Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?

Published : Jul 31, 2026, 08:12 AM IST

సుమంత్‌ హీరోగా నటించిన `న్యూటన్స్ థర్డ్ లా` మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సుమంత్ చెప్పిన కర్మ థియరీ ఏంటనేది రివ్యూలో తెలుసుకుందాం.

PREV
16
న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ

ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించాడు సుమంత్‌. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్నారు. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలే చేస్తున్నారు. అందులో భాగంగా ఈటీవీ విన్‌ కోసం `న్యూటన్స్ థర్డ్ లా` అనే మూవీలో నటించారు. దీనికి రాజేష్‌ కర్ణ దర్శకత్వం వహించారు. మార్క్ మై వర్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హరీష్‌ కొహిర్కర్‌ నిర్మించారు. ఇందులో సుమంత్‌తోపాటు శ్రీనివాస్‌ అవసరాల, రవి వర్మ, షెల్లీ ఎన్‌ కుమార్, థ్రినాథ్‌ వర్మ, నేహా పఠాన్‌, పండిత్‌ గౌతమ్‌ వంటి వారు నటించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 31)న విడుదలైంది. మరి ఎలా ఉంది? సుమంత్‌ చెప్పిన న్యూటన్స్ థర్డ్ లా ఏంటి? కర్మ థియరీ ఏంటనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
న్యూటన్స్ థర్డ్ లా మూవీ కథ

డేవిడ్ కిశోర్‌(అవసరాల శ్రీనివాస్)ఒక బిగ్‌ షాట్‌, ఒకప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌. అతనికి ఓ రోజు న్యూటన్స్‌ థర్డ్‌ లా అనే ఒక పుస్తకం కొరియర్ లో వస్తుంది. ఆ బుక్ చదవగా అది తన రియల్‌ స్టోరీకి దగ్గరగా ఉంటుంది. దీంతో ఆయనలో టెన్షన్‌ స్టార్ట్ అవుతుంది. పుస్తకంలో రాసిన కథలోకి వెళితే 1999లో భర్త చనిపోయాడనే వార్త తెలిసి కూతురుతో కలిసి వెళ్తుంటే జ్యోతికి(నేహా పఠాన్‌)కి యాక్సిడెంట్‌ అవుతుంది. ఆమె కూడా చనిపోతుంది. అది జరిగిన కొన్ని రోజులకే వినయ్(త్రినాథ్ వర్మ) బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు. ఆ కేసు డీల్ చేయడానికి పోలీస్ వాసుదేవ్(సుమంత్) తన టీమ్‌తో రంగంలోకి దిగుతాడు. అది సూసైడ్ కాదు మర్డర్ అని, తలలో బుల్లెట్ ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ లో రావడంతో వాసుదేవ్ .. వినయ్‌ పేరెంట్స్ ని విచారిస్తుంటాడు. వినయ్‌ తండ్రి గంగాధర్‌(రవి వర్మ)పై అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. ఆయన భార్య పార్వతి(షెల్లీ ఎన్‌ కుమార్‌) ఏం మాట్లాడదు, భర్తని అసహ్యించుకుంటుంది. దీంతో వీరిద్దరిపైనే అనుమానాలుంటాయి.  వినయ్‌ని తండ్రి గంగాధరే చంపాడని తేలుస్తాడు వాసుదేవ్‌. దీంతో ఆయన్ని కోర్ట్ కి పంపిస్తారు. అదే సమయంలో చనిపోయిన జ్యోతి కూతురు(నేహా పఠాన్‌) పెంపకం బాధ్యత వారికే అప్పగిస్తారు. అయితే అప్పుడే కేస్‌ అయిపోదు, అసుల ట్విస్ట్ లు, అసలు కథ అప్పుడే స్టార్ట్ అవుతుంది? వినయ్‌ సూసైడ్‌ చేసుకోవడానికి ముందు మెర్యూరీ(జగపతిబాబు) నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. మరి మెర్యూరీకి, వినయ్‌కి సంబంధం ఏంటి? ఫోన్‌ చేసిన ఫ్రెండ్‌ కార్తీక్‌(పండిత్‌ గౌతమ్‌) వినయ్‌ని ఎందుకు బెదిరించాడు? జ్యోతి యాక్సిడెంట్‌కి వీరికి సంబంధం ఏంటి? సూసైడ్‌కి ముందు వీరిద్దరు కలిసి చేసిన క్రైమ్‌ ఏంటి? వినయ్‌ ఫేరెంట్స్ జ్యూవెల్లరీ షాప్‌ని దొంగిలించింది ఎవరు? డైమండ్స్ స్టోరీ ఏంటి? డేవిడ్‌ పుస్తకం చదివి ఎందుకు బయపడుతున్నాడు? ఆయన పోలీసా? క్రిమినలా? అనేది మిగిలిన కథ.

36
న్యూటన్స్ థర్డ్ లా మూవీ విశ్లేషణ

ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్ కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కాకపోతే ఎంత ఎంగేజింగ్‌గా, ఎంత థ్రిల్లింగ్‌గా, ఎంత ట్విస్ట్ లు, టర్న్ లతో సినిమాని నడిపించామనేది  ముఖ్యం. దాన్ని బట్టే అది సక్సెస్‌ అవుతుంది. తాజాగా సుమంత్‌ నటించిన `న్యూటన్స్ థర్డ్ లా` కూడా అలానే ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అయితే ఇటీవల ఈటీవీ విన్‌ వాళ్లు మంచి కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించి, వాటిని థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ఈ మూవీ కూడా అలా వచ్చిందే. ఇక సినిమా విషయానికి వస్తే, శ్రీనివాస్‌ అవసరాలకి న్యూటన్స్ థర్డ్ లా పుస్తకం రావడం, ఆయన చదివి టెన్షన్‌ పడటం, దీంతో కథ 1999లోకి వెళ్తుంది. ఆ టైమ్‌లో జ్యోతికి రోడ్డు యాక్సిడెంట్‌లో మరణిస్తుంది. వినయ్‌ మేడ మీద నుంచి కిందపడి చనిపోతాడు. ఈ రెండింటికి సంబంధం ఉంటుంది. దీన్ని హీరో సుమంత్‌ ఎంట్రీ ఇచ్చి విచారిస్తుంటాడు. ఈ విచారణ ప్రారంభంలో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అనేక అనుమానాలు కలుగుతుంటాయి. అయితే కాసేపు తర్వాత బోరింగ్‌గా మారుతుంది. చాలా స్లోగా విచారణ జరుగుతుంటుంది. దీంతో కథ ముందుకు కదలదు, ఎంతసేపు ఆ విచారణ చుట్టూనే తిరుగుతుంది. సుమంత్‌ రియాక్షన్‌ స్లోగా ఉంటుంది. దీంతో నిరసంగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో విచారణకు సంబంధించిన మలుపులు కొంత ఎంగేజ్‌ చేస్తాయి. 

ఫస్టాఫ్‌ వరకు పేరెంట్స్ ని విచారించడం వరకే సాగుతుంది, ఆ తర్వాత ఆపార్ట్ మెంట్‌ లో ఉన్న వారిని విచారించి, ఫైనల్‌గా తండ్రినే నేరస్థుడిగా నిర్థారిస్తాడు. ఆయనకు శిక్ష కూడా పడుతుంది. అయితే అప్పుడే అసలు కథ స్టార్ట్ అయ్యిందని, అనేక ప్రశ్నలకు సమాధానం సెకండాఫ్‌లో ఇస్తారు. అసలు వినయ్‌, కార్తీక్‌ చేసిన క్రైమ్‌ ఏంటనేది, ఇందులో జగపతిబాబు, శ్రీనివాస్‌ అవసరాల పాత్ర ఏంటనేది రివీల్‌ చేస్తూ వెళ్తారు. దీంతో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుంటాయి. అవి కొంత ఎంగేజ్‌ చేస్తాయి. క్లైమాక్స్ మరింత ట్విస్ట్ లు పెట్టారు. అయితే అది కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తుంది. గజిబిజీగా అనిపిస్తుంది. అతి తెలివి ప్రయోగించిన ఫీలింగ్‌ కలుగుతుంది. దీంతో ఫస్టాఫ్‌ టార్చర్‌ అంటే సెకండాఫ్‌ దానికంటే టార్చర్‌లా మారింది. సంఘటనల తాలూకు క్యూరియాసిటీ అంతగా వర్కౌట్‌ కాలేదు, చాలా సీన్లు లైటర్‌ వేలోనే చూపించారు. విచారణ చిరాకు తెప్పిస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు రివీల్‌ అయిన తీరు బాగానే ఉంది. ఎంగేజ్‌ చేస్తుంది. కానీ దాన్ని కన్‌ఫ్యూజ్‌ చేసి ఆ థ్రిల్‌ లేకుండా చేశారు. దీంతో సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.   పిల్లల్ని సరిగ్గా పెంచాలని, టీనేజ్‌ టైమ్‌లో నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పిన విధానం బాగుంది. కాకపోతే అది అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అదే సమయంలో యాక్షన్‌ రియాక్షన్‌(కర్మ థియరీ) అనే కాన్సెప్ట్ కూడా బాగుంది. దాన్ని ఇంకా బలంగా చెప్పాల్సింది.

46
న్యూటన్స్ థర్డ్ లా లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ వాసుదేవ్‌గా సుమంత్‌ బాగా చేశాడు. సెట్టిల్డ్ గా చేసి మెప్పించాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. కాకపోతే ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక శ్రీనివాస్‌ అవసరాల పాత్రలోని ట్విస్ట్ కూడా బాగుంది. ఆయన కూడా బాగా చేశాడు. జగపతిబాబు పాత్ర ఉన్నది కాసేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తుంది. నెగటివ్ రోల్లో మెప్పించారు. వినయ్‌గా త్రినాథ్‌ వర్మ అదరగొట్టాడు. పాత్రలో జీవించాడు. ఆయన ఫ్రెండ్‌గా చేసిన కుర్రాడు కూడా మెప్పించాడు. అమ్మ పాత్రలో షెల్లీ జీవించింది. నాన్నగా రవి వర్మ యాప్ట్ గా నిలిచారు. ఆయన పాత్రలో అనేక అనుమానాలకు తావిస్తూ సాగిన తీరు బాగుంది. జ్యోతిగా నేహా పఠాన్‌ ఉన్నంతలో మెప్పించింది. కూతురుగానూ తనే కనిపించడం విశేషం. ఇక మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

56
న్యూటన్స్ థర్డ్ లా టక్నీకల్‌గా ఎలా ఉందంటే

సింజిత్‌ యర్రమిల్లి సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఇందులో మెయిన్‌ గా ఆర్‌ఆర్ మీదనే సినిమా సాగుతుంది. యాక్షన్‌ సినిమాలను తలపించేలా బీజీఎం ఇచ్చారు. అది చాలా స్టయిలీష్‌గా ఉంది. సినిమాకి పెద్ద అసెట్‌ ఏదైనా ఉందంటే అది ఆర్‌ఆర్‌ అనే చెప్పాలి. వేద వ్యాస్‌ గొట్టిపాటి కెమెరా వర్క్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. అనిల్‌ పలాస ఎడిటింగ్ ఇంకా బెటర్‌ చేయాలి. చాలా సీన్లు కన్‌ఫ్యూజ్‌ చేస్తాయి. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సింది. దర్శకుడు రాజేష్‌ కర్ణ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కర్మ థియరీని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. యాక్షన్‌కి రియాక్షన్‌ జరుగుతుందని చెప్పడం బాగుంది. కానీ చెప్పిన తీరునే ఎంగేజింగ్‌గా లేదు, అసలు ఆయన చెప్పాలనుకున్న సందేశం ఇంపాక్ట్ ఫుల్‌గా లేదు. సినిమా ఎంగేజ్‌ చేయలేకపోయింది. కన్‌ఫ్యూజన్‌ ఎక్కువైంది. మరింత గ్రిప్పింగ్‌గా కథని నడిపిస్తే బాగుండేది.

66
ఫైనల్‌ రిపోర్ట్, రేటింగ్‌

ఎంగేజ్‌ చేయలేని న్యూటన్‌ థర్డ్ లా. కర్మ థియరీ బాగున్నా, చెప్పిన విధానం అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో బోరింగ్‌ ఫార్ములా మారిపోయింది.

రేటింగ్‌: 2.25

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories