#GunturKaaramReview:మహేష్ ‘గుంటూరు కారం’ రివ్యూ

First Published | Jan 12, 2024, 9:50 AM IST

సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం అంచనాలను అందుకుందా...మహేష్ కు మరో హిట్ పడిందా..త్రివిక్రమ్ కు మరో అలవైకుంఠపురం అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Guntur Kaaram


మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే అంచనాలు ప్రారంభమైపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ లో ఈ చిత్రం ఫ్యాన్స్‌ అంచనాలకు తగ్గట్టే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని నిర్మాత నాగవంశీ ఖచ్చితంగా చెప్పడంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ చిత్రంపై అసక్తి పెరిగింది. అలాగే పాటలు కూడా రెండు సూపర్ హిట్టై జనాల్లోకి వెళ్లాయి. ఈ నేపధ్యంలో సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం అంచనాలను అందుకుందా...మహేష్ కు మరో హిట్ పడిందా..త్రివిక్రమ్ కు మరో అలవైకుంఠపురం అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Guntur Kaaram Review


స్టోరీ లైన్

మినిస్టర్ వసుంధర (రమ్యకృష్ణ) మొదటి భర్త కొడుకు రమణ(మహేష్ బాబు) . ఆమె తన భర్త సత్యం(జయరాం)కు విడాకులకు ఇచ్చేసి తన కొడుకుని వదిలేసి తన తండ్రి వైరా వెంకట సామి(ప్రకాష్ రాజ్ ) దగ్గర ఉంటూంటుంది. ఆమె రావు రమేష్ ని మరో పెళ్ళి చేసుకుని తన రాజకీయ జీవితంలో బిజీగా ఉంటుంది. మరో ప్రక్క రమణ తన తండ్రి వారసత్వంగా వచ్చిన గుంటూరు మిర్చి యార్డ్ లో మకుటం లేని మహారాజులా ఏలుతూ బిజినెస్ చేస్తూంటాడు. అయితే అతని దృష్టి మొత్తం తనను వదిలేసి వెళ్లిపోయిన తల్లి మీదే.  కానీ తను ధైర్యం చేసి వెళ్లలేడు. ఆమె పిలిచే అవకాసం లేదు. అలా గడుస్తూంటే..ఓ రోజు వెంకట స్వామి కు రాజకీయంగా ఓ సమస్య వస్తుంది. ప్రత్యర్ది కాటా మధు (రవిశంకర్) తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ... తన కూతురు మొదటి భర్త ,కొడుకు గురించి జనాల్లోకి తీసుకెళ్తామని బెదిరిస్తారు.


Guntur Kaaram Review


 దాంతో అసలా మొదటి కొడుకుతో లింక్ తెంపేసుకుంటే బెస్ట్ అని నిర్ణయానికి వెంకటసామి వస్తాడు. అందుకోసం ఆ కుటుంబంతో సంభంధం లేదని, ఆస్దులు కోసం కానీ, వారసత్వం కోసం కానీ తిరిగి రానని  రమణ చేత కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకురమ్మని  తన వాళ్లను పంపుతాడు. అయితే ఆ ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టడం ఇష్టంలేని రమణ హైదరాబాద్ వెళ్లి ఏం చేస్తాడు. అప్పుడు వైరా వెంకటసామి ఎలా రియాక్ట్ అయ్యాడు. అసలు తల్లి,కొడుకులు విడిపోవాల్సిన పరిస్దితి ఎందుకు వచ్చింది. తన మొదటి భర్తకు వసుంధర ఎందుకు విడాకులు ఇచ్చింది...చివరకు తల్లి,కొడుకులు ఒకటయ్యారా లేదా... కథలో అమ్ము (శ్రీ లీల)పాత్ర ఏమిటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి)కు రమణ కు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి ?వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Guntur Kaaram Review

Plot and Pacing

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు డైలాగులుతో, ఎమోషన్స్ తో , యాక్షన్ బిట్స్, కామెడీ ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి నడుపుతూంటాడు. అందుకే అవి ఫ్యామిలీలకు, కుర్రాళ్లకు అనే తేడా లేకుండా జనాల్లోకి వెళ్తూంటాయి. అయితే అదే ఒక్కోసారి దారి తప్పి అజ్ఞాత వాసి లా ఇలా గుంటూరు కారంలా మారిపోతుంది. తన అలవైకుంఠపురం సూపర్ హిట్ ని, అత్తారింటికి దారేది లాంటి క్లాసిక్ ని , నితిన్ తో చేసిన అ..ఆ ప్లేవర్ లో కలిపి అందించాలనుకున్నారు. అయితే మహేష్ వంటి సూపర్ స్టార్ ఇమేజ్ ని ఓ చిన్న కథలో బంధించటం అదీ బాగా నలిగిపోయిన నేరేషన్ లో ప్రెజెంట్ చేయాలనుకోవటం తో ఇబ్బంది మొదలైంది. ప్లాట్ ని తల్లి,కొడుకు అనుబంధంగా మలవాలుకున్నారు. అయితే అది చిన్న హీరోకు అయితే ఫెరఫెక్ట్ గా వర్కవుట్ అయ్యేదేమో. ఎందుకంటే హీరో ఏమీ చేయడు. కేవలం డైలాగులు చెప్పేసి వెళ్లిపోతే మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతూంటాయి. అలాగే హీరోకు ప్రత్యర్ది తన ఎనభై ఏళ్ల తాత ..ఆయనే విలన్. ఆ ఏజ్ గ్రూప్ వ్యక్తి ని విలన్ గా చూపినప్పుడు చివరకు చెయ్యత్తి కూడా కొట్టలేని సిట్యువేషన్. ఇంక మహేష్ బాబు ఏం చేయాలి. కుర్చి మడతబెట్టి అనే పాటలు పాడటం తప్పించి. అయితే ఫస్టాఫ్ ..మహేష్ తన కామెడీ టైమింగ్ ,డైలాగు డెలవరీతో లాక్కెళ్లిపోయాడు. 

Guntur Kaaram


సెకండాఫ్ కు వచ్చేసరికి ఆయనా ఆ కదలని కథలో చేతులు ఎత్తేసాడు. ప్లాట్ ముడులు వాటంతట అవే విడిపోతుంటే తను మాత్రం ఏం చెయ్యగలుడు. వాటిని చూస్తూ ఉండటం తప్పించి. మనకు హీరో అంటే ఏదో ఒకటి చేయాలి కదా. అందులో సూపర్ స్టార్ అంటే మరీను. ఇక జయరాం ను,మురళి శర్మను చూస్తూంటే మనకు అలవైకుంఠపురం గుర్తుకు వచ్చేస్తూంటుంది. ఆయన్ని ఆయనే కాపీ కొడుతున్నాడా,అనుకరిస్తున్నాడా అని అనిపిస్తూంటుంది. ఇక సినిమా పేస్ అయితే మరీ దారుణం...పాటల్లో పరుగెడుతుంది..మిగతా టైమ్ లో కుంటుతూంటుంది. ఇక హీరోకు ఒక కన్ను కనపడదు అని పెట్టారు. దాని వలన కథలో పెద్ద మార్పు అయితే రాలేదు కానీ మహేష్ వంటి స్టార్ అలాంటి క్యారక్టరైజేషన్ కు ఒప్పుకోవటం మాత్రం గ్రేట్.

Guntur Kaaram


 కొన్ని క్యారక్టర్స్, వారి జీవితాలు,ఇంటర్ కనెక్ట్ పెట్టుకుని మధ్యలో  ఓ విలన్ ని   పెట్టడం స్క్రీన్ ప్లే పరంగా బాగుంది. అయితే అలాంటి విలన్ ని కొడుకు వచ్చే దాకా మినిస్టర్ అయినా సరే ఆ తల్లి (రమ్యకృష్ణ) ఎదిరించలేకపోవటం మాత్రం కాస్తంత విడ్డూరంగానే ఉంటుంది. అయినా నాకు వారసత్వం వద్దని బాండ్ కాగితాల మీద సంతకం పెట్టిస్తే..మాత్రం రాజకీయంగా పరువు తీయాలనుకునేవాళ్లను ఆపగలరా...ప్రకాష్ రాజ్ పాత్ర తలుచుకుంటే మహేష్ ని లేపేసే స్దాయిలో కదా ఉన్నది. ఎందుకు ఈ కాగితాలు.బాండ్స్ అంటూ తిరగటం ...త్రివిక్రమ్ లాజిక్ ఏదో ఉంటుంది. కానీ మనకే అది అర్దం అవకో,డైజస్ట్ కాకో జరిగి ఉంటుందని సరిపెట్టుకోవాలి.  

Gunturkaaram


నటీనటుల్లో ...
మహేష్ బాబు ఎనర్జీకు ఎవరూ సాటి రారు అన్న రీతిలో  స్క్రీన్ ప్రెజన్స్ అదరకొట్టారు. రమ్యకృష్ణలో రాజసం తగ్గినా రాజమాతలాగే హుందాగా కనపించింది. రావు రమేష్ డైలాగులు సదా మామూలే. వెంకట సామి పాత్రలో ప్రకాష్ రాజ్ చాలా రోజుల తర్వాత విలనీ చేసారు. ఆయన్ని వంక పెట్టలేం. జగపతిబాబు ని, అజయ్ ఘోష్ ని వాళ్ల స్దాయి పాత్రలు కాదు. జయరామ్ అయితే మరీ నాశి పాత్ర.  ఈశ్వరి రావు, మురళీ శర్మ, రఘుబాబు అలా అలా చేసుకుంటూ వెళ్లారు. వెన్నెల కిషోర్, బ్లైండ్ బాబ్జిగా అజయ్   నవ్విస్తారు.  అజయ్ ఘోష్ సీన్స్ లో డైలాగులు బాగున్నాయి. శ్రీలీల పాటల్లో ఇరగతీస్తోంది. నటనకు అంత స్కోప్ ఉన్న పాత్రమీ కాదు. బ్రహ్మాజీ పాత్ర పెద్దగా రిజిస్టర్ కాదు. రాహుల్ రవీంద్రన్ ఉన్నాడంటే ఉన్నాడు అంతే.

Guntur Kaaram


టెక్నికల్ గా...

మహేష్ బాబు డాన్స్ లకు కొరియోగ్రఫీ బాగుంది. తమన్ కూడా రెండు పాటలు బాగా ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతం కాదు కానీ ఓకే.  కెమెరా వర్క్ ఓ రేంజిలో ఉంది. ఎడిటింగ్ ..సెకండాఫ్ లో లాగిన సీన్స్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదినిపించింది. మహేష్ సినిమాకు తగ్గట్లు రిచ్ గా ఖర్చు పెట్టలేదేమో అనిపించేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. త్రివిక్రమ్ స్క్రిప్టు ప్రక్కన పెడితే డైలాగులు మాత్రం కొన్ని ఆయన మార్కు బాగా పేలాయి. దర్శకుడుగా త్రివిక్రమ్ కొత్తగా చేసిందేమీలేకపోయినా సూపర్ స్టార్ ని డీల్ చేసిన విధానం బాగుంది. 

Guntur kaaram

 
ప్లస్ లు 
మహేష్ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ తో కూడిన లాంగ్వేజ్
ఫన్ తో కూడిన ఫస్టాఫ్
క్లిక్ అయ్యిన రెండు మాస్ సాంగ్ లు 
శ్రీలల స్టెప్స్
కొన్ని డైలాగ్స్


మైనస్ లు

త్రివిక్రమ్ రచన(కథ,స్క్రీన్ ప్లే)
జస్ట్ ఓకే అనిపించే ప్రొడక్షన్ వాల్యూస్
మిగిలిన రెండు పాటలు
వీక్ విలనీ
 

Guntur Kaaram


ఫైనల్ థాట్

ఇది కేవలం త్రివిక్రమ్ 'మమ' అనిపిస్తూ చేసిన 'మమకారం'  (కొడుకు దిద్దిన కాపురం) టైప్  కథ. మహేష్ సినిమా అని ముచ్చటపడితే మూతి పళ్లు రాలతాయి అన్నట్లు అనిపించే  కొన్ని సీన్స్ మినహాయిస్తే క్లిక్ అయిన రెండు పాటలు,మహేష్ స్వాగ్, స్టైల్ కోసం అయితే ధైర్యం చేయాలి.

Rating:2.25

---సూర్య ప్రకాష్ జోశ్యుల


 బ్యానర్: హారిక హాసిని క్రియేషన్స్
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు
ఎడిటింగ్: నవీన్ నూలి 
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్
సంగీతం: ఎస్ థమన్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల: జనవరి 12,2024

Latest Videos

click me!