యశస్వి ఇప్పుడిప్పుడే సింగర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఈవెంట్‌లో పాటలు పాడి అలరించారు. మంచి పేరు తెచ్చుకున్నాడు.
తాజాగా ఆయన జీ తెలుగు నిర్వహించే `సారేగమపా నెక్ట్స్ సింగింగ్ ఐకాన్`లో పాట పాడాడు. `జాను` సినిమాలోని `లైఫ్ ఆఫ్ రామ్` పాటని తన స్టయిల్‌లో పాడాడు. అంటేపాట ఒరిజినల్ ఎలా ఉందో అలానే పాడాడు. అంతే అందరిని ఫిదా చేశాడు.
యశస్వి పాడిన పాటకి రైటర్ చంద్రబోస్, ఎస్పీ శైలజ, కోటి లాంటి వారి ఫిదా అయ్యారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఒరిజినల్‌కి ఏమాత్రం తక్కువ లేదన్నారు. ఇంకాచెప్పాలంటే దానికంటే బాగా ఉందనేలా మాట్లాడారు.
అంతేకాదు యూట్యూట్‌లోనూ ఈ పాట వైరల్ అవుతుంది. దీంతో జీ తెలుగు నిర్వహించిన మరో ఈవెంట్‌లో యశస్వి చే ఆ పాటని పాడించారు. అందులో జానీ మాస్టర్, పవన్‌మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొన్నారు. దీంతో జీ కుటుంబం మొత్తం కదిలి వచ్చింది.
ఈ ఈవెంట్‌లో యశస్వి పాడిన పాటకి ఓ సీరియల్ నటి మైమరచిపోయింది. ఆ వెంటనే వెళ్లి స్టేజ్‌పై యశస్విని హగ్ చేసుకుంది.
బిగ్గరగా వాటేసుకుని నీ వాయిస్‌కి పెద్ద అభిమానిని అయిపోయా. పాట విన్నాక నా బాధలన్నీ మర్చిపోయానని తెలిపింది.
నీ పాటకి పెద్ద అభిమానిని అయిపోయా. వేరే ఉద్దేశం అంటూ ఏం లేదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్నా ఫర్వాలేదని తెలిపింది. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కి గురయ్యారు.
అంతేకాదు యశస్వి సైతం పెద్ద షాక్‌కి గురయ్యాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అలా ఉండిపోయాడు. తాజాగా ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.