`కృష్ణమ్మ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | May 10, 2024, 2:11 PM IST

సత్యదేవ్‌.. టాలెంట్‌ ఉన్న సక్సెస్‌ రావడం లేదు. ఈ క్రమంలో సక్సెస్‌ కోసం ఆయన `కృష్ణమ్మ` అనే చిత్రంలో నటించారు. కొరటాల శివ సమర్పణలో ఈ మూవీ తెరకెక్కడం విశేషం. నేడు శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

సత్యదేవ్‌ టాలెంట్‌ ఉన్న హీరో. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ సక్సెస్‌ వరించడం లేదు. చాలా ప్రయత్నాలు చేసినా బెడిసి కొడుతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ రియలిస్టిక్‌ కథాంశంతో `కృష్ణమ్మ` అనే చిత్రంలో నటించాడు. దీనికి దర్శకుడు కొరటాల శివ సమర్పకులుగా ఉండటం విశేషం. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ ఈశుక్రవారం(మే 10న) విడుదలైంది. మరి ఈ సారైన సత్యదేవ్‌కి సక్సెస్‌ పడిందా, కొరటాల శివ నిర్మాణంలో చేసిన ప్రయత్నం వర్కౌట్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
భద్ర(సత్యదేవ్‌), శివ(కృష్ణతేజ)  , కోటి(లక్ష్మణ్‌) ప్రాణ స్నేహితులు. అనాథలు. భద్ర, కోటి వించిపేటలో దాసన్నకు గంజాయి సరుకు తేవడంలో సహకరిస్తూ చిన్న చిన్న క్రిమినల్‌ పనులు చేస్తుంటారు. శివ ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని వీటికి దూరంగా ఉంటాడు. కానీ శివకి తెలియకుండా వీళ్లు ఈ గంజాయి సరఫరా చేస్తుంటారు. ఈక్రమంలో శివకి అమ్మాయి మీనా(అథిరా రాజ్‌) ప్రింటింగ్‌ బుక్స్ ఆర్డర్‌ ద్వారా పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు శివ. మరోవైపు తాను ఉండే సమీపంలో ఓ అమ్మాయి పాపతో కనిపిస్తూ భద్రని ఆకర్షిస్తుంది. వారికి సహాయం చేస్తుంటాడు భద్ర. కానీ ఆమె నాన్న మీరు ఎవరు, మీ పేరెంట్స్ ఎవరు, ఏం చేస్తుంటారని నిలదీయడంతో బాధపడతాడు, వారిపై కోప్పాడతాడు. ప్రతి ఒక్కడు అనాథ అనాథ అని గుర్తు చేస్తూనే ఉంటారని కోప్పడంతో ఆ అమ్మాయి వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. మరోవైపు మీనా ప్రేమలో ఉన్న శివపై కూడా భద్ర మండిపడతాడు. ఈ ప్రేమ మనకు సెట్‌ కావని, మనం ఎవరు అని వాళ్లు కూడా నిలదీస్తారని, ఇవన్నీ వద్దు అంటూ ఫైర్‌ అవుతాడు. దీంతో శివ.. మీనాకి దూరంగా ఉండాలనుకుంటాడు. శివ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసే కుర్రాడి ద్వారా నిజం తెలుసుకున్న మీనా.. భద్రకి రాఖీ కట్టి చెల్లి, అమ్మ ఉందని ధైర్యమిస్తుంది. దీంతో ఆమె కోసం నిలబడాలనుకుంటారు భద్ర ఆయన ఫ్రెండ్స్. అయితే ఆ అమ్మాయి తల్లికి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. లక్షల్లో డబ్బు కావాలి. ఆమె కోసం మరోసారి గంజాయి సరుకు తెచ్చేందుకు ఒప్పుకుంటారు. కానీ పోలీసులకు దొరికిపోతారు. కట్‌ చేస్తే ఓ అమ్మాయిని రేప్‌ చేసి హత్య చేసిన కేసులో ఈ ముగ్గురుని ఇరికిస్తారు ఏసీపీ. దీని వెనకాల రాజకీయ నాయకుడి కొడుకు, వారి ఫ్రెండ్స్ ఉంటారు. వారిని తప్పించే క్రమంలో వీరిని ఇరికిస్తారు. మరి ఆ కేసు నుంచి బయటపడ్డారా? జైలు జీవితాన్ని అనుభవించారా? శివ తాను ప్రేమించిన అమ్మాయిని కలుసుకున్నాడా? అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? దీని వెనక ఏం జరిగింది? తమని తప్పుడు కేసుని ఇరికించిన వారిపై భద్ర ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః
2007 ఆయేషా మీరా కేసు సంచలనం సృష్టించింది. కృష్ణ జిల్లా ఇబ్రహింపట్నంలోని హాస్టల్‌లో ఉండే అమ్మాయి మీరాపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసు అప్పట్లో దుమారం రేపింది. చాలా మందిని అమాయకులను ఇందులో పోలీసులు ఇరికించారు. కానీ వారు బయటపడ్డారు. కానీ ఓ సత్యంబాబు అనే వ్యక్తిని గట్టిగా ఇరికించారు. ఇప్పటికీ ఈ కేసు నడుస్తుంది. అయితే ఓ మంత్రి కొడుకుని కాపాడేందుకు పోలీసులు, వ్యవస్థ కుమ్మక్కైందనేది ఆయేషా పేరెంట్స్ ఆరోపణలు. మహిళా సంఘాలు కూడా దీనిపై పోరాటం చేశాయి. ఈ కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇప్పుడు అందరు దాన్ని మర్చిపోయారు. అలాంటి కథతోనే `కృష్ణమ్మ` సినిమాని తీశారని అర్థమవుతుంది. టీమ్‌ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే కొంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారనిపిస్తుంది. సినిమా కథగా చూస్తే మంచి పాయింట్‌ ఉన్న సబ్జెక్ట్. చాలా పెయిన్‌ ఉంది, చాలా ఎమోషన్ ఉంది. కానీ దర్శకుడు ఈ కేసులో ఇరుక్కున్న అమాయకుల జీవితాల ప్రధానంగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించాడు. దీంతో అత్యాచారం కేసు తీవ్రతని తగ్గిపోయింది. అక్కడే ఫెయిల్‌ అయ్యాడు. ఈ పెయిన్‌ని, ఎమోషన్స్ ని బలంగా చెప్పలేకపోయారు. 

సినిమా సత్యదేవ్‌, లక్ష్మణ్‌ కొట్టుకుంటారు. ఇందులో లక్ష్మణ్‌ని చంపినట్టుగా చూపించారు. ఈ కేసుని పోలీస్‌ అధికారి రఘు కుంచే విచారిస్తుంటారు. దీంతో ప్లాష్‌ బ్యాక్‌ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో భద్ర, శివ, కోటిల స్నేహాన్ని చూపించారు. వారి కథలను ఎస్టాబ్లిష్‌ చేశారు. వారి ప్రేమలను చూపించారు. ప్రేమని దక్కించుకునే క్రమంలో కట్‌ చేసి అమ్మాయి చనిపోయిన కేసులో ఈ ముగ్గురిని ఇరికిస్తారు. సెకండాఫ్‌లో కథ కేసు వైపు టర్న్ తీసుకుంటుంది. మొదటి భాగంలో సినిమా అక్కడక్కడ ఫన్‌తో నార్మల్‌గా సాగుతుంది. ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు, కిక్‌ ఇచ్చే సీన్లు లేకపోవడంతో ఫ్లాట్‌గా సాగుతుంది. చాలా వరకు సీరియస్‌గానే వెళ్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్‌ మొత్తం కేసు చుట్టూ తిరుగుతుంది. అమాయకంగా వీరిని కేసులో ఇరికించేందుకు అధికారుల నుంచి ప్రభుత్వం వైపు నుంచి జరిగిన కుట్రలను ఆవిష్కరించారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు, రాజకీయ నాయకులు ఎంతటి కుట్రలు చేస్తుంటారు, అమాయకులను ఎలా ఇరికిస్తారో కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆ తర్వాత ఈ కేసులో దోషులుగా ఉన్న వారిపై, తమని కేసులో ఇరికించిన వారిపై భద్ర ప్రతీకారం తీర్చుకోవడం మెయిన్‌గా ఉంటుంది. సీరియస్‌ నెస్‌ మరింత పెరిగింది. 
 

అయితే అమ్మాయి ఎవరనే ట్విస్ట్ బాగున్నా, అది పేలలేదు. సింపుల్‌గా తేల్చేశారు. అక్కడే పెద్ద పెయిన్‌ ఉంది, ఎమోషన్‌ ఉంది, డ్రామా ఉంటుంది. కానీ దాన్ని నీరు గార్చాడు దర్శకుడు. దీంతో ఆ ఎమోషన్‌ తో ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోతారు. అదే ఈ మూవీకి పెద్ద మైనస్‌. ఇలాంటి సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్లకి స్కోప్‌ ఉంది. రక్తికట్టించే సీన్లు, ఎమోషనల్‌ డ్రైవ్ ముఖ్యం, కానీ అవే ఫోకస్‌ చేయలేదు. స్నేహానికే ప్రయారిటీ ఇచ్చాడు. బహుశా కేసుకి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయని భావించారో ఏమో సేఫ్‌ గేమ్ ఆడారు. అక్కడే బెడిసికొట్టింది. కథలోని ఎమోషన్‌ ఆడియెన్స్ ఫీలైతే సినిమా సన్నివేశాలు రక్తికడతాయి. లేదంటే తేలిపోతాయి. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. లవ్‌ స్టోరీని కూడా బలంగా చూపించలేదు. అంతా రెగ్యూలర్‌గానే ఉంటుంది. సీన్లు ఊహించేలా ఉంటాయి. కథగా ఇది సెన్సిటివ్‌ సబ్జెక్ట్ కావడంతో సరిగా డీల్‌ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. దీంతో బలమైన సీన్లు తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రెండిషిఫ్‌ని బలంగా చూపించినా బాగుండేది. అది కూడా జరగలేదు. దీంతో సినిమాతో ఆడియెన్స్ కనెక్ట్ కావడం కష్టమని చెప్పాలి. యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. 

నటీనటులుః 
భద్ర పాత్రలో సత్యదేవ్ చాలా బాగా చేశాడు. సెటిల్డ్ గా, పాత్రలో ఇన్ వాల్వ్ అయి చేశాడు. సీన్లని రక్తికట్టించడంలో సక్సెస్‌ అయ్యాడు. నటుడిగా ది బెస్ట్ ఇచ్చాడు. ఆయనతోపాటు శివ పాత్రలో నటించిన తేజ కృష్ణ కూడా బాగున్నాడు. పాత్రకి బాగా సెట్ కావడంతోపాటు సహజంగా చేసి మెప్పించాడు. ఇక లక్ష్మణ్‌ నుంచి కామెడీ ఆశిస్తాం. కానీ ఇందులో అది మిస్ అయ్యింది. సీరియస్‌గానే సాగుతుంది. మీనా పాత్రలో అథిరా రాజ్‌ బాగా చేసింది. అందంగా ఉంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్థాయి. 

టెక్నీషియన్లుః 
సినిమాకి కాళభైరవ మ్యూజిక్‌ ఫర్వాలేదు. మంచి పాటలు అందించారు. బీజీఎం కూడా బాగుంది. కథని డ్రైవ్‌ చేసేలా ఉంది. విజువల్‌గా సినిమా రిచ్‌గా ఉంది. ఎడిటింగ్‌ పరంగా ల్యాగ్లు తగ్గిస్తే బాగుండేది. నిర్మాత కొమ్మలపాటి కృష్ణ బాగానే ఖర్చు చేశాడు. దర్శకుడు వీవీ గోపాలకృష్ణ టేకింగ్‌ బాగుంది. దర్శకుడిలో విషయం ఉంది. కాకపోతే ఆయన ఎక్కువగా ఫ్రెండ్‌షిప్‌, అత్యాచారం కేసుని మెయిన్‌గా తీసుకున్నాడు. దీంతో సినిమా డల్‌గా సాగుతుంది. ల్యాగ్‌ అనిపిస్తుంది. ఆడియెన్స్ కి మధ్య మధ్యలో ట్విస్ట్ లు, టర్న్ లుతగిలితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ విషయంపై ఫోకస్‌ పెట్టలేదు. దీంతో సప్పగా సాగుతున్నట్టు, రొటీన్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. అత్యాచారంకి సంబంధించిన ఎమోషన్స్ పై దృష్టిపెడితే సినిమా బాగుండేది. క్లైమాక్స్ లో భద్ర, కోటి పాత్రలకు సంబంధించిన సీన్లు హృదయాన్ని కదిలిస్తాయి.   

ఫైనల్‌గాః స్నేహం, అత్యాచారం కేసు అనే రెండు కథలను తెలియజేసే `కృష్ణమ్మ`. 
రేటింగ్‌ః 2 

నటీనటులుః సత్యదేవ్‌, మీసాల లక్ష్మణ్‌, కృష్ణ తేజ రెడ్డి, నందగోపాల్‌, అథిర, రఘు కుంచె తదితరులు.
టెక్నీషియన్లుః
మ్యూజిక్‌ః కాళభైరవ
నిర్మాతః కొమ్మలపాటి కృష్ణ
డైరెక్టర్‌ః వీవీ గోపాలకృష్ణ
 

click me!