Hema Hemeelu Review: శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ , హేమా హేమీలు రివ్యూ..

Published : Aug 09, 2026, 10:12 AM IST

Hema Hemeelu Review: సూపర్ స్టార్ కృష్ణ తెరకెక్కించిన సినిమాలలో అద్భుతమైన మల్టీ స్టారర్ గా నిలిచింది హేమాహేమీలు. శోభన్ బాబు చేసిన మోసానికి కృష్ణ తీర్చుకున్న రివేంజ్ గా ఈసినిమా నిలిచిపోయింది. ఇంతకీ ఈసినిమా వెనుక ఉన్న కథేంటి?

PREV
17
మల్టీస్టారర్ సినిమాలను ఆడియన్స్ సపోర్ట్..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆధరిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అలనాటి తారల నుంచి నేటి రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు అద్భుతమైన మల్టీస్టారర్ మూవీస్ చేశారు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR), సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం ‘హేమా హేమీలు’ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది.

27
హేమా హేమీలు సినిమా వెనుక కథ..

1979లో విడుదలైన ఈ సినిమా కేవలం ఇద్దరు స్టార్ హీరోల కలయిక మాత్రమే కాదు, దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ‘హేమా హేమీలు’ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ నిర్మించగా.. ఆయన భార్య విజయనిర్మల డైరెక్ట్ చేసింది. ఈ సినిమాలో మెయిన్ హీరోగా అక్కినేని నాగేశ్వరావును తీసుకున్నారు కృష్ణ. తానుకూడా తోడై.. ఈసినిమాలో నటించారు. హిందీలో వచ్చిన డాన్ సినిమా కథను ప్రేరణగా తీసుకుని.. అందులో కృష్ణ, విజయ నిర్మల పాత్రలను చేర్చి.. మహారథితో కొత్త స్క్రిప్ట్ రాయించారు కృష్ణ. అయితే ఈ సినిమా నిర్మించడానికి పరోక్షంగా శోభన్ బాబు కారణం అయ్యాడు. ఆయన మీద కోపంతోనే కృష్ణ ఈసినిమాను నిర్మించారు.

37
శోభన్ బాబు చేసిన పనికి రివేంజ్ తీర్చుకున్న కృష్ణ

ఒకసారి వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న శోభన్ బాబు.. కృష్ణతో సినిమా చేయాలని కబురు పంపించారు. వెంటనే కృష్ణ స్వయంగా వెళ్లి శోభన్ బాబకు 25 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. ఇద్దరం సినిమా చేస్తున్నాం.. విజయనిర్మల డైరెక్ట్ చేస్తుంది అని చెప్పివచ్చారు. ఈలోపు శోభన్ బాబుకు మల్లెపువ్వు సినిమాతో హిట్ పడింది. దాంతో కృష్ణతో సినిమా చేయనని చెప్పి.. ఆ 25 వేలు అడ్వాన్స్ ను తిరిగి పంపించారు. దాంతో కృష్ణకు కోపం వచ్చింది. వెంటనే అక్కినేని నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లి .. మీతో సినిమా చేస్తాను అన్నారు. అప్పటికే వారి మధ్య దేవదాసు సినిమా గొడవలు నడుస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టి కృష్ణతో సినిమాకు ఒప్పుకున్నారు అక్కినేని. ఇద్దరు కలిసి చేసిన ఆ మల్టీ స్టారర్ సినిమానే హేమా హేమీలు. ఈ సినిమాతో శోభన్ బాబుకి షాక్ ఇచ్చాడు సూపర్ స్టార్.

47
హేమా హేమీలు కథ విషయానికి వస్తే..

ఒక జమీందారు దగ్గర కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం ఉంటుంది. జమీందారు బావమరిది దానికోసం ప్రయత్నించి జమీందారు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు. జమీందారు పెద్ద కొడుకు రఘుబాబు(ఏఎన్నార్), జమీందారు భార్య, జమీందారు కూతురు విజయ( విజయ నిర్మల), దివాన్ శివరామయ్య ఒక చోట చేరుకుంటారు. జమీందారు చిన్నకొడుకు రామచంద్రబాబు ఒక పల్లెలో పెరుగుతాడు. దివాన్ కొడుకు రాజా(కృష్ణ) ఒక బ్యాంక్ ఉద్యోగి ఆలనాపాలనలో పెరిగి పెద్దవాడవుతాడు. దివాన్ భార్య, కూతురు సీత ఒక పల్లె చేరుకుంటారు. రఘుబాబు పెరిగి పెద్దవాడయి తమ కుటుంబానికి అన్యాయం చేసినవారిపై పగ తీర్చుకోవడానికి రెడ్ లయన్ అనే మారుపేరుతో ఒక ముఠా ఏర్పాటు చేసుకుంటాడు. నల్లపిల్లి పేరుగల ఒక బందిపోటు ముఠా నాయకుడు త్రిలింగా బ్యాంకుపై దాడి చెసి, మేనేజర్‌ను హతమార్చి, జమీందారుకు చెందిన వజ్రకిరీటాన్ని అపహరిస్తాడు. ఈలోపు నైట్ కింగ్‌ గా ఒకడు అవతరించి అడుగడుగునా రెడ్ లయన్‌కు, నల్లపిల్లికి అడ్డుతగులుతుంటాడు. ఈలోపు జరిగిన ఓ కాల్పులవల్ల రఘుబాబు మరణిస్తాడు. దాంతో ఇంట్లో రఘుబాబు స్థానంలో మరొకడు వచ్చి చేరతాడు. అసలు రెండో వాడు ఎవరు? నైట్ కింగ్ పేరుతో విలన్ల పనిపట్టేది ఎవరు? చివరకు రఘుబాబు ప్లేస్ లో ఉన్నది ఎవరనేది తెలిసిందా లేదా? అనేది క్లైమాక్స్.

57
హేమా హేమీలు రివ్యూ..

‘హేమా హేమీలు’ కథ రెండు భిన్న ధృవాల లాంటి వ్యక్తుల మధ్య సాగే డ్రామా, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలగలిపి ఉంటుంది. కథలో ఒకరు రాజసానికి, సాంప్రదాయానికి ప్రతీక అయితే, మరొకరు అన్యాయాన్ని ఎదురించే ధైర్యవంతుడైన యువకుడు. సమాజంలో ఉన్న అసమానతలు, ధనవంతుల అహంకారం, పేదల వైపు నిలబడే నాయకత్వం అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు తనదైన శైలిలో గాంభీర్యాన్ని, ఆత్మాభిమానాన్ని ప్రదర్శించే పాత్రలో కనిపించగా, కృష్ణ యాక్షన్ హీరోగా.. తిరుగుబాటు మనస్తత్వమున్న పాత్రలో అలరిస్తారు. ఆరంభంలో వీరిద్దరి మధ్య వచ్చే విభేదాలు ఫైట్ సీన్స్ బాగుంటాయి. ఇక చివరికి ఒకే లక్ష్యం కోసం (అన్యాయాన్ని అణచివేయడం) వీరిద్దరూ ఎలా ఒకటయ్యారనేదే ఈ మూవీ లైన్.

67
నటీనటుల పనితీరు ఎలా ఉంది?

ఈ సినిమాలో ANR నటించిన పాత్రలో అనుభవం, పరిణతి స్పష్టంగా కనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్ లో ఆయన మాటల తీరు, కళ్లలోనే పలికించిన భావాలు అద్భుతం. ముఖ్యంగా సంభాషణలు చెప్పే విధానంలో ఆయన చూపించిన హుందాతనం సినిమా స్థాయిని పెంచింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ విషయానికి వస్తే.. మాస్ ఎనర్జీ, స్పీడ్, యాక్షన్ సన్నివేశాల్లో కృష్ణ తన మార్కును స్పష్టంగా చూపించారు.

ANR లాంటి నటన దిగ్గజం పక్కన నటిస్తున్నప్పటికీ, తనదైన మార్క్ ను చూపించుకోగలిగాడు. కృష్ణ పాత్రలో ఉండే ఉత్సాహం, రోషం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక విజయనిర్మల కథలో గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే పాత్రల్లో కనిపించారు. వీరిద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. కైకాల సత్యనారాయణ , రావు గోపాలరావు విలన్లుగా తమదైన విలనిజంతో సినిమాకు కావలసిన డ్రామాను, ఉత్కంఠను అందించారు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిది మేరకు అద్భుతంగా నటించారు.

హేమా హేమీలు టెక్నికల్ గా ఎలా ఉంది? ఏవరు ఎలా పనిచేశారు?

ఈ సినిమాలో ఏఎన్నార్, కృష్ణ, కైకాల, లాంటి అగ్ర నటులను ఒకే ఫ్రేమ్‌లో బ్యాలెన్స్ చేయడం సాధారణ విషయం కాదు. అభిమానులు ఎవరూ అసంతృప్తి చెందకుండా, ఇద్దరు హీరోల ఇమేజ్‌లకు సరిపడేలా సన్నివేశాలను మలచడంలో విజయనిర్మల సఫలమయ్యారు. ఒక మహిళా దర్శకురాలు ఆ కాలంలో ఇంతటి భారీ మల్టీస్టారర్‌ను విజయవంతంగా హ్యాండిల్ చేయడం నిజంగా ప్రశంసనీయం.

ఈ సినిమా విజయంలో రమేష్ నాయుడు అందించిన సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం (BGM) సినిమాకు పెద్ద బలంగా మారింది. "పారాహుషార్" వంటి పాటలు డ్యూయెట్స్ ప్రేక్షకులను అలరించాయి. అంతే కాదు ఈమూవీలో పదునైన మాటలు, ముఖ్యంగా ANR-కృష్ణల మధ్య వచ్చే సన్నివేశాల డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించాయి. కెమెరా పనితనం ఆ కాలపు ప్రమాణాలకు అనుగుణంగా రిచ్‌గా ఉంది.

77
ప్లాస్ - మైనస్ పాయింట్స్

ప్లాస్ పాయింట్స్..

ANR - కృష్ణ కాంబినేషన్: తెరపై వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ‌- బాడీ లాంగ్వేజ్ అతిపెద్ద ప్లస్ పాయింట్.

సంగీతం & యాక్షన్: రమేష్ నాయుడు పాటలు, కృష్ణ శైలి యాక్షన్ ఘట్టాలు.

మైనన్ పాయింట్స్..

కొన్ని సన్నివేశాలు ఆనాటి రొటీన్ ఫార్ములా డ్రామాను గుర్తుచేస్తాయి.

ద్వితీయార్థంలో సాగతీత: సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాల వేగం తగ్గినట్లు అనిపిస్తుంది.

‘హేమా హేమీలు’ అనేది కేవలం ఒక వెండితెర వినోదం మాత్రమే కాదు... ఇద్దరు స్టార్ హీరోలు వారి అభిమానులకు ఇచ్చిన పెద్ద గిప్ట్. క్లాసిక్ మల్టీస్టారర్ సినిమాలను, అక్కినేని-కృష్ణల అద్భుత నటనను చూడాలనుకునే ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన చిత్రం ‘హేమా హేమీలు’. ఈ మూవీ చూడాలనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories