గోపిచంద్, శ్రీనువైట్ల ‘విశ్వం’ మూవీ రివ్యూ

First Published Oct 11, 2024, 1:45 PM IST

శ్రీను  వైట్ల  తనకు అచ్చివచ్చిన ట్రైన్ కామెడీ, యాక్షన్ సీన్స్ తో హిట్ కొడతానంటూ వచ్చారు. గోపిచంద్ సైతం తన టైటిల్ లో సున్నా సెంటిమెంట్ ని వదలకుండా ఈ సినిమాకు అలాంటి టైటిల్ నే పట్టుకుని దిగారు. 

Gopichand, Srinu vytla, Viswam, Review


శ్రీను వైట్ల తన యాక్షన్ కామెడీలతో ఒక టైమ్ లో ఒక వెలుగు వెలిగారు. అయితే ఆయన కథలను ఆయనే అనుకరించటమే కాకుండా , ఇండస్ట్రీలో పెద్ద డైరక్టర్స్ సైతం ఆయన టైప్ కామెడీ సెటప్ లోకి వచ్చేసి, ఆ జానర్ ని బోర్ కొట్టించేసారు.  దాంతో శ్రీనువైట్ల తనను తాను మార్చుకుని, తన పాత ఒకే ఇంట్లో హీరో, విలన్ కామెడీ పంధా వదిలేసి కొత్త దారి ఎంచుకున్నాడు. అయితే అవీ మరీ డిజాస్టర్స్ అయ్యిపోయాయి.

దాంతో తనకు అచ్చివచ్చిన ట్రైన్ కామెడీ, యాక్షన్ సీన్స్ తో హిట్ కొడతానంటూ వచ్చారు. గోపిచంద్ సైతం తన టైటిల్ లో సున్నా సెంటిమెంట్ ని వదలకుండా ఈ సినిమాకు అలాంటి టైటిల్ నే పట్టుకుని దిగారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సైతం వరస డిజాస్టర్స్ తో ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తోంది. క్రిందటి వారం కూడా శ్వాగ్ అంటూ తమ సినిమాని దింపింది. ఈ క్రమంలో పీపుల్స్ మీడియాకు, శ్రీను వైట్లకు, గోపిచంద్ కు హిట్ అత్యవసరమైన ఈ టైమ్ లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది..అసలు కథేంటి, హిట్ అయ్యే కంటెంటేనా వంటి వివరాలు చూద్దాం. 

Viswam movie Review


కథేంటి
 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖురేషి (డిష్ సెన్ గుప్తా) హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. అతడికి వెనక నుంచి  సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు బాచి రాజు (సునీల్) హెల్ప్ చేస్తూంటాడు. ఈ విషయం మినిస్టర్ (సుమన్) కు తెలియడంతో ఇద్దరు కలిసి అతన్ని చంపేస్తారు.అయితే ఇప్పుడా హత్యను  ఒక పాప చూస్తుంది. దాంతో మీరు ఊహించినట్లుగానే  ఆ పాపను చంపాలని టెర్రరిస్ట్ మనుషుల్ని పంపిస్తాడు.

అప్పుడు మన హీరో  గోపి అలియాస్ విశ్వం (గోపీచంద్) రంగంలోకి దూకి  ఆ పాప ప్రాణాలు కాపాడుతాడు. అప్పటినుంచి ఆ పాపకు అంగరక్షకుడిగా మారతాడు. మారుపేర్లతో ఆ పాప ఇంట్లో చేరుతాడు. అయితే ఆ పాపను క్యాజువల్ గా రక్షించాడా..కావాలనే వేరే కారణంతో రక్షించాడా..అసలు నిజానికి విశ్వం ఎవరు...టెర్రరిస్ట్ లు అసలు లక్ష్యం ఏమిటి... ఆ పాపను విశ్వం కాపాడాడా లేదా..? అలాగే  సమైరా (కావ్య థాపర్) కు ఈ కథలో పాత్ర ఏమిటి..?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

Latest Videos


Viswam movie Review


ఎలా ఉంది

శ్రీను వైట్ల సినిమాలకు గతంలో రైటింగే బలం. ఈ సారి అదే మైనస్ గా మారింది. అయితే అదే సమయంలో కామెడీ బాగానే పండించింది.  శ్రీను వైట్ల గత చిత్రాల్లో హీరో తనెవరో  దాచి మరొకరిగా విలన్ లేదా  హీరోయిన్ ఇంటికి వెళ్లడం జరుగుతూంటుంది. ఆ ఇంటికి ఎందుకు  వెళ్లాల్సి వచ్చిందనే కారణం చెప్పి  ముగిస్తూంటారు.  ఈ సినిమాలోనూ అంతే. అయితే ఈ సారి అది చాలదన్నట్లు అవుట్ డేటెడ్ అయిన టెర్రిరిస్ట్ ట్రాక్ ని తీసుకొచ్చి కలిపారు. అదే సినిమాని పదిహేను  సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన ఫీలింగ్ కలగ చేసింది.  
 

Viswam movie Review


దానికి తోడు ఎందుకనో డైరక్టర్స్ ఈ మధ్యన కమర్షియల్ హీరో,విలన్ సినిమా చేస్తూనే విలన్ ని తక్కువ గా చూపిస్తున్నారు.హీరోని కేజీఎఫ్ లెవిల్లో ఎలివేషన్స్ ఇస్తూ, విలన్ ...అసలు వీడికి ఇంత సీన్ లేదు..ఇంక హీరో వచ్చి చేసేదేముంది అనే ఫీల్ కలగ చేస్తున్నారు. స్ట్రాంగ్ విలన్ అనే విషయంలో రాజమౌళి ఎక్కడ సక్సెస్ అయ్యారో అక్కడే ఈ దర్శకులు దెబ్బ తింటున్నారు.   రజనీ వెట్టయాన్ లోనూ అదే పరిస్దితి. విలన్ అంత సీన్ ఉండదని మొదటే అర్దమైపోతుంది. ఇక్కడా విశ్వంలోనూ అంతే.

కొత్త తరహా కథో లేక నేరేషన్ లో వెల్తే విలన్, హీరో అనే లెక్కలు అవసరం లేదు. కానీ చేసేది ఫక్తు కమర్షియల్ యాక్షన్ కామెడీ అయ్యినప్పుడు విలన్ విషయంలో ఎందుకో అంత నిరాశక్తత. కథలో కీలకమైన విలన్ టెర్రరిస్ట్ పాత్ర అంత నీరసంగా ఉంటే ఎలా? దానికి తోడు టెర్రరిజం, నక్సలిజం అనేవి సినిమాల వరకూ అవుట్ డేటెడ్ ట్రాక్ లు అయ్యిపోయాయి. ఆ పాత్రలు తెరపై  వస్తే ఇరిటేషన్ వచ్చే స్దాయిలో మనవాళ్లు అరగతీసేసారు. 
 


మారుతున్న కాలంతో పాటు ఖచ్చితంగా దర్శకులు, రచయితలు, నటులు మారాల్సిన అవసరం ఉంది. అవసరం లేదు అనుకుంటే వీళ్లకు సక్సెస్ అవసరం లేదు అనుకుని ప్రక్కకు వెళ్ళి వేరే వాళ్లను వరిస్తుంది. శ్రీను వైట్ల కి ఈ సినిమా ఎగ్జామ్ లాంటిది. తన కామెడీని ఇప్పటి ఆడియన్స్ ఆదరిస్తారా అనేది చెక్ చేసుకోవల్సిన పరిస్దితి. ఎందుకంటే ఇప్పుడు కామెడీ రూపు రేఖలు మారిపోయింది. ఎంతో కష్టపడితే కానీ నవ్వించలేని పరిస్దితి. ఏ మాత్రం పాత వాసన వచ్చినా కామెడీ  కాస్తా కంగాళి అయ్యిపోతుంది.

ఈ సినిమాలో జోక్స్ ఉన్నాయి.  వెంకీ తరహాలో ట్రైన్ కామెడీ ఉంది. అలాగే  యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. కానీ ఈ జనరేషన్ వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్సే మిస్సయ్యాయి. సినిమా ఉంది. కానీ అందులో జరగాల్సిన మేజిక్ జరగలేదు. చూస్తూంటే ఫ్రెష్ ఫీల్ రాలేదు. ఇంతకు ముందు చూసేసినట్లుగా, బాగా నలిగిన ఫార్ములా ఫిల్మ్ చూసినట్లుగా అనిపించింది. 
 

Viswam movie Review


ట్రైన్ కామెడీ ని రవితేజ వెంకీ స్దాయిలో అన్నారు. కాకపోతే ఆ కాలం నాటి జోక్ లు, పంచ్ డైలాగులతోనే నింపేసారు. కేవలం వెన్నెల కిషోర్ మాత్రమే నవ్వించాడు. మిగతా కామెడీ యాక్టర్స్ కు ఆ మాత్రం ఫన్ కూడా క్రియేట్ చేయలేక చేతులు ఎత్తేసారు.  ఏదైమైనా ఫస్టాఫ్ ని ఫృధ్వీ కామెడీ, ఇంటర్వెల్ బ్లాక్  ఎంతో కొంత కాంపన్సేట్ చేసింది. సెకండాఫ్ లో ఆ మాత్రం కూడా లేకుండా పోయింది. హీరో ఫ్లాష్ బ్యాక్ , క్లైమాక్స్ లో హీరో,విలన్స్ మధ్య డైలాగ్స్ ఏంటో శ్రీను వైట్ల ఛాదస్తం  అనిపిస్తుంది. 
  

Gopichand, Srinu vytla, Viswam, Review,

టెక్నికల్ గా ...

చైతన్ భరద్వాజ్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ ..శ్రీను  వైట్ల గత చిత్రాల మాస్ సాంగ్స్ ని గుర్తు చేస్తాయి. గుహన్ కెమెరా వర్క్ ఎప్పటిలాగే నీట్ గా ఉంది. ఎడింటిగ్ మాత్రం చాలా చోట్ల లాగుతున్న ఫీలింగ్ వచ్చింది. ల్యాగ్ లు తగ్గించి  ఇంకాస్త షార్ప్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత బెటర్ అవుట్ ఫుట్ అనిపించేది.

డైలాగులు కొన్ని చోట్ల పేలాయి కానీ , చాలా చోట్ల తేలిపోయాయి.  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆర్టిస్ట్ లలో గోపించ్ యాక్షన్ సీక్వెన్స్ లు బాగా చేసారు. మిగతావాళ్ళలో పృధ్వీ కామెడీ అదరకొట్టాడు. సునీల్ ఓకే. హీరోయిన్ నామమాత్రం. విలన్ ని తొక్కేసారు. వెన్నెల కిషోర్ , ప్రగతి కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయ్యింది. 

Gopichand, Srinu vytla, Viswam, Review,


Final Thoughts
 
అయినా పండగనాడు కూడా పాత మొగుడేనా అని ప్రతి విషయంలోనూ ఫీలయ్యి కొత్తదనం వెతికే జనరేషన్ ఇది. అలాంటిది అప్పట్లో నచ్చినవి అన్ని ఇప్పుడు కూడా నచ్చాలంటే కష్టం కదా. అయినా గ్యాప్ వచ్చింది కదా విశ్వరూపం చూపెడతావు అనుకుంటే ఖాళీ విస్తరాకు చూపించావు. 

ఉన్నంతలో కాస్త కామెడీ ఎపిసోడ్స్ బెటర్.వాటిని ఎంజాయ్ చేయటానికి ఓ లుక్కేయచ్చు. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5

Viswam movie Review


బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు : గోపీచంద్, కావ్య థాపర్,జిష్షు సేన్‌గుప్తా, వీటీవీ గణేష్,
సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : K. V. గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
రైటర్స్: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్, ఆదిత్య చెంబోలు
దర్శకుడు : శ్రీను వైట్ల
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి
విడుదల తేది : 11 అక్టోబర్ 2024

click me!