Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?

Published : Dec 13, 2025, 07:50 AM IST

సుమ కనకాల కొడుకు రోషన్‌ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `మోగ్లీ`. `కలర్‌ ఫోటో` ఫేమ్‌ సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ శనివారం విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? 

PREV
16
మోగ్లీ మూవీ రివ్యూ

స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల తన కొడుకు రోషన్‌ కనకాలని హీరోగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రోషన్‌ ఇప్పటికే `బబుల్గమ్‌` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా `మోగ్లీ` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. జాతీయ అవార్డు చిత్రం `కలర్‌ ఫోటో` ఫేమ్‌ సందీప్‌ రాజ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. సాక్షి మడోల్కర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బండి సరోజ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషించాడు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించాడు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. ఈ మూవీ ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్లతో మంచి బజ్‌ని ఏర్పర్చుకుంది. ఈ క్రమంలో నేడు శనివారం(డిసెంబర్‌ 13)న సినిమా విడుదలైంది. మరి ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? రోషన్‌ కనకాలకి హిట్‌ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
మోగ్లీ మూవీ కథ ఇదే

మోగ్లీ(రోషన్‌ కనకాల)కి అమ్మానాన్న లేరు. అడవిలో ఒంటరిగానే పెరుగుతాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తాడు. తండ్రిలాగానే పోలీస్‌ కావాలనే కోరికతో బతికేస్తుంటాడు. అయితే అడవిలో మోగ్లీ, బంటి(వైవా హర్ష) సినిమా షూటింగ్‌లకు జూనియర్ ఆర్టిస్ట్ లను సప్లై చేస్తుంటారు. ఇవన్నీ బంటి తీసుకొస్తుంటాడు. ఇలా ఓ సినిమా షూటింగ్‌లో సైడ్‌ డాన్సర్‌ జాస్మిన్‌(సాక్షి మడోల్కర్‌) చూసి ఫిదా అవుతాడు మోగ్లీ. ఆమెకి మాటలు రావు, వినికిడి లోపం ఉంటుంది. ఓ రోజు హీరోహీరోయిన్‌ రాకపోవడంతో మోగ్లీ, జాస్మిన్‌లతో షూటింగ్‌ చేస్తారు. అది బాగా వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు. అదే సమయంలో ఆ జాస్మిన్‌పై నిర్మాత కన్నుపడుతుంది. ఆమెని తన వద్దకు పంపించమని ఎగ్జిక్యూటివ్‌ కి చెబుతాడు. జాస్మిన్‌తో మోగ్లీ ప్రేమలో ఉన్నాడనే విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా మోగ్లీ మనసు విరగ్గొట్టాలని ప్లాన్‌ చేస్తారు. అంతలోనే స్థానిక ఎస్‌ఐ క్రిస్టోఫర్‌ నోలన్‌(బండి సరోజ్‌ కుమార్‌) ఎంట్రీ ఇస్తాడు. అతనికి అమ్మాయిల పిచ్చి. వాళ్ల వీక్‌నెస్‌లను పట్టుకొని అనుభవిస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్‌పై మోజుపడతాడు. ఆమెని ట్రాప్‌ చేయగా, మోగ్లీ దాన్ని బ్రేక్‌ చేస్తాడు. దీంతో మోగ్లీని అక్రమంగా కేసుల్లో ఇరికించి అడ్రస్‌ లేకుండా చేయాలని ప్లాన్‌ చేస్తాడు. మరి దీన్ని మోగ్లీ ఎలా ఎదుర్కొన్నాడు, తన జాస్మిన్‌ని ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగిలిన కథ.

36
మోగ్లీ మూవీ విశ్లేషణ

సినిమా షూటింగ్‌ల నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది. సినిమా మొత్తం ఫారెస్ట్ లోనే సాగుతుంది. బ్యాక్‌ డ్రాప్‌ బాగుంది. రెగ్యూలర్‌ నుంచి భిన్నమైన ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. అనాథగా పెరిగిన హీరో నివాసం, ఆయన అడవిలో వాడే టెక్నిక్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అదే సమయంలో హీరోయిన్‌కి మాటలు రావు, చెవులు వినిపించవు అనేది కూడా డిఫరెంట్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. అదే సమయంలో హీరోహీరోయిన్‌ ఇద్దరూ అనాథలు కావడం మరో విశేషం. టేకింగ్‌ పరంగా సినిమా కాస్త కొత్త ఫీల్‌నిస్తుంది. గ్రాండియర్ లుక్‌ని కూడా ఇస్తుంది. కానీ కథగా చూసినప్పుడు మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తొలి చూపులోనే హీరోయిన్‌ని చూసి పడిపోవడం, ఆ తర్వాత సినిమా నేపథ్యం కావడంతో ఆమెపై నిర్మాత కన్నుపడటం, ఆ తర్వాత విలన్‌ అయిన బండిసరోజ్‌ కుమార్‌ మోజుపడటం, ఆయన ఆమెని అనుభవించాలనుకోవడం, ప్రేమ కోసం పోలీస్‌తో మోగ్లీ ఫైట్‌ చేయడమే సినిమా. ఇది అన్ని ప్రేమ కథల్లోనూ ఉండేదే. ఇందులోనూ ఉంది. సినిమాని నడిపించిన తీరు మాత్రం రొటీన్‌గానే ఉంటుంది. పైగా బలమైన కథ లేదు, అంతకు మించి కాన్ల్ఫిక్ట్ బలంగా లేదు. హీరోని అడ్డుతప్పించాలనే పాయింట్‌ లాజిక్ లెస్‌గా ఉంది. అది బలంగా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. పైగా సినిమా మేకింగ్‌ విషయంలోనూ చాలా షాట్లు నాసిరకంగానూ ఉన్నాయి. ఏమాత్రం పర్‌ఫెక్షన్‌ మెయింటేన్‌ చేయలేదు. ఫస్టాఫ్‌లో సీన్లు కూడా ఏమాత్రం ఎంగేజ్‌ చేసేలా లేవు. ఏవో సీన్లు వస్తుంటాయి, పోతుంటాయి తప్పితే, అవి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు చూపిస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. సినిమాని నడిపించడం కోసం ఏదో టైమ్‌ పాస్‌ వ్యవహారంలా ఉంటాయి, తప్పితే ఎందులోనూ సోల్‌ లేదు, కథని నడిపించే ఎమోషన్‌ లేదు. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్‌ మొత్తం అసలు కథేంటో అర్థం కాదు. విలన్‌ హీరోయిన్‌పై మోజుపడటమనేది కూడా బలంగా చూపించలేదు. ఆధార్‌ కార్డ్ జిరాక్స్ ఫోటోని చూసి మోజుపడటమనేది కన్విన్సింగ్‌ గా లేదు. హీరో తన పెయిన్‌ని చూపించే సీన్లు కూడా బలంగా లేవు. దీంతో ఎమోషన్స్ క్యారీ కాలేదు. ఒక సీన్‌ తర్వాత మరో సీన్‌ రావాలనేది తప్పితే, కథని నడిపించేలా ఆయా సీన్లు లేకపోవడం గమనార్హం. సెకండాఫ్‌ కూడా బాగా సాగదీసినట్టుగానే, ఊహించినట్టుగానే చాలా రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్ `జయం` సినిమాని తలపించేలా తీశారు. అదే సమయంలో ఇటీవల కాలంలో క్లైమాక్స్ లో దేవుడిని చూపించడం, శ్రీరాముడు, హనుమంతుడిని, శివుడుని చూపించి హడావుడి చేసే స్ట్రాటజీ ప్రతి సినిమాలోనూ కామన్‌ అయిపోయింది. కథకి సంబంధం లేకపోయినా సక్సెస్‌ ఫార్ములాగా భావించి పెడుతున్నారు. కానీ ఇందులో అవి చాలా బలవంతంగా పెట్టినట్టుగానే ఉన్నాయి. ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా లేవు. అదే సమయంలో కాస్త అసహనానికి గురి చేస్తాయి. యాక్షన్‌ సీన్లని కూడా క్వాలిటీగా తీయలేకపోయారు. ఆ విషయం ప్రతి మూమెంట్‌లోనూ కనిపిస్తుంది. ఇలా ప్రతి విషయంలోనూ సినిమా పరీక్షలాగానే ఉంటుందని చెప్పొచ్చు.

46
మోగ్లీ మూవీలోని ప్లస్‌, మైనస్‌ లు

ప్లస్‌లు

సినిమా కథకి సంబంధించిన బ్యాక్‌ డ్రాప్‌ కొత్తగా ఉంది. హీరోహీరోయిన్ల బ్యాక్‌ డ్రాప్‌ డిఫరెంట్‌గా చెప్పొచ్చు. సినిమాలో బిజీఎం బాగుంది. పాటలు యావరేజ్‌. రోషన్‌ బాగా నటించాడు. హీరోయిన్‌ కూడా బాగా చేసింది. అదే సమయంలో హీరో కంటే విలన్‌ సీన్లే ఎక్కువగా ఉన్నాయి. బండి సరోజ్‌ కుమార్‌ని హీరో లెవల్‌లో చూపించారు. వైవా హర్షతో సీన్లు బాగున్నాయి. ఎమోషనల్‌గా ఉంటాయి. విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి.

మైనస్‌లు

కథ, కథనం ఈ సినిమాకి పెద్ద మైనస్‌. యాక్షన్‌ సీన్లు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. రొటీన్‌ క్లైమాక్స్. బలవంతంగా జోడించిన హనుమంతుడి ఎలిమెంట్లు. కర్మ సిద్ధాంతం అనే చెప్పే తీరు కూడా ఏమాత్రం కనెక్టింగ్‌గా లేదు. చాలా అసహజంగా ఉంది.

56
నటీనటులు ప్రదర్శన

మోగ్లీ పాత్రలో రోషన్‌ కనకాల చాలా బాగా చేశాడు. నటుడిగా ఆయనలో పరిణతి కనిపిస్తుంది. తనని మరో మెట్టు ఎక్కించేలా ఉంటుంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతనిలోని కసి కనిపిస్తుంది. అలాగే హీరోయిన్‌ సాక్షి కూడా చాలా బాగా చేసింది. కొత్తగా ఉంది. అందంతో మెప్పించింది. బండి సరోజ్‌ కుమార్‌ ఇరగదీశాడు. హీరో లెవల్‌లో నటించి మెప్పించాడు. కాకపోతే అతనిలో సుదీప్‌ స్టయిల్‌ కనిపించింది. వైవా హర్ష పాత్ర కొన్ని చోట్ల నవ్వించింది. కానీ ఎమోషనల్‌గా ముగించారు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించేలా ఉంటాయి.

66
టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి కాల భైరవ మ్యూజిక్‌ బాగుంది. పాటల కంటే బీజీఎం బాగుంది. ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సీన్లు ఎలివేట్‌ అయ్యాయంటే ఈ బీజీఎం వల్లే అని చెప్పొచ్చు. కెమెరా వర్క్ సినిమాకి మరో ప్లస్‌. హైలైట్‌ కూడా. చాలా షాట్స్ వాహ్‌ అనిపించేలా ఉన్నాయి. ఎడిటింగ్‌ లోపాలు చాలా కనిపిస్తున్నాయి. సినిమా స్క్రీన్‌ప్లేని కన్‌ఫ్యూజ్‌ చేసేలా ఉన్నాయి. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. దర్శకుడు సందీప్‌ రాజ్‌ `కలర్‌ఫోటో` వంటి జాతీయ అవార్డు చిత్రం తర్వాత ఇప్పుడు `మోగ్లీ`తో వచ్చాడు. కానీ దర్శకుడిగా ఆయన ఈ మూవీతో సక్సెస్‌ కాలేకపోయారు. టేకింగ్‌లో క్వాలిటీ ఇష్యూస్‌ చాలా ఉన్నాయి. చాలా సీన్లు నాసిరకంగా ఉన్నాయి. కొన్ని సీన్లు కేర్‌లెస్‌గా తీసినట్టుగా ఉన్నాయి. ఏదో చూట్టేసినట్టుగా ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి. బ్యాక్‌ డ్రాప్‌ బాగుంది. కానీ సినిమాని బాగా సాగదీశాడు. ఏం చేయాలో తెలియక, ఇంకా ఏదో చేసినట్టుగా ఉంది. నిర్మాణ విలువలకు మాత్రం కొదవలేదు. పీపుల్స్ మీడియా వాళ్లు బాగా ఖర్చు చేశారు.

ఫైనల్‌గా: ఏమాత్రం మెప్పించలేని `మోగ్లీ`. దేవుడిని నమ్ముకుంటే సక్సెస్‌ వచ్చే అవకాశం ఉంది, దేవుడిని వాడుకుంటే కాదు.

రేటింగ్‌: 2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories