'భార‌తీయుడు 2' మూవీ రివ్యూ , రేటింగ్‌

First Published | Jul 12, 2024, 1:37 PM IST

 సేనాపతి మళ్లీ ఎందుకు వచ్చాడు.  వచ్చి ఏం చేశాడు? లంచగొండితనం, అవినీతి మీద భారతీయుడు ఈ సారి కొత్తగా చేసిన  పోరాటం ఏంటి?  

Bharateeyudu 2


పాతికేళ్ల క్రితం వచ్చిన 'భార‌తీయుడు ' కు ఇప్పటికే ఎంత క్రేజ్ అంటే భారీ బడ్జెట్ తో ఇన్నాళ్లు తర్వాత సినిమా తీసేటంత. అయితే ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పటికి శంకర్ కు సీక్వెల్ ఐడియా తట్టి ఉండచ్చు లేదా కమల్ ఒప్పుకుని ఉండచ్చు. ఎలా జరిగినా  'భార‌తీయుడు 2' వచ్చాడు. అయితే అప్పటికి ఇప్పటికీ లంచం అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్టే. అయితే లంచం తీసుకునే తీరు మారింది. క్విక్ అండ్ ప్రో వంటివి రకరకాలు వచ్చేసాయి. మారిన ప్రపంచానికి అణుగుణంగా  'భార‌తీయుడు 2'ఉన్నాడా లేక అప్పటి కాలంలోనే ఆగిపోయాడా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

Bharateeyudu 2 Review


కథేంటి

అరవింద్ (సిద్దార్థ్) తన స్నేహితులుతో కలిసి  బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతూంటాడు. ఆ యూట్యూభ్ ఛానెల్ సాయింతో .. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు  వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూంటాడు.  చాలా మందిని రెడ్ హ్యాండెండ్ గా పట్టించగలుగుతారు. ఈ క్రమంలో ఈ టీమ్ కు చాలా మంది శత్రువులు పోగవుతారు. టీమ్ ని ఇబ్బందులు పెడుతూంటారు. తమ శక్తి సరిపోవటం లేదని టీమ్ కు అర్దమవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద అధికారులు, పోలీసులు అరవింద్ ,అతని టీమ్ పై పగపెడతారు. పొగ పెడుతూంటారు. ఇలాంటి సమయంలో తమకో శక్తి అవసరం అని భావిస్తారు. అది సేనాపతి  అని అర్దం చేసుకుంటారు. 
 

Latest Videos


Bharateeyudu 2 Review

 సేనాపతిని రప్పించటం కోసం   'కమ్ బ్యాక్ ఇండియన్' అంటూ హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తారు. ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అది ఎక్కడో   చైనీస్ తైపీలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రంలో ఉన్న సేనాపతి ని చేరుతుంది. తన అవసరం ఉందని గ్రహిస్తాడు. ఆయన ఇండియాకు తిరిగి రావడానికి డిసైడ్ అవుతాడు. అలా మనదేశంలో అడుగుపెట్టిన సేనాపతి ఇప్పటి కాలంలో అవినీతికి ఎలా చెక్ చెప్తాడు.   సేనాపతిని పట్టుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్న  సీ.బి.ఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) సక్సెస్ అయ్యాడా... ఇక్కడ భారత్ లో ఇప్పటి  పరిస్దితులకు భారతీయుడు ఎలా స్పందిస్తాడు. ఆయన వచ్చాక వచ్చిన మార్పులు ఏమిటి..ఎదురైన ఛాలెంజ్ లు ఏమిటి..వాటిని ఎలా ఎదుర్కొన్నాడు..చివరకు సేనాపతి  ని  గో బ్యాక్ ఇండియన్' అంటూ రాళ్లతో, చీపుళ్లతో కొట్టే  పరిస్దితి ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి. సినిమా చూసినా తెలియకపోతే “భారతీయుడు 3” వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. 

Bharateeyudu 2 Review

విశ్లేషణ

కొన్ని సినిమాలు ఎంత కాలం అయినా గుర్తుండిపోతాయి. వాటిలో కంటెంట్, క్యారక్టర్స్, గెటప్స్, పాటలు ఇలా ఏదో ఒకటి ఎప్పుడో అప్పుడు గుర్తుకు వచ్చి ఆ సినిమాలను సజీవంగా ఉంచుతూంటాయి. అప్పుడే ఆ సినిమాకు సీక్వెల్ తీసి సొమ్ము చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి సినిమానే   'భార‌తీయుడు ' . స్వతంత్ర సమరయోధుడు అయిన సేనాపతి (కమల్ హాసన్) సమాజంలోని అవినీతి మూలాలు ని,  లంచగొండుల్ని ఏరిపారేయటం చాలా మందికి నచ్చింది. ఈక్రమంలో తన కొడుకు చందు (యంగ్ కమల్ హాసన్)ని కూడా వదిలిపెట్టకపోవటం గొప్ప డ్రామాకు తెరతీసి సినిమాని ఎవర్ గ్రీన్ గా చేసింది. ఇంక పాటలు గురించి అయితే చెప్పక్కర్లేదు. ఏ ఆర్ రహ్మాన్ స్వరపరిచిన ఆ పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినపడుతూంటాయి. అలాంటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేసారంటే  ఖచ్చితంగా వెళ్లి చూడాలనిపిస్తుంది. అయితే చిత్రంగా ఈ సినిమాకు అంత సీన్ లేదు.

Bharateeyudu 2 Review


సీక్వెల్ ని రెండు పార్ట్ లుగా విభజించి భారతీయుడు -3కు మరో తాను ముక్కను దాయటంతో ఈ పార్ట్ కేవలం కథా నేఫధ్యం, సెటప్ కే సరిపోయింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంటర్వెల్ దాకా కథ చెప్పి వదిలేసినట్లు అన్నమాట. దాంతో ఆ తర్వాత ఏమైందో తెలియదు. తర్వాత పార్ట్ లో చూసుకుందామన్నారు. అయితే ఈ పార్ట్ చూసాక తర్వాత పార్ట్ చూస్తారనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇందులో భారతీయుడు పాత్ర ...మొదటి పార్ట్ లో లాగానే రకరకాల వేషాలు మార్చుకుంటూ ఫైట్స్ చేస్తూ ఉంటుంది. అవతలి వాళ్ల పాపాల చిట్టా విప్పుతూ భారీ డైలాగులు చెప్తుంది. 
 

Bharateeyudu 2 Review


డైరక్టర్ శంకర్ ....అప్పటి సినిమాకు సీక్వెల్ చేస్తున్నారనుకున్నారే కానీ మొదటి పార్ట్ కు రెండో పార్ట్ కు మధ్య చాలా ఏళ్లు గ్యాప్ ఉందనే విషయం మర్చిపోయినట్లున్నారు. అప్పటి నేరేషన్ ఇప్పుడు వర్కవుట్ కావటం లేదు. మారిన జనాలకు సరపడ మారిన స్క్రీన్  ప్లేని అనుసరించలేదు.  అయినా భారతీయుడు అంటే మర్మ కళను బ్రాండ్ అంబాసిడర్ ...అతను  చైనీస్ కుంఫూ మాస్టర్ తరహా ఆహార్యంతో ఇంట్రడక్షన్ ఇవ్వటమేంటో కొరుకుడు పడదు. ఫస్టాఫ్ ఏదో నడిచిపోతుంది. ఓకే అనుకుంటాం. సెకండాఫ్ మీద ఆశలు పెట్టుకుంటే అదీ టీవి సీరియల్ లాగ సాగుతుందే తప్పించి ఎంతకీ ఓ కొలిక్కి రాదు. మూడో పార్ట్ కోసం మొత్తం కథ దాచి పెట్టినట్లున్నారు. ఈ పార్ట్ లుగా వచ్చే సినిమా కథలన్నీ పార్ట్ లు సరిగ్గా అమరని వెహికల్స్  లాగనే ఉంటున్నాయి. సీట్ ఉంటే చక్రం ఉండదు. అవి రెండూ ఉంటే బాడీ ఉండదు అన్నట్లు తయారవుతున్నాయి. ఈ క్రమంలో కథకు అవసరమైన ఎమోషన్స్ మిస్ అవుతున్నాయి. కథే పూర్తిగా అర్దం కావటంలేదు. సీరియల్ సగం అయ్యి మరుసటి రోజు కోసం వెయిట్ చేసేలాగ ఉంటున్నాయి. 
 

Bharateeyudu 2 Review


ఎవరెలా చేసారు

వయస్సుతో సంభంధం లేకుండా కమల్ కష్టపడే తీరు, అన్నేసి గంటలు మేకప్ వేయించుకుని నటించే విధానం ముచ్చట వేస్తుంది. ఈ సినిమాలో ఆరేడు గెటప్ లలో కనిపిస్తారు. అయితే అన్ని మెప్పించలేకపోయారు. అలాగే కమల్ కే సాధ్యమైన కొన్ని ఎమోషన్స్ కు సినిమాలో స్దానం లేదు. ఇక సిద్దార్ద్ మంచి ఈజ్ ఉన్న ఆర్టిస్ట్. రకుల్ ప్రీతి కూడా లెంగ్త్ తక్కువైనా బాగా చేసింది. ప్రియ భవాని శంకర్ క్యారక్టర్ పెద్దదైనా  తన ముద్ర వేయలేకపోయింది. అనేకమంది సీనియర్స్ ఉన్నారు. తమదైన స్దాయిలో చేసుకుంటూ పోయారు. ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునే సీన్స్ అయితే ఏమీ లేవు.

Bharateeyudu 2 Review


టెక్నికల్ గా చూస్తే

శంకర్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అలాగే యాక్షన్ బ్లాక్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. అయితే  యాక్షన్ ని చాలా చోట్ల లాగారు . కానీ కొన్ని ఫైట్స్ అదిరిపోయాయి.   రవి వర్మన్ సినిమాటోగ్రఫీ సినిమాని నెక్ట్స్ లెవిల్ లో తీసుకెళ్లింది. అయితే ఎక్కువ ఎక్సెపెక్ట్ చేసిన అనిరిధ్ మాత్రం ఎక్కువ నిరాశపరిచాడు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి. సాంగ్స్ వినటానికి గొప్పగా లేకపోయినా చూడ్డానికి కనులు విందుగా ఉన్నాయి. మూడు గంటల రన్ టైమ్ ని రెండున్నర కుదిస్తే బాగుండేదేమో.

డైలాగులు మాత్రం డబ్బింగ్ లాగ అనిపించలేదు. హనుమాన్ చౌదరి  చాలా బాగా రాసారు. 

ప్లస్ లు 
కమల్ హాసన్

గ్రాండియర్ గా వేసిన సెట్స్ 


మైనస్ లు 

కథ, కథనం
అనిరిధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎమోషన్ కనిక్టివిటీ లేకపోవటం
రన్ టైమ్

Kamal Haasans Bharateeyudu 2


ఫైనల్ థాట్

ఒక పార్ట్ లో చెప్పిన  కథలే కాస్త బిగిన్,మిడిల్ ,ఎండ్ ఉంటున్నాయి. మరో పార్ట్ కోసం ఎదురుచూసే కథలు అర్దాంతరంగా ముగిసి విసిగిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ సినిమానే. మరో పార్ట్ పెట్టుకోకండా మొత్తం కథని ఈ సీక్వెల్ లోనే చెప్పేస్తే ఖచ్చితంగా బాగుండేదనిపిస్తుంది.
-----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5

ఎవరెవరు...


న‌టీన‌టులు: క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు.

స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌ 
మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌ 
ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
 సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌ 
ఆర్ట్‌: ముత్తురాజ్‌ 
స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌ 
డైలాగ్ రైట‌ర్‌: హ‌నుమాన్ చౌద‌రి, 
విఎఫ్‌ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌
 కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌,
 పాట‌లు: శ్రీమ‌ణి, 
సౌండ్ డిజైన‌ర్‌: కునాల్ రాజ‌న్‌, 
మేక‌ప్ : లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, 
కాస్టూమ్ డిజైన్‌: రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి సాయి, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుంద‌ర్ రాజ్‌, 
హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జికెఎం త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌: సెన్‌బ‌గ మూర్తి
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌
 నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌
 రిలీజ్ డేట్: 2024-07-12

click me!