ఉపేంద్ర “కబ్జా” మూవీ రివ్యూ & రేటింగ్

First Published | Mar 17, 2023, 2:14 PM IST

స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు కొడుకు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌ర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడ‌నే క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

Kabzaa Movie Review


ఉపేంద్ర హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన చిత్రాలు ఇక్కడ కూడా సెన్సేషన్ హిట్ అయ్యాయి. A,ఓం, ఉపేంద్ర వంటి సినిమాలు కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయాయి. మధ్య మధ్యలో వచ్చిన మరిన్ని సినిమాలు సైతం బాగానే ఆడాయి. అయితే ఈ మధ్యన ఆయన తెలుగులో  ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గని’ వంటి చిత్రాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఆ తర్వాత ఆయన స్పీడు తగ్గించారు. అయితే తాజాగా ఈ కబ్జా చిత్రం టీజర్ వచ్చి ఆశ్చర్యపరిచింది. కేజీఎఫ్ పోలికలతో ట్రైలర్ వచ్చినా మంచి ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా..అసలు ఈ కబ్జా కథేంటి..చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Kabzaa


స్టోరీ లైన్: 

1947 నుంచి 1984 కాలంలో నడిచే ఈ కథని సిటీకి కొత్తగా వచ్చిన భార్గవ్ భక్షి(కిచ్చా సుదీప్) పాయింటాఫ్ వ్యూలో నేరేట్ చేస్తూంటారు. అప్పట్లో ఆర్కేశ్వర్(ఉపేంద్ర) అనే డాన్ ఉన్నాడని, అతను మాములు వాడు కాదని చెప్పటం మొదలెడతాడు. ఉత్తర భారతదేశంలో సంగ్రామ్ అనే గ్రామంలో పుట్టి పెరుగుతాడు అర్కేశ్వర్ (ఉపేంద్ర).. స్వాతంత్ర్య యోధుడైన తన తండ్రి చనిపోవడంతో సౌత్ ఇండియాలోని అమరాపురానికి చేరుకుంటాడు.  చిన్నప్పటి నుంచి భయస్థుడైన అర్కేశ్వర్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగంసాధిస్తాడు. అలాగే అమరాపురం యువరాణి మధుమతి (శ్రియ) తో అర్కేశ్వర ప్రేమలో పడతాడు. కానీ అమరాపురం మహారాజు  వీర బహదూర్ (మురళీ శర్మ) కు తన కూతురు మధుమతిని అర్కేశ్వరకు ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం ఉండదు. తన కూతురుకి  రాజ కుటుంబంలోని వ్యక్తితోనే పెళ్లి చేయాలనుకుంటాడు. ఇదిలా జరుగుతూండగా....అనుకోని పరిస్థితుల్లో  అర్కేశ్వర కత్తి పట్టి డాన్ గా మారాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది?  ఆర్కేశ్వర్ కత్తి పట్టడానికి కారణం ఏమిటి...ఈ కథలో   శివరాజ్ కుమార్‌ల పాత్ర  ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


Kabzaa Trailer

విశ్లేషణ: 

గత కొంతకాలంగా కన్నడ సినిమా కొత్త వెలుగు మొదలైంది. ఇండియా మొత్తం కన్నడ పరిశ్రమ గురించి మాట్లాడుతోంది.   KGF, కాంతారా, 777 చార్లీ లు ట్రెండ్ సృష్టించాయి.  వీళ్లందరిలోకి రాకీ భాయ్  స్పెషల్ గా నిలబడి ఎంటర్టైన్మంట్ పంచాడు. అయితే మన పరిశ్రమలలో ఉన్న సమస్య ఏమిటంటే...హిట్ కు చవకబారు అనుకరణ. ఈ సారీ అదే జరిగింది. కేజీఎఫ్ ని మళ్లీ తీయాలనుకున్నారు. అలాంటి సక్సెస్ ని రీక్రియేట్ చేయాలనుకుంటే ఎప్పుడూ సమస్య రాదు. అది పద్దతి కూడా కానీ అదే సినిమాని మళ్లీ తీయటమెందుకు. ఒరిజనల్ మార్కెట్ లో దొరుకుతుంటే డూప్లికేట్ కు విలువేది. ఉపేంద్ర వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, కిచ్చా సుదీప్ వంటి సూపర్ స్టార్ కూడా ఈ కేజీఎఫ్ మాయలో పడి బయిటకు రాలేకపోయారు. మరో భాయ్ ని తెరపై లాంచ్ చేసి దేశవ్యాప్తంగా కలెక్షన్స్ కుమ్మేయాలనుకున్నారు. కానీ చూసి వారి పరిస్దితి వేరే విధంగా ఉంది.  

Kabzaa


ఎందుకంటే అనుకరణ మాయలో పడి ఒరిజనల్ ని వదిలేసారు. కథ అనేదే లేకుండా చేసుకున్నారు. కేవలం సీన్స్ తో నెట్టుకొద్దామనుకున్నారు. అయితే కేజీఎఫ్ ని మర్చిపోయిన చాలా కాలం తర్వాత ఈ సినిమా తీసి ఉంటే మ్యాజిక్ జరిగేదేమో. కానీ కేజీఎఫ్ వచ్చి ఎంతో కాలం అవ్వలేదు. ఒక అమాయకుడు, నీతిమంతుడు ..ప్రపంచంలోని దుర్మార్గులకు ఎదురెళ్లి..వాటిని ఎదుర్కొవటానికి తాను ప్రపంచం భయపడే రాక్షసుడుగా మారాలనుకోవటం కొత్తేమీ కాదు. అయితే గొప్పగా చెప్పవచ్చు ఈ పాయింట్ ని గతంలో చాలా మంది దర్శకులు ప్రూవ్ చేసారు. అందుకు కేవలం ఎడిటింగ్, వేళ్లు కూడా కదపకుండా కురిపించే బుల్లెట్ల సాయిం తీసుకుంటే చేసేదేముంది. ఇక ఈ సినిమాలో చాలా పాత్రలు భయపెట్టాలా డిజైన్ చేసారు. కానీ ఇప్పటికే వచ్చేసిన చాలా సినిమాలలో గ్యాంగస్టర్ పాత్రలకు స్పూఫ్ లా  మరో యాంగిల్ లో మనకు దర్శనమిస్తూంటాయి.  విలన్స్ క్రూరంగా ఉన్నా సరే కొన్ని సార్లు నవ్వు వచ్చేలా చేస్తున్నారంటే అంతకు మించి చెప్పుకునేదేముంది?

Kabzaa


సాంకేతిక విషయాలకి వస్తే..

పూర్తి స్దాయిలో పైనే చెప్పుకున్నట్లు స్క్రిప్టు లోపంగా రెడీ అయ్యింది.  ‘కేజీఎఫ్’నే అనుకరించారు కానీ... ‘కబ్జా’లో ఆ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు. అలాగే చాలా కన్ఫూజ్ గా కథలో పాత్రలు తెర మీదకు వస్తూంటాయి.  కేజీఎఫ్ మాదిరిగానే  విలన్ పాత్రలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ల పేర్లు మరింత కన్ఫ్యూజ్ . ఇక దర్శకత్వం విషయానికి చాలా ఎక్కడా పాయింటాఫ్ ఇంట్రస్ట్ కూడా ఉండదు. విజువల్స్ ...రక్తపాతం, అరుపులుతో నిండిపోయి ఉండాయి. ఎంత మంది జనాలని చంపినట్లు చూపితే అంత పెద్ద గ్యాంగస్టర్ అన్నట్లు డైరక్టర్ భావించినట్లు ఉన్నారు. అదే తెరపై మనకు కనపడుతుంది. ఎమోషన్ లేని రక్తపు చక్కుకు విలువ ఉండదు.  ఇక సంగీతం అయితే చెవుల్లో పెద్ద శబ్దాలు పోస్ట్ చేస్తున్నట్ల ఉంటుంది. 
 

కాస్ట్యూమ్స్, ఆర్ట్, ప్రొడక్షన్ డిపార్టమెంట్ లు అన్ని చాలా అబ్సర్డ్ గా అనిపిస్తూంటాయి. శ్రియ మేకప్ కూడా చాలా వింతగా అనిపిస్తుంది. ఎక్కడా పొరపాటున కూడా కనెక్ట్ కానివ్వరు. ఫైట్స్ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. నిర్మాత మాత్రం బాగా ఖర్చు పెట్టారని మాత్రం అర్దమవుతుంది. కేజీఎఫ్ లాభాలు కళ్ల ఎదురుగా ప్రతీ క్షణం కనపడేలా చేసి ఉంటారు. అయితే ఇంత నెగిటివ్ లోనూ గొప్ప పాజిటివ్ ఎలిమెంట్ మాత్రం సినిమాటోగ్రఫీ.ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగా డిజైన్ చేసారు. ఇలాంటి సినిమాలను అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దారణం. అయితే డైరక్టర్ క ఎంత ధైర్యం కాకపోతే  క్లైమాక్స్ ఫైట్ మధ్యలో ఆపేసి పార్ట్ 2 లో మిగతాది చూడమన్నాడు. ఇప్పుడు పార్ట్ 2 ని ఈ రిజల్ట్ చూసి తీస్తారో లేదో..అప్పటిదాకా ఈ సస్పెన్స్ భరిస్తూ వెయిట్ చేయటం ఎలా...?

kabzaa release date announced upendra kiccha sudeepa

 
నటీనటులు విషయానికి వస్తే...

ఉపేంద్ర గొప్ప నటుడు అందులో తిరుగులేదు. ఆయన చాలా సార్లు స్టన్నింగ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటారు కానీ డైరక్టర్, డైలాగులు, సీన్స్ అవి పడనివ్వవు. సుదీప్, శివరాజ్ కుమార్ ఇద్దరి గెస్ట్ రోల్స్ ఉన్నంతలో మంచి రలీఫ్. శ్రియ జస్ట్ ఓకే.  మురళీశర్మ, సుధ వంటి ఆర్టిస్ట్ ల వల్ల కూడా ఒరిగింది ఏమీ లేదు.

kabzaa


ప్లస్ లు

సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్
ఉపేంద్ర నటన

మైనస్ లు 
డైరక్షన్
కేజీఎఫ్ కు బాగా దారుణమైన అనుకరణ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
   

Kabzaa upendra shriya sharan


ఫైనల్ థాట్

ఐడియా కబ్జా చేసినంత ఈజీ  కాదు...ప్రేక్షకుల మనస్సులు కబ్జా చేయటం

అయినా  హిట్ సినిమా సోల్ తీసుకోవాలి కానీ తోలు తీసుకోకూడదు. తీసుకుంటే ఇలా చూసేవారి తోలు ఒలిచేస్తుంది.

Rating:2
--సూర్య ప్రకాష్ జోశ్యుల
 

నటీనటులు : ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ, సుధ, మురళీ శర్మ త‌దిత‌రులు  
సినిమాటోగ్రఫీ:అర్జున్ శెట్టి
సంగీతం : రవి బస్రూర్
నిర్మాత‌లు : ఆనంద్ పండిట్, ఆర్. చంద్రు, అలంకార్ పాండియన్
రచన, ద‌ర్శ‌క‌త్వం : ఆర్. చంద్రు
విడుదల తేదీ : మార్చి 17, 2023 
 

Latest Videos

click me!