సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌.. తెరపై నవ్వుల వర్షం కురిసిందా?

Published : Nov 14, 2025, 02:15 PM IST

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన `సంతాన ప్రాప్తిరస్తు` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. సంతాన సమస్య నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? 

PREV
16
సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా `సంతాన ప్రాప్తిరస్తు`. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. సంతానం కోసం పడే బాధల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్‌ 14న) విడుదలైంది. నవ్వులకు కేరాఫ్‌గా నిలుస్తుందని టీమ్‌ చెబుతూ వచ్చింది. తెరపై ఆ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`సంతాన ప్రాప్తిరస్తు` మూవీ కథ

చైతన్య(విక్రాంత్‌) సాఫ్ట్ వేర్‌ జాబ్‌ చేస్తుంటాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.  ఒకరోజు ఫ్రెండ్‌ సుబ్బు(అభినవ్‌ గోమటం)ని గ్రూప్‌ 1 ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద డ్రాప్‌ చేయగా, వేరే సెంటర్‌కి వెళ్లాల్సిన కళ్యాణి(చాందిని చౌదరీ) మిస్‌ అయి ఈ సెంటర్‌కి వస్తుంది. ఆ సమయంలో చైతన్య హెల్ప్ చేస్తాడు. ఎగ్జామ్స్ కి టైమ్‌ కావడంతో ఆమె థ్యాంక్స్ చెప్పకుండా వెళ్లిపోతుంది. కానీ మొదటిసారి చూసినప్పుడే ఆమెకి ఫిదా అవుతాడు చైతన్య. ఆమె ఎగ్జామ్‌ అయిపోయేంత వరకు అక్కడే వెయిట్‌ చేస్తాడు. ఆ తర్వాత కళ్యాణి వచ్చి థ్యాంక్స్ చెప్పి డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది. నెంబర్ అడిగితే నో చెబుతుంది. మ్యాట్రిమోనీలో అదే అమ్మాయి ప్రొఫైల్‌ చూసి రిక్వెస్ట్ పెట్టగా, ఆమె ఓకే చెబుతుంది, కలిసేందుకు వరంగల్ వెళ్లగా, అక్కడికి వాళ్ల నాన్న(మురళీధర్‌ గౌడ్‌) వస్తాడు. చైతన్య గురించి ఆరా తీసి, చాలా బ్యాడ్‌ హాబిట్స్ ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగం లేదని రిజెక్ట్ చేస్తాడు. గవర్నమెంట్‌ జాబ్‌ కొట్టిన వ్యక్తికే తన కూతురుని ఇస్తానని సవాల్‌ చేస్తాడు. ఆ డిజప్పాయింట్‌తో వెళ్లిపోతుండగా, ఓ గర్భవతి ఎమెర్జెన్సీ కారణంగా అటు చైతన్య, కళ్యాణి కలుసుకుంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ప్రేమలో పడతారు. కానీ చైతన్యతో పెళ్లిని కళ్యాణి నాన్న రిజెక్ట్ చేస్తాడు. దీంతో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటారు. కొన్ని రోజులకు కళ్యాణి నాన్న వస్తాడు. వీరిని విడగొట్టి కూతురుని తీసుకెళ్లిపోవాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకు వంద రోజులే అని చైతన్యకి సవాల్‌ విసురుతాడు. అయితే మూడు నెలల్లో కళ్యాణిని గర్భవతి చేస్తే తమని ఇంకా ఎప్పటికీ విడగొట్టలేరని భావిస్తాడు చైతన్య. పిల్లలు కాకపోవడంతో డౌట్‌ వచ్చి ఆసుపత్రిలో చెక్‌ చేయగా, చైతన్యకి స్పెర్మ్ కౌంట్‌ తక్కువగా ఉందని చెబుతారు డాక్టర్. మూడు నెలలు కొన్ని ఆర్గానికి ఫుడ్‌, మెడికేషన్‌ ఇస్తారు. మరి మూడు నెలల్లో తన భార్య గర్భవతి అయ్యిందా? కూతురుని, అల్లుడిని విడగొట్టాలనే ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యిందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.

36
`సంతాన ప్రాప్తిరస్తు` మూవీ విశ్లేషణ

సంతాన సమస్యలు అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. పది మందిలో ముగ్గురు, నలుగురు ఈ సమస్యలతోనే బాధపడుతున్నారు. దేశంలో జనాభాతోపాటు ఫర్టిలిటీ సెంటర్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇదొక సెన్సిబుల్‌ సబ్జెక్ట్. ఇదే కాన్సెప్ట్ కి కొంత ఫన్‌, ఎమోషన్స్ ని జోడించి ఈ మూవీని రూపొందించారు దర్శకుడు సంజీవ్‌ రెడ్డి. కాంటెంపరరీ అంశాలను ఇందులో చూపించారు. దాన్ని ఫన్నీ వేలో ఆవిష్కరించారు. కాకపోతే దాన్ని చాలా నీట్‌గా డీల్‌ చేయడం విశేషం. ఫస్ట్ ఆఫ్‌ అంతా హీరోహీరోయిన్ లవ్‌ ట్రాక్‌, ప్రేమించుకోవడం, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరిని విడగొట్టేందుకు హీరోయిన్‌ తండ్రి ప్రయత్నించడంతో సాగుతుంది. మధ్యలో హీరో నలిగిపోవడం, ఆయన పడే బాధలు, ఈ క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి. తరుణ్‌ భాస్కర్‌ పాత్రకి హీరో తన లవ్‌ స్టోరీ చెప్పే సన్నివేశాలను ఫన్నీగా రాసుకున్నారు. హీరోతో ఫ్రెండ్‌ అభినవ్‌ గోమటం పాత్ర, జీవన్‌ పాత్రలు, సాఫ్ట్ వేర్‌  ఆఫీస్‌లో ఉండే వర్క్ కల్చర్‌ని, అందులో నేటి మ్యారేజ్‌ల పోకడల గురించి చెప్పించిన, చూపించిన తీరు బాగుంది. మొదటి భాగాన్ని మొత్తం సరదాగా నడిపించారు. ఇంటర్వెల్‌లో విక్రాంత్‌, చాందిని, మురళీధర్‌ గౌడ్‌ల మధ్య కాన్‌ఫ్లిక్ట్ ని ఆవిష్కరించారు. అది ఎంగేజ్‌ చేసేలా ఉంటుంది. సెకండాఫ్‌ సైతం సంతానం కోసం హీరో పడే బాధలను చూపించారు. వెన్నెల కిశోర్‌ పాత్ర ఎంట్రీతో మరింత ఫన్‌గా మారుతుంది. అదే సమయంలో ఎమోషనల్‌గానూ టర్న్ తీసుకుంటుంది. సెకండాఫ్‌లో మధ్య మధ్యలో ఫ్యామిలీ ఎలిమెంట్లని, మరోవైపు మూడు పాత్రల మధ్య సంఘర్షణని ఎమోషనల్‌గా ఆవిష్కరించడం, క్లైమాక్స్ లో ఆ ఎమోషన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్లి హ్యాపీగా ముగించడం విశేషం.

46
సంతాన ప్రాప్తిరస్తు మూవీ హైలైట్స్, మైనస్‌లు

సినిమా ప్రారంభం నుంచి కామెడీగా, సరదాగా తీసుకెళ్లిన తీరు బాగుంది, కానీ ఫన్‌ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. రెగ్యూలర్‌ గా స్టోరీ సాగుతున్నట్టుగానే ఉంటుంది. తరుణ్‌ భాస్కర్‌ ఎపిసోడ్లు కొంత వరకు నవ్విస్తాయి. మరోవైపు హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పెళ్లి తర్వాత హీరోయిన్‌ తండ్రి వచ్చాక అసలు డ్రామా, అసలు ఫన్‌ స్టార్ట్ అవుతుంది. హీరో పడే ఫ్రస్టేషన్‌ నవ్వించేలా ఉంటుంది. కానీ చాలా చోట్ల కామెడీ వర్కౌట్‌ కాలేదు. తేలిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇంకా బాగా చూపించాల్సింది అనిపిస్తుంది. సెకండాఫ్‌ ల్యాగ్‌ ఫీలింగ్‌ ఉంటుంది. ఎమోషన్స్ అన్ని చోట్ల వర్కౌట్ కాకపోవడంతో రొటీన్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. క్లైమాక్స్ లో హీరోయిన్‌ తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో మాట్లాడిన తీరు ఇటీవల వచ్చిన `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రాన్ని తలపిస్తుంది. కానీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే సినిమా కోసం టీమ్‌ జెన్యూన్‌ ప్రయత్నించిందని మాత్రం అర్థమవుతుంది. ఆ సిన్సియారిటీలో సినిమా మేకింగ్‌లో కనిపిస్తుంది. సంతానం అనే పాయింట్‌ చిన్నదే, దానికి మించిన ఎమోషనల్‌ లేయర్స్ ఇందులో చాలానే ఉన్నాయి. తండ్రి ఎమోషన్స్, కూతురు ఎమోషన్స్, ప్రియుడి ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. అయితే సంతానం అనే సబ్జెక్ట్ చాలా సెన్సిటివ్‌ ఉందులో చాలా ఫన్నీగా, ఎక్కడా మిస్‌ లీడ్‌ కాకుండా చూపించిన తీరు మాత్రం బాగుంది. సంతాన సమస్యలకు గల కారణాలను చెప్పిన తీరు అవగాహన కల్పించేలా ఉంది.

56
సంతాన ప్రాప్తిరస్తు మూవీ నటీనటుల ప్రదర్శన

ఇందులో చైతన్య పాత్రలో విక్రాంత్‌ చాలా బాగా నటించాడు. చాలా సహజంగా నటించాడు. ఇన్నోసెంట్‌గా, స్ట్రగుల్‌ అయ్యే అబ్బాయిగా, పిల్లలు పుట్టరని తెలియడంతే బాధపడే వ్యక్తిగా, ఇటు ఫ్యామిలీ, అటు ఆఫీస్‌ వర్క్ మధ్య నలిగిపోయే వ్యక్తిగా అదరగొట్టాడు. తన నటనతోనే కట్టిపడేశాడు. ఇక చాందిని చౌదరీ కళ్యాణి పాత్రకి యాప్ట్ గా అనిపించింది. తను కూడా చాలా సహజంగా చేసింది. పాత్రకి ప్రాణం పోసింది. అటు తండ్రి, ఇటు భర్తని మ్యానేజ్‌ చేస్తూ నలిగిపోయే పాత్రలో చాలా బాగా చేసింది. నటిగా ఆమెకి మరో మెట్టు ఎక్కించే పాత్ర అవుతుంది. హీరోయిన్‌ తండ్రి పాత్రలో మురళీధర్‌ గౌడ్‌ సైతం బాగా చేశారు. ఆయనకు బాగా సూట్‌ అయ్యే పాత్ర కావడంతో రెచ్చిపోయాడు. ఇక మురళీధర్‌ గౌడ్‌ శిష్యుడిగా తరుణ్‌ భాస్కర్‌ మధ్య మధ్యలో కనిపించి నవ్వించాడు. యోగా గురువుగా వెన్నెల కిశోర్‌ నవ్వించాడు. ఫ్రెండ్‌గా అభినవ్‌ గోమటం సైతం ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర చేసే రచ్చ ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. మిగిలిన పాత్రల్లో నటించిన హర్షవర్థన్‌, జీవన్‌ కుమార్‌, సత్యకృష్ణ, తాగుబోతు రమేష్‌, అభయ్‌, అనిల్‌ గీల, సద్ధామ్‌, రియాజ్‌, కిరీటి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

66
సంతాన ప్రాప్తిరస్తు మూవీ టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ ప్లస్‌గా చెప్పొచ్చు. పాటలు, బిజీఎం కూడా చాలా బాగుంది. ఆకట్టుకునేలా ఉంది. మహిరెడ్డి పండుగుల కెమెరా వర్క్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఆర్ట్ వర్క్ సైతం ఆకట్టుకుంది. సాయికృష్ణ గనల ఎడిటింగ్‌ కొంత ట్రిమ్‌ చేయోచ్చు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు సంజీవ్‌ రెడ్డి ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని ఫన్నీగా, ఎమోషనల్‌గా చెప్పే తీరు కూడా ఆకట్టుకునేలా ఉంది. కానీ ఆశించిన స్థాయిలో ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. ఎమోషన్స్ చాలా వరకు వర్కౌట్‌ అయ్యాయి. ఇంకా బాగా చెప్పాల్సిందే. కాకపోతే లవ్‌ స్టోరీలో ఎమోషన్‌ని, తండ్రికూతుళ్ల మధ్య అనుబంధాన్ని మరింత బలంగా చూపిస్తే బాగుండేది.

ఫైనల్‌గా: `సంతాన ప్రాప్తిరస్తు` ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ రైడ్‌

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories