ఇంటెన్స్ థ్రిల్లర్ : జేడీ ‘దయా’ వెబ్ సీరిస్ రివ్యూ

First Published | Aug 4, 2023, 2:24 PM IST

జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘దయా’. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Daya Web series

తెలుగులో ఇప్పుడిప్పుడే వెబ్ సీరిస్ లు పాపులర్ అవుతున్నాయి. అయితే జనాలకి నచ్చే వాటిల్లో ఎక్కువ తెలుగుకి డబ్బింగ్ అవుతున్నవే ఉంటున్నాయి. తెలుగుకు బడ్జెట్ కొరతో లేక కంటెంట్ కొరతో,క్వాలిటీ కొరతో  ఏదో ఒకటి పీడిస్తోంది. కానీ మూడింటినీ బాలెన్స్ చేసుకుంటూ కంటంట్, క్వాలిటీ తో  సినిమాల స్దాయి స్టాండర్డ్స్ ని దాటే సీరిస్ లు అరుదే. కానీ తాజాగా వచ్చిన  ‘దయా’ఆ విషయంలో ముందుంది. ఇంతకీ  ఈ సీరిస్ కథాంశం ఏమిటి...నచ్చే విషయం ఏముందో చూద్దాం.

స్టోరీ లైన్: 

దయా (జేడీ చక్రవర్తి)  ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం చేస్తూంటాడు. ఓ ప్రక్కన అతని భార్య అలివేలు (ఇషారెబ్బా) నిండు గర్బిణి. రేపో,మాపో డెలివరీ అన్నట్లు ఇంటిదగ్గర ఉంటుంది. ఎప్పటిలాగే ఓ రోజు తన డ్యూటీ అవగొట్టుకుని ఇంటికి  వెళ్దామనుకునే సమయానికి అతని వ్యాన్ లో ఓ అమ్మాయి శవం కనపడి షాక్ అవుతాడు. అతనికి పోలీస్ లు అంటే భయం. దాంతో ఆ శవాన్ని తన క్లీనర్ ప్రభా(జోష్ రవి)తో కలిసి  మొదట వదిలించుకుందామనుకుంటాడు. కానీ అది అంత సజావుగా జరగదు. కష్టపడి ఆ శవాన్ని వదిలించుకున్నాక అసలు ట్విస్ట్ పడుతుంది. ఆ శవం మరెవరో కాదు...ప్రముఖ జర్నలిస్ట్ కవిత నాయుడు (రమ్యా నంబీసన్) ది.  ఆమె లోకల్ ఎమ్మెల్యే పెన్మత్స పరశురామ రాజు (బబ్లూ పృథ్వీరాజ్)ను కలిసిన దగ్గర నుంచి మిస్సైపోయింది. ఆమె భర్త కౌశిక్ (కమల్ కామరాజు) పోలీస్  కంప్లైంట్ ఇస్తాడు. దాంతో పోలీస్ లు ఓ స్పెషల్ ఆఫీసర్ తో కలిసి సెర్చింగ్ మొదలెడతారు. ఇదిలా ఉంటే ...ఓ వ్యక్తి  ఈ హత్యలకు సంభందించిన వారందరినీ వరస హత్యలు చేస్తూంటాడు. అతనెవరు... అసలు జర్నలిస్ట్  శవాన్ని దయా వ్యాన్ లోకి ఎవరు తెచ్చి పెట్టారు...అసలు ఆమెను ఎవరు చంపారు. ఆ  మిస్టరీ ఏమిటి...ఈ కేసులో మెల్లిమెల్లిగా ఇరుక్కుంటున్న దయాకు ఉన్న ప్లాష్ బ్యాక్ ఏమిటి...అతను ఈ హత్య కేసుని ఎలా డీల్ చేసాడు వంటి విషయాలు తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.

Latest Videos


Dayaa

విశ్లేషణ:

ఇది సీరిస్ లా అనిపించదు..ఓ సినిమాని ముక్కలు చేసి సీరిస్ గా పెట్టారా అనిపిస్తుంది. అంత ఇంటెన్స్ క్యారక్టర్స్ పరుగెడతాయి.  వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ ప్రశ్నలతో ముగిసేలా డిజైన్ చేసారు.  ఈ కథ పూర్తి  గ్రిప్ తో సాగుతుంది. చిన్న మర్డర్ మిస్టరీలా మొదలై ఒక్కో ఎపిసోడ్ కొత్త ఎలిమెంట్స్ కలుపుకుంటూ ఆశ్చర్యపరిచారు. ఒక అమాయకుడు, పిరికివాడైన జేడీ ఇలాంటి మర్డర్ మిస్టరీలో ఇరుక్కున్నాడే ఎలా బయిటపడతాడు అనిపిస్తుంది.  ఈ సీరిస్ లో పెద్ద ప్లస్..క్యారక్టర్స్ డిజైనింగ్. ప్రతీ ప్రధాన పాత్రకు దానికంటూ ఓ స్పష్టమైన లక్ష్యం ఉండటంతో ఎంగేజే చేస్తుంది. అలాగే కాంప్లిక్ట్స్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఎస్టాబ్లిష్ చేయటంతో బోర్ కొట్టదు. స్కిప్ చేయాలనిపించదు. 

Dayaa Trailer

అయితే మొదటి మూడు ఎపిసోడ్స్ కాస్తంత స్లోగా వెల్తాయి. జేడీ ఏమీ చేయటం లేదు...అనిపిస్తుంది. కానీ జేడీ ఎప్పుడైతే యాక్షన్ లోకి వచ్చాడో అప్పుడే కథ పరుగెడుతుంది. అయితే ఈ సీరిస్ సెకండ్ సీజన్ కోసం ...క్లైమాక్స్ ని అంసంపూర్తిగా కొన్ని ప్రశ్నలతో వదిలేసారు.  అలాగే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో నడిచే సీన్స్ కథను ఫాలో అయ్యేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తాయి. అయితే ఎందుకిలా చేసారనేది ఆసక్తిని నింపుతుంది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ కథను,కాంప్లిక్ట్ ని,క్యారక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ  సాగితే..ఐదో ఎపిసోడ్ నుంచి ఫార్మెట్ మార్చేసారు. ట్విస్ట్ లు టర్న్ లు, ఫైట్స్ తో సాగుతుంది. ఇది నిజానికి రీమేక్ అయినా ఒరిజనల్ ని పూర్తిగా మార్చి, తమదైన క్రైమ్ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేసారు. అలాగని తెలుగు నేటివిటి పేరుతో అతికి పోలేదు.

Daya Web series

టెక్నికల్ గా...

గ్రిప్పిగ్ గా ఈ సీరిస్ ని మార్చటంలో డైరక్టర్ ఎంచుకున్న మేకింగ్ స్టైల్, కొన్ని షాట్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పోటీ పడ్డాయి. ఎడిటింగ్ వర్క్ కొన్ని చోట్ల సాగిన ఫీలింగ్ ని తీసేస్తే బాగుండేదేమో..వెబ్ సీరిస్ కు ఉన్న పరిమితులకు దృష్ట్యా తప్పలేదేమో అనిపిస్తుంది. డైలాగులు కూడా చాలా చోట్ల నాచురల్ గా ఉన్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్, కాస్టూమ్స్ డిపార్టమెంట్ లు రెండూ స్పెషల్ గా మెన్షన్ చేసే వర్క్ కనపడుతుంది.

Daya Web series

నటీనటుల్లో ...

జేడీ చక్రవర్తి ఈజ్ బ్యాక్ . ఆయన క్లాసిక్స్ ని గుర్తు చేసేలా నటన సాగింది. ఎక్కడా ఓవర్ అనిపించదు. ఈషా రెబ్బా పాత్ర కనపడేది కొద్ది సేపే అయినా గుర్తుండిపోతుంది. ఎందుకనేది ఆమెకు ఇచ్చిన ట్విస్ట్.  జర్నలిస్ట్ పాత్రలో రమ్యా నంబీసన్ ఫెరఫెక్ట్ ఛాయిస్.  ఆమె భర్తగా కమల్ కామరాజు డిఫరెంట్ గా ఉన్నాడు!  విష్ణు ప్రియ భీమనేని కూడా మంచి పాత్ర. ఇక అన్నిటికన్నా ఈ సీరిస్ లో గుర్తుండిపోయేది రెండు పాత్రలు ...ఒకటి జోష్ రవి. ఎన్నో సినిమాల్లో చేసినా ఇంతలా తనలోని నటుడుని ఎక్సప్లోర్ చేయలేదు. గెటప్, లుక్, డైలాగు డెలవరీ అన్ని కొత్తగా ఉన్నాయి.  రెండోవారు... సినిమాలో ఒక్క డైలాగు  కూడా లేకుండా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న నంద గోపాల్ .  అలాగే పృథ్వీరాజ్ ని అలాంటి పర్వెర్డెడ్ పాత్రలో అసలు ఊహించం. చాలా కొత్తగా చేసారు.

Daya Web series

ఫైనల్ థాట్..

గ్రిప్పింగ్ గా సాగే  క్రైమ్ థ్రిల్లర్ గా దయా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అయితే మధ్యలో  వచ్చే ఒకటి రెండు సెమీ సెక్స్ సీన్స్ ..ఫ్యామిలీలతో కూర్చుని చూసే వాళ్లకు ఇబ్బంది..అలాంటివి లేకుండా చూసుకుంటే బాగుండేది.
  

Rating:3.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Daya Web series

నటీనటులు : జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్, విష్ణుప్రియ భీమనేని,  'జోష్' రవి, బబ్లూ పృథ్వీరాజ్, కమల్ కామరాజు, మయాంక్ పరాఖ్, కల్పికా గణేష్, గాయత్రి గుప్తా, నంద గోపాల్ తదితరులు
ఛాయాగ్రహణం : వివేక్ కాలెపు 
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు : శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని 
రచన, దర్శకత్వం : పవన్ సాధినేని
విడుదల తేదీ: ఆగస్టు 4, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

click me!