Irumudi Movie Review: మాస్ మహారాజ రవితేజ ఫస్ట్ టైమ్ చేస్తోన్న భక్తిరస చిత్రం ఇరుముడి. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ ను రవితేజ ఎలా మెపించగలడనన అభిప్రాయాల మధ్య.. ఇరుముడి ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడమే కాకుండా, ఫిలిం వర్గాలు, సెన్సార్ టీమ్ నుంచి కూడా పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఊర మాస్ అభిమానులున్న రవితేజ.. భక్తి చిత్రంతో ఎలా మెప్పించగలడన్న డౌట్ చాలామందిలో ఉంది. కానీ ఈసినిమాతో ఆయన ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించబోతునట్టు తెలుస్తోంది. పలు నివేదికల ఆధారంగా రూపొందించిన 'ఇరుముడి' ఫస్ట్ రివ్యూ / సెన్సార్ టాక్ వివరాలు చూస్తే.
25
ఇరుముడి కథ విషయానికి వస్తే..
ఈ సినిమాలో రవితేజ ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి చెందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తారు. కథ బిగినింగ్ లో ఆయన పక్కా నెగెటీవ్ పాత్రలో కనిపిస్తారట. మందుకు బాగా అలవాటుపడిన పాత్రలో కనిపించే ఆయన, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప మాల ధరిస్తారు. మాల వేసుకున్న తర్వాత ఆయన జీవితంలో, ఆయన ప్రవర్తనలో వచ్చే మార్పుల ఏంటి? ఆ ఊరిలో మహిళల చుట్టూ అల్లుకున్న క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
35
ఇరుముడి రివ్యూ..
గత సినిమాలకు పూర్తి భిన్నంగా రవితేజ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్న ఈసినిమాలో ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో అలరించినట్టు తెలుస్తోంది. స్వామి మాల ధరించిన తర్వాత ఆయన నటనలోని పరిణతి అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తండ్రి - కూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం. రవితేజ , ఆయన కూతురిగా నటించిన చిన్నారి (బేబీ నక్షత్ర) మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో (Second Half) వచ్చే సెంటిమెంట్ సీన్లకు ఫిదా అవ్వాల్సిందే. అంతే కాదు ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 25 నిమిషాలు మాత్రమే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవ్వబోతోంది. ఎక్కడా అనవసర సన్నివేశాలు లేకుండా స్క్రీన్ ప్లే స్పీడ్ గా ఆసక్తికరంగా సాగుతుంది.
జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన "ఇరుముడి కట్టు", "మల్లెపూల పల్లకి" వంటి పాటలు వైరల్ అవుతున్నాయి. మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈసినిమా మొత్తానికి ఈ రెండు పాటలు హైలెట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే శివ నిర్వాణ మార్క్ టేకింగ్ అందరికి తెలిసిందే. గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా చూపిస్తూనే, ఎమోషన్స్, సస్పెన్స్‌ని దర్శకుడు చక్కగా బ్యాలన్స్ (Balance) చేశారు.
55
నటీనటుల పనితీరు
ఈ సినిమాలో రవితేజ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు సపోర్ట్ గా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా తన పరిధి మేర ఆకట్టుకోగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వరుస ప్లాపులతో ఉన్న రవితేజకు 'ఇరుముడి' ఒక ఫర్ఫెక్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా నిలిచి, మంచి కంబ్యాక్ హిట్ ఇస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. సెన్సార్ రిపోర్ట్ తర్వాత మూవీ టీమ్ లో కూడా కాన్ఫిడెంట్ మరింతపెరిగినట్టు తెలుస్తోంది. సెంటిమెంట్, డ్రామా తో కూడిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడే కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా 21 అగస్ట్ న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది.