God Movie Review: నయనతార `గాడ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 13, 2023, 10:41 AM IST

జయం రవి, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కలిసి నటించిన మూవీ `గాడ్‌`. ఇది తెలుగులో నేడు (శుక్రవారం) విడుదలైంది. మర్దర్‌ మిస్టరీ నేపథ్యంలో సైకో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఓ వైపు స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. తాజాగా ఆమె జయం రవితో కలిసి `గాడ్‌` మూవీలో నటించింది. ఐ అహ్మద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్‌ సుందరం, జి జయరాం, సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ గత వారం విడుదలైంది. తాజాగా నేడు(శుక్రవారం-అక్టోబర్‌ 13)న తెలుగులో రిలీజ్‌ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో (God Movie Telugu Review) తెలుసుకుందాం. 
 

కథః
సీటీలో సైకో కిల్లర్‌ వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. అమ్మాయిలను టార్గెట్‌ చేస్తూ అత్యంత దారుణంగా చంపేస్తుంటాడు. న్యూడ్‌గా చంపివదిలేస్తుంటాడు. తన సింబల్‌గా స్మైల్‌ గుర్తులను వదిలుతాడు. అలా స్మైలీ సైకో కిల్లర్‌గా పాపులర్‌ అవుతాడు. ఆ కేసుని పోలీస్‌ ఆఫీసర్స్ అర్జున్‌(జయం రవి), ఆండ్రూ(నరేన్‌) డీల్‌ చేస్తుంటారు. అనేక హత్యల అనంతరం ఎట్టకేలకు కిల్లర్‌ని పట్టుకుంటారు. అతడు స్మైలీ కిల్లర్‌ బ్రహ్మా(రాహుల్‌గా బోస్‌) గా గుర్తిస్తారు. కానీ అతన్ని పట్టుకునే సమయంలో జరిగిన గొడవలో ఆండ్రూ చనిపోతాడు. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా ఉందనుకునే సమయంలో కొన్ని రోజులకు ఆ కిల్లర్‌ ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. మళ్లీ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి హత్యలు చేస్తుంటాడు. టార్గెట్‌ అర్జున్‌ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. అలా బంధువు కూతురు కిడ్నాప్‌ చేసి చంపేస్తాడు. ఆ కసితో బ్రహ్మాని పట్టుకుని చంపేస్తారు అర్జున్‌ అండ్‌ పోలీస్‌ టీమ్‌. కానీ మళ్లీ అదే స్టయిల్లో అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి కొత్తగా జరిగే హత్యలకు కారకులు ఎవరు? ప్రాణంగా ప్రేమించే ప్రియా(నయనతార)ని అర్జున్‌ ఎందుకు దూరం (God Movie Review) పెడుతున్నాడు? ఆ తర్వాత చోటు చేసుకున్న ట్విస్ట్ లేంటి? అనేది సినిమా.


విశ్లేషణః
మర్డర్‌ మిస్టరీలు, సైకో కిల్లర్‌ చేసే హత్యల నేపథ్యంలో అనేక సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలు, సైకో థ్రిల్లర్‌ మూవీస్‌ వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని హిట్‌, మరికొన్ని ఫట్టు. ఇలాంటి సినిమాల్లో ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లే ముఖ్యం. ట్విస్ట్ లు వాహ్‌ అనిపించాలి. ఆడియెన్స్ ని థ్రిల్‌కి గురి చేయాలి. సినిమా రేసీగా సాగాలి. అప్పుడే సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. సక్సెస్‌ సాధ్యమవుతుంది. లేదంటే రొటీన్‌ మూవీ ట్రాక్‌లో పడిపోతుంది. జయం రవి, నయనతార కలిసి నటించిన `గాడ్‌` చిత్రం కూడా ఈ విషయంలో రొటీన్‌ ట్రాక్‌లోనే పడిపోయిందని చెప్పొచ్చు. నెక్ట్స్ ఏం జరుగుతుంది? ఎలాంటి సీన్లు ఎదురవుతుంటాయనేది ఊహించేలా, అర్థమయ్యేలా ఉండటం (God Movie Review) ఈ సినిమాకి మైనస్‌. నయనతార, జయం రవి నటించిన సినిమా అంటే ఆడియెన్స్ లో మంచి అంచనాలుంటాయి. బలమైన కంటెంట్‌ ఉంటుందనే భావనలో ప్రేక్షకులు ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం ఈ విషయంలో నిరాశ పరిచింది. రొటీన్‌ సీన్లు, రొటీన్‌ హత్యలు, ఇన్వెస్టిగేషన్‌ ఎంతకూ ముందుకు సాగకపోవడం విసుగు తెప్పిస్తుంది. కిల్లర్‌ ఎవడో తెలిసినా పోలీసులు ఏం చేయలేని స్థితిలో ఉండటం, ఇన్వెస్టిగేషన్‌ సీన్లు రేసిగా లేకపోవడంతో బోర్‌ తెప్పిస్తుంది. 
 

దీనికితోడు స్లో నెరేషన్‌ కూడా సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. హీరో జయం రవి ఏం చేయలేని స్థితిలో కనిపిస్తుంటాడు. ప్రతి విషయంలో ఆయన స్లో రియాక్షన్‌ నిరాశ పరుస్తుంది. ఆయన పాత్రలో ఏమాత్రం హీరోయిజం (God Movie Review) కనిపించదు. అలాగే నయనతార పాత్రని కేవలం ఆయనకు లవర్‌గానే పరిమితం చేశారు. మరోవైపు కిల్లర్‌కి సంబంధించిన ట్విస్ట్ ని రివీల్‌ చేసేటప్పుడు కిక్‌ ఇవ్వలేదు. బలమైన ట్విస్ట్ లు లేవు. దర్శకుడికి పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన అవగాహన లేదని ఆయా సీన్లని చూస్తే అర్థమవుతుంది. అయితే సినిమాలో కొన్ని సీన్ల వరకు బాగున్నాయి. ఎంగేజ్‌ చేస్తాయి. హత్యలకు సంబంధించిన కొన్ని డ్రామా సీన్లు బాగున్నాయి. మరో హంతకుడు ఎవరు? అనేది ఎంగేజ్‌ చేస్తుంది. అలాగే కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలను పట్టుకునే సమయంలో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. హత్యలు చేస్తున్నది ఎవరనేదానిపై వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్‌ లో ఉత్కంఠ రేకెత్తిస్తాయి. కానీ చివరగా దాన్ని తగ్గట్టుగా కిల్లర్‌ లేకపోవడం, పైగా కిల్లర్‌కి (God Movie Review) బలమైన కారణాలు లేకపోవడం కన్విన్సింగ్‌గా అనిపించదు. దీంతో ఇదొక రెగ్యూలర్‌ సైకో కిల్లర్‌ నేపథ్యంలో సాగే మర్డర్‌ మిస్టరీ చిత్రంగా నిలుస్తుంది. హత్యలకు సంబంధించిన ఎంచుకున్న అంశాలు కొన్ని కొత్తగా ఉంటాయి. 
 

నటీనటులుః 
అర్జున్‌ పాత్రలో జయం రవి కనిపించాడు. ఆయన సెటిల్డ్ గా నటించాడు. ఇలాంటి రేసీ మూవీలో ఆయన అంత కంట్రోల్ గా ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చిందో అర్థం కాలేదు. కానీ ఉత్కంఠరేపే సీన్లలో మాత్రం అదరగొట్టాడు. నయనతార పాత్రకి ఏమాత్రం బలం లేదు. జస్ట్ కొన్ని సీన్లకి, ప్రేమ సన్నివేశాలకే పరిమితమయ్యింది. చివర్లో సైకో కిల్లర్‌ వద్ద కొన్ని సీన్లలో మెప్పిస్తుంది. అలాగే నరేన్‌ పాత్ర ఉన్నంత సేపు  (God Movie Review)  ఆకట్టుకుంటుంది. హైలైట్‌గా నిలుస్తుంది. పోలీస్‌ ఆఫీసర్ గా ఆశిష్‌ విద్యార్థి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. సైకో కిల్లర్స్ తమదైన నటనతో మెప్పించారు. మొదటి కిల్లర్‌ కంటే రెండో కిల్లర్ డామినేషన్‌ ఎక్కువగా కనిపిస్తుంది. 
 

టెక్నీకల్‌గాః 
దర్శకుడు అహ్మద్‌.. బలమైన కథని రాసుకోలేకపోయాడు. రొటీన్‌ గా తెరకెక్కించాడు. ఎంగేజ్‌ చేయడంలో విఫలమయ్యాడు. ఉత్కంఠభరిత సీన్ల వరకు బాగా డీల్‌ చేశాడు. అయితే కిల్లర్‌ అంత క్రూరంగా ఎందుకు చంపుతున్నారనేది బలంగా చూపించలేకపోయాడు. కారణం స్ట్రాంగ్‌గా లేదు. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ సీన్ల విషయంలోనూ (God Movie Review)  తడబడ్డాడు. ఇక సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ప్లస్‌ అవుతుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి బ్యాక్‌ బోన్‌లా నిలుస్తుంది. చాలా సీన్లు బీజీఎంతోనే హైలైట్‌ అయ్యాయి. ఎంగేజ్‌ చేసేలా ఉన్నాయి. హరి కె వేదాంతం కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి. 

ఫైనల్‌గాః రొటీన్‌ సైకో థ్రిల్లర్‌ `గాడ్‌`.
రేటింగ్‌ః 2.25

Latest Videos

click me!