బిగ్‌బాస్4లో బాగా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సోహైల్ చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తన మేనరిజంతో అందరికి దగ్గరయ్యారు.
`కథ వేరేలా ఉంటది..`, `సింగరేణి ముద్దు బిడ్డ` అనే పదాలు, `నైట్ తొమ్మిది తర్వాత షెడ్‌కి వెళ్లడం` అనే విషయం అటు హౌజ్‌లోని కంటెస్టెంట్లకి, ఇటు టీవీ ఆడియెన్స్ కి తెగ నచ్చేశాడు. తన బోళా ప్రవర్తన బాగా ఆకట్టుకుంది. బిగ్‌బాస్4 ఫైనల్‌లో టాప్ 3లో నిలిచారు సోహైల్. కానీ అందరిచేత అసలైన విన్నర్ అనిపించుకున్నారు.
బిగ్ బాస్ ఆఫర్ ప్రకారం 25 లక్షలు తీసుకుని మధ్యలోనే డ్రాప్ అయ్యారు. ఫైనల్ వేదికలో చిరంజీవి ప్రశంసలందుకున్నారు. ఎన్జీవోకి నాగార్జున పది లక్షల విరాళం అందించారు. అటు చిరంజీవి సైతం మెహబూబ్‌కి సోహైల్ తరపున తాను ఇస్తానన్నాడు. అంతేకాదు తన సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని చిరు హామీ ఇచ్చారు.
ఇలా బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అత్యంత క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు సోహైల్. తాను పాపులర్ అవ్వడమేకాదు, తాను వాడే పదాలను పాపులర్ చేసుకున్నారు. తన ప్రాంతం సింగరేణికి పాపులారిటీని తీసుకొచ్చారు. తన తండ్రి చేసే వృత్తికి పాపులారిటీ తెచ్చిపెట్టాడు. తనతో కలిసి ఉన్న అందరినీ హైలైట్ చేశాడు, చేయించాడు.
ఇదిలా ఉంటే ఫినాలే రోజు తాను మూడో స్థానంలో ఉంటానని మెహబూబ్ ఇచ్చిన సిగ్నల్ వైరల్ అయ్యింది. సోహైల్, మెహబూబ్ కలిసి జనాలను మోసం చేశారనే కామెంట్లు, విమర్శలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే సోహైల్ స్పందించి ఖండించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరింత వివరణ ఇచ్చారు. షాకింగ్ విషయాలను వెల్లడించారు. అవి నిరాధార ఆరోపణలని, అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. నాపై వచ్చిన కథనాలతో తాను తీవ్రంగా బాధపడ్డాడట. ఇంత ఘోరంగా విమర్శలు వస్తాయనుకోలేదట.
తాను విన్నర్‌ని కాదని తెలిసే, 25లక్షలు తీసుకున్నాడని అనడం సరికాదు. నాకు ఆ మొత్తం చాలా ముఖ్యం. అది నాకు పెద్ద ఎమౌంట్. అది ఆ టైమ్‌లో తీసుకున్న నిర్ణయం తప్ప, మరోటి కాదు, మెహబూబ్ నాకు చెప్పాడనడం వాస్తవం కాదని సోహైల్ తెలిపారు. ఇలా డబ్బులు తీసుకోవడంలో తాను ఏమాత్రం పాశ్చాత్తాపానికి గురి కావడం లేదన్నారు.
బిగ్‌బాస్ హైజ్‌లోకి రావడం, అందులో ఉన్నన్ని రోజులు ఓ గొప్ప మెమరీ అవుతుంది. ఇదొక ఎమోషనల్ జర్నీ అని చెప్పాడు. హైజ్ మంచి స్నేహితులను ఇచ్చిందని చెప్పాడు. అంతేకాదు తాను పదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతున్నాడు. హీరోగా రాణించాలని ఎన్నో సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతున్నానని, ఈనాటికి తనకంటూ ఓ గుర్తింపు వచ్చిందని సోహైల్ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
సోహైల్ హీరోగా ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించారు. `జార్జ్‌రెడ్డి`, `ప్రెషర్ కుక్కర్` నిర్మాత అప్పిరెడ్డి.. సోహైల్ హీరోగా, శ్రీనివాస్ అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. మరోవైపు సోహైల్‌కి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పటికే స్టార్‌మాలో `బిగ్‌బాస్ బుజ్` ప్రోగ్రామ్‌కి హోస్ట్ గా అవకాశం ఇచ్చారట. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారని టాక్. దీంతోపాటు తన ఊరైన సింగరేణి నేపథ్యంలో తాను హీరోగా ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు టాక్.