Animal Movie Review: `యానిమల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published Dec 1, 2023, 1:14 PM IST

`అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం `యానిమల్‌`. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా నేడు రిలీజ్‌ అయ్యింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా `అర్జున్‌ రెడ్డి` చిత్రంతో ఓ ట్రెండ్‌ సెట్‌ చేశాడు. విజయ్‌ దేవరకొండని సరికొత్తగా ఆవిష్కరించారు. ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దాన్ని హిందీలో `కబీర్‌ సింగ్‌` పేరుతో రూపొందించారు. అక్కడ పెద్ద హిట్‌. ఇప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` మూవీని రూపొందించారు సందీప్‌. రష్మిక మందన్నా హీరోయన్‌గా చేసింది. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, శక్తి కపూర్‌, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్‌, ట్రైలర్లతోనే అంచనాలను పెంచేసిన ఈ మూవీ నేడు శుక్రవారం(డిసెంబర్‌ 1న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? `అర్జున్‌రెడ్డి` ని మించి ఉందా? ప్రస్తుతం ఉన్న హైప్‌ని రీచ్‌ అయ్యేలా ఉందా లేదా? అనేది రివ్యూ(Animal Movie Review)లో తెలుసుకుందాం. 

కథః
రణ్‌ విజయ్‌ సింగ్‌ బల్బీర్‌(రణ్‌బీర్‌ కపూర్‌)కి చిన్నప్పట్నుంచి నాన్న బల్బీర్‌ సింగ్‌(అనిల్‌ కపూర్‌) అంటే ఇష్టం. ఆయన ప్రతి పుట్టిన రోజుని ప్రత్యేక రోజుగా భావిస్తాడు. తనని విష్‌ చేయాలని, నాన్నతో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటాడు. కానీ బల్బీర్‌ సింగ్‌ దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆయన టూ బిజీగా ఉంటాడు. ఫ్యామిలీ, పిల్లలతో టైమ్‌ కేటాయించలేకపోతుంటాడు. ఇలా ఏ పుట్టిన రోజు కూడా నాన్నతో స్పెషల్‌గా గడపాలన్న కోరిక తీరదు. అలా అని తండ్రిని ద్వేషించడు, ఇంకా ప్రేమిస్తాడు. ఆ ప్రేమ హద్దులు దాటిపోతుంది. ఈ క్రమంలో పెద్దయ్యాక గొడవ అవుతుంది. దీంతో తండ్రి తనని ఇంటి నుంచి పంపించేస్తాడు. ఆ సమయంలో తన ఫ్రెండ్‌ చెల్లి గీతాంజలి(రష్మిక మందన్నా)పై తనకున్న ప్రేమని తెలియజేస్తాడు. దీంతో ఆమె తన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుని రణ్‌విజయ్‌తో వచ్చేస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోతారు. వారి లైఫ్‌ కూల్‌గా సాగుతుంది. ఇద్దరు పిల్లలు కూడా అవుతారు. ఆ సమయంలో తన తండ్రిపై ఎటాక్‌ జరిగిందనే వార్త తెలుస్తుంది. దీంతో మళ్లీ ఇండియాకి వచ్చేస్తాడు. దాడి చేసింది తన అక్కడ భర్త(బావ) అనే విషయాన్ని (Animal Movie Review) కనిపెట్టి అతన్ని చంపేస్తాడు. ఆ విషయాన్ని దాస్తూ తన తండ్రిపై ఎటాక్ వెనకాల ఉన్నది ఎవరు? కంపెనీలో ఏం జరుగుతుంది ? అనే విషయాలు తెలుసుకుంటాడు. మరి అతనికి తెలిసిన నిజాలేంటి? తండ్రిని చంపాలని ప్లాన్‌ చేస్తున్నది ఎవరు? తండ్రిని కాపాడుకునేందుకు రణ్‌ విజయ్‌ సింగ్‌ ఏం చేశాడు? దీనికి ఆర్బర్‌(బాబీ డియోల్‌)కి సంబంధం ఏంటి? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ. 

Latest Videos


విశ్లేషణః
సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం స్టయిల్‌ వేరు. నిజానికి సినిమా పారామీటర్లకు అతీతంగా ఉంటుంది. `అర్జున్‌రెడ్డి`తో ఆ విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు `యానిమల్‌` సినిమా కూడా అదే స్టయిల్‌లో, ఆయన స్టయిల్‌లోనే రూపొందించారు. దానికి మించిన యాటిట్యూడ్‌, ఆరొగెన్స్, అగ్రెషన్‌ ఈ సినిమాలోని హీరో రణ్‌ బీర్‌ పాత్రలో ఉంటుంది.  ఇంకా చెప్పాలంటే ఈ మూవీ చూస్తుంటే `అర్జున్‌రెడ్డి`కి సీక్వెల్‌గానే ఉందనిపిస్తుంది. అర్జున్‌ రెడ్డి తర్వాత హీరో ఏం చేశాడు, ఎలా ప్రవర్తించాడనేలా సినిమా సాగుతుంది. అయితే అర్జున్‌రెడ్డిలో హీరో అమ్మాయి ప్రేమ కోసం ఎంతటి సాహసానికి దిగుడుతాడు, ఎంతగా తహతహలాడిపోతాడో, ఇందులో తండ్రి ప్రేమ కోసం అంతగా తపిస్తుంటాడు. చిన్నప్పట్నుంచి తండ్రి ప్రేమ కోసం తపిస్తుంటాడు. కానీ ఎప్పుడూ ఆ ప్రేమ దొరకదు. తండ్రికి తన ప్రేమని (Animal Movie Review) చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ వినే పరిస్థితుల్లో తండ్రి లేడు. ఆయన ఫుల్‌ బిజీ. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఆయన బంధం, అనుబంధం, ప్రేమ అనే కోణంలోనే చూస్తుంటారు. పైగా హీరో టూ ఇంటలిజెంట్‌. టూ బోల్డ్. సినిమా కూడా ఆద్యంతం బోల్డ్ గా సాగుతుంది. సెక్స్‌, రిలేషన్‌, ఇలా ప్రతి విషయాన్ని దర్శకుడు చాలా బోల్డ్ గా చూపించాడు. డైలాగుల ద్వారా చెప్పించాడు. అదే ఈ సినిమాకి పెద్ద అసెట్‌. 

అయితే సినిమాలో ప్రతి విషయాన్ని చాలా డిటెయిలింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. హీరో తాలుకూ ఫీలింగ్‌, ఎమోషన్స్, లవ్‌ని చాలా డిటెయిలింగ్‌గా చూపించారు. స్కూల్‌ టైమ్‌లో తండ్రి ప్రేమ కోసం కొడుకు ఎంత తపించాడు, తన అగ్రెషన్‌ని ఎలా చూపించాడనేది, అలాగే పెద్దాయ్యక కూడా తను ఎలా ఉండాలనుకుంటున్నాడు, తండ్రి ఎలా ఉన్నాడనేది ఇందులో స్పష్టంగా ఆవిష్కరించారు. తన ప్రేమ తండ్రికి ఎప్పుడూ నెగటివ్‌గానే కనిపించడం, ఇద్దరికి పడకపోవడం, కలిసిన ప్రతిసారి గొడవ జరగడం వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో వీరికి మధ్య గొడవకి సంబంధించిన చర్చ కొంత ఓవర్‌ డోస్‌ అనిపిస్తుంది. అదే (Animal Movie Review) సమయంలో లాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో మొత్తం తన తండ్రి కోసం కొడుకుగా తన ఫీలింగ్స్, లవ్‌ని చూపించారు. ఇక అదే సమయంలో తండ్రిపై ఎటాక చేసిన వారిని పట్టుకుని చంపేయడం వరకు సాగుతుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అది తన బావే అని తెలిసి అతన్ని చంపడం క్రేజీగా అనిపించింది. దీంతోపాటు తన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఇంటర్వెల్‌ చేసే ఫైట్‌ నెక్ట్స్ లెవల్‌ ఉంది. ఇది `కేజీఎఫ్‌`లోని గన్‌ని మించిన మిషన్‌ గన్‌ వాడటం విశేషం. అయితే దాన్ని అంతే ఎలివేషన్‌లో చూపించడంలో విఫలమయ్యారు. ఫైట్‌ ఆలోచన బాగుంది. కానీ అంతగా పేలలేదు. 

ఇక ఫస్టాఫ్‌ సాగినంత రేసీగా సెకండాఫ్‌ ఉండదు. అతను ఆసుపత్రి పాలు కావడం, లేవలేని స్థితి, మామూలు మనిషిలా ఉండలేకపోవడం అందుకోసం తను సెట్‌ అయ్యేందుకు టైమ్‌ తీసుకున్నట్టుగానే ఆయా సీన్ల విషయంలోనూ సాగదీశాడు దర్శకుడు. అక్కడ సినిమా ఒక్కసారిగా పడిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇందులో సెక్స్ రిలేటెడ్‌ విషయాలు చర్చించడం, మగాళ్లకి సంబంధించిన ప్రైవేట్‌ విషయాలో బోల్డ్ గా చెప్పడం వంటివి చాలా ఫన్నీవేలో చూపించారు. ఈ సీన్లు సినిమాలో మధ్య మధ్యలో వస్తూ నవ్వులు పూయిస్తాయి. అంతే క్రేజీగా ఉంటాయి. సెకండాఫ్‌ క్లైమాక్స్ వరకు సినిమా స్లోగా సాగుతుంది. రష్మికతో గొడవ విషయం సైతం బోరింగ్‌గా ఉంటుంది. టూమచ్‌ గా అనిపిస్తుంది. తండ్రి ప్రేమ కోసం ఓ సైకోలా ప్రవర్తించడం సైతం ఓవర్‌గా అనిపిస్తుంది. ఇలా అతిగా సాగదీసినట్టుగా ఉంటుంది. టూమచ్‌ డీటెయిల్స్ సెకండాఫ్‌ని ట్రాక్‌ తప్పేలా చేసింది. 

కానీ క్లైమాక్స్ ఫర్వాలేదు. బాబీ డియోల్‌తో ఫైట్‌ సీన్‌ బాగుంది. కొత్తగా ఉంది అదే సమయంలో సినిమాలో చాలా ఫైట్ సీన్లు కన్విన్సింగ్‌గా లేవు. ఇక `యానిమల్‌`లో క్లైమాక్స్ తర్వాత వచ్చే సీన్లు సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్లుగా (Animal Movie Review) చెప్పొచ్చు. అది సినిమాని మరింత క్రేజీగా మార్చింది. పార్‌ 2కి ప్రకటించారు. ఆ సర్‌ప్రైజ్‌ నిజంగానే వాహ్‌ అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా టూ బోల్డ్, అండ్‌ టూ వాయిలెంట్‌. తండ్రి ప్రేమ కోసం కొడుకు చేసే వాయిలెంట్‌ జర్నీగా ఈ సినిమా ఉంటుంది. మోస్ట్ వాయిలెన్స్, మోస్ట్ బోల్డ్ నెస్ అనేది ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇబ్బంది పెట్టేలా ఉంది. అయితే మూడుపాటలు, ఆరు ఫైట్లు అనేది దానికి ఇది పూర్తి భిన్నం. దీని స్టయిలే వేరు.

నటీనటులుః
రణ్‌ విజయ్‌ సింగ్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటన అద్బుతం. సినిమా మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుని చేసినట్టుంది. అన్ని పాత్రలను ఆయన నటన, ఆయన పాత్ర ప్రభావితం చేస్తుంది. డిఫరెంట్‌ వేరియేషన్స్ లో అదరగొట్టారు రణ్‌బీర్‌ సింగ్‌. విశ్వరూపం చూపించాడు. ఛాక్లెట్‌ బాయ్‌ ఇంత వాయిలెంట్‌గా కనిపించడం ఆయన అభిమానులను సర్‌ప్రైజ్‌ (Animal Movie Review) చేస్తుంది. మొత్తంగా అతను వన్‌ మ్యాన్‌ షో చేశాడు. గీతాంజలిగా రష్మికకి ఓ కొత్త తరహా పాత్ర. తను కూడా అదరగొట్టింది. తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ చాలా సెటిల్డ్ గా చేశాడు. నటుడుగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జస్ట్ అలా ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. శక్తీ కపూర్‌ ఉన్నంతలో మెప్పించారు. బాబీ డియోల్‌ పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదు. సెకండాఫ్‌ మధ్యలో ఆయన పాత్ర పరిచయం అవుతుంది. మధ్యలో రెండు సీన్లలో కనిపిస్తారు. మళ్లీ క్లైమాక్స్ లోనే ఎంట్రీ ఇస్తారు. తర్వాత డైరెక్ట్ ఫైట్‌. ఆయన పాత్ర తక్కువ చూపించడం కొంత డిజప్పాయింట్‌. ఇక మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపించాయి. 

టెక్నీకల్‌గా..

టెక్నీకల్ గా మూవీ చాలా బ్రిలియంట్‌గా ఉంది. అయితే అదంతా దర్శకుడు సందీప్‌ రెడ్డి మ్యాజిక్‌ అనే చెప్పాలి. ప్రతి విజువల్స్ కి సంబంధించిన ప్రతి ఫ్రేములోనూ, మ్యూజిక్‌లోనూ, సాంగ్స్, ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ, చివరికి ఎడిటింగ్‌ లోనూ ఆ మార్క్ కనిపిస్తుంది. ఆయన యాటిట్యూడ్‌ కనిపిస్తుంది. అన్ని విభాగాలను తన కంట్రోల్‌లోకి తీసుకుని చేసినట్టుగా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. మ్యూజిక్‌ అదిరిపోయింది. కథలో భాగంగా వచ్చే ప్రతి పాట ఎలివేట్‌ అయ్యేలా ఉంది. సీన్లని (Animal Movie Review) రక్తికట్టించారు. ముఖ్యంగా పంజాబీ పాట హైలైట్‌. ఇక డిఫరెంట్‌ ఆర్‌ఆర్‌తో వాహ్‌ అనిపించారు.అంతా ఇప్పుడు `కేజీఎఫ్‌`, `విక్రమ్‌`, `జవాన్‌`, `జైలర్‌` ట్రాక్‌లో పడి కొట్టుకుపోతుండగా, ఓ విభిన్నమైన బీజీఎంతో సినిమాని ప్రత్యేకంగా మార్చారు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. కానీ సందీప్‌రెడ్డి వంగా మూడున్నర గంటలు ఈ సినిమాని చెప్పాలనుకోవడం మైనస్‌. కట్‌ చేసే సీన్లు, చేయాల్సిన సీన్లు ఉన్నాయి. అవి సినిమా వేగాన్ని తగ్గించాయి. 

Animal Movie Review

ఫైనల్‌గాః `యానిమల్‌` మోస్ట్ లెన్తీ వాయిలెంట్‌ ఫాదర్‌ అండ్‌ సన్‌ లవ్‌ స్టోరీ. టూ బోల్డ్ అండ్‌ మ్యాడ్‌ మూవీ. 

రేటింగ్‌ః 3

నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు
ఛాయాగ్రహణం: అమిత్ రాయ్
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023  
 

click me!