First Time Review: ఫస్ట్ టైమ్‌ మూవీ రివ్యూ, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రియుడి సినిమా ఎలా ఉందంటే?

Published : May 22, 2026, 03:53 PM IST

తెలుగులో సైన్స్ ఫిక్షన్‌ చిత్రాలు రావడం చాలా అరుదు. తాజాగా `ఫస్ట్ టైమ్‌` అనే మూవీ రూపొందింది. సౌరబ్‌ ధింగ్రా, అఖిల్‌ సార్థక్‌, అనిక విక్రమ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఎలా ఉందంటే? 

PREV
16
ఫస్ట్ టైమ్‌ మూవీ రివ్యూ

హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ఫ్రెండ్‌ సౌరబ్‌ ధింగ్రా హీరోగా, అనిక విక్రమన్‌ హీరోయిన్‌గా, అఖిల్‌ సార్థక్‌ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ `ఫస్ట్ టైమ్‌`. హేమంత్‌ ఇప్పలపల్లి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఆయనే నిర్మాత కూడా. సైన్స్ ఫిక్షన్‌, అడ్వెంచర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ మూవీ నేడు శుక్రవారం (మే 22న) విడుదలైంది. మరి తెలుగులో వచ్చిన ఈ సరికొత్త మూవీ ఎలా ఉంది. ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
ఫస్ట్ టైమ్‌ మూవీ కథ ఇదే

ఆద్య(అనిక విక్రమన్‌) ఒక స్పెషల్‌ ఉమెన్‌.  కాలేజీలో ఆమెకి చాలా ఫాలోయింగ్‌ ఉంటుంది. ప్రతి ఒక్కడు ఆమెని ప్రేమించాలని, ఆమెని అనుభవించాలని తపిస్తుంటారు. అదే సమయంలో సొంత బావ కూడా ఆమెని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె మాత్రం తనకు సెట్‌ అయ్యే సోల్‌ మేట్‌ని వెతుక్కుంటుంది. సోల్‌ మేట్‌ని వెతుక్కునే క్రమంలో ఫ్రెండ్‌(గాయత్రి గుప్తా) హెల్ప్ చేస్తుంది. కానీ ఆమె కూడా మోసం చేసిందని తర్వాత అర్థమవుతుంది. ఒక అపరిచిత వ్యక్తి వద్ద వదిలేస్తుంది. అతన్నుంచి తప్పించుకొని వస్తుంది. ఆ తర్వాత కాలేజీలో తనకోసం కుర్రాళ్ల మధ్య గొడవ అవుతుంది. ఆది(అఖిల్‌ సార్థక్‌) వచ్చి తనని ఏడిపించే కుర్రాళ్లని కొడతాడు. దీంతో ఆదికి ఇంప్రెస్‌ అవుతుంది ఆద్య. ఇద్దరూ ప్రేమలో పడతారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. అయితే ఆద్య అనుకోకుండా ఓ ప్రమాదంలో ఇరుక్కుంటుంది. స్పృహ కోల్పోతుంది. ఆమెని సేవ్‌ చేసేందుకు ప్రైవేట్‌ జెట్‌ సహాయంతో దూరంగా వెళ్లిపోతారు. కానీ మధ్యలో ఆమె స్పృహలోకి రావడంతో గొడవ అవుతుంది. దీంతో జెట్‌ క్లాష్‌ అవుతుంది. ఇద్దరు సముద్రంలోకి దూకుతారు. మరి దాన్నుంచి ఎలా బయటపడ్డారు? సర్వైవ్‌ కోసం ఏం చేశాడు? పాత కెమికల్‌ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది? ఒక జర్నలిస్ట్ ఆదికి ఏం చెప్పాడు? ఫైనల్‌గా ప్రపంచంలో చోటు చేసుకున్న షాకింగ్‌ సంఘటన ఏంటి? మనిషి స్థానంలో ఆత్మలు, రోబోలు, ఏలియన్స్ ఎందుకు వచ్చాయి? చివరికి ఈ కథ ఎలాంటి ముగింపు తీసుకుందనేది సినిమా.

36
ఫస్ట్ టైమ్‌ మూవీ ఎలా ఉందంటే?

సైన్స్ ఫిక్షన్‌, అడ్వెంచర్‌, థ్రిల్లర్‌ అంశాలతో సాగే చిత్రమిది. ఏలియన్స్ భూమిపైకి రావడం, తమ జాతిని విస్తరించాలనుకోవడం, మనిషి అంతరించిపోగా, ఆత్మలు వచ్చి ఏలియన్స్ కి అసలు కథ చెప్పడంతో ఈ మూవీ ప్రారంభమవుతుంది. ప్రారంభంలోనే సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తుంది. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ఆ తర్వాత సరికొత్త సృష్టికి మూలం అయిన అమ్మాయి కథ చెబుతారు. ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను రివీల్‌ చేస్తారు. హీరోయిన్‌ అందంగా ఉండటం, వర్జిన్‌ కావడం, అందరు ఆమె వెంటపడటం, ఇంట్లో బావ, కాలేజీలో పోరగాళ్లు ఆమెని ప్రేమతో వేధించడం వంటి సంఘటనలు కొంత రెగ్యూలర్‌ సినిమాలను తలపిస్తుంది. ఆ తర్వాత ఫస్టాఫ్‌ అంతా అమ్మాయి చుట్టూనే  తిరుగుతుంది. ఆమె కథనే ఏలియన్స్ డిస్కష్‌ చేస్తాయి. సెకండాఫ్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. హీరోహీరోయిన్లు సముద్రంలో చిక్కుకోవడం, మనుగడకోసం వాళ్లు పడే బాధ వంటి సన్నివేశాలు ఎంగేజ్‌ చేస్తాయి. అయితే సినిమా నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ ప్లే మెథడ్‌లో సాగుతుంది. ముందు వెనక్కి వెళ్లినట్టుగా ఉంటుంది. ఇది దర్శకుడి టాలెంట్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో అది కొంత కన్‌ఫ్యూజన్‌కి కారణమవుతుంది. అర్థం కాని విధంగా ఉంటుంది. 

అయితే ఫస్టాఫ్‌ వరకు ఈ సమస్య వస్తుంది. కానీ చాలా అంశాలను ఇందులో చూపించారు. ఓ వైపు అమ్మాయిజర్నీ, మరోవైపు ఆకాశంలో జరిగే పరిణామాలు, మరోవైపు భూమిపై విధ్వంసానికి ప్రయోగాలు జరగడం వంటి అంశాలను పారలల్‌గా రన్‌ అవుతుంటాయి. దీన్ని తెలివిగా నడిపించారు. సెకండాఫ్‌ లో కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అప్పుడు అసలు క్లారిటీ వస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఈ ప్రపంచమే అంతం కావడం, మళ్లీ కొత్త యుగం స్టార్ట్ కావడమనే అంశాలు ఎంగేజ్‌ చేస్తాయి. వాహ్‌ అనిపిస్తాయి. సృష్టికి మూలానికి సంబంధించిన చర్చ బాగుంది. కొత్తగా హీరోహీరోయిన్‌ మరో సృష్టికి కారణమయ్యారనే అంశాలు బాగున్నాయి. చాలా అడ్వాన్స్ థింకింగ్‌తో ఈ మూవీని రూపొందించారు. అయితే స్లోగా సాగుతుంది, అర్థంకాకపోవడం, మైనస్‌గా చెప్పొచ్చు. చాలా సీన్లు కన్విన్సింగ్‌గా లేవు. పాయింట్‌ పరంగా బాగున్నా, దాన్ని క్లారిటీగా తెరకెక్కించలేకపోయారు. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ మిస్‌ అయ్యింది. నటీనటుల నటన, సౌండింగ్‌ కూడా మైనస్‌గా నిలుస్తాయి. మనిషి జాతి సరికొత్తగా రూపాంతరం చెందడం, భారతజాతినే భూమిపై ఉంటారనే అంశాలు బాగున్నాయి.

46
ఫస్ట్ టైమ్‌లో నటీనటులు ఎలా చేశారంటే?

ఆది పాత్రలో అఖిల్‌ సార్థక్‌ బాగా చేశాడు. మెప్పించాడు. డబ్బింగ్‌ సెట్‌ కాలేదు. ఆది పాత్రలో రెండు రూపాలు ఉంటాయి. మరో లుక్‌లో సౌరబ్‌ ధింగ్రా బాగా నటించాడు. ఉన్నంతలో బెస్ట్ ఇచ్చాడు. కాకపోతే ఆయన పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. సినిమాగా ఇది ఆయనకు తొలి చిత్రం. మొదటి మూవీనే మెప్పించే ప్రయత్నం చేశాడు. ఆద్యగా అనిక విక్రమన్‌ బాగా చేసింది. ఈ పాత్రకు బాగా సెట్‌ అయ్యింది. సహజంగా చేసి మెప్పించింది. ఆమె ఫ్రెండ్‌గా గాయత్రి గుప్తా కనిపించింది కాసేపే అయినా ఆక్టటుకుంటుంది. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి. అయితే నటీనటుల నటనకు సంబంధించి పర్‌ఫెక్షన్‌ మిస్‌ అయ్యింది.

56
ఫస్ట్ టైమ్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే

ఈ మూవీకి దర్శకుడు హేమంత్‌ అన్నీతానై చేశాడు. వీఎఫ్‌ఎక్స్ అతనే డిజైన్‌ చేశాడు, ఎడిటింగ్‌ చేశాడు. దర్శకత్వం, రచన ఇలా అన్నీ ఆయనే చూసుకున్నారు. దర్శకుడిగా కథకి న్యాయం చేశాడు. కాని ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కొంత క్లారిటీ మిస్‌ అయ్యింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. రాజీపడకుండా నిర్మించారు. అయితే వీఎఫ్‌ఎక్స్ ఇందులో సర్‌ప్రైజ్‌. ఈ స్థాయిలో ఊహించలేం. బాగా చేశారు. టెక్నికల్‌గా మూవీ బాగుంది.

66
ఫైనల్‌గా

సరికొత్త అనుభవాన్ని, అనుభూతిని కలిగించే మూవీ ఫస్ట్ టైమ్‌. చెప్పాలనుకున్న పాయింట్‌ బాగుంది. 

రేటింగ్‌: 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories