Rao Bahadur Review: రావు బహదూర్‌ మూవీ రివ్యూ.. సత్యదేవ్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందా?

Published : Jul 03, 2026, 04:24 PM IST

Rao Bahadur Review: సత్యదేవ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `రావు బహదూర్‌`. వెంకటేష్‌ మహా రూపొందించిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. 

PREV
16
రావు బహదూర్‌ మూవీ రివ్యూ

సత్యదేవ్‌ వెర్సటైల్‌ నటుడిగా రాణిస్తున్నారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కానీ ఆయన టాలెంట్‌ స్థాయిలో విజయాలు వరించడం లేదు. ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంతో వచ్చాడు. `రావు బహదూర్‌` అనే చిత్రంలో నటించాడు. వెంకటేష్‌ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో దీపా థామస్‌ హీరోయిన్‌గా నటించింది. అనురాగ్‌, శరత్‌, గోపాల కృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణంలో మహేష్‌ బాబు ప్రొడక్షన్ కూడా ఇన్‌వాల్వ్ కావడం విశేషం.  ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 3)న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సారైనా సత్యదేవ్‌కి హిట్‌ పడిందా? వెంకటేష్‌ మహా హిట్‌ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
రావు బహదూర్‌ మూవీ కథ

రామప్ప రావు బహదూర్‌(సత్యదేవ్‌) భువన రాజకుటుంబానికి చెందిన వారసుడు. తన రాజభవనంలో ఒక్కడే  పిచ్చివాడిగా ప్రవర్తిస్తుంటాడు, మహాభారతం గురించి ఏవేవో మాట్లాడుకుంటుంటాడు.   ఆయనకు లివర్‌ క్యాన్సర్‌ ఉందని, మరణానికి చివరిదశలో ఉన్నాడని ఫ్రెండ్‌ అయిన డాక్టర్‌ ఆచారి చెబుతాడు. అయితే రామప్ప మాత్రం తన చిన్న కొడుకు కుసుమ  తనకే పుట్టాడా? వేరే వాళ్లకి పుట్టాడా? అనే అనుమానంతో బతుకుతుంటాడు. ఆ అనుమానమే ఆయన్ని పిచ్చోడిని చేస్తుంది. స్నేహితుడి వద్ద ఎప్పుడూ అదే టాపిక్‌ తెస్తుంటాడు. ఈ కారణంగానే తాను ప్రేమించిన భార్య రేణుక(దీపా థామస్‌)ని కూడా దూరం చేసుకుంటాడు. ఆమె ఒక గదిలోనే ఉండిపోతుంది. క్రమంగా పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్న రామప్పలో వచ్చిన మార్పేంటి? అందుకు ఆయన స్నేహితుడు ఏం చేశాడు? రేణుక గదిలోనే ఉండిపోవడానికి అసలు కారణం ఏంటి? కుసుమ ఎలా చనిపోయాడు? ఇంతకి అతను తన కొడుకేనా? పెద్ద కొడుకు విషయంలో చోటు చేసుకున్న ట్విస్ట్ ఏంటి? తన రాజవంశంలోని ట్విస్ట్‌లు ఏంటనేది సినిమా.

36
రావు బహదూర్‌ మూవీ విశ్లేషణ

అనుమానం పాత రోగం, అనుమానం పెనుభూతం అంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్‌ పై నడిచే మూవీ ఇది. కథగా ఇది చాలా చిన్నపాయింట్‌. ఒక పెద్ద సినిమా చేసేంత బలమైన పాయింట్‌ అయితే కాదు, కానీ దాన్ని సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకటేష్‌ మహా చేసిన ప్రయత్నం, ఆయన్ని నిర్మాతలు, హీరోహీరోయిన్లు నమ్మడం ఇక్కడ గొప్ప విషయం. ఒక కొత్తరకమైన పాయింట్ తో ఈ మూవీ తీయడాన్ని అభినందించాలి. కానీ తీసిన విధానం, చెప్పిన తీరుని మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక సినిమాగా చూసినప్పుడు, కమర్షియల్‌ వేలో చూసినప్పుడు మాత్రం ఇది ఏమాత్రం అలరించలేకపోయింది. పైగా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఏం జరుగుతుందనే క్లారిటీ లేదు. సత్యదేవ్‌ పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? సినిమా ద్వారా ఏం చూపించాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారనే ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. ఫస్టాఫ్‌ అంత గందరగోళంగా సాగుతుంది. సత్యదేవ్‌ ప్రవర్తన సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. పైగా చాలా స్లోగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో సత్యదేవ్‌ ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు, ఆయన ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్లు ఎంగేజ్‌ చేసేలా లేవు.  ఆయా సన్నివేశాలు కనీసం కామెడీగా, ఫన్నీగా ఉంటే బాగుండేది, బహుశా ఫన్‌ వర్కౌట్‌ అవుతుందని  తీసి ఉంటారు, కానీ కామెడీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. పైగా బోరింగ్‌గా, లాజిక్ లెస్‌గా సాగింది. రామప్ప పాత్రలోని ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్లు కూడా ఎంగేజింగ్‌గా లేవు. ఎమోషన్స్ ఏమాత్రం లేవు. లవ్‌ స్టోరీలోనూ ఫీల్‌ లేదు. ఏదో సీన్‌ బై సీన్‌ సాగిపోతుంటాయి. అందుకే మూవీతో ఆడియెన్ ట్రావెల్ కాలేకపోతారు. సెకండాఫ్‌ కూడా అలానే సాగింది. కాకపోతే కథ కాస్త ముందుకు వెళ్తుంది. రామప్ప అలా ఎందుకు మారాల్సి వచ్చిందనేది చూపించారు. కుసుమ పాత్రకి సంబంధించిన పెయిన్‌ని ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే రామప్పలోని అనుమానం పోకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. చివర్లో కొంత ఎమోషనల్‌ టచ్‌ ఉంది, సీరియస్‌గానూ ఉంటుంది. క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. ముగింపు ఊహించినట్టుగానే ఉంటుంది. కానీ కన్‌క్లూజన్‌ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. అదొక్కటే సినిమాలో హైలైట్‌ పాయింట్ గా చెప్పొచ్చు. రన్‌ టైమ్‌, స్లోగా సాగడం, చెప్పాలనుకున్న విషయంలో బలం లేదు, పెయిన్ లేదు, ఎమోషన్‌ అంతకంటే లేదు. అదే సినిమాకి పెద్ద మైనస్‌.

46
రావు బహదూర్‌ లో నటీనటులు ఎలా చేశారంటే?

రామప్ప రావు బహదూర్‌గా సత్యదేవ్‌ ఇరగదీశాడు. విభిన్నమైన షేడ్స్ లో ఆయన అదరగొట్టారు. యంగ్‌ కుర్రాడిగా, మిడిల్‌ ఏజ్‌ వ్యక్తిగా, వృద్ధుడిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. నటనలోనూ వేరియేషన్‌ చూపించి మెప్పించాడు. విలక్షణ నటనని చూపించారు. సినిమాకి సత్యదేవ్‌ యాక్టింగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా మొత్తానికి సత్యదేవ్‌ పాత్రనే పెద్ద హైలైట్‌గా చెప్పాలి. ఇక ఆయన లవర్‌గా, భార్యగా దీపా థామస్ ఉన్నంతలో బాగా చేసింది. ఆకట్టుకునేలా ఉంది. పాత్రలో లీనమైన చేసింది.  సత్యదేవ్‌ ఫ్రెండ్‌ ఆచారిగా వికాస్‌ ముప్పాల నటన మరో హైలైట్‌గా చెప్పొచ్చు. చాలా బాగా చేసి మెప్పించాడు. అచ్చమ్మగా చేసిన నటి  నవ్వించే ప్రయత్నం చేసింది. దర్శకుడు వెంకటేష్‌ మహా కూడా కాసేపు మెరిసి అలరించారు. ఇతర పాత్రధారులు ఓకే అనిపించారు.

56
రావు బహదూర్‌ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

స్మరణ్‌ సాయి సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలు ఓకే అనిపించాయి. బీజీఎం బాగుంది. కార్తీక్‌ పార్మర్‌ కెమెరా వర్క్ చాలా బాగుంది. ఆనాటి నేటివిటీని ప్రతిబింబించేలా ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా రిచ్‌గా ఉంది. దర్శకుడు వెంకటేష్‌ మహా మంచి కథలను తెరపై ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటారు. కానీ ఈ సారి మాత్రం ఆయన మెప్పించలేపోయాయి. ప్రయోగం మాత్రం చేశారని చెప్పొచ్చు. ప్రయోగం బాగుంది, కానీ ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా చేయడంలో విఫలమయ్యారు. 

66
ఫైనల్‌ గా

  అనుమానం పెనుభూతం అన్నట్టు, ఇది ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే మూవీ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. 

రేటింగ్‌ : 2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories