MS ధోనీ 'లెట్స్ గెట్ మ్యారీడ్' రివ్యూ

First Published | Aug 4, 2023, 5:05 PM IST

ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి కాబోయే అత్త‌గారి గురించి భ‌యప‌డుతుంది. అందు కోసం ఆమెతో క‌లిసి కొన్ని రోజుల పాటు ఆమెతో క‌లిసి ట్రావెల్ చేయాల‌నుకుంటుంది

Lets get Married LGM Review

 
క్రికెట్ రంగంలో నెంబర్ వన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni). ఆయన  ఇప్పుడు సినీ పరిశ్రమలో అడుగు పట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమా ప్రొడ్యూస్ చేసారు. ఆ సంస్థలో ధోని సతీమణి సాక్షీ సింగ్ ధోని ని ప్రొడ్యూసర్ గా చేస్తూ నిర్మించిన మొదటి సినిమా 'ఎల్‌జిఎమ్' (LGM Movie). హరీష్ కళ్యాణ్, 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా జంటగా నటించారు. నదియా, యోగిబాబు ఇతర తారాగణం. ఈ సినిమా ఎలా ఉందనే ఆసక్తి కలగటం సహజం. ఎందుకంటే ఇది ధోని ప్రొడక్షన్... ఫస్ట్ ఫిల్మ్ తోనే సిక్సర్ కొట్టారా లేదా చూద్దాం.


స్టోరీ లైన్
 
రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న గౌత‌మ్ (హ‌రీష్ క‌ళ్యాణ్‌), మీరా(ఇవానా)  పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఇక ఇళ్లల్లో చెప్పటమే ఆలస్యం. గౌత‌మ్ పెళ్లి కోసం వాళ్ల అమ్మ లీలా(నదియా) చాలా రోజులుగా ఎదురుచూస్తోంది కాబట్టి ఆవిడ వైపు నుంచి నో ప్లాబ్లం. తను తన కోడలని కూతురులా చూసుకుంటానని చెప్తుంది. అయితే అత్తింటి కాపురం ...మీరా కు ఇష్టం ఉండదు.  పెళ్లైన వెంటనే వేరే కాపురం పెట్టాలని గౌతమ్ కు చెప్తుంది. తల్లిని వదిలేసి రావటానికి గౌతమ్ ఇష్టపడడు. బ్రేకప్ చెప్పేసుకుందామా అనే పరిస్దితిలో ఓ చిన్న కాంప్రమైజ్ కు వస్తారు. తనకు తన కాబోయే అత్తగారు నచ్చితే ఆమెతో కలిసి ఉంటానని, పెళ్లికు ఓకే అంటుంది. కానీ ఆ నచ్చటం ఎలా తెలుస్తుంది. అప్పుడు ఓ ప్లాన్ చేస్తారు. రెండు కుటుంబాలు వాళ్లు కలిసి కూర్గ్ కు టూర్ కు బయిలుదేరతారు. ఆ జర్నీలో మీరా, లీలా లు  మరొకరు సరిపడతారా..చివరకు వాళ్ల పెళ్లి అయ్యిందా ...అనేది తెలియాలంటే ఈ సినిమా(LGM Review) చూడాల్సిందే.
 



విశ్లేషణ

ఇలాంటి అత్తా ,కోడళ్ల కథలు ...ఎప్పుడో పెద్ద తెరను దాటి, టీవికు వెళ్లిపోయాయి. అయినా అత్తైనా, కోడలైనా ఎవరైనా ఎవరి ప్రపంచంలో వారు ఇండిడ్యువల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి ధోరణి వారిదే. ఈ విషయాలు ఏమీ నిర్మతగా కథ చెప్తున్నప్పుడు  ధోని  గమనించినట్లు లేరు. పోనీ స్క్రిప్టు టైట్ గా ఉన్నా ఈ సినిమా గెలిచేసేది. కాని సినిమాలో సగం ఎడిట్ చేసినా బోర్ కొట్టేలా ఉంది. అన్ని అక్కర్లేని సీన్స్ తో నిండిపోయింది. అలాగే ఆ ట్రిప్ లో ...వీరి  వెనక ఓ ఫారిన్ వ్యక్తి పడి,వెంటబడి చివరకు లీలాకు ప్రపోజ్ చేస్తాడు. ఇదో రొటీన్ వ్యవహారంగా విసిగిస్తుంది. ఇక మాట్లాడితే చాలు యోగిబాబు ఫ్రేమ్ లోకి వచ్చేస్తాడు. అసలు కథ కన్నా యోగిబాబుని అడ్డం పెట్టి ఫన్ చేసి ఒడ్డున పడాలనే దర్శకుడు తాపత్రయం కనపడుతుంది. ఈ క్రమంలో హీరో తెరపై గెస్ట్ కన్నా దారుణంగా మాయమయ్యాడనే సంగతి మర్చిపోయారు.ఈ కథలో మెయిన్ క్యారక్టర్ గౌతమ్ అయితే తింగరగా సమస్యలను కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాడు. నిజానిక ఇది క్యారక్టర్ డ్రైవెన్ డ్రామాలో లో పాత్రల మధ్య స్టెబులిటీ కానీ కాంప్లిక్ట్ గానీ చూసుకోలేదు. ఎంతసేపూ గౌతమ్ పాత్రపై సానుభూతి రప్పించాలని చూస్తాడు. జోక్ లు ఉన్నాయి కానీ అవి జెన్యూన్ గా లేవు. ఫైనల్ గా ఇది రొమాంటిక్ కామెడీ అందాము అంటే హీరో,హీరోయిన్స్ మధ్య జరిగే కథ కాదు..అత్తా,కోడళ్ల మధ్య జరిగే సీరియల్ కామెడి. 


నటీనటుల్లో ...

హీరోగా  హరీష్ కళ్యాణ్ గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు..ఎందుకంటే సినిమాలో అతనికి అంత సీన్ లేదు. నదియా,ఇవానాలు ఇద్దరి కథ ఇది. వాళ్లిద్దరూ బాగానే చేసుకుంటూ పోయారు. కాకపోతే కాస్తంత తమిళ ప్లేవర్ ఉంటుంది.  యోగిబాబు, ఆర్జే విజయ్  అక్కకడక్కడా నవ్వించారు. దర్శకుడు వెంకట్ ప్రభు హీరో బాస్ పాత్రలో కనిపించారు కానీ మన తెలుగువాళ్లకు ఆయన పరిచయం లేరు కాబట్టి కనెక్ట్ అవ్వటం కష్టమే.

టెక్నికల్ గా...
ఈ  సినిమా ఫస్ట్ స్క్రిప్టు ఫెయిల్యూర్. కాబట్టి డైరక్టర్ ఎంత ప్రయత్నించినా ఒడ్డెక్కలేదు.  పాటలు బాగోలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మరీ దారుణం. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. పెద్దగా ఖర్చు పెట్టినట్లు లేరు. మిగతా డిపార్టమెంట్స్ సోసో .  

ఫైనల్ థాట్

 మగాళ్ల మాట దేవుడెరుగు ఆడవాళ్లకు అయినా నచ్చుతుందా లేదా అని దర్శకుడు ఈ సినిమా స్క్రిప్టు రాసుకున్నప్పుడు చూసుకున్నట్లు లేరు. డబ్బు పెట్టేటప్పుడూ ధోనికి ఈ డౌట్ వచ్చినట్లు లేదు.

Rating:2
 


నటీనటులు : హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్, వీటీవీ గణేష్, వెంకట్ ప్రభు, శ్రీనాథ్, మోహన్ వైద్య తదితరులు
ఛాయాగ్రహణం : విశ్వజిత్ ఒదుక్కత్తిల్
నిర్మాణ సంస్థ : ధోని ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : సాక్షి సింగ్ ధోని, వికాస్ హస్జా
సంగీతం, దర్శకత్వం : రమేష్ తమిళ్ మణి
విడుదల తేదీ : ఆగస్టు 04, 2023

Latest Videos

click me!