Keerthy Suresh:కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రివ్యూ..!

First Published | Jan 28, 2022, 2:48 PM IST

 బాక్సాఫీస్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని సిట్యువేషన్ లో  రిలీజైన ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుంది, చిత్రం కథేంటి, కీర్తి సురేష్ కు హిట్ ఇచ్చిందా చూద్దాం.

Good Luck Sakhi


 కరోనా తో మార్కెట్లో చిత్రమైన పరిస్దితి నెలకొంది. థియేటర్లు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నా సినిమాల విడుదలకు నిర్మాతలు ఉత్సాహం చూపట్లేదు. కానీ  ఎన్నో వాయిదాల తర్వాత ‘గుడ్ లక్ సఖి’ టీం ధైర్యం చేసి ముందుకు వచ్చింది. సినిమా మీద ఉన్న నమ్మకం వల్లే ఈ ధైర్యం చేసేరా  లేక ఇలా సోలోగా రిలీజయ్యే అవకాశం మళ్లీ రాదనో థియోటర్లో దిగిపోయారు. ఏదేమైనా బాక్సాఫీస్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని సిట్యువేషన్ లో  రిలీజైన ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుంది, చిత్రం కథేంటి, కీర్తి సురేష్ కు హిట్ ఇచ్చిందా చూద్దాం.

కథ

తండా అమ్మాయి సఖి (కీర్తి సురేష్) అందగత్తే కానీ పాపం  బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ .  పుట్టి పెరిగిన ఊళ్లోనే నల్ల పిల్లి లైఫ్ అయ్యిపోతుంది ఈ తెల్ల పిల్ల జీవితం.  ఆమె  ఎదురు వస్తే ఏదో చెడు జరుగుతుంది అని పబ్లిసిటీ ఒకటి. ఆమెకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేసినా దురదృష్టం వెంటాడటంతో   విసిగిపోయారు ఫ్యామిలీ. ఈ క్రమంలో సఖి...ఎవరినీ పట్టించుకోని వ్యక్తిత్వం సంతరించుకుంటుంది. ఆమె కు గోలీలు అన్నా గురి చూసి కొట్టడమన్నా మహా ఇష్టం.


అదే ఊరి వాడైన గోలి రాజు (ఆది పినిశెట్టి) ఒక స్టేజ్ ఆర్టిస్ట్...ఆమె చిననాటి ప్రెండ్. గోలీ రాజుకు ఎప్పటికైనా సూపర్ స్టార్ అయ్యిపోతానని నమ్మకం. ఇక సూరి (రాహుల్ రామకృష్ణ) మరో చిననాటి స్నేహితుడు. అతనికి సఖి అంటే పడదు.

ఇక ఆ ఊరుకి.. రిటైర్డ్ కల్నల్ (జగపతి బాబు) తన సొంత ఊరైన ఆ మారుమూల పల్లెకు వస్తాడు. తన ఊళ్లో నుంచి కొంతమంది షార్ప్ షూటర్స్ ని తయారు చేయాలనుకుంటాడు. అప్పుడు ఆమెను గోలీరాజు కర్నల్ దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ కర్నల్ ఆమెను మట్టిలో మాణిక్యం లా భావిస్తాడు. 

Good Luck Sakhi


ఆమె టాలెంట్ చూసి మంచి స్దాయికి వెళ్తుందని అంచనా వేసి ట్రైనింగ్ ఇస్తాడు..రాష్ట్ర స్దాయి పోటీలకు పంపుతాడు. . ఈ క్రమంలో ఆమె దురదృష్టం ఆమెను వదిలేసిందా..లేక వెన్నెంటే ఉండి దెబ్బకొట్టిందా...ఆమె గుడ్ లక్ సఖి అని ఎలా అనిపించుకుంది, సఖి మీద ఎప్పటి నుంచో కన్నేసిన సూరి (రాహుల్ రామకృష్ణ) ఏం చేశాడు? గోలీరాజు తో ఆమె రిలేషన్ ఏమిటి.... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 
 

Good Luck Sakhi

 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్...

హీరోయిన్ ఓరియెంటెడ్ అదీ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలు మనకు తక్కువే. కీర్తి సురేష్ నటించటంతో ఈ సినిమాకు మంచి బజే క్రియేట్ అయ్యింది. అయితే సినిమా అంచనాలకు మరీ అట్టడుగున ఉంది.ఈ సినిమా చూస్తుంటే మనకు గతంలో శ్రీహరి చేసిన భద్రాచలం సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా చూస్తూంటే..అయితే అందులో ఉన్న జోష్, ప్రేరణ ఇచ్చే పాటలు, రేసీ స్క్రీన్ ప్లే ఇందులో కనపడదు. సాధారణంగా స్పోర్ట్స్ సినిమాలు ఎదుర్కొనే  పెద్ద సమస్య రొటీన్ ఫార్మెట్ స్క్రీన్ ప్లే. రొమాంటిక్ కామెడీలు ఎలాగైతే  clichés నిండిపోయి విసిగిస్తాయో....స్పోర్ట్స్ మూవీస్ కూడా సేమ్ టు సేమ్.

Good Luck Sakhi


ఈ రొటీన్ ట్రాప్ నుంచి బయిటపడి గొప్ప స్పోర్ట్స్ మూవీ రాయటం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ డ్రామాల్లో మొదట ఎదురయ్యేది అండర్ డాగ్ స్టోరీ.  ఓ అనామిక అట్టడగు స్దాయి వ్యక్తి అన్ని అడ్డంకులను దాటి విజయం సాధించటం ప్రధానాంశంగా ఉంటుంది. లేదా ఆ ప్లేస్ లో ఓ ఫెయిల్యూర్ టీమ్ ఉంటుంది.  ఈ సినిమా ఈ స్కీమ్ లోనే నడిచింది. దాంతో కాంప్లిక్ట్స్ ఉన్నట్లు అనిపించినా...ఊహకు అందే సీన్స్ వచ్చిపోతూంటాయి. అలాగే కాంప్లిక్ట్స్ క్యారక్టర్స్ ని డ్రైవ్ చేయగలగాలి. అది ఇక్కడ జరగలేదు.

Good Luck Sakhi


కీర్తి సురేష్ పాత్ర ప్లాట్ గా ఉండిపోతుంది. పరిస్దితులు అనుగుణంగా తన ప్రస్దానాన్ని కొనసాగిస్తుంది. సెకండాఫ్ లో కాసేపు తప్పించి ఎక్కడా చెప్పుకోతగిన ఛాలెంజ్ చేయదు. ఈ అడ్డంకులు అన్నీ దాటుకుని ఈ పాత్ర ఎలా గెలుస్తుందనే ఉత్సుకత ఆడియన్స్ లో క్రియేట్ చేయలేక చతికిలపడింది. అలాగని దర్శకుడు తక్కువ వాడా అంటే అక్కడ ఉన్నది నగేష్ కుకునూర్. ఇక్భాల్, డోర్ వంటి క్రిటికల్లీ ఎక్లైమెడ్ ఫిల్మ్ లు తీసినవాడు. అయినా స్క్రిప్టులో వచ్చిన సమస్యలను అధిగమించలేకపోయారు. సినిమా మొదలైన కాసేపటకే గ్రిప్ కోల్పోయాడు. బలహీన పాత్రలతో మరింత బలహీనమైన కథనంతో కుదైలైపోయింది స్క్రిప్టు. దాంతో ఆర్టిస్ట్ లు కూడా ఏ మాత్రం ఎనర్జీ లేకుండా అలా సాదాసీదాగా చేసుకుంటూ పోయారు. అయితే సహజంగా సినిమా అనిపించాలని రాసుకున్న కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. అవి తప్పిస్తే ఏముంది..అంటే ఏమీ లేదు. కీర్తి సురేష్ పాత్ర అయితే చాలా చైల్డిష్ గా ఉంటుంది.

Good Luck Sakhi


టెక్నికల్ ...

దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఇలాంటి మ్యూజిక్ అయితే ఆశించం.  'ఇంత అందంగా ఉంటుందా లోకం' పాట బావుంది. 'బ్యాడ్ లక్ సఖి' సాంగ్ ఓకే అన్నట్లుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. శ్రీకర్ ప్రసాద్ ..చాలా లేపేసి సాధ్యమైనంత బోర్ తగ్గించే ప్రయత్నం చేసారు. డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు.  డైలాగులు కొన్ని  బాగా పేలాయి. గ్రామీణ అమ్మాయిలు ఇంకా అలాగే ఉన్నారా అనిపిస్తుంది ఆ డ్రస్ లు, మేకప్ చూస్తే...మారిన గ్రామాలను పట్టుకోలేదు. ముప్పై ఏళ్ళ క్రితం గ్రామాలే మన సినిమాల్లో ఉంటున్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది. నగష్  డైరక్షన్ గురించి కొత్తగా చెప్పేదేముంది. స్క్రిప్టే ఆయనకు సహకరించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Good Luck Sakhi

నటీనటుల్లో...

కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ వీళ్ల చుట్టూనే కథ తిరుగుతుంది. కీర్తి సురేష్ అమాయకమైన విలేజ్ అమ్మాయిలా ...కొన్ని ఎక్సప్రెషన్స్ ఇచ్చింది. అవి బాగున్నాయి. ఆది పినిశెట్టి కు తగ్గ వర్త్ ఉన్న పాత్ర కాదు.  జగపతిబాబు పాజిటివ్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి పాత్ర. రాహుల్ రామకృష్ణ అలా తన స్టైల్ తో లాగేసాడు.
 

Good Luck Sakhi

ప్లస్ లు:
కీర్తి సురేష్
రన్ టైమ్ తక్కువకావటం
గ్రామీణ వాతావరణం తీర్చిదిద్దిన తీరు

మైనస్ లు:
 
రొటీన్ కథ,కథనం

ఫైనల్ థాట్

స్క్రిప్ట్ కూడా స్పోర్ట్స్ లాంటిదే ...అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నిర్ధాశ్రక్ష్యణంగా ఓడించేస్తుంది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

Good Luck Sakhi


ఎవరెవరు..

నటీనటులు: కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ సహ నిర్మాత: శ్రావ్యా వర్మ సమర్పణ: 'దిల్' రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
దర్శకత్వం: నగేష్ కుకునూర్
విడుదల తేదీ: జనవరి 28, 2022

Latest Videos

click me!