నారా రోహిత్ ‘ప్రతినిధి 2’రివ్యూ & రేటింగ్!

First Published | May 10, 2024, 12:50 PM IST

సినిమా దర్శకుడు టీవీ జర్నలిస్ట్ కావటం మూలానో ఏమో కానీ ..  కథ ఎక్కువ టీవీ స్టుడియోలు..   పరిమితం కావడంతో..అక్కడక్కడే తిరుగుతన్న ఫీలింగ్,  చూసిందే మళ్లీ మళ్లీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది.

Prathinidhi 2 Review


ఇది ఎలక్షన్ సీజన్. ఇప్పుడు వచ్చేవి. జనాలకు ఆసక్తిగా అనిపించేవి రాజకీయ చిత్రాలే. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు   స్థానిక ప్రజలకు ఇచ్చే కరపత్రానికి సైతం ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకోవాలి. అలాంటప్పుడు రాజకీయ ప్రాపగాండా చిత్రాలు రిలీజ్ కావు. మరి నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ప్రతినిధి 2’ఇప్పుడు వస్తోందేంటి..ఇది చాలా మందికి వస్తోన్న డౌట్. అంటే ఈ సినిమాలో ఏ రాజకీయ పక్షాన్ని టార్గెట్ చేయలేదా?  దర్శకుడు మూర్తి ఏమో  తెలుగుదేశం పార్టీకు పూర్తి స్దాయి సపోర్టర్. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది... అధికార పక్షంపైనా, ముఖ్యమంత్రిపైనా ఏమైనా విసుర్లు ఉన్నాయా..అసలు కథేంటి ?
 

Prathinidhi 2 Review


కథేమిటంటే...

ఈ కాలంలో మనకు అరుదుగా కనపడే నిఖార్స‌యిన నిక్కచ్చైన  జ‌ర్న‌లిస్ట్ చేత‌న్ (నారా రోహిత్‌) అలియాస్ 'చే'  . దేనికి, ఎవరికి భయపడడు.  జర్నలిజంలో సాహసాలు చే ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌ గా చేస్తూంటాడు. ఇక మరో జర్నలిస్ట్ ఉదయభాను (ఉదయభాను) ప్రతిఫలం ఆశించకుండా.. ప్రజలకు ఏదైనా  మంచి చేయాలనే ఉద్దేశంతో NNC ఛానల్‌ని ప్రారంభిస్తుంది. ఆ ఛానల్‌కి చేని సీఈవో గా చే ని చేస్తుంది. అక్కడ నుంచి తన సెన్సేషనల్ స్టోరీలతో  రాజకీయ నాయకులకు కునుకు లేకుండా చేస్తుంటాడు చే. శంకర్ ఒక్కడు సీన్ గుర్తు చేసేలా ..ఫైనాన్సి మినిస్టర్ గజేంద్ర(అజయ్ ఘోష్ )ని ఓ ఇంటర్వూలో ప్రశ్నలతో ఇరుకున పెడతాడు.  


Prathinidhi 2 Review


సరిగ్గా అదే సమయంలో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి  పేదల పెన్నిదిగా చెప్పబడే  ప్రజాపతి (సచిన్ ఖేడేకర్). ఆయన  ఓ రాత్రి క్యాంప్ ఆఫీస్ లో పని చేస్తుండగా ఎవరో దుండగులు చేసిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోతాడు .   తండ్రి మరణంతో కొడుకు విశ్వ ('ప్లే బ్యాక్' ఫేమ్ దినేష్ తేజ్) ముఖ్యమంత్రిగా సీన్ లోకి వస్తాడు. విశ్వం (దినేష్ తేజ్) తదుపరి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సభ్యులు కోరుకుంటారు.   ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతాడు. 
 

Prathinidhi 2 Review


ఆ  సమయంలో ముఖ్యమంత్రి  బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని,కుట్రను బయటపెడతాడు చే. అయితే అనుకోని విధంగా  అసలు నేరస్తుడు చే అనే ఆరోపణపై అరెస్ట్ అవుతాడు. అప్పుడు సీబీఐ స్పెషల్ ఆఫీసర్ (జిషు సేన్ గుప్తా) ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఈ క్రమంలో అనేక షాకింగ్ నిజాలు బయిటకు వస్తాయి.  అసలు ఇంతకీ ముఖ్యమంత్రిని చంపాలనుకున్నదెవరు? చేకి ఆ బాంబ్ బ్లాస్ట్‌కి సంబంధం ఏంటి?మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? చివరగా ఆ కేసును ఎలా ఛేదించారు అనేదే ‘ప్రతినిధి 2’ మిగిలిన కథ. 

Prathinidhi 2 Review

 
ఎలా ఉంది

నిజం చెప్పాలంటే ‘ప్రతినిధి’సినిమా ఇప్పటికి చాలా మందికి గుర్తు ఉంది. ఈ సినిమా కు సీక్వెల్ గా రెండో పార్ట్ వస్తోందంటే ఆసక్తి కలిగింది. అందుకు తగ్గట్లు మూర్తి దర్శకుడు కావటం కూడా ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చింది. నారా రోహిత్ కు రీఎంట్రీ లాంటి సినిమా. ఇన్ని ప్లస్ లు ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజువారి రాజకీయంలో జరుగుతున్న సంఘటనలు చుట్టూ ఈ సినిమా రాసుకున్నారు. అయితే సీన్స్, డైలాగులు వెళ్లిపోతూంటాయి కానీ కథలో సరైన కాంప్లిక్ట్ పడక పరుగు అందుకోదు. ఫస్టాఫ్ అలా డైలాగులు, లైవ్ లో జరుగుతున్న సీన్స్ తో నడిచిపోతుంది. సెకండాఫ్ కు వచ్చేసరికి క్రైమ్ ఇన్విస్టిగేషన్ మోడ్ లోకి సినిమా వెళ్లిపోయింది. దాంతో రొటీన్ గా అనిపిస్తుంది.తప్పించి పెద్ద కొత్తగా అనిపించదు. 
 

దర్శకుడు మూర్తి రెగ్యులర్ గా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మాట్లాడే టాకింగ్ పాయింట్స్ తో స్క్రీన్ ప్లే చేసుకున్నారు. అయితే ఇలాంటి సినిమాలు చూసేవాళ్లు డైలీ రాజకీయాలు టీవీల్లో ఫాలో అవుతున్నవాళ్లే. వాళ్లకు కొత్తగా అనిపించేవి కావాలి. అంతేకానీ టీవిల్లో , పేపర్లో చూసే డిబేట్ లే ఇక్కడా చూపిస్తానంటే ఎలా. మైనింగ్ స్కామ్, స్టింగ్ ఆపరేషన్స్, మర్డర్ ఇన్విస్టిగేషన్ ఇలా మలుపులు తిరుగూనే ఉంటుంది. సింగిల్ పాయింట్ ఎజెండా సెకండాఫ్ దాకా ఫిక్స్ అవ్వలేదు. తాము అనుకున్న లేదా ఊహించిన చాలా విషయాలు ఒకేసారి మొత్తం చెప్పాయలనే ఆత్రుతే ఆసక్తి చంపేసింది. అలాగే కెమెరామెన్ గంగతో రాంబాబు, సర్కార్, ఒకే ఒక్కడు వంటి సినిమాలు కూడా మధ్య మధ్యలో గుర్తు వస్తూంటాయి. ఇవి చాలదన్నట్లు కొన్ని చోట్ల ఉపన్యాసాలు వంటివి పెట్టారు. 


అయితే ఉన్నంతలో ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే...డైరక్టర్  మూర్తి దేవగుప్తపు ప్రత్యేకంగా ఓ పొలిటికల్  పార్టీకి కొమ్ముకాసే పోగ్రామ్ పెట్టుకోకుండా  ఒక  కమర్షియల్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే ఇప్పటి రాజకీయపు ట్రెండ్  ఒక జర్నలిస్ట్ పాయింటాఫ్ వ్యూలో తెరకెక్కించటం కూడా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.క్యాంప్ ఆఫీస్ లో జరిగే సీన్స్ లో సినిమాటెక్ లిబర్టీ ఎక్కువ తీసుకుని లాజిక్స్ ని వదిలేసారు. 


టెక్నికల్ గా...

ఈ సినిమా పొలిటకల్ థ్రిల్లర్ గా రూపొందించిన మూర్తి స్క్రిప్టు ఇంకొంచెం టైట్ గా ఉంటే బాగుండేది. అయితే సినిమా ఫీల్డ్ లో చాలా కాలం పనిచేసి  డెబ్యూ ఇచ్చే చాలా మంది డైరక్టర్స్ కంటే మంచి అవుట్ ఫుట్ నే ఇచ్చారు. క్రాప్ట్ మీద కమాండ్ చూపగలిగినా సెకండాఫ్ లో డ్రామా ఎక్కువైందనే విషయం గమనించలేకపోయారు. అయితే కొన్ని డైలాగ్స్ జనాల చేత విజిల్స్ వేయించాయి. అవి ఎవరిని ఉద్దేశించో అందిరికీ తెలుసు కాబట్టి.   


ఇక నాని చ‌మిడిశెట్టి కెమెరా వర్క్ , మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నడిచిపోతాయి. సెకండాఫ్ లో ల్యాగ్ తగ్గించేలా ఎడిటింగ్ చూసుకోవాల్సింది. 

Prathinidhi 2


డైలాగులు విషయానికి వస్తే.. పొలిటికల్ సెటైర్లు ఉన్నా ఎక్కువ శాతం .. సెన్సార్‌ బీప్‌ల్లో కలిసిపోయాయి. ఇక ‘పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్.. మనల్ని ఎవడేం చేస్తాడు’, ఇక ‘నాన్నగారు చనిపోయి రోజులు కూడా కాలేదు.. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేశారా?’, ‘సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్‌లు వేసేశాం.. ఇంకా చెప్పడానికి వాళ్లు వినడానికి మిగిలిందేం లేదు’,   ‘దేశాన్ని కాపాడ‌టానికి సైనికుడు, క‌డుపు నింప‌డానికి రైతు ఎంత ముఖ్య‌మో, స‌మాజానికి జ‌ర్న‌లిస్ట్ కూడా అంతే ముఖ్యం’వంటి  డైలాగులకు జనం బాగానే రెస్పాండ్ అయ్యారు.
 

Prathinidhi 2


వైయస్ జగన్ ని,ఆయన పార్టీని  ఉద్దేశించి తీసిన సినిమానా

పదివిలో ఉండగా ముఖ్యమంత్రి దారుణ మరణం.. ఆయన  కొడుకుని సీఎం చేయాలని పట్టుబట్టడం..వంటివి కొంతవరకూ వైయస్ జగన్ ని గుర్తు చేస్తాయి. అలాగే  సంక్షేమ పథకాలపై వ్యంగ్య బాణాలు, సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధి ఆగిపోయిందనే విమర్శలు ఉన్నా...అవి డైలాగులు వరకే పరిమితం చేసారు కానీ కథలో ముఖ్యమంత్రి జగన్ ని కాని,   అధికార వైసీపీ పార్టీ ని పెద్దగా లోతుగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. అందుకే ఎలక్షన్స్ ముందు రిలీజైంది. కేవలం సీఎం మర్డర్ మిస్టరీకే తమ కథను పరిమితం చేసుకున్నారు. దాంతో ఎవరికీ పెద్దగా కలిసొచ్చేది కానీ డామేజ్ కానీ జరిగే అవకాసం  పెద్దగా లేదనే చెప్పాలి. 

Prathinidhi 2 Review


నటీనటుల్లో ...

 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత నారా రోహిత్  చేసిన  చిత్రం ఇదే.  మళ్లీ  ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు నారా రోహిత్.  అయితే అతని స్టామినాకు తగిన కథ అయితే కాదనేది నిజం.   స‌చిన్ ఖేడ్కర్‌, దినేశ్ తేజ్‌, జిషుసేన్ గుప్తా, అజ‌య్ ఘోష్‌, పృథ్వీరాజ్, ఉద‌య‌భాను వంటివారు తమ  పాత్ర‌లు నీట్ గా చేసుకుంటూ పోయారు. దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పొలిటికల్ ఎనాలసిస్ట్  గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపించి మెప్పించారు.. 

Pratinidhi 2

 
ప్లస్ లు 

నారా రోహిత్ రీఎంట్రీ
హిట్ సినిమాకు సీక్వెల్ కావటం
ఓటు విలువ చెప్పే ఎపిసోడ్స్
కొన్ని డైలాగ్స్

మైనస్ లు 

బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే
రొటీన్ గా నడిచే క్రైమ్ ఇన్విస్టిగేషన్ సీన్స్
 

Pratinidhi 2


ఫైనల్ థాట్

ఇది పొలిటకల్ ప్రాపగాండా ఫిల్మ్ కాదు..అలాగని పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ కాదు. 

ఏదైైమైనా  కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తీయకుండానే ఉంటేనే బాగుంటుంది. ఇది పెద్దగా ఏ పార్టీ జనాలకు కిక్ ఇచ్చే చిత్రం కాదు. మధ్యస్దంగా ఉన్న సినిమా. ఓ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపిస్తాడు

----సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2

Prathinidhi 2 Review


నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, ర‌ఘు కారుమంచి త‌దిత‌రులు;
 సంగీతం: మహతి స్వర సాగర్; 
ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల; 
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి; 
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె; 
ఫైట్స్: శివరాజు & పృథ్వీ; 
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని; 
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు; 
నిర్మాణ సంస్థ‌లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్; 
విడుద‌ల‌ తేదీ: 10-05-2024
 

Latest Videos

click me!