Hero Review:గల్లా అశోక్ 'హీరో' రివ్యూ

First Published | Jan 15, 2022, 2:45 PM IST

మహేష్ బాబు మేనల్లుడు...గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడే అశోక్ గ‌ల్లా. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జ‌య‌దేవ్ ఇంటి నుంచి అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమాతోనే ఏర్పాటైంది.
 

hERO MOVIE


తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వచ్చాడు. అతనే.. గల్లా అశోక్. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరోతను. ఆయన కుమార్తె పద్మావతి, అల్లుడు గల్లా జయదేవ్‌ల కొడుకే ఈ అశోక్. కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా ఘన వారసత్వంతోనే అతను హీరోగా అరంగేట్రం చేసాడు.   భ‌లే మంచి రోజు, శ‌మంత‌క‌మ‌ణి, దేవ‌దాస్ లాంటి విభిన్న చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య హీరో మూవీకి ద‌ర్శ‌కుడు కావ‌డం, దీని ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌టంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఇంట్రస్ట్ క‌నిపిస్తోంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి, కొత్త కుర్రాడు స్క్రీన్ ప్రెజన్స్ ఎలా ఉంది, వర్కవుట్ అయ్యే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

hERO MOVIE


కథ
 
అర్జున్ (అశోక్ గ‌ల్లా) కు సినిమా హీరో కావాలని ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో ట్రైల్స్ వేస్తూంటాడు. (వాళ్ల నాన్న మిడిల్ క్లాస్ నరేష్ మరి). తల్లి (అర్చన)ఇచ్చే ప్రోత్సాహంతో దూసుకుపోవాలని కలలు కనే అతని జీవితంలోకు సుభద్ర అలియాస్ సుబ్బు(నిధి అగర్వాల్) వస్తుంది. అందమైన అమ్మాయి కనపడితే  తెరపై జీవించటానికి ప్రాక్టీస్ కు పనికొస్తుందనో ఏమో కానీ..ఆమె వెనకబడి ప్రేమ పాఠాలు చెప్తూ, ప్రేమ గీతాలు పాడుతూంటాడు. అయితే ఆమె తండ్రి (జగపతిబాబు) ఇలా హీరో ట్రైల్స్ లో ఉన్న వాడికి తన కూతురుని ఇవ్వనని నో చెప్పేస్తాడు.  అయితే ఇలా కెరీర్ ,లవ్ స్టోరీతో స్ట్రగుల్ అవుతున్న  సమయంలో అతనికి పొరపాటున ముంబై లోని ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ స‌లీం భాయ్ (ర‌వికిష‌న్) కు చెందిన తుపాకీ తప్పుడు కొరియర్ అడ్రస్ వలన చేతికి వస్తుంది.


hERO MOVIE

వస్తే వచ్చింది గన్ ఏ బ్లాక్ మార్కెట్ లోనే అమ్మేయచ్చు. లేదా ఫ్యాషన్ గా దాచుకోవచ్చు. కానీ అలా కాదే.. తనకు తను ప్రేమించిన అమ్మాయి తండ్రిని చంప‌డానికి ఈ గన్ పంపారని తెలుస్తోంది. ఆ గన్ పంపిన వాళ్లు  ముంబై మాఫియా. వాళ్లు  హైదరాబాద్ రౌడీలకు సుపారీ అందిందని తెలుస్తుంది. అప్పుడు అర్జున్ ఏం చేసాడు. అసలు ఆ తుపాకీ అసలు ఎవరి చేతికి వెళ్ళాలి..? ఆ గన్ తో జరగాల్సిన మర్డర్ ఎవరిది..  ? మధ్యలో జగపతిబాబు పాత్ర ఏమిటి.. ? హీరో ఆ గన్ వచ్చిన దగ్గర నుంచి ఏ ఇబ్బందులు పడ్డాడు...చివరికి ఆ హీరో లవ్ స్టోరీ ఏమైంది, సినిమా ఆఫర్స్ వచ్చాయా..ముంబై మాఫియా మ్యాటర్ ఏంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

hERO MOVIE

ఎనాలసిస్ ...

స్క్రీన్ కు కొత్త హీరో లాంచింగ్ డైరక్టర్స్ కు ఎప్పుడూ టఫ్ జాబే. ఎందుకంటే లాంచింగ్  సినిమా అనగానే కెమెరా ముందు అతను ఎంత కంఫర్ట్ గా ఉన్నాడో అంచనా వేసుకుని అందుకు తగినట్లు వర్క్ ప్రారంబించాలి. అలాగే అతని బలహీనతలు,బలాలు స్టడీ చేసి వాటిమీదే ప్లే చేయాలి. అందులో భాగంగా స్క్రిప్టులో కొన్ని బెస్ట్ అనుకున్న ఎపిసోడ్స్ కూడా త్యాగం చేయాలి...మరికొన్ని యాడ్ చేయాలి. అలాగే వారసుడు అయితే మరో కష్టం. వారసత్వపు ఎలివేషన్స్ చూసుకోవాలి.  అతను వారసుడే అని ప్రేక్షకులకు గుర్తు చేసే సీన్స్ రాసుకుని తెరకెక్కించాలి. ఇలా డైరక్టర్ కు బోలెడు పని. అవన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చూసుకునే ఉంటారు. అందుకేనేమో తొలి చిత్రం ఏ యాక్షన్ థ్రిల్లరో లేక మాస్ మసాలా అనుకునో ముందుకు వెళ్ళకుండా ఫన్ పై ఎక్కువ ఆధారపడ్డారు. ఫన్ యూనివర్శల్ కాబట్టి...అక్కడ హీరోతో సంభందం లేకుండా జనం చూసేస్తారు. అలా మెల్లిగా హీరో అలవాటైపోతాడు. అలవాటైపోతే అందలం ఎక్కించటం ఎంతసేపు.

hERO MOVIE


స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.... క్రైమ్ కామెడీ జానర్ స్క్రీన్ ప్లే లో డిజైన్ చేసిన సినిమా ఇది. ఫన్ని క్యారక్టర్ రాయటం ఒకెత్తు...అలా కాకుండా మెయిన్  క్యారక్టర్ ని  సంభందం లేని క్రైమ్ లో ఇరికించి వినోదం చూడటం ఒకెత్తు. రెండో స్కీమే ఎంచుకున్నాడు డైరక్టర్.  అయితే హ్యూమర్ లో ఒరిజనాలిటీ ఎప్పుడూ క్యారక్టర్స్ ని ఫన్ని సిట్యువేషన్ లో పడేస్తేనే పుట్టదు. పాత్ర మోరల్ వ్యూ పాయింట్ ని సరిగ్గా ఎంచుకున్నప్పుడే పుడుతుంది. ఇలాంటి కథలకు స్ట్రాంగ్ ఓపినింగ్ ఎంత క్రూసియలో, ఫస్ట్ గ్యాగ్ కూడా క్రాకర్ లా పేలాలి. అప్పుడే చూస్తున్న జనం ఇందులో జెన్యూన్ ఫన్ ఉందని నమ్మి, మిగతా సినిమాని అదే యాంగిల్ చూసి ఆనందిస్తారు. ఈ సినిమా లో కొంతవరకూ అది సాధించారు. కానీ సంపూర్తిగా అయితే మాత్రం కాదు.

hERO MOVIE


ఫస్టాఫ్ లో అస‌లు క‌థే క‌నిపించదు. క్యారక్టర్స్ ఇంట్రడక్షన్, వాటి ప‌రిణామ క్ర‌మం త‌ప్ప‌. అయితే… ప్ర‌తీ స‌న్నివేశంలోనూ కామెడీ ట‌చ్ ఉంటుంది. మ‌రీ విర‌గ‌బ‌డి న‌వ్వేయ‌లేం కానీ.. ఆయా సన్నివేశాలు స‌ర‌దాగా సాగుతూ.. జోష్ ఇస్తాయ అదే ప్లస్ అయ్యింది.  ఇంట్ర‌వెల్ బ్యాంగ్ బాగుండు సెకండాఫ్ పై మ‌రిన్ని అంచ‌నాలు పెంచుతాయి. అయితే ఫస్టాఫ్ లో  హాస్యంపై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించిన డైరక్టర్ సెకండాఫ్ లో  డ్రామా వైపు  ప్ర‌ధానంగా దృష్టిపెట్టాడు. కొన్ని సీన్స్ లో  ఎమోష‌న్స్ పండినా… ఫీల్ మాత్రం పండ‌దు.కొత్త హీరోని ఇలాంటి కామెడీ సీన్స్ తో  తీర్చిదిద్దిన తీరు కొత్త‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని స‌న్నివేశాల్లో స్పీడు త‌గ్గ‌డంతోపాటు, బాగా సిల్లీగా అనిపిస్తాయి. ఒక్కోచోట  క‌థ‌ని సాగ‌దీసి, ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షించే ప్రయత్నం చేసారు. ఓ లైటర్ వీన్ కామెడీ ఫీల్ తో మొద‌లైన సినిమా..ఫుల్ కామెడీ సినిమాగా ముగిసినట్టు అనిపిస్తుంది. ఏదైమైనా తాను చెప్ప‌దల‌చుకున్న పాయింట్ ని  వినోదాత్మ‌క‌ంగా చెప్పటమే సినిమా వర్కవుట్ అవ్వటానికి  కారణమైంది.
 


ఫెరఫార్మెన్స్ వైజ్ చూస్తే..

 సినిమాను పెద్ద  ప్లస్ పాయింట్  హీరో, హీరోయిన్, మిగిలిన నటులు కాస్త ఫ్రెష్ గా వుండి ఈజ్ తో లాక్కెళ్లటమే. యాక్షన్ సినిమానో,లవ్ స్టోరీనో  అంటూ  కథ తయారు చేసుకుని వుంటే వేరుగా వుండేది. కొత్త కుర్రాడితో చేసిన ఈ సినిమా యూత్ సినిమా బదులు కామెడీ సినిమా చూసినట్లే వుంది. ఇక గల్లా అశోక్ విషయానికి వస్తే డాన్స్ లు,ఫైట్స్ లో మంచి ఈజ్ కనపరిచాడు. ఇంక నటన లో నలగటమే కావాల్సింది.   పాన్‌ ఇండియా స్టార్‌ అనే కాన్సెప్ట్ తో బ్రహ్మాజీ రోల్‌ ఎంట్రీ  అవుతుంది. ఇండియాలో మనమేగా  ఫస్ట్ అంటూ ఆయన చేసే  కామెడీ బాగుంది.


టెక్నికల్ గా ..

సినిమాకు ఖర్చు బాగా చేసారు. పాటలు సోసో గా ఉన్నాయి. కానీ టెక్నికల్ వాల్యూస్ బాగానే వున్నాయి. కొత్త హీరో నటనలో ఈజ్ ఉంది కానీ ...కథలో ఎక్సప్రెషన్స్ విషయంలో మాత్రం ఓకె అనిపించుకుంటాడు. జగపతిబాబు కూడా ఓకె. కథలో దమ్ము లేకపోవడం, నెరేషన్  సోసోగా ఉండటం, కొన్ని చోట్ల నెమ్మదించడం, చాలా చోట్ల రొటీన్ అనిపించుకోవడం జరిగినా, ఫన్ తో కొట్టుకుపోవటం,, అన్నింటికి మించి ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ కామెడీ ఎపిసోడ్స్ ఉండటం హీరోని చూడదగ్గ సినిమాగా మార్చేసాయి. డైరక్టర్ విషయానికి వస్తే అతను గతంలో చేసిన సినిమాలు ఇదే జానర్ లో నడిచినవే. ఇందులో ముంబై డాన్ బ్యాక్ డ్రాప్ ఉండటంతో స్టైలిష్ గా,slick మేకింగ్ తో నడిపే అవకాసం వచ్చింది. ఇంటర్వెల్, క్రైమాక్స్ లు విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకున్నాడు. డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా రేసిగా నడవటానికి సహకరించింది.

 
పాజిటివ్ లు:

 రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
కొత్త హీరో డీసెంట్ ఫెరఫార్మెన్స్
మ్యూజిక్
క్లైమాక్స్ లో బ్రహ్మాజీ ఫన్

నెగిటివ్ లు:
డల్ గా సాగే
కాంప్లిక్ట్ పాయింట్ ఎఫెక్టివ్ గా లేకపోవటం
సిల్లీగా సాగే సీన్స్


ఫైనల్ థాట్

----సూర్య ప్రకాష్ జోశ్యుల

హీరో లాంచింగ్ కామెడీగా కూడా చేయచ్చు. కాకపోతే రిజల్ట్ కామెడీిగా లేకుండా చూసుకోవాలి

Rating:2.5

hERO MOVIE

ఎవరెవరు...

 నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, రవికిషన్, స‌త్య‌, 'వెన్నెల' కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: ఎ. రామాంజనేయులు
ఎడిట‌ర్‌: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
సంగీతం: జిబ్రాన్
నిర్మాణ సంస్థ‌లు: అమర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నిర్మాత: పద్మావతి గల్లా
క‌థ‌, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య .టి
విడుదల తేదీ: 15-11-2022

Latest Videos

click me!