Nani: రీసెంట్ గా ప్యారడైజ్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్ర చేశాడు నేచురల్ స్టార్ నాని. పక్కంటి కుర్రాడిలా అందరిలో కలిసిపోతారు నాని. హీరోయిన్లు కూడా నాని అంటే బాగా అభిమానిస్తారు. ఓ హీరోయిన్ ను ఇంటికి పిలిచి మరీ వంట చేయించాడట నాని.
సినిమా షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్ మధ్య ఉండే నటీనటులు సెట్స్‌లోనే కాకుండా బయట కూడా ఎంతో ఆప్యాయంగా కలిసి ఉంటారు. ముఖ్యంగా హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న హీరో నాని.. తన హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటాడు. హీరోయిన్లు కూడా నానిని బాగా ఇష్టపడతారు. హద్దులు మీరకుండా.. సెట్ లో తోటి తారలతో బాగా అల్లరి చేస్తుంటాడు నాని. తనతో బాగా కనెక్ట్ అయిన హీరోయిన్లు అయితే.. నాని ఇంటికి కూడా వెళ్తుంటారట. ఆయన ఫ్యామిలీతో కలిసిపోతుంటారు కూడా. అలానే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఓ సారి నాని ఇంటికి వెళ్లిందట. అక్కడ తనకు ఓ షాక్ ఇచ్చారట నాని.
24
నాని, కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్స్..
నాని, కీర్తి సురేష్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. 'నేను లోకల్', 'దసరా' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒకసారి నాని ఇంటికి వెళ్లిన కీర్తి సురేష్ అక్కడ చేసిన సందడి, ఆమెకు ఆ ఇంట్లో తగిలిన షాక్ గురించి.. రీసెంట్ గా ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో నాని, కీర్తి సురేష్ కలిసి వెల్లడించారు. బాగా ఆకలి అవుతుంది.. తిందామనుకుంటే.. కీర్తి చేతనే వంట చేయించారట నాని ఫ్యామిలీ.
34
ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు..
ఒకరోజు కీర్తి సురేష్, నాని ఇంటికి అతిథిగా వెళ్లారు. "ఏం తింటావు?" అని నాని అడగ్గా, ఆమె చటుక్కున "దోస తింటాను" అని చెప్పారు. దానికి నాని కూడా "ఓకే, వెరీ గుడ్" అని చెప్పి, దోసల కోసం కీర్తితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎంతసేపైనా ప్లేట్‌లోకి దోసలు రాకపోవడంతో అక్కడ వింత పరిస్థితి ఏర్పడింది. డైనింగ్ టేబుల్ వద్ద నాని, కీర్తి సురేష్ అలానే కూర్చుని ఎదురుచూస్తున్నారు.కిచెన్‌లో అసలు ఏం జరిగింది?తీరా చూస్తే, ఇంట్లోని పనివాళ్లు, నాని భార్య అంజు (అంజనా) కిచెన్ లోపల నిలబడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అది చూసి నానికి, కీర్తి సురేష్ కు ఆశ్చర్యం వేసింది.
దోసలు వేయడానికి అక్కడ పిండి సిద్ధంగానే ఉంది, కానీ ఎవరూ ముందుకు వచ్చి దోస వేసి ఇవ్వడం లేదు! కిచెన్‌లోకి వెళ్లిన అంజు కూడా అక్కడి పరిస్థితి చూసి నవ్వు ఆపుకోలేకపోయారు.అందరూ నవ్వుకుంటూ ఉండేసరికి విషయమేంటో అర్థమైన కీర్తి సురేష్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కిచెన్‌లోకి వెళ్లిపోయారు. ఎవరి కోసం ఎదురుచూడకుండా తానే స్వయంగా దోస పిండి తీసుకుని, పెనంపై దోస వేసుకుని, హాయిగా తిన్నారు.ఈ సరదా జ్ఞాపకాన్ని ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు నాని,కీర్తి సురేష్.
స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎలాంటి ఈగో లేకుండా నాని ఇంట్లో కిచెన్‌లోకి వెళ్లి సొంతంగా దోస వేసుకుని తిన్న కీర్తి సురేష్ నిరాడంబరతకు, వీరిద్దరి మధ్య ఉన్న నిజమైన స్నేహానికి నెటిజన్లు మురిసిపోతున్నారు. కొంత మంది మాత్రం నానీ ఇంట్లో వాళ్లకు దోశలు వేయడం రాదా అని విమర్శిస్తున్నారు.