నితిన్, శ్రీలీల 'రాబిన్ హుడ్' రివ్యూ
Nithiin Robinhood movie review : నితిన్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూలో కామెడీ, మాస్ ఎంటర్టైనర్‌గా సినిమా ఎలా ఉందో తెలుసుకోండి. శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ ఫ్యాక్టర్ సినిమాకు కలిసొచ్చాయా? పూర్తి రివ్యూ చదవండి.
Nithiin Robinhood movie review : నితిన్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూలో కామెడీ, మాస్ ఎంటర్టైనర్‌గా సినిమా ఎలా ఉందో తెలుసుకోండి. శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ ఫ్యాక్టర్ సినిమాకు కలిసొచ్చాయా? పూర్తి రివ్యూ చదవండి.
Nithiin Robinhood movie review : కామెడీ సినిమాలకు తెలుగులో మంచి గిరాకీ ఉంది. అలాగే ఛలో, భీష్మ చిత్రాలతో కామెడీ, మాస్ ఎంటర్టైనర్ డైరెక్టర్‌గా వెంకీ కుడుములకు మంచి పేరు ఉంది.
అలాగే శ్రీలీల, డేవిడ్ వార్నర్ ఫ్యాక్టర్, అదిదా సర్పైజ్ సాంగ్ వైరల్ అవటంతో కలసి వచ్చింది. వీటిన్నటితో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో అందరూ నితిన్ కు ఈ సారి మంచి హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరి వెంకీ కుడుముల.. నితిన్‌ను గట్టెక్కించాడా? రాబిన్ హుడ్ కథేంటి, సినిమా చూడదగ్గదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్ :
అనాధ అయిన రామ్ (నితిన్) తను పెరిగిన అనాధాశ్రమానికి విరాళాలు లేక పిల్లల తిండికి కూడా ఇబ్బంది పడటం గమనిస్తాడు. దాంతో వారిని ఆదుకోవటం కోసం దొంగతనాల బాట పడతాడు. కోటిశ్వరులను కొట్టి పేదోళ్లకు పెట్టాలనే రాబిన్ హుడ్ కాన్సెప్ట్ ని బుర్రకు ఎక్కించుకుని, అదే నిక్ నేమ్ తో ముందుకు వెళ్తూంటాడు. అయితే దొంగతనాలు ఎంత టెక్నాలిజీని వాడి దొరక్కుండా చేసినా ఏదో రోజు దొరికిపోతారు కదా. రాబిన్ హుడ్ ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ (షైన్ చాం టాకో) దిగుతాడు.
ఈ క్రమంలో దొంగతనాలకు స్వస్ది చెప్పి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. ఇక ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీ లీల) ట్రిప్ కోసం ఇండియా వస్తుంది. ఆ ట్రిప్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ నితిన్ బ్యాచ్ తీసుకుంటారు.
నీరా రుద్రకొండ వెళ్తానంటుంది. ఆమెతో రామ్ కూడా వెళ్తాడు. అయితే ఆమెను కొన్ని ముఠాలు వెంబడిస్తూంటాయి. అలా వెళ్లిన తర్వాత అక్కడ విలన్ సామి (దేవదత్తా నాగే) వలలో చిక్కుకుంటారు.
వారి బారి నుంచి నీరాను రాబిన్ హుడ్ అండ్ టీం తప్పించిందా? రుద్రకొండ గ్రామానికి గంజాయికి లింకేంటి, అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) పాత్ర ఏంటి చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.
ఎలా ఉంది
కథగా రవితేజ కిక్ ని గుర్తు చేసే ఈ సినిమా గతంలో మనం చాలా సార్లు చూసిన సెటప్ లోనే మొదలవుతుంది. టెంప్లేట్ కమర్షియల్ ఎంట్రైటనర్ గా డిజైన్ చేసారు.
అయితే హైలెట్ గా చెప్పిన కామెడీ మాత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ సాయింతో కామెడీ బాగానే వెళ్లిపోయినా సెకండాఫ్ లో నత్త నడక నడిచింది. కథ ఎదరకెళ్లే కొలిది చాలా ప్రెడిక్టబుల్ గా రొటీన్ టెంప్లేట్ గా మారిపోయింది. దాంతో ఇంట్రస్ట్ తగ్గుతూపోయింది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉన్నంతలో బెస్ట్.
సినిమా ప్రారంభం శ్రీలంకలో విలన్, తన గ్యాంగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా ఇంట్రెస్టింగ్ గానే మొదలైంది. ఆ తర్వాత హీరో ..రాబిన్ అవతారం హీరో ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, హీరోయిన్ కు సెక్యూరిటీ గా వెళ్లటం, ఆ తర్వాత చిక్కుల్లో ఇరుక్కోవటం, ఓ చిన్న ట్విస్ట్ తో కథనం ముందుకు వెల్తుంది.
రొటీన్ గానే అనిపించే కథను కామెడీతో ముందుకు తీసుకెళ్లచ్చు అనే ధైర్యంతో దర్శకుడు ప్రతీ సీన్ లోనూ ట్రై చేసాడు. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ ని బాగా వాడుకున్నారు. అయితే ఓ స్దాయి కు కథ వెళ్లాక..ముందుకు వెళ్లనని మొరాయిస్తుంది. దానికి తోడు హీరో ఎక్కడా సమస్యల్లో పడినట్లు అనిపించడు. దాంతో కథలో కాంప్లిక్ట్ పార్ట్ వర్కవుట్ కాక పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు.
టెక్నికల్ గా
ఉన్నంతలో ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన పాటలు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అయితే కథ,కథనంపై మరింత కసరత్తు చేసి ఉంటే వీటికి నిండుతనం వచ్చేది. సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్ తో కళ్లకు ఇంపుగా ఉంది.
అలాగే సినిమాకు మొదటి నుంచి హైలెట్ చేస్తూ వచ్చిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ లోని స్టెప్ విషయంలో టీం కేర్ తీసుకుంది. ఆ స్టెప్ ని దొరక్కుండా కొంత కోత పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ లని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసారు. ఇక దర్శకుడే రాసుకున్న డైలాగ్స్ బాగా నవ్వించాయి. నిర్మాణ విలువలు బ్యానర్ కు తగినట్లే రిచ్ గా ఉన్నాయి.
నటీనటుల్లో ... నితిన్ ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్లిపోయాడు.ఫన్ యాంగిల్ బాగానే వర్కవుట్ చేసాడు. శ్రీ లీల పాత్ర పరిమితమైనా గ్లామర్ ప్రదర్శనలో తగ్గేదేలే అనిపించింది.
విలన్ గా దేవ దత్త పాత్ర..హప్ కు తగ్గట్లు లేకుండా తేల్చేసారు. అన్నిటకన్నా ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కనిపించింది చాలా తక్కువ సేపు సమయం.
అయితే ఆయన ఎంట్రీకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక శుభలేఖ సుధాకర్, లాల్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ వంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎప్పుడూ వారు నిరాశపరచరు.
ఫైనల్ థాట్
కామెడీ పండాలన్నా అందుకు తగ్గ సెటప్, స్ట్రాంగ్ బేస్ కథలో ఉండాలి. లేకపోతే సీన్స్ వస్తూంటాయి పోతూంటాయి. ఏవీ గుర్తుండవు. ఏదైమైనా కాసిన్ని నవ్వులు కోసం ఈ సినిమా ఓ సారి చూడచ్చు.
Rating: 2.75
---సూర్య ప్రకాష్ జోశ్యుల