చైతూ #Dhootha రివ్యూ

First Published | Dec 1, 2023, 1:22 PM IST

చైతూకి ఇది ఓ కొత్త ప్రయత్నం. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్​.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. 

#Dhootha web series Review


నాగచైతన్య కు హిట్ పడి చాలా కాలం అయ్యింది. యావరేజ్ లు కూడా పడటం లేదు. ఈ క్రమంలో ట్రెండ్ కు తగినట్లుగా తనను తాను మార్చుకుని వెబ్  సీరిస్ వైపు అడుగులు వేసారు. తనతో గతంలో మనం,  ధాంక్యూ చేసిన దర్శకుడు కావటంతో చాలా కంఫర్ట్ గా చేసినట్లు అనిపిస్తున్న ఈ సీరిస్ ఎలా ఉంది...సీరిస్ లో ఉన్న కంటెంట్ ఏమిటి... ఈ సీరిస్ ఏ విధంగా చైతూ కెరీర్ పై ప్రభావం చూపించబోతోందో చూద్దాం.   
 

Dhootha review

స్టోరీ లైన్ 

స్టార్ జర్నలిస్ట్  సాగర్ (నాగ చైతన్య) 'సమాచార్' అనే న్యూస్​ పేపర్​ కు ఎడిటర్ కమ్ CEO అవుతాడు.  అయితే ఆ పోస్ట్ వేరే వాళ్లకు రావాల్సింది. కానీ మానుప్యులేట్ చేసి ఆ పోస్ట్ లోకి వస్తాడు. తన పలకుబడితో  రాజకీయనాయకులతో కుమ్మక్కు అయ్యి  డబ్బు సంపాదనలో ఉన్న అతనికి మంచి రోజులు ఖర్చు అయ్యిపోతాయి. ఎప్పుడైతే చీఫ్ ఎడిటర్ పోస్ట్ లోకి వస్తాడో అప్పటినుంచి అతనికి కష్టాలు, జీవితంలో ఊహించని ట్విస్ట్ లు  మొదలవుతాయి. భాధ్యతలు స్వీకరించిన  రోజు రాత్రి భార్యా, కూతురితో క‌లిసి ఆనందంతో తన  ఇంటికి వెళుతోన్న స‌మ‌యంలో వర్షం ,కారులో డీజిల్ లేకపోవటం అత‌డి కారు ఆగిపోతుంది.  దగ్గరలో క్యాబ్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో అక్క‌డే ఉన్న ధ‌మ్ ధ‌మ్ అనే దాభాలోకి వెళ‌తాడు సాగ‌ర్‌. అక్క‌డ‌ే అత‌డికి ఓ పేప‌ర్ ముక్క  దొరుకుతుంది. ఆ ముక్కలో ఆ దాభా ముందు జ‌రిగిన యాక్సిడెంట్‌లో సాగ‌ర్ వ‌ర్మ(మన హీరో) కుక్మ చ‌నిపోయిన‌ట్లుగా ఉంటుంది. అందులో చ‌దివిన‌ట్లుగానే ఆ కొద్ది సేపట్లోనే సాగ‌ర్ వ‌ర్మ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. 


Dhootha-Naga Chaitanya


ఆ కారులో ఉన్న పెంపుడు కుక్క ఏ చ‌నిపోతుంది. తన భార్యా ,కూతురు సేవ్ అవుతారు. కానీ కథ అక్కడితో ఆగదు. ఆ పేపరు ముక్కలు అతని జీవితాన్ని వెంబడించి నిర్దేశిస్తూంటాయి.  అతనికి కనపడే పేపరు ముక్కల్లో ఉన్నట్లుగా ప్రమాదాలు జరిగి అతని జీవితాన్ని కష్టాల్లోకి తోసేస్తూంటాయి. మరో ప్రక్క అతనిపై ఓ హత్యారోపణ పడుతుంది. అసలు అలా జరగబోయే ప్రమాదాన్ని ముందుగా పేపర్లలో రాసి అతనికి కనపడేలా చేస్తున్నది ఎవరు? సాగర్ వర్మ కే ఇలా ఎందుకు జరుగుతోంది? అతని జీవితంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), పోలీస్ అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్)  పాత్రలు ఏమిటి? సాగ‌ర్ భ‌విష్య‌త్తును అత‌డికి తెలియ‌జేస్తున్న దూత ఎవ‌రు? అది ఒక ఆత్మ‌నా? అతీంద్ర‌యశ‌క్తా?  అలాగే సాగర్ వర్మ కు...   'దూత' పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి)కి సంబంధం ఏమిటి? ఈ కేసును ఎస్పీ క్రాంతి  (పార్వతి తిరువొతు) ఎలా సాల్వ్ చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ ...

హీరోకు కనపడే పేపర్ కటింగ్స్ తో భవిష్యత్ సంఘటనలు ఊహించటం ఈ సీరిస్ లో ఉన్న కొత్త,గొప్ప నావెల్టి. అక్కడే మాగ్జమం మనం లాక్ అయ్యిపోతాము.  దర్శకుడు విక్రమ్ కుమార్ కు గతంలో  ఇలాంటి అతీంద్రియ శక్తులతో కూడిన కాన్సెప్టుతో  మాధవన్ హీరోగా  '13బి' చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్టునే సమర్ధవంతంగా డీల్ చేసారు.  ప్రతీ ఎపిసోడ్  చాలా ఆసక్తికరంగా నడిపారు. చివరిదాకా మిస్టరీగా నడిపారు. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రివీల్ అయ్యిదాకా ఆ సస్పెన్స్ నడిచింది. 'దూత' దెయ్యం కథ కాదు. ఓ అతీంద్రియ శక్తి ని తీసుకొచ్చి ముగింపు ఇచ్చారు. అలాగే ఇందులో విక్రమ్ చేసిన మరో గొప్ప విషయం ఏమిటి అంటే  ఎక్కడా హారర్ టచ్ ఇవ్వటానికి ,చీప్ ట్రిక్స్ వైపు అడుగులు వెయ్యలేదు.  అయతే ఐదు ఎపిసోడ్స్ వైపు తన సామర్ధ్యాన్ని ప్రదర్శించిన శక్తి ఆ తర్వాత కొద్దిగా సన్నగిల్గిందనే చెప్పాలి. . (Dhootha Web Series Review) 'దూత'  ఫ్లాష్ బ్యాక్  రొటీన్ గా అనిపించటం ఇబ్బంది పెడుతుంది.

Dhootha-Naga Chaitanya

 కథ రివేంజ్ వైపు మలుపు తీసుకోవటం డైజస్ట్ కాదు.  అంతకు మించి ముగించటానికి వేరే దారి లేదు కూడా. అయితే దర్శకుడుగా విక్రమ్ కుమార్ అనుభవం , కథలో ఉన్న  మ‌ల్టీలేయ‌ర్స్‌, డిఫ‌రెంట్ క్యారెక్ట‌రైజేష‌న్స్‌ సీరిస్ ని  ఉత్కంఠ‌భ‌రితంగా మార్చేసాయి. ఎపిసోడ్ చివర్లో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్‌ల‌ు బాగా  ఎంగేజింగ్ చేశాయి.  ఓరకంగా ఇది స్క్రీన్‌ప్లే మ్యాజిక్ . చూస్తున్న మనకీ ... పేరప్ కటింగ్స్ వెనక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలని అనిపించటమే ఈ సీరిస్ సక్సెస్. అలాగే పోలీస్ ఇన్విస్టిగేషన్ ను కూడా అర్దవంతంగా నడిపారు. హీరో మంచివాడిగానే చూపాలి అనికాకుండా గ్రే షేడ్స్ లో చూపటం కలిసి వచ్చింది. మైనస్ లు ఉన్నా ప్లస్ లు ఎక్కువ ఉండటం థ్రిల్స్ ఇవ్వటం ఈ సీరిస్ చూసేవారికి కలిసొచ్చే అంశం.  అలాగే  మొదట ఎపిసోడ్ నుంచే కాసేపటికే కథలోకి స్పీడుగా వెళ్లటం
 

Dhootha review


టెక్నికల్ గా...

విక్రమ్ కుమార్ సినిమాలు మొదటి నుంచి టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంటూ వస్తున్నాయి. వెబ్ సీరిస్ కు కూడా అదే ఫాలో అయ్యారు. ఇషాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ...మనని హాంట్ చేస్తుంది. కెమెరా వర్క్ అయితే ఓ రేంజిలో ఉంది.  ప్రతీ ఫేమ్ లో డిటేలింగ్ లో డైరక్టర్ కష్టం, ఆలోచన కనపడుతుంది. విజువల్ గా మంచి అప్పీల్ ఉన్న సీరిస్ ఇది. అయితే ఎడిటింగ్  కాస్త ఫాస్ట్ చేస్తే బాగుండును ..డిటేలింగ్ మరీ ఎక్కువైందేమో అనిపిస్తుంది కొన్ని చోట్ల. రెయిన్ ఎఫెక్ట్ కూడా సీరిస్ కు థ్లిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇచ్చింది. తెలుగు డైలాగులు కృతకంగా లేకుండా నాచురల్ గా ఉన్నాయి.

Dhootha

ఫెరఫార్మ్ పరంగా చూస్తే..

చైతూ ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తు...ఈ సీరిస్ ఒకెత్తు అని చెప్పాలి. ఆశ్చర్యపరిచే రీతిలో ఆయన నటన ఉంది. అలాగే  ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్రాంతి గా నటించిన పార్వతి అదరకొట్టింది. సాగర్  పి.ఏ అమృత పాత్రలో కనిపించిన ప్రాచి దేశాయ్ జస్ట్ ఓకే.  తరుణ్ భాస్కర్, తణికెళ్ల, రవీంద్ర విజయ్, పసుపతి అంతా కూడా ఇచ్చిన పాత్రలకు తమకు అలవాటైన నటనతో చేసుకుంటూ వెళ్లిపోయారు. రాజకీయ నాయకుడుగా రఘు కుంచె బాగా చేసారు. 

Dhootha

ఫైనల్ థాట్

తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సీరిస్ లలో ఇది ముందు వరసలో ఉంటుంది. నాగచైతన్య ఓటిటి డెబ్యూ సక్సెస్ అయ్యినట్లే. థ్రిల్లర్ అభిమానులు ఖచ్చితంగా చూడదగ్గ సీరిస్ . అయితే  వెబ్ సీరిస్ ల సంప్రదాయం ప్రకారం  రెండు మూడు బూతులు పెట్టారు..ఫ్యామిలీలతో చూసేటప్పుడు జాగ్రత్త.  అలాగే అడల్ట్ సీన్స్ లేవు వాటికి ఆశపడద్దు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 3/5

Dhootha


నటీనటులు: నాగచైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్, పశుపతి, రోహిణి, తరుణ్ భాస్కర్ దాస్యం, రవీంద్ర విజయ్, తనికెళ్ల భరణి, అనీష్ కురువిల్లా, జయప్రకాశ్ తదితరులు
 దర్శకత్వం: విక్రమ్ కే కుమార్
 నిర్మాత:శరత్ మరార్, విక్రమ్ కే కుమార్ 
మ్యూజిక్: ఇషాన్ చాబ్రా 
రిలీజ్ డేట్: 2023-11-30
ఓటిటి: అమేజాన్ ప్రైమ్
ఎపిసోడ్స్‌: 8
 

Latest Videos

click me!