#Avatar2:‘అవతార్-‌2’ విశ్లేషాత్మక రివ్యూ..ప్లస్ లు,మైనస్ లు

First Published | Dec 16, 2022, 12:50 PM IST

 భారీ అంచనాల నడుమ వచ్చిన  ఈ సినిమాను ఇండియాలో దాదాపుగా అన్ని ప్రధాన భాషల్లో కూడా రిలీజ్ చేశారు. ఏకంగా 160 భాషల్లో ఈ మూవీ రిలీజ్ కావడం విశేషం. ఈ సినిమా ఎలా ఉంది,కథ ఏంటి?

AvatarTheWayOfWater review


గత 13 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘అవతార్-‌2’ఈ ఉదయం పలకరించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే ప ప్రివ్యూలు చూసిన ఇంటర్నేషనల్  విజువల్ వండర్ అని, తెరపై అద్బుతం అని పొగుడుతున్నారు. మరికొందరు..అదేమి లేదు బోర్ అని , రొటీన్ విఎఫ్ ఎక్స్ అని , యానిమేషన్ ఫిల్మ్ లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరేమన్నా ఒక్కసారైనా చూడాలి అనేది సగటు ప్రేక్షకుడు ఆలోచన.  ఈ క్రమంలో ఈ సినిమా కథేంటి...నిజంగానే బోర్ గా ఉందా...హైలెట్స్ ఏమిటి...అవతార్ ఫస్ట్ పార్ట్ కు ఈ సినిమాకు తేడా ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

AvatarTheWayOfWater review


కథాంశం..

అవతార్ 1 కి కొనసాగింపుగా  కథ కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటే ఈ కథ తేలిగ్గా అర్దమవుతుంది. పండోరా అనే  గ్రహం మీద ‘నావి’ అనే తెగ జీవిస్తుంటుంది. భూమిమీద సహజ వనరులు అంతరించి పోవటంతో ..మనుష్యుల దృష్టి ఆ గ్రహంపై పడుతుంది.  దాన్ని ఆక్రమించాలని అమెరికా సైన్యం అక్కడకు వెళ్లగా.. నావీ తెగ వారిని ఎదుర్కుని పోరాడుతుంది. ఈ క్రమంలో  ఏలియన్‌ను పోలి ఉన్న నావీ తెగ మనుషులను తయారు చేయాలని స్కెచ్ వేస్తారు. నేటివ్స్‌ డీఎన్‌ఏతో  మానవ డీఎన్‌ఏను జోడించి,రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే అవతార్‌లను రెడీ చేస్తారు. అలాంటి అవతార్‌లలో జేక్‌ సల్లీ(సామ్‌ వర్తింగ్‌టన్‌) ఒకరు. మనిషిగా ఉన్నప్పుడు జేక్‌ సల్లీ నడవలేడు. నావికా దళంలో ఉన్నప్పుడు ఆయన ప్రమాదానికి గురై కాళ్లు పోగోట్టుకుంటాడు. అయితే అవతార్‌గా మారిన తర్వాత జేక్‌ సల్లీ పరుగెత్తగలగుతాడు.



పండోరా గ్రహంలో ఉన్న ఓ విలువైన చెట్టు రహస్యాన్ని చెబితే.. కాళ్లు వచ్చేలా చేస్తానని జేక్‌కు ఓ అధికారి ఆఫర్‌ ఇస్తాడు. దీంతో జేక్‌ ఆ గ్రహంపైకి వెళ్తాడు.అక్కడ కొన్ని పరిస్దితుల్లో .. చనిపోవటం ఖాయం అనుకున్న సమయంలో నావీ తెగకు చెందిన నేత్రి అతన్ని రక్షిస్తుంది. నావీతెగ పెట్టిన ఓ పరీక్షలో విజయం సాధించి జేక్ వారిలో ఒక సభ్యునిగా చేరిపోతాడు. వారిలో ఒకడిగా ఉండేందుకు శిక్షణ తీసుకునే క్రమంలో జేక్‌ సల్లీ నేత్రీతో ప్రేమలో పడిపోతాడు. నావీ తెగ మంచితనం చూసి వారికి రక్షణగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో  భూలోకం నుండి పండోరా గ్రహానికి వెళ్ళిన జేక్ సల్లీ అక్కడివారికి మానవులు అన్యాయం చేస్తున్నారని గ్రహిస్తాడు. తన సొంత మనుషులపైకే ఎదురు తిరుగుతాడు. చివరకు జేక్ సల్లీ  అక్కడే నిలచిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. 

avatar 2 pirated copy leaked online through torrent sites james cameron


ఇప్పుడు సీక్వెల్ విషయానికి వస్తే..అలా అక్కడే ఉండిపోయిన జేక్ సల్లీ  (శామ్ వాషింగ్టన్),, తన భార్య నేతిరి(జో సల్దానా) తో హ్యాపీగా కాలేక్షేపం చేస్తూంటాడు. తన మామగారు (నేత్రి తండ్రి )తరువాత తానే ఆ  తెగకు నాయకుడు అవుతాడు. ఆ దంపతులకు నెటెయమ్, లోక్ కొడుకులు, టక్ అనే కూతురు పుడతారు. అలాగే కిరి అనే పెంపుడు కూతురు, స్పైడర్ అనే మానవబాలుడు కలసి ఉంటాడు. అయితే ఆ పిల్లాడిని మానవలోకం పంపడానికి సరైన సాధనం లభించక పోవడంతో జేక్ తో పాటే ఉంటాడు . ఇలా రోజులు గుడుస్తూంటాయి.  


ఈ క్రమంలో పండోరాను ఆక్రమించుకోవటం కోసం మిలిట్రీ కర్నల్  మైల్స్ క్వారిచ్  (స్టీఫెన్ లాంగ్) మళ్లీ  ప్లాన్ చేస్తాడు. అయితే సారి తన స్కెచ్ మారుస్తాడు. క్వారిచ్ నావి ల శరీరంతో వస్తాడు. దాంతో తను కాపు కాస్తున్న తెగని రక్షించటానికి  జేక్ రంగంలోకి దూకాల్సి వస్తుంది. ఈ క్రమంలో   క్వారిచ్ మనుషులు జేక్ పిల్లలను బంధించి తీసుకెళ్తారు. అప్పుడు ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. క్వారిచ్ కు స్పైడర్ తన కొడుకే అన్న నిజం తెలుస్తుంది.  ఇక ఇప్పుడు క్వారిచ్ ముందు ఉన్న లక్ష్యం... జేక్ ను మట్టుపెట్టడం, తన కొడుకు స్పైడర్ ను తనతో తీసుకెళ్ళడం . 

Image: Google


అయితే జేక్ ఊరుకుంటాడా తన కుటుంబాన్ని విడిపించుకొని మెట్కాయినా ప్రాంతానికి వెళతాడు.  అయితే అక్కడ జరిగిన సంఘటనలతో జాక్ కొడుకుని లోక్ ను తీసుకువెళ్ళి భయంకరమైన జలచరాలుండే చోట పడేస్తారు. అక్కడ నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. లోక్ ను పాయకన్ అనే జలచరం రక్షిస్తుంది. జేక్ పిల్లలు సముద్రంతో ఎంతో అనుబంధం పెంచుకుంటారు. 
 

avatar 2


ఈ క్రమంలో క్వారిచ్ ఎలాగైనా జేక్ ను అంతమొందించాలని ఎత్తుకు, పై ఎత్తులు వేస్తాడు. తన తండ్రి చేస్తున్న పనులు  స్పైడర్ కు నచ్చవు. అతను తన తండ్రికే వ్యతిరేకంగా పోరాడతాడు.  అప్పుడు ఏం జరుగుతుంది...జాక్ కుటుంబం చివరకు ఏమవుతుంది? జేక్ ను అంతమొందించాలనుకున్న క్వారిచ్ ఏం చేశాడు? పండోరా   ప్రకృతివనరులపై కన్నేసిన   స్వార్థపరులను జాక్ ఏం చేసారు, కథలో రొనాల్ (కేట్ విన్స్‌లెట్) పాత్ర ఏమిటి  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   

విశ్లేషణ

ఓవరాల్ గా ఈ సినిమా  కుటుంబం, విలువలు, అనుబంధాలు, కష్టమొచ్చినప్పుడు ఒకరికోసం మరొకరు నిలబడటం..పోరాడటం..ఇంకా చెప్పాలంటే ఓ ప్రేమాలయం తరహా చిత్రం.  అయితే అదే సమయంలో మనుష్యుల్లో ఉన్న స్వార్దం, మనుష్యులతో నిండిపోయిన ఈ భూమికి ప్రత్యన్మాయం వెతకాల్సిన పరిస్దితి వస్తుందనే ఆలోచన, మానవ జాతి వదిలేస్తున్న మానవత్వం హైలెట్ చేస్తాడు. అయితే మొదటి భాగం ఉన్నంత టైట్ గా ఈ కథ ఉండదు. విజువల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు.
 


జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) అద్భుత సృష్టి అవతార్ అనటంలో సందేహం లేదు. ఆ సినిమా గొప్పతనం అంతా సరళంగా సాగిన నేరేషన్ లోనే ఉంది.  స్టోరీ లైన్ ని సూక్ష్మంగా, విజువల్స్ ని గ్రాండియర్ గా  చేసి మనని అబ్బురపరిచాడు. ఎక్కడా కన్ఫూజ్ అనే దానికి తావివ్వలేదు. మనకు తెలిసిన కథే వేరే లోకంలో జరుగుతూంటుంది. అందుకే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ విజువల్స్ ముద్ర వేసేసి ఇన్నేళ్లు అయినా మర్చిపోకుండా సీక్వెల్ కోసం ఎదురుచూసేలా చేసాయి. ఇది  కామెరూన్‌ పాటించిన టెక్నిక్. అదే ఈ సీక్వెల్ కు ఫాలో అయ్యిపోయాడు. అలాగే మన భారీతీయ పురాణ,ఇతిహాసాల నుంచి కొంత తీసుకోవటంతో మనం నోకియా ..కనెక్టింగ్ ఇండియాలా కనెక్ట్ అయ్యిపోతాం. 
 


 ఇక ఈ సినిమా  స్క్రిప్టు విషయం ప్రక్కన పెడితే కొత్త టెక్నాలిజీతో  పండోరా జనాల్లో భావోద్వేగాలను పండించేందుకు ,వాటిని పీక్స్ కు  రైజ్ చేసిన విధానం మనకుAliens Terminator 2: Judgement Day ని గుర్తు చేస్తాయి. ఎత్తుగడ, కాన్సెప్టులు వేరేమో కానీ కథనం,క్యారక్టర్ డైనమిక్స్ షిప్ట్ చేయటం, పర్శనల్ స్టేక్స్ ,అడ్వాన్స్ లెవిల్స్ లో కాంప్లిక్ట్స్, థ్రెట్ ఏర్పాటు చేయటం వంటివి  అలాగే అనిపిస్తాయి. అయితే అది విశ్లేషణగా విజువల్స్ నుంచి బయిటకు వచ్చి చూసినప్పుడు మాత్రమే అనిపిస్తుంది. 

మొదటి పార్ట్ కు రెండో పార్ట్ కు ప ోలికలు, తేడాలు


ఇక మొదటి పార్ట్ కు, ఈ రెండో పార్ట్ కు పోలికల విషయానికి వస్తే...ఈ రెండు సినిమాల మెయన్ ఐడియా ..కుటుంబం,కల్చరల్ కాంప్లిక్ట్స్, ఏక్సెప్టెన్సీ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో ప్రయాణం,స్నేహం,మానవ విధ్వంసం వంటి విషయాలను అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇవి తప్పిస్తే  అవతార్: ది వే ఆఫ్ వాటర్ కు మొదటి పార్ట్ వేరు.  అవతార్ పార్ట్ 1 లో ఆధునిక మానవుల ఆత్యాశతో.. ఎక్కడో భూమికి దూరంగా ఉన్న పండోరా గ్రహంలోని  ఓ ఆదివాశి లాంటి తెగ, వారి అడవి నివాసాలు మొత్తం ప్రమాదంలో పడతాయి.


 అదే రెండవ పార్ట్ లో ... హీరో జేక్, నేత్రి , వారి సంప్రదాయ కుటుంబం, పిల్లలు, పండోరాను ఆక్రమించుకోవడమే ధ్యేయంగా ఉండి మరోసారి పండోరా గ్రహంపై దాడులు చేసే  మైల్స్ క్వారిచ్ చుట్టూ తిరుగుతుంది.  VFX, CGI,3D టెక్నాలిజీలోని అడ్వాన్స్ వెర్షన్స్  తో ఈ సినిమా రూపొందించారు. ఈ  సినిమా లో పాత్రలను ఎంతలా మనకు క్లోజ్ గా అనిపించేలా డిజైనమ్ చేసారంటే ...వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తాం..ఎక్కడా వారి చేయిని విడిచిపెట్టం. ఆ పాత్రల కళ్లతోనే మనం సినిమా చూస్తాం.   ఈ కథ మన కల్చరల్ ఐడెండిటీని,  ప్రకృతిపై ప్రేమను   ఏ స్దాయిలో ప్రేరేపిస్తుంది...ప్రతిబింబిస్తుంది..అన్న దాన్ని ఎక్సప్లోర్ చేస్తూ సాగుతుంది. ఇది స్క్రిప్టుపరంగా కన్నా దర్శకత్వ పరంగా కామెరూన్ సాధించిన విజయం.
 

టెక్నికల్ గా...

దర్శకుడుగా  జేమ్స్‌ కామెరూన్‌ మరోసారి తనేంటో చూపెట్టారు. తన బలం టెక్నాలజీ అని ప్రూవ్ చేసారు.  విజువల్ మ్యాజిక్ అనిపిస్తుంది చాలా చోట్ల. రన్ టైమ్ ఎక్కువ అవటం వల్ల కాస్త టైర్ అయినట్లు అనిపించినా, ఎంగేజింగ్ గా ఉండే విజువల్స్, అమేజింగ్ అనిపించే కొత్త పాత్రలు నడిపించేసాయి. ఫలానా విభాగం బాగా చేసింది అని విడ తీసి చెప్పలేం. ఇక  తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు ప్రముఖ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ డైలాగులు అందించారు. డైలాగులు సినిమాలో కలిసి పోయాయి. సహజంగా ఉన్నాయని చెప్పలేం కానీ ఆడ్ గా మాత్రం లేవు. 

నటీనటులు ఎవరెలా చేసారంటే..

 Motion-capture technology  టెక్నిక్ లో తయారయ్యే ఈ సినిమాలో నావీలుగా కనిపించే ప్రతీ ఒక్కరూ ఎవరెస్టు శిఖరం ఎక్కినంత కష్టపడాల్సిందే. ఆ కష్టం మనకు ఫస్ట్ పార్ట్ మేకింగ్ వీడియోలు చూసినా అర్దమవుతుంది. ఇది అందరికీ పెద్ద ఛాలెంజ్. డైరక్టర్ కష్టాన్ని మనం గౌరవించాల్సిందే. ముఖ్యంగా నేత్రిగా చేసిన Zoe Saldana ని ప్రశంసించకుండా ఉండలేం.  మైల్స్ క్వారిచ్ మిలిట్రీ మనిషిగా, ఫన్ తో , గమ్మత్తైన మ్యానరిజంతో కూడిన ఫెరఫార్మెన్స్, ప్రతీకారంతో తహతహలాడే అతని నైజం...కానీ అవతార్ గా మారాల్సిన అవసరం చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఓ గొప్ప విలన్ గా ఆ పాత్ర గుర్తుండిపోతుంది.  

ప్లస్ లు 
VFX and CGI (విజువల్ ఎఫెక్ట్స్)
కథలో వచ్చే కొత్త ట్విస్ట్ లు
మన భారతీయ కథలకు దగ్గరగా ఉండటం
 కేట్ విన్స్లెట్  
ప్రొడక్షన్,  మేకింగ్ వేల్యూస్

మైనస్ లు 
 క్వారిచ్, అతని కొడుకు స్పైడర్ మధ్య గొడవ చూస్తే మన తెలుగు సినిమాలు చూసినట్లే అనిపించటం
స్టాంగ్ సీన్స్, పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషన్స్  లేకపోవటం
లెంగ్త్

ప్లస్ లు 
VFX and CGI (విజువల్ ఎఫెక్ట్స్)
కథలో వచ్చే కొత్త ట్విస్ట్ లు
మన భారతీయ కథలకు దగ్గరగా ఉండటం
 కేట్ విన్స్లెట్  
ప్రొడక్షన్,  మేకింగ్ వేల్యూస్

మైనస్ లు 
 క్వారిచ్, అతని కొడుకు స్పైడర్ మధ్య గొడవ చూస్తే మన తెలుగు సినిమాలు చూసినట్లే అనిపించటం
స్టాంగ్ సీన్స్, పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషన్స్  లేకపోవటం
లెంగ్త్

AvatarTheWayOfWater review


ఫైనల్ థాట్

సినిమాటెక్ ఎక్సపీరియ్స్ అంటే ఏమిటో,విజువల్ ట్రీట్ కు అర్దం చెప్పే ఇలాంటి సినిమాలు పెద్ద తెరపైనే చూడాలి. కక్కుర్తి పడి పైరసీలోనో మరో చోటో చూస్తే  ఆకిక్కు ఉండదు. అలాగే మొదటి పార్ట్ స్దాయిలో ఈ సినిమా ఎక్సపెక్ట్ చేస్త నిరాశ కలుగుతుంది. 
  
రేటింగ్: 3/5

AvatarTheWayOfWater review


నటీనటులు : శామ్ వాషింగ్టన్, జో సల్దానా, సగోని వీవర్, జాక్ ఛాంపియన్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టిస్ తదితరులు
ఛాయాగ్రహణం : రస్సెల్ కార్పెంటర్ 
సంగీతం : సిమన్ ఫ్రాంగ్లేన్ 
సమర్పణ : మురళి లాలుకోట
నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జాన్ లాండో
దర్శకత్వం : జేమ్స్ కామెరూన్! 
విడుదల తేదీ: డిసెంబర్ 16, 2022
Runtime: 192.10 Minutes.

Latest Videos

click me!