకునిరాశే. కాకపోతే నాని బలం అయిన ఫ్యామిలీ సీన్లు బాగానే ఉన్నాయి. 
 

నటీనటులుః
విరాజ్‌ పాత్రలో నాని ఇరగదీశాడు. ఆయన మంచి నటుడే. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఎమోషన్స్ సీన్లు పిండేశాడు. అదే సమయంలో ఆయన నటనలో ఈజ్‌ తగ్గింది. రిలాక్స్ అయినట్టుగా ఉంది. యష్ణ పాత్రలో మృణాల్‌ నటన అద్భుతం. చాలా సీన్లలో నానిని డామినేట్‌ చేసింది. దీంతో (Hi Nanna Review) హైలైట్‌ అయ్యింది. మాయ పాత్రలో కియారా ఎంతో క్యూట్‌గా ఉంది. చాలా బాగా చేసింది. జయరాం పాత్ర సర్‌ప్రైజ్‌ ఆకట్టుకుంటుంది. శృతి హాసన్‌ పాత్రకి ప్రయారిటీ లేదు. జస్ట్ గెస్ట్ రోల్‌. అది కూడా ఆమె ఎందుకు చేసిందో అర్థంకాలేదు. అంగద్‌ బేడీ.. మృణాల్‌ని చేసుకోబోయే వాడి పాత్రలో, డాక్టర్ గా చాలా హుందాగా చేశారు. చివర్లో వీరు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. ప్రియదర్శి పాత్ర సైతం అలరిస్తుంది. మిగిలిన పాత్రదారులు ఓకే అనిపించారు. 
 

టెక్నికల్‌గాః
`హాయ్‌ నాన్న` టెక్నీషియన్ల మూవీ. కథ, నటీనటుల నటన కంటే దర్శకుడు శౌర్యువ్‌ దీన్ని ఓ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని తెరకెక్కించడం విశేషం. కథ పరంగా, స్క్రీన్‌ ప్లే పరంగా మరింతగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమా స్లోగా సాగడంతో సీరియల్‌ని తలపిస్తుంది. స్లో డైలాగ్‌లు మరింత చిరాకు తెప్పించాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ని వదిలేసి ఎమోషనల్‌ వైపు వెల్లడంతో నాని ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతారు. ఇక కెమెరా పరంగా అదిరిపోయింది. సాను వర్గేషే కెమెరా వర్క్ బాగుంది. ప్రతి విజువల్‌ అందంగా, అద్బుతంలా ఉంది. మ్యూజిక్‌ హేషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ మ్యూజిక్‌ బాగుంది. పాటలు వినపొంపుగా ఉన్నాయి. కానీ ఆర్ఆర్‌ విషయంలో దొరికిపోయాడు. ఓల్డ్ ఆర్‌ఆర్‌నే వాడినట్టుగా ఉంటుంది. కొత్త తనం లేదు. అది కూడా సీన్లకి మించిన సౌండింగ్‌తో ఆర్‌ఆర్‌ చేయడం కాస్త ఓవర్గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. 
 

ఫైనల్‌గాః సీరియల్‌లా సాగే ఫాదర్‌‌ అండ్‌ డాటర్‌ ఎమోషనల్‌ జర్నీ `హాయ్‌ నాన్న`. లవ్‌స్టోరీ స్పెషల్‌ ఎఫెక్ట్. 

రేటింగ్‌ః 2.5
 

click me!