`జాతర` సినిమా రివ్యూ, రేటింగ్.. మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

First Published | Nov 8, 2024, 4:08 PM IST

శుక్రవారం విడుదలైన చిత్రాల్లో `జాతర` ప్రత్యేకంగా నిలిచింది. మైథలాజికల్‌, డివోషనల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

ఈ శుక్రవారం చిన్న సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ఇది మంచి టైమ్‌ గా చెప్పొచ్చు. ఈ వారం పదికిపైగా సినిమాలు విడుదలయ్యాయి. ఏది కంటెంట్‌తో ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పోటీలో వచ్చిన సినిమాల్లో `జాతర` ఒకటి. సతీష్‌ బాబు, దీయా రాజ్‌ జంటగా నటించారు. హీరో సతీష్‌ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. రాధాకృష్ణారెడ్డి, శివ శంకర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కథః 
చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ ఇది. ఓ ఊర్లో పాలేటి అనే పూజారీ గంగావతి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాడు. అతని కొడుకు చలపతి(సతీష్‌ బాబు) మాత్రం దేవుడిని నమ్మడు. పాలేటి ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు. ఊరిలోని దురాచారాల్ని రూపమాపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఊర్లో తమకు, ఊరి పెద్ద గంగిరెడ్డి(ఆర్కే నాయుడు)కి పడదు. తరచూ గొడవలు అవుతుంటాయి.

ఇలా సాగుతున్న సమయంలో అనూహ్యంగా పాలేటితోపాటు గంగావతి అమ్మవారు మాయమవుతారు. దీంతో ఊరంతా షాక్‌ అవుతుంది. అమ్మవారిని పాలేటి పూజారీనే ఏదో చేశాడని అంతా అనుకుంటారు. చలపతి ఫ్యామిలీనే కారణమని భావిస్తారు. అదే ప్రచారం జరుగుతుంది. దీంతో ఊరు మొత్తం చలపతి ఫ్యామిలీని శతృవులుగా చూస్తుంటారు. అదే సమయంలో గంగిరెడ్డి గ్రామదేవతలను తన ఇంటికి ఆహ్వానిస్తాడు.

మరి గ్రామ దేవతలు ఇంటికి వచ్చారా? పాలేటి అదృశ్యం వెనుక ఎవరన్నారు? గంగిరెడ్డికి, చలపతి ఫ్యామిలీకి ఉన్న గొడవేంటి? ఈ కుట్రకి కారకులు ఎవరు? చలపతి లవ్‌ స్టోరీ ఏంటి? దేవుడిని నమ్మని నాస్తికుడైనా చలపతిలో వచ్చిన మార్పేంటి? అనేది సినిమా మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః 
ఇటీవల రా అండ్‌ రస్టిక్‌, రగ్గుడ్‌, మాస్‌ యాక్షన్‌, దైవత్వంతో కూడిన సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. అమ్మవారు, దేవుడు వంటి ఎలిమెంట్లకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. మైథలాజికల్‌ టచ్‌ ఉంటే చాలు సినిమా హిట్టే అనేలా మారిపోయింది. `కాంతార`, `పొలిమెర` ఆ కోవకి చెందిన సినిమాలనే విషయం తెలిసిందే. తాజాగా `జాతర` సినిమా కూడా అలాంటి అంశాల మేళవింపుతోనే రూపొందించారు.

టైటిల్‌ కి తగ్గట్టే కథ కూడా ఉంటుంది. ఇది పూర్తిగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుంది. అయితే ఊరి ప్రజలను, తన భక్తులను దేవుళ్లు కాపాడటం కామన్‌గా ఉంటుంది. ప్రతి సినిమాలోనూ ఇదే జరుగుతుంది. కానీ దేవతలను నాస్తికుడు కాపాడటమే ప్రత్యేకత. అదే కథగా ఇందులో కొత్త ఎలిమెంట్‌. సినిమాపై క్యూరియాసిటీ పెరగడానికి ఇదే కారణమని చెప్పొచ్చు.

ఒక నాస్తికుడు అమ్మ‌వారి అండ‌తో ఎలా దుష్ట‌సంహారాన్ని గావించాడ‌నేది ఈ మూవీ కథ. దీనికి ప్రతీకారంతోపాటు ప్రేమ కథని, అలాగే మాస్‌ ఎలిమెంట్లని జోడించారు. ఇలా అన్ని అంశాల మేళవింపుగా తెరకెక్కించారు. దాన్ని అంతే ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా, ఎంగేజింగ్‌గా తెరకెక్కించడం విశేషం. ఈ విషయంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. 
 

సినిమా ప్రారంభం.. గంగావ‌తి గ్రామ‌దేవ‌త‌తో పాటు పాలేటి పాత్ర‌తోనే ఈ సినిమా ప‌రిచ‌యం అవుతుంది. తండ్రిలా దైవ భక్తుడిలా కాకుండా భిన్న మ‌న‌స్త‌త్వంతో చ‌ల‌ప‌తి పెర‌గ‌డానికి కార‌ణం ఏమిట‌న్న‌ది చూపించాడు డైరెక్ట‌ర్‌. వెంక‌ట‌ల‌క్ష్మి, చ‌ల‌ప‌తిల ప్రేమాయ‌ణం ఫ‌స్ట్ హాఫ్‌లో టైమ్‌పాస్ చేస్తుంది. ఊరి నుంచి పాలేటితో పాటు అమ్మ‌వారు అదృశ్య‌మ‌య్యే ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఆక‌ట్టుకుంటుంది. సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ క్రియేట్‌ అవుతుంది.

సెకండాఫ్‌లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. గంగిరెడ్డి, చ‌ల‌ప‌తి ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు వేసే ఎత్తులు పై ఎత్తుల‌తో సెకండాఫ్‌ నడుస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్‌గా రన్‌ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్‌లో వ‌చ్చి ట్విస్ట్‌లు, యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఊరమాస్‌ యాంగిల్స్ లో దుమ్మురేపాయి.

 అయితే ఫ‌స్ట్ హాఫ్‌లో పాత్ర‌ల ప‌రిచ‌యానికే  ఎక్కువ టైమ్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి మాస్‌, డివోషనల్‌ థ్రిల్లర్‌లో లవ్‌ ట్రాక్‌ ఇరికించడమే బాగా అనిపించలేదు. అది సెట్ కాలేదు. దీంతోపాటు కొన్ని రెగ్యూలర్‌ సీన్లు బోర్‌ తెప్పిస్తుంటాయి. స్క్రీన్‌ ప్లేని వేగంగా రన్‌ చేయడంతో మూవీ కొంత రిలీఫ్‌నిస్తుంది. ఓవరాల్‌గా మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాగా చెప్పొచ్చు.    
 

నటీనటులుః 
హీరోగా దర్శకుడే నటించాడు. సతీష్‌ బాబు హీరోగా చేస్తూ దర్శకత్వం వహించడం గొప్పవిషయం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. నటుడిగానూ మెప్పించాడు. అదరగొట్టాడు. దర్శకుడిగానూ గ్రిప్పింగ్‌గా సినిమాని తెరకెక్కించారు. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెడితే బాగా చేశాడని చెప్పొచ్చు. హీరోయిన్‌గా దీయా రాజ్‌ ఫర్వాలేదనిపించింది. గంగిరెడ్డి పాత్రలో ఆర్కే నాయుడు యాప్ట్ గా నిలిచాడు. తన పరిధి మేరకు రచ్చ చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. తెలిసిన ఫేసులు లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. 
 

టెక్నీకల్‌గా
సినిమాకి శ్రీజిత్‌ ఏడవన పాటలు, ముఖ్యంగా బీజీఎం బాగుంది. సినిమా రేంజ్‌ని పెంచింది. మాస్‌ సాంగ్స్ సైతం బాగున్నాయి. కేవీ ప్రసాద్‌ కెమెరా వర్క్ సైతం ఆకట్టుకుంది. డార్క్, రెడ్‌ టోన్‌తో గూస్‌బంమ్స్ తెప్పించాడు. సినిమా నిర్మాణం పరంగానూ బాగానే ఉంది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది. దర్శకుడు సతీష్‌బాబు హీరోగానే కాదు, దర్శకుడిగానూ ఇంకా బాగా చేశాడు. వాహ్‌ అనిపించేలా చేశాడు.  

ఫైనల్‌గాః `జాతర` నిజంగానే జాతర ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. 

రేటింగ్‌ః 2.5


 Read more: హేబా పటేల్‌ `ధూం ధాం` మూవీ రివ్యూ, రేటింగ్‌

also read: `జితేందర్‌ రెడ్డి` మూవీ రివ్యూ, రేటింగ్‌

click me!