Prema Vimanam Review: `ప్రేమ విమానం` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Oct 12, 2023, 11:39 AM IST

యాంకర్‌ అనసూయ, సంగీత్‌ శోభన్‌, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ప్రేమ విమానం`. ఈ ఓటీటీ ఫిల్మ్ నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

యాంకర్‌ అనసూయ టీవీ వదిలేసి సినిమాలతో బిజీ అవుతుంది. ఆమె బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. `రంగమార్తాండ`, `విమానం`, `పెదకాపు` చిత్రాల్లో స్ట్రాంగ్స్ రోల్స్ చేసింది. ఇప్పుడు `ప్రేమ విమానం` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. మరోవైపు ఇటీవలే `మ్యాడ్‌` చిత్రంతో హిట్‌ కొట్టాడు హీరో సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్‌ శోభన్‌. ఇప్పుడు `ప్రేమ విమానం`లో తన ప్రేమ కథని చెప్పబోతున్నాడు. సంతోష్‌ కటా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా, జీ5 రూపొందించారు. నేటి నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో (Prema Vimanam Review) తెలుసుకుందాం. 
 

కథః
హైదరాబాద్‌ సమీపంలోని రెండు పల్లెటూర్లలో 1990లో జరిగే స్టోరీ ఇది. ఓ పల్లెటూర్లో శాంతమ్మ(అనసూయ) తన భర్త ఇద్దరు పిల్లలు రామ్‌ లక్ష్మణ్‌(దేవాన్ష్‌ నామా, అనిరుథ్‌ నామా)లతో ఓ చిన్న గుడిసెలో ఉంటుంది. కాలం కలిసి రాదు, అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు ఇచ్చినవాడు ఒత్తిడి చేస్తాడు. దీంతో బాధ భరించలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో తమ ఇద్దరు విమానం ఎక్కాలనే పిచ్చి పట్టుకుంటుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రతి రోజు విమానం మీదే ద్యాస. విమానం ఎక్కాలంటే పది వేలు కావాలని ఊర్లో ఉండే పంతులు(వెన్నెల కిషోర్‌) అందుకు పదివేలు కావాలి. ఆ డబ్బులు సంపాదించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. అదే సమయంలో సేటు అప్పు తీర్చేందుకు శాంతమ్మ కూలి పనులు చేస్తుంది, ఇరుగు పొరుగు వాళ్లని అప్పు అడుగుతుంది. కొంత డబ్బుని పోగు చేస్తుంది. ఆ డబ్బు చూసిన పిల్లలు ఓ రోజు రాత్రి ఆ డబ్బు తీసుకుని విమానం ఎక్కాలని సీటీకి వస్తారు. మరి విమానం ఎక్కరా? సిటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?. 

మరోవైపు పక్క ఊర్లో  మణి( సంగీత్‌ శోభన్‌)తన తండ్రితోపాటు కిరాణషాపు నడిపిస్తుంటాడు. ఊరి సర్పంచ్‌ కూతురు అబిత(శాన్వీ మేఘన)ని చిన్నప్పట్నుంచి ఇష్టపడతారు. వీరిద్దరి ప్రేమకి పార్లీ బిస్కట్‌ మూలం అవుతుంది. ప్రేమ పీక్లోకి వెళ్తుంది. అప్పుడే అబితకి ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. అనుకోకుండా ఓ అమెరికా సంబంధం ఓకే అవుతుంది. పది రోజుల్లో చూడ్డానికి వస్తారు. అంతలోనే వీరి ప్రేమ విషయం అబిత అమ్మకి తెలుస్తుంది. దీంతో ఆమెని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కట్టడి చేస్తుంది. కానీ ఇంటి నుంచి (Prema Vimanam Review) పారిపోవాలని, దుబాయ్‌ వెళ్లాలని ప్లాన్‌ చేస్తారు? మరి దుబాయ్‌ వెళ్లారా? దొరికిపోయారా? ఇంకోవైపు విమానం ఎక్కాలనుకున్నా ఆ పిల్లల కోరిక తీరిందా? ఆ కథకి, ఈ ప్రేమ జంట కథకి లింకేంటి? అనంతరం కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా. 
 


విశ్లేషణః

గతంలో జరిగిన విషయాలకు సంబంధించి ఇప్పుడు కథ చెప్పడం అనే ట్రెండ్‌ చాలా రోజులుగా నడుస్తుంది. `మహానటి`, `జార్జిరెడ్డి` వంటి చిత్రాల్లో చూశాం. చాలా మంది మేకర్స్ ఇలాంటి స్టయిల్‌నే ఎంచుకుని కథ చెబుతుంటారు. ఆడియెన్స్ ని గతంలోకి తీసుకెళ్తుంటారు. తాజాగా విడుదలైన `ప్రేమ విమానం` సినిమాకి సంబంధించి దర్శకుడు ఇదే స్టయిల్‌ని ఫాలో అయ్యాడు. ఇందులో ఓ వైపు పల్లెటూరిలో ఇద్దరు చిన్నపిల్లలు విమానం ఎక్కాలనే కోరికని, మరో ఊర్లో ఓ ప్రేమ జంట ప్రేమని (Prema Vimanam Review) పారలల్‌గా ఆవిష్కరిస్తూ వచ్చాడు. అదే సమయంలో సినిమాలో పల్లెటూరిలో ఓ రైతు అప్పుల బాధలు, కరువు పరిస్థితులను ఇందులో టచ్‌ చేశాడు దర్శకుడు సంతోష్‌ కటా. సినిమాని ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ రైడ్‌లా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 

సినిమా మొదటి భాగం కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి పాత్రల మధ్య సంఘర్షణకి ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు. అనసూయ ఫ్యామిలీ ధీన స్థితిని ఆవిష్కరిస్తూనే తన పిల్లలు విమానం ఎక్కాలనే కోరికని పెంచుతూ వెళ్లారు. ఆమె ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుండగా, పిల్లల కోరిక మాత్రం మరింత బలంగా మారుతుంది. ఈ సీన్లకి సంబంధించి అనసూయ ఫ్యామిలీ అప్పులను ఎమోషనల్‌ వేలో ఆవిష్కరించారు. అదే సమయంలో తన కుమారుల ఇన్నోసెంట్‌, విమానానికి సంబంధించిన అనేక డౌట్లని వెన్నెల కిషోర్‌ని అడుగుతూ ఉండటం వంటి సీన్లని ఫన్నీవేలో చూపించారు. ఆయా సీన్లు ఆద్యంతం నవ్వించేలా డిజైన్‌ చేసుకున్నారు. 
 

మరోవైపు మణి, అబిత జంట ద్వారా సంగీత్‌, శాన్వి మేఘన ల ప్రేమ కథని ఆవిష్కరించారు. దాన్ని ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా మార్చారు. ఇలా ఏక కాలంలో మూడు ఎమోషన్స్ ని తీసుకెళ్తూ ఆడియెన్స్ ని భిన్న భావోద్వేగాల్లో ముంచెత్తుతూ ఎంగేజ్‌ చేశారు. ఇలా రెండు కథలు, మూడు ఎమోషన్స్ ఓ రోలర్‌ (Prema Vimanam Review) కోస్టర్‌లా మార్చేశారు. సెకండాఫ్‌లోనూ దీన్నే ఫాలో అయ్యారు. అన్నీ పీక్‌లోకి వెళ్తాయి. పిల్లలు విమానం ఎక్కడం కోసం ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవడం, ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోవాలనుకోవడం, అప్పు తీర్చడం కోసం అనసూయ డబ్బు పోగు చేయడం, అనంతరం చోటు చేసుకున్నపరిణామాలు,  ట్విస్ట్ లు అన్నీ ఆద్యంతం ఎంగేజ్‌ చేస్తాయి. అలరిస్తాయి. అదే సమయంలో ఫన్‌, ఎమోషన్స్‌, లవ్‌ ఫీల్‌ని కూడా పీక్‌లోకి తీసుకెళ్లారు. 
 

సినిమాలో ప్రధానంగా అన్ని లైటర్‌వేలోనే ఉన్నాయి. బలంగా ఏ విషయాన్ని చెప్పలేకపోయారు. బలమైన ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. సంఘర్షణలో ఘాఢత తగ్గింది. ఆ ఎమోషన్స్ వెండితెరపై అనుకున్న స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. లైట్‌ గా టచ్‌ చేసినట్టుగానే ఉంటాయి. గుండెని పిండేసే సీన్లు ఉన్నా, ఆ ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. ఆ పెయిన్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. పిల్లల అమాయకత్వంలో, వెన్నెల కిషోర్‌ని డిస్టర్బ్ చేసే సీన్లలో కామెడీకి ఆస్కారం ఉన్నా, అవి చాలా వరకు రొటీన్‌గానే అనిపిస్తాయి. దీంతో ఫన్‌ పూర్తి స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. ఇక అనసూయ ఫ్యామిలీకి సంబంధించిన చాలా ఎమోషన్స్ ఉన్నాయి, బాధ ఉంది. కానీ తెరపై అది పూర్తిగా పండలేదు. ప్రేమ సంబంధించిన ఫీల్‌ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. పైగా చాలా వరకు సినిమా ఊహించేలా ఉంది. ఆ మధ్య వచ్చిన `విమానం`కథకి లవ్‌ స్టోరీని యాడ్‌ చేసినట్టు అనిపిస్తుంది. దీంతో సినిమాతో చాలా చోట్లు ఆడియెన్స్ డిస్‌ కనెక్టింగ్‌ అవుతారు. డిటెయిలింగ్‌లోకి వెళ్లే క్రమంలో సినిమా స్లోగా మారిపోతుంది. అది బోర్ తెప్పిస్తుంది.  ఫైనల్‌ ట్విస్ట్ బాగున్నా,  వాహ్‌ అనేలా లేదు.
 

నటీనటులుః 

శాంతమ్మ పాత్రలో, పేదరికంలో, అప్పుల బాధలో మగ్గే ఇల్లాలుగా అనసూయ బాగా చేసింది. మరో బలమైన పాత్ర, నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దక్కింది. చాలా వరకు నేచురల్‌గా అనసూయ బాగా చేసింది. పిల్లలిద్దరు దేవాన్ష్‌ నామా, అనిరుథ్‌ నామా చాలా బాగా చేశారు. చిన్నబ్బాయి అనిరుథ్‌ మాత్రం ఇరగదీశాడు. అద్బుతమైన ఎక్స్ ప్రెషన్స్ పలికించాడు. ఇండస్ట్రీకి మంచి చైల్డ్ ఆర్టిస్ట్ దొరికినట్టే. ప్రేమ జంటగా సంగీత్‌ శోభన్‌, శాన్వి సైతం అదరగొట్టాడు. `మ్యాడ్‌`లో ఫన్‌తో (Prema Vimanam Review) ఇరగదీసిన సంగీత్‌, ఇందులో లవర్‌గా సెటిల్డ్ గా మెప్పించాడు. సహజమైన భావోద్వేగాలు, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. శాన్వీ సైతం లవర్‌గా కనువిందు చేసింది. హీరో తండ్రిగా గోపరాజు రమణ మరో ఆకట్టుకునే పాత్ర అవుతుంది. హీరో ఫ్రెండ్‌గా అభయ్‌ నవీన్‌ కాసేపు మెప్పించాడు. ఇతర పాత్రలు ఫర్వాలేదనిపించాయి. సహజంగా కనిపించాయి. 

టెక్నీకల్‌గాః
టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. అనూప్‌ రూబెన్స్ సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యింది. పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉంది. డీసెంట్‌గా అనిపించింది. ఎమోషన్స్ పరంగా బీజీఎంలో ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది. సినిమాటోగ్రాఫర్‌ జగదీష్‌ చీకటి విజువల్స్ ప్లసెంట్‌గా అనిపించాయి. పల్లేటూరి చాలా అందంగా, చాలా నేచురల్‌గా చూపించారు. ఎడిటింగ్‌ పరంగా అమర్‌ రెడ్డి ఇంకాస్త కేర్‌ తీసుకోవాల్సింది. స్లో సీన్లు, ల్యాగ్‌ లు కట్‌ చేస్తే బాగుండేది. గంధి (Prema Vimanam Review) నడికుడికర్‌ ఆర్ట్ వర్క్ బాగుంది. ఆ కాలాన్ని ఆవిష్కరించింది. నిర్మాతలు ఉన్నంతలో బెటర్‌గా నిర్మించారు. దర్శకుడు సంతోష్‌ కటా టేకింగ్‌ బాగుంది. రెండు కథలను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. కానీ ఎమోషన్స్ పరంగా ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఆడియెన్స్ కి ముందే అర్థమవుతుంది. ఆ విషయంలో స్క్రిప్ట్ పరంగా బలంగా రాసుకుని, ఫన్‌, ఎమోషన్స్ పై ఫోకస్‌ పెడితే ఫలితం ఇంకా బాగుండేది. 

ఫైనల్‌గాః లైటర్‌ వేలో సాగే ఫన్‌, లవ్‌, ఎమోషనల్‌ రైడ్‌ `ప్రేమ విమానం`. 

రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!