`హరి హర వీర మల్లు` మూవీ రివ్యూ, రేటింగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ తన రేంజ్‌ ఏంటో చూపించాడా?

Published : Jul 24, 2025, 02:53 AM IST

పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్ టైమ్ చేసిన పీరియడ్‌ మూవీ `హరి హర వీరమల్లు`. ఈ సినిమా భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
17
`హరి హర వీరమల్లు` మూవీ రివ్యూ

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. చివరగా ఆయన `బ్రో` చిత్రంతో సందడి చేశారు. ఈ మూవీ వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `హరి హర వీరమల్లు` సినిమాతో వచ్చారు. 

క్రిష్‌తోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ఈ పీరియాడికల్ డ్రామాని నిర్మించారు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. 

బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ మొదటి సారి చేసిన పీరియడ్‌ ఫిల్మ్ ఇది. అదే సమయంలో ఆయన మొదటి పాన్‌ ఇండియా చిత్రం కూడా. ఇంకోవైపు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి సినిమా కావడం విశేషం. 

ఇలా అనేక ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ చిత్రం అనేక అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ఈ గురువారం(జులై 24)న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

27
`హరి హర వీరమల్లు` మూవీ కథ ఏంటంటే?

దేశాన్ని మొఘల్ రాజులు పాలిస్తున్న కాలంలో(1690) మన కొల్లూర్ ప్రాంతంలో వజ్రాల కోసం అక్కడి స్థానిక ప్రజలతో అన్వేషణ చేయిస్తాడు నవాబ్. అందులో ఓ పిల్లాడికి డైమండ్‌ దొరుకుతుంది. అది స్థానిక రాజు నుంచి నవాబ్‌లకు చేరుతుంది. 

మరోవైపు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఔరంగజేబ్‌ రాజ్య పాలన సాగిస్తుంటాడు. పాలన కోసం ఏకంగా తండ్రినే బంధీని చేస్తాడు. తన రాజ్యంలో హిందువులు ఉండకూడదని, అంతా మతం మారాలనే కండీషన్‌ పెడతాడు. హిందువుగా ఉండాలంటే జిజియా పన్ను చెల్లించాలనే నిబంధన పెడతాడు. 

దీన్ని ఎదురించిన రాజులను చంపేస్తాడు. కట్ చేస్తే వీర(పవన్‌ కళ్యాణ్‌) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బుని పేదవారికి పంచుతుంటాడు. బ్రిటీష్‌ వారి నుంచి డైమండ్స్ కొట్టేసి మళ్లీ వారికే అమ్ముతుంటాడు. ఈ క్రమంలో స్థానిక రాజు(సచిన్‌ ఖేడ్కర్‌) వీరని పిలిపిస్తాడు. 

గోల్కొండ కుతుబ్‌షాకి పంపాల్సిన డైమండ్స్ దొంగతనం చేయించి తమకి ఇవ్వాలనే ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ ఆ ప్లాన్‌ బెడిసికొడుతుంది. ఆ రాజు వద్ద బంధీగా ఉన్న పంచమి(నిధి అగర్వాల్‌) తనని ప్రేమిస్తున్నట్టు నాటకమాడి మోసం చేస్తుంది. దీంతో వీర కుతుబ్‌షా సైన్యానికి దొరికిపోతాడు. 

వీర తెలివి, ధైర్యసాహసాలు తెలిసిన కుతుబ్‌షా.. ఢిల్లీ నవాబ్‌ ఔరంగజేబ్‌ వద్ద ఉన్న కొహినూర్‌ డైమండ్ దొంగిలించి తీసుకురావాలని కోరతాడు. అందుకు ఓకే చెబుతాడు వీర. మరి ఎర్రకోటలో అత్యంత క్రూరమైన ఔరంగజేబ్‌ ఆధీనంలో ఉన్న కొహినూర్‌ డైమండ్‌ ని తీసుకురావడానికి తన స్నేహితులు, కుతుబ్‌ షా మనుషులతో కలిసి బయలు దేరతాడు వీర.

 ఈ జర్నీలో తాను ఎలాంటి సంఘటనలు చూశారు? ఆ జర్నీ ఎలా సాగింది? ఇంతకి వీర ఎవరు? అతని గతం ఏంటి? కుతుబ్‌షా కోరగానే ఎందుకు ఓకే చెప్పాడు? అతని లక్ష్యం ఏంటి? కొహినూర్‌ డైమండ్‌ తీసుకొచ్చాడా? అత్యంత క్రూరమైన ఔరంగజేబ్‌ వీర ఎలా ఎదుర్కొన్నాడు. చివరికి ఏం జరిగిందనేది ఈ మూవీ కథ.

37
`హరి హర వీరమల్లు` మూవీ విశ్లేషణః

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు కమర్షియల్‌ మూవీస్‌ చేస్తూ వచ్చారు. కానీ మొదటిసారి చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశంతో ఈ మూవీ చేశారు. మొఘల్‌ పాలన కాలంలో కొహినూర్‌ డైమండ్ మన వద్ద నుంచి ఔరంగజేబ్‌కి చేరిన నేపథ్యంలో దాన్ని తీసుకురావడం కోసం వీరమల్లు బయలు దేరడం, దాన్ని దొంగిలించుకురావడానికి ఆయన ఏం చేశాడు? 

ఆయన జర్నీ ఎలా సాగిందనేది క్లూప్తంగా ఈ మూవీ. ఈ జర్నీలో చోటు చేసుకున్న డ్రామా, ఎమోషన్స్, స్ట్రగుల్స్ ని ఇందులో చూపించారు. ఆ సమయంలో ఔరంగజేబ్‌, కుతుబ్‌ షా పాలన ఎలా ఉండేది, అమాయక ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టారనేది టచ్‌ చేస్తూ ఈ మూవీని నడిపించారు. 

పేద ప్రజల శ్రమని దోచుకోవడం, దాన్ని వీర పాత్ర ఎదురించడం, సాధ్యమైనంత వరకు రాజుల వద్ద ధనం దొంగిలించి పేదవారికి పెడుతుంటాడు వీర. ప్రారంభంలో బ్రిటీష్‌ వారిని నుంచి డైమండ్స్ దొంగిలిస్తాడు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ సీన్‌ అదిరిపోయింది.

 యాక్షన్‌ సీన్లు అబ్బురపరిచేలా ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌కి మంచి ఇంట్రో అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా వచ్చే డైలాగ్‌లు తన రియల్‌లైఫ్‌ని, రాజకీయాలకు దగ్గరగా ఉంటాయి. జనసేనా డైలాగ్‌లను తలపిస్తాయి. ఔరంగజేబ్‌ క్రూరత్వాన్ని చూపిస్తూ, అనంతరం వీర వీరత్వాన్ని ఆవిష్కరిస్తూ సినిమా సాగుతుంది.

 స్థానిక రాజు వద్ద బంధీగా ఉన్న నిధి అగర్వాల్‌ని కలిసినప్పుడు లవ్‌ ట్రాక్‌ని పెట్టారు. అందులోనే కామెడీ మేళవించారు. సునీల్‌, నాజర్‌, సుబ్బరాజులతో కలిసి పవన్‌ చేసే ఫన్‌ నవ్వులు పూయించేలా ఉంటుంది. 

ఇక నిధి అగర్వాల్‌తో రొమాన్స్ కూడా ఆకట్టుకునేలా సరదాగా అనిపిస్తుంది. మంచి ఎంటర్టైనింగ్‌గా దాన్ని నడిపించారు. ఆ తర్వాత నగలు దొంగతనం చేసే క్రమంలో వచ్చే యాక్షన్‌ బాగుంది. ఇందులో నిధి ఇచ్చే ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. ఇంటర్వెల్‌లో కొహినూర్‌ కోసం డీల్‌ సెట్‌ కావడంతో ఈ సందర్భంగా పవన్‌, పులికి మధ్య వచ్చే సీన్లు గూస్‌ బంమ్స్ అని చెప్పాలి.

47
`హరి హర వీరమల్లు` మూవీలోని హైలైట్స్

సెకండాఫ్‌ లో కొహినూర్‌ కోసం బయలు దేరడం, వారి జర్నీని మెయిన్‌గా చూపించారు. ఆయా ఎపిసోడ్లు స్లోగా ఉంటాయి. అందులో పవన్‌ తన భావజాలం చెప్పే ప్రయత్నం చేశారు. తన డైలాగ్‌లతో, పాటలతో ఆ విషయాన్ని జోడించారు.

 `మాట వినాలి` పాట సమయంలో వచ్చే తోడేళ్ల ఎపిసోడ్‌ కూడా బాగుంది. అదే సమయంలో ఫన్నీగానూ ఉంది. ఇందులో రఘుబాబు, నాజర్‌ల కామెడీ బాగుంటుంది. అనంతరం ఎమోషనల్‌గా ఉంటుంది. 

ఓ పల్లెలో వర్షాలు లేక ఇబ్బంది పడటం, వీర మనుషులు వారికి దాహం, ఆకలి తీర్చడం, అనంతరం యజ్ఞం చేయడం, ఈ సందర్భంగా వచ్చిన సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. ఆ తర్వాత ఔరంగజేబ్‌ చౌకీబార్‌(సంత) ప్రాంతంలో వచ్చే ఎపిసోడ్‌, యాక్షన్‌ వేరే లెవల్‌లో ఉంటుంది.

 ఇందులోని పాట కూడా ఊపుతెచ్చేలా ఉంటుంది. క్లైమాక్స్ కిది లీడ్‌గా ఉంటుంది. అనంతరం క్లైమాక్స్ ఎపిసోడ్‌ని మాత్రం వేరే లెవల్‌లో డిజైన్‌ చేశారు. ఎవరూ ఊహించని విధంగా అది ఉంటుంది. అందులో చివరి సీన్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని బ్రిడ్జ్ సీన్‌ని గుర్తు చేస్తుంది. 

57
`హరి హర వీరమల్లు` మూవీలోని మైనస్‌లు

అయితే సినిమా ప్రారంభంలో హైప్‌ ఉన్నా, ఆ తర్వాత తగ్గిపోయింది. ఫస్టాఫ్‌లో నిధి అగర్వాల్‌ ఎపిసోడ్‌ అంతగా పండలేదు. సాగదీసినట్టుగా ఉంది. ఇక సెకండాఫ్‌లో వీరి కొహినూర్‌ జర్నీ కూడా టైమ్‌ పాస్‌గా ఉంటుంది. 

అందులో డ్రామా ఏమాత్రం రక్తికట్టలేదు. మరోవైపు పవన్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కూడా ఇరికించినట్టుగా ఉంది, ఇంకోవైపు హిందువులు అనే అంశాలు కాస్త ఇరికించినట్టుగా ఉన్నాయి. కథకి సెట్‌ కాలేదు. 

దీనికితోడు చాలా సీన్లు కట్ బై కట్ వస్తున్నట్టుగా ఉన్నాయి తప్పితే ఒక ఫీల్‌తో, ఎమోషన్‌తో క్యారీ అయినట్టుగా అనిపించలేదు. సినిమాలో ప్రధానంగా ఎమోషన్స్ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. భావోద్వేగాలు కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో చాలా సీన్లు తేలిపోయాయి.

 కాకపోతే యాక్షన్‌ సీన్లు హైలైట్‌గా నిలిచాయి. పవన్‌ మార్క్ యాక్షన్‌ సీన్లు ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటాయి. విజువల్స్ అదిరిపోయాయి. బీజీఎం సైతం బాగుంది. కాకపోతే ఔరంగజేబ్‌, వీరమల్లు మధ్య వారికి సంబంధించిన అసలు కథ రెండో పార్ట్ కి వదిలేయడం గమనార్హం. దీంతో ఒక అసంతృప్తి కలుగుతుంది.

67
`హరి హర వీరమల్లు` మూవీ నటీనటుల పర్‌ఫెర్మెన్స్

వీరమల్లు పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ బాగా చేశాడు. తనమార్క్ రొమాన్స్ తో అలరించడంతోపాటు కామెడీతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. యాక్షన్‌ సీన్ల కోసం ఆయన బాగా కష్టపడ్డారని అర్థమవుతుంది. ఆయా సీన్లలో ఆయన అదరగొట్టారు. 

మరోవైపు తాను చెప్పాలనుకున్న సందేశం కూడా బలంగా చెప్పాడు. పొలిటికల్‌ లక్ష్యాన్ని కూడా ఇందులో ఇన్‌ బిల్ట్ చేశారు. హిస్టారికల్‌ మూవీ కావడంతో పవన్‌ మార్క్ మాస్‌ ఫీల్‌ మిస్‌ అయినట్టుగా ఉంది. పంచమి పాత్రలో నిధి అగర్వాల్‌ బాగా చేసింది. 

ఆమెకి మంచి పాత్ర పడిందని చెప్పొచ్చు. ఆమె పాత్రలోని ట్విస్ట్ బాగుంది. ఇక ఔరంగజేబ్‌గా బాబీ డియోల్‌ బాగా సూట్‌ అయ్యారు, ఆయన కూడా అంతే బాగా చేశారు. కాకపోతే ఆయన పాత్రని ఇంకా చూపించాల్సింది. 

మరోవైపు రఘుబాబు, సునీల్‌, సుబ్బరాజు, నాజర్‌ పాత్రలు నవ్వులు పూయించేలా ఉంటాయి. ఇందులో `జాతిరత్నాలు` అనుదీప్‌ కూడా మెరవడం విశేషం. సత్యరాజ్‌, ఈశ్వరీరావు వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

77
`హరి హర వీరమల్లు` మూవీ టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం పెద్ద అసెట్‌. పాటలు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ట్రెండ్‌ అయ్యాయి. బిజీఎం విషయంలో చాలా కేర్‌ తీసుకున్నారు. చాలా కొత్తగా ఉంది. ఓకొత్త ఫీల్‌ని అందించింది. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. 

మనోజ్‌ పరమహంస, జ్ఞాన శేఖర్‌ కెమెరా వర్క్ సినిమాకి మరో అసెట్‌. విజువల్స్ మాత్రం వేరే లెవల్‌. సినిమా గ్రాండియర్ నెస్‌ని పెంచింది. వీఎఫ్‌ఎక్స్‌ కూడా అదిరిపోయాయి. కాకపోతే గుర్రాలపై వచ్చే సీన్లు, ఇంకా పలు సీన్లలో వీఎఫ్‌ఎక్స్ తేలిపోయాయి. 

ఆర్ట్ వర్క్ సినిమాలో మరే అసెట్‌. కెమెరా, ఆర్ట్ వర్క్ సినిమా గ్రాండియర్‌ని పెంచేశాయి. ఇక ఎడిటింగ్‌ పరంగా సహజత్వం మెయింటేన్‌ చేయాలి. చాలా సీన్లు కట్‌ కట్‌ అనేలా ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. ప్రతి ఫ్రేమ్‌ రిచ్ గా ఉంది. నిర్మాత ఏఎం రత్నం రాజీపడకుండా నిర్మించారని చెప్పొచ్చు. 

ఈ మూవీకి క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. డైరెక్షన్‌ పరంగా కథ బాగానే ఉంది. దాన్ని నడిపించే విషయంలోనే మరింత కేర్‌ తీసుకోవాల్సింది. మరింత గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయాల్సింది. 

జ్యోతికృష్ణ టేకింగ్‌ అదిరిపోయింది. దర్శకత్వం పరంగా చాలా బాగా చేశారు. సినిమాని బాగా డీల్‌ చేశారు. ఆయన వర్క్ సినిమాలో కనిపిస్తుంది. చాలా బాగా డీల్‌ చేశారు. టెక్నీషియన్‌గా తానేంటో నిరూపించుకున్నారు. సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్ లు కూడా ఆకర్షించేలా ఉన్నాయి. మొత్తంగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేసేలా ఈ మూవీ ఉంటుందని చెప్పొచ్చ.

ఫైనల్‌గాః ఫ్యాన్స్ కోసం పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్‌ ఫీస్ట్.

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories