Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌

Published : Jul 30, 2026, 03:57 PM IST

Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. అలరించాయి. అందులో భాగంగా ఇప్పుడు `స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే` మూవీ నేడు మన వద్ద కూడా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే?

PREV
15
స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే మూవీ రివ్యూ

`స్పైడర్‌ మ్యాన్` మూవీస్‌ హాలీవుడ్‌నే కాదు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. వీటికి మనదేశంలోనూ అభిమానులున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాల కంటే ఇలాంటి యాక్షన్ హాలీవుడ్‌ చిత్రాలను చూసేందుకే మన ఆడియెన్స్ ఎగబడుతున్నారు. స్టార్‌ హీరోల రేంజ్ లో వీటికి ఓపెనింగ్స్ ఉండటం విశేషం. తాజాగా ఈ సిరీస్‌ నుంచి మరో చిత్రం `స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే`  వచ్చింది. ఇది 2021లో వచ్చిన `స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్` చిత్రానికి కొనసాగింపు. ఇందులో హల్క్, ఫనీషర్, జీన్‌ లు కలిసి వస్తున్నారు. దీంతో అంచనాలున్నాయి. ఈ గురువారం(జులై 30) విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది, గత చిత్రాల కంటే బెటర్‌గా ఉందా? పీటర్‌ చేసే సాహసాలు ఆకట్టుకున్నాయా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

25
స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ ఏ మూవీ కథ ఏంటంటే?

గత మూవీ స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌కి కొనసాగింపుగా ఈ చిత్ర కథ సాగుతుంది. అందులో స్పైడర్‌ మ్యాన్‌, డాక్టర్‌ స్ట్రేంజ్‌ చేసిన పనికి పీటర్‌ పార్కర్‌, డ్యామేజ్‌ కంట్రోల్ లేడీ అధికారిని తప్ప ప్రపంచం అంతా స్పైడర్‌ మ్యాన్‌ సాహసాల గురించి మర్చిపోతారు. చివరికి తన ప్రియురాలు ఎమ్‌జే, ఫ్రెండ్‌ కూడా తనని మర్చిపోతారు. దీంతో తాను దగ్గరున్నా వాళ్లు గుర్తించలేదు. అయితే వాళ్లిద్దరు చేసే రీల్స్ చూస్తూ బాధపడుతుంటాడు స్పైడర్‌ మ్యాన్‌. అంతేకాదు తన లవర్‌ వేరే వ్యక్తితో క్లోజ్‌గా ఉండటం, కిస్‌ చేయడంతో బాగా హర్ట్ అవుతాడు, తన బాధని ఎవరితోనూ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతుంటాడు. మరోవైపు న్యూయార్క్ సిటీలో ఏ ప్రమాదం జరగబోతున్నా ముందే గుర్తించి వాటిని ఆపుతుంటాడు. అమెరికా డిఫెన్స్   సంస్థ అయిన డ్యామేజ్‌ కంట్రోల్ డిపార్ట్ మెంట్‌తో కలిసి పనిచేస్తూ ప్రజలను రక్షించే బాధ్యతని తాను తీసుకుంటాడు. అయితే సిటీలోకి అనుకోకుండా ఒక శక్తి వస్తుంది. ఇతర మెదడుని ప్రభావితం చేసే శక్తి అది. పేరు జీన్‌(సాడీ సింక్‌). జీన్‌ తన శక్తితో డ్యామేజ్‌ కంట్రోల్‌ డిఫెన్స్ పై దాడి చేస్తుంది. అది ఒక లేడీ అని తెలుసుకున్న స్పైడర్‌ మ్యాన్‌ ఆమెని ఎలా ఎదుర్కొన్నాడు? ఇంతకి ఆమె ఎవరు? వీ మ్యాక్స్ అంటే ఏంటి? తన ప్రియురాలిని పీటర్‌ కలుసుకున్నాడా? లేదా అనేది మిగిలిన సినిమా.

35
స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే మూవీ ఎలా ఉందంటే?

స్పైడర్‌ మ్యాన్‌ గత సినిమాలకు కొనసాగింపుగా ఇది సాగినా, కథగా మాత్రం కొత్తగానే ఉంటుంది. ఫ్రెష్‌గా స్పైడర్‌మ్యాన్‌ చేసే సాహసాలను చూపించారు.  ప్రజలను ఆపద నుంచి కాపాడేందుకు ఆయన చేసే పోరాటాలు ఆకట్టుకునేలా తీసుకెళ్లారు. అవి ఎప్పటిలాగే ఆకట్టుకుంటాయి. అయితే భారీ యాక్షన్‌ సీన్లు, సూపర్‌ హీరోలు చేసే బ్లాస్టింగులు, ఛేజింగ్‌లు లేకుండా ఉన్నంతలో డీసెంట్‌గా పెట్టారు. రియాలిటీగా చూపించే ప్రయత్నం చేశారు. యాక్షన్‌, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ మూవీని నడిపించారు. పీటర్‌ లవర్ తన గతాన్ని మర్చిపోవడంతో ఆమె చేసే రీల్స్ చూస్తూ తాను బాధపడుతుంటారు. ఒంటరిగా కుంగిపోవడం వంటి సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. అలా తనలో తాను బాధపడుతూనే తాను మానసికంగా డిస్టర్బ్ కావడంతో తన శక్తులకు సంబంధించిన గందరగోళం ఏర్పడుతుంది. హైపర్‌ టెన్షన్‌ ఫీలవుతుంటాడు. వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం, తను పడే బాధలను బాగా చూపించారు. మరోవైపు సీటీలోకి కొత్త లేడీ శక్తి రావడం, అది తన కంటే పవర్‌ఫుల్‌గా ఉండటం, ఒకేసారి సిటీని తన కంట్రోల్‌లోకి తీసుకునే శక్తి తనకు ఉండటంతో ఆమెని ఎదుర్కొనేందుకు డ్యామేజ్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌కి సహకరించడం వంటి సీన్లు ఎంగేజ్‌ చేస్తాయి. ఈ సినిమాలో మనవైన ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇవ్వడంతో ఇండియన్స్ కిది బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. లవ్‌ సీన్లు బాగుంటాయి. లవర్‌ విషయంలో పీటర్‌ ఎదుర్కొనే సంఘర్షణ హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. అలాగే ఫనీషర్‌తో చేసే యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. ఇంకోవైపు లేడీ శక్తిని ఎదుర్కొనే సీన్లు అలరించేలా ఉంటాయి. వీఎఫ్‌ఎక్స్, విజువల్స్ మరో హైలైట్‌గా నిలుస్తాయి. ఇందులో హైలైట్‌ ఏంటంటే హల్క్ పాత్ర. హల్క్.. లేడీ శక్తి కంట్రోల్‌లోకి వెళ్లడంతో స్పైడర్‌ మ్యాన్‌.. ఆ హల్క్ తో ఫైట్‌ చేసే సీన్‌ అదిరిపోయింది. స్పైడర్‌ మ్యాన్‌ అయినప్పటికీ తాను కూడా ఒక సాధారణ మనిషినే అని, తనకు అన్ని రకాల ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయని, తనకు మనసు ఉందని, అది బాధపడుతుందని, తాను కూడా అందరిలాంటి వాడినే అని చెప్పిన తీరు బాగుంది. మొత్తంగా ఈ మూవీని యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ హైలైట్‌గా నడుస్తుంది.

45
స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే ఆర్టిస్టు లు, టెక్నీషియన్ల పనితీరు

పీటర్‌గా, స్పైడర్‌ మ్యాన్‌గా టామ్‌ హాలెండ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. హడావుడి లేకుండా సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. ఎమోషన్స్ పలికించే విషయంలో తన బెస్ట్ ఇచ్చాడు. చాలా చోట్ల వాహ్‌ అనిపించాడు. ఒక అదృశ్య శక్తితో పోరాడుతూనే, సిటీని కాపాడుతూనే తన ప్రేమికురాలి విషయంలో మానసికంగా నలిగిపోతున్న వ్యక్తిగా అదరగొట్టాడు. లవ్‌ సీన్లకి సంబంధించి, తనలోనే కుమిలిపోయే సీన్లలో అదరగొట్టాడు. ప్రియురాలు ఎమ్‌జేగా జెండయానే నటన కూడా బాగుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నెడ్‌ పాత్రలో నవ్విస్తుంది. జీన్‌గా సాడీ సింక్‌ సైతం నవ్వించాడు. ఫనీషర్‌గా జాన్‌ బె్నెతల్‌ అదరగొట్టాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. విజువల్స్ సినిమాకి మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తాయి. వీఎఫ్‌ఎక్స్ కూడా అంతే బాగా ఆట్టుకున్నాయి. మనక సరికొత్త అనుభూతిని అందించాయి. దర్శకత్వం పరంగా బాగానే చేశాడు. సినిమా కాస్త స్లో ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని సీన్లు సాగదీసినట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్‌ పరంగా ఫర్వాలేదు. మ్యూజికల్‌గా సినిమా బాగుంది. ఆర్‌ఆర్‌ చాలా నీట్‌గా ఉంది. ఎంగేజ్‌ చేసేలా ఉంది. ఎమోషనల్‌ సీన్లలో అది బాగా వర్కౌట్‌ అయ్యింది.

55
ఫైనల్‌గా..

స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే మూవీ యాక్షన్‌, విజువల్స్, ఎమోషన్స్ తో కనువిందు చేసే మూవీ. ఈ సిరీస్‌ లవర్స్ నే కామన్‌ ఆడియెన్స్ ని కూడా అలరించే మూవీ అవుతుంది. ఇదొక మంచి థియేట్రికల్‌ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు.

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories