రవిబాబు 'రష్' ఓటీటీ రివ్యూ..

First Published | Jun 22, 2024, 4:17 PM IST

అల్ల‌రి రవిబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించిన‌ చిత్రం ర‌ష్ మూవీ. 

Rush Movie


మొదటి నుంచీ డైరక్టర్ రవిబాబుది ఓ డిఫరెంట్ స్కూల్. ముఖ్యంగా థ్రిల్లర్స్ తీయటంలో అందెవేసిన చెయ్యి. అయితే ఆయన ఈ మధ్యకాలంలో వెనకబడ్డారు. ఒకప్పుడు 
  'అనసూయ', 'అమరావతి', 'అవును', 'అవును 2' అదరకొట్టిన ఆయన అడపదడపా వేషాలు వేసుకుంటూ కనపడుతున్నారు. అయితే ఆయన గ్యాప్ తీసుకుని ఈటీవి విన్ కోసం ఓ సినిమా రెడీ చేసి అందించారు. డైరక్టర్ వేరే అయినా కథ ఇచ్చి ప్రధాన పాత్రలో కనిపించారు. ఇంతకీ ఈ సినిమా రవిబాబు గత చిత్రాలను గుర్తు చేసిందా. మళ్లీ రవిబాబు వరస సినిమా తీస్తే బాగుంటుంది అనిపించిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

కథేంటి


 భార్యాభ‌ర్త‌లైన కార్తీక (డైసీ బోప‌న్న‌), ఆదిత్య (కార్తీక్ ఆహుతి) హ్యాపీ లైఫ్ అనుభవిస్తూంటారు. సిటీలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న వీరికి ఇద్ద‌రు సంతానం రిషి - రియా.  ఒక రోజున ఆఫీసుకి వెళ్లిన ఆదిత్యకి ఓ షాకింగ్ కాల్ వస్తుంది.  వాళ్ల స్థలాన్ని ఎవరో కబ్జా చేస్తున్నారనేది ఆ కాల్ లో తెలుస్తుంది.  దాంతో హడావిడిగా కార్లో బయిలుదేరిన ఆదిత్య ప్రమాదానికి గురవుతాడు. దాంతో కంగారుపడ్డ కార్తీక ...హాస్పటిల్ కు ట్రీట్మెంట్ కోసం డబ్బు ట్రాన్సఫర్ చేస్తూ అక్కడకి బయిలుదేరుతుంది. 
 

Latest Videos


Rush movie


పిల్లలతో కలిసి కారులో వెళ్తున్న ఆమెకు మధ్యలో నలుగురు బైరర్స్ తో గొడవ అవుతుంది. దాంతో వాళ్లు ఆమెను బెదిరిస్తూ వెంటపడుతూంటారు. అయితే ఈ క్రమంలో ఆమె వల్ల వాళ్లు గాయపడతారు. అయితే వాళ్లు నలుగురు లోకల్ రౌడీ నర్శింగ్ మనుష్యులు. దాంతో నర్శింగ్ కు విషయం తెలిసి సీన్ లోకి వస్తాడు. కార్తీక కుమారుడిని న‌ర్సింగ్‌ కిడ్నాప్ చేస్తాడు. కొడుకు కావవాలంటే పోలీస్ స్టేష‌న్‌ ఎవిడెన్స్ రూమ్ లో  ఉన్న ఓ బ్యాగ్ త‌మ‌కు కావాల‌ని డిమాండ్ చేస్తాడు నర్సింగ్. 

Rush movie


అదే సమయంలో  బైకర్స్ గాయపడిన ప్రదేశానికి పోలీస్ ఆఫీసర్ శివ ( రవిబాబు) చేరుకుంటాడు. ఒక స్త్రీ  తమను కారుతో డ్యాష్ ఇచ్చేసి పోయిందని ఆ బైకర్స్ చెబుతారు. దాంతో ఆమెను ఫాలో చేస్తాడు శివ. ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి డ్యూటీలో ఉన్న వాళ్ళతో దెబ్బలాటి ఆ హార్డ్ డిస్క్ తీసుకుని బయిలుదేరుతుంది. స్టేషన్ కు వచ్చిన శివ...సిసిటీవి ఫుటేజ్ లో ఆమెను చూసి షాక్ అవుతాడు. అసలు హార్డ్ డిస్క్ లో ఏముంది. కార్తీక ఎవరు. ఆమెను చూడగానే శివ ఎందుకు షాక్ అయ్యాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Rush movie

ఎలా ఉంది

ఇది కాన్సెప్టు ఓరియెంటెడ్ క్రైమ్ కథ. కథను ఫాలో అవుతూ చూసుకుంటూ వెళ్లటమే. ఏదో క్రైమ్ నవల చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. మలుపులు కొన్ని బాగుంటాయి. కొన్ని ప్రెడిక్ట్ చేసేస్తాం. అయితే చాలా తక్కువ  బడ్జెట్ లో చుట్టేసిన వ్యవహారంలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడా క్వాలిటీ అనేది కనపడదు. సాధారణంగా బ్రతికే ఓ అమ్మాయికు భాషాలాంటి ప్లాష్ బ్యాక్ ఉంటే ఎలా అనే  పాయింట్ చుట్టూ కథ అల్లారు కానీ అందుకు తగ్గ నేపధ్యం కరెక్ట్ గా సెట్ చేయలేకపోయారు. అలాగే మొదట్లో ఏదో చూడబోతున్నాం అనే ఉత్సుకత కనిపించినా రాను రాను అది తగ్గిపోతూ వచ్చింది. థ్రిల్లర్ లక్షణాలు అంటే కేవలం ట్విస్ట్ ఉంటే సరిపోదనుకున్నారు. కానీ దాన్ని థ్రిల్లింగ్ గా నపడాలనే ఆలోచన చేయలేదు. రవిబాబు కథ,మాటలు ఇంత నాశిగా అందిస్తాడని ఊహించము.

Rush movie


నటుడుగా రవిబాబు ఎప్పటిలాగే చేసుకుంటూ పోయాడు. పెద్ద గొప్పగానూ లేదు ..తీసికట్టు గానూ లేదు. తన అనుభవంతో లాగేసారు. క్లైమాక్స్ లో రవిబాబు మీద ఓ ట్విస్ట్ పెట్టుకున్నారు కానీ అదీ పెద్దగా పేలలేదు. దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా లేదు. రవిబాబు అనే బ్రాండ్ ఇమేజ్ తో ఈటీవి విన్ వాళ్లు తీసుకున్నట్లున్నారు. అదే ఇమేజ్ తో చూస్తే ఏమన్నా కొంతలో కొంత నచ్చవచ్చేమో. డైసి నటన ఎలా ఉన్నా యాక్షన్ సీన్స్ బాగున్నాయి.

Rush Movie


టెక్నికల్ గా రవిబాబు సినిమాలకు ఓ స్టాడర్డ్స్ ఉంటుంది. తను డైరక్టర్ కాకపోవటం వల్లనేమో అదేమీ మనకు కనపడదు. ఇక రాజేశ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ చల్తాహై. ఉన్నంతలో సుధాకర్ రెడ్డి కెమెరా పనితనం మనని కూర్చో బెడుతుంది.  సత్యనారాయణ ఎడిటింగ్ వర్క్ బాగుంది.

Rush movie


చూడచ్చా

లో బడ్జెట్ లో లాగేసిన ఈ సినిమా ....  యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఓ లుక్కేయవచ్చు

Rating:2

click me!