Bigg Boss Season 6: ఒంటరివాడినయ్యానన్న ఫీలింగ్ లో రేవంత్, నోటిదురుసు చూపించిన గలాట గీతు

First Published | Sep 8, 2022, 12:37 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదటి రోజు నుంచే వాడీ వేడిగా నడుస్తోంది.. రెండు రోజులు మాటల యుద్దంతో హౌస్ అంతా హడావిడిగా మారింది. ఇక నామీనేషన్స్ టైమ్ కావడంతో.. బిగ్ బాస్ హౌస్ లో మంటలు మండుతున్నాయి. 
 

ఈవారమే స్టార్ట్ అయిన బీగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుంచే  వాడీ వేడి చర్చలు, వాదోపవాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఇక నామీనేషన్లు ప్రక్రియ బిగ్ బాస్ హౌస్ మెంట్ల లో మరింత అగ్గిని రాజేసింది. నామినేషన్ కు ముందే మాటలయుద్దం జరుగుతుండగా.. అది ఇప్పడు ఇంకా పెరిగింది. 
 

ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ప్రకారం ముఖ్యంగా  సింగర్ రేవంత ఒంటరివాడు అయ్యానన్న ఫీలింగ్ లో ఉన్నాడు. మొదటి నుంచి హౌస్ లో హడావిడి చేస్తూ వస్తున్న రేవంత్.. నిన్న నామిమేషన్స్ లో అందరిక టార్గెట్ అయ్యాడు. దాదాపు అందరూ రేవంతన్ ను ఎలిమినేషన్స్ కోసం   నామినేట్ చేశారు. 
 


నామినేషన్స్ లో తాను టార్గెట్ అవ్వడంతో రేవంత ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తను ఎవరికి నచ్చడంలేదని.. ఏం తప్పు చేశానో తెలియడంలేదు అని బాధపడుతున్న రేవంత్ ను బాల ఆదిత్య ఓదార్చాడు. నామినేషన్స్ అనేవి సహజం.. ఏదో ఒక తప్పు చూపించి నామినేట్ చేయాల్సిదే.. దాని గురించి బాధపడొద్దంటూ.. ఓదార్చాడు.. 

Bigg boss telugu 6

ఇక ఇంట్లో..  ఇనయా సుల్తాన రచ్చ అలాగే కొనసాగుతుంది. ఆమెకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదంటూ.. తనను టార్గెట్ చేస్తున్నారని పాడిన పాటే పాడుతోంది. ఈ విషయంలో బాల ఆదిత్యతో కూడా వాదనకు దిగింది ఇనయా. అటు చాలా ఓపికగా విషయం వివరించిన బాలాదిత్య కూడా ఇనయా చిరాకు తెప్పిచండంతో కాస్త గట్టినే చెప్పాడు.. నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని. నీతో యుద్ద చేయడానికి తాను సిద్దంగా లేనని. 
 

ఇటు గలాట గీతు నోటి దురుసు బాగాపెరిగిపోయింది. ఊరికే ఉన్నది ఉండకుండా.. రేవంత ఈ హౌస్ లో ఉండే అర్హత లేదంటూ.. ఆయన్ను ఇంత మంది నామినేట్ చేశారు. ఇంకా ఇదే ఆటిట్యూడ్ తో హౌస్ లో ఉంటే.. జనాలు అతన్ని అసహ్యించుకుంటారంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. దాంతో ఆమెపై చంటీ ఫైర్ అయ్యాడు. ఈసారి నాగార్జున్ క్లాస్ గట్టిగా ఇచ్చే వారిలో గలాట గీతు ముందు ఉండే అవకాశం ఉంది. 

మోత్తానికి ఈరోజు రిలీజ్ అయిన ప్రమో ప్రకారం చూస్తే.. హౌస్ అంతా గందరగోళంగా.. గోడవల మయంగా ఉంది. వీకెండ్ లో వీరిని నాగార్జున సెట్ చేసి  క్లాస్ పీకితే కాని ఒక్కొక్కరు సెట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. 
 

మోత్తానికి ఈరోజు రిలీజ్ అయిన ప్రమో ప్రకారం చూస్తే.. హౌస్ అంతా గందరగోళంగా.. గోడవల మయంగా ఉంది. వీకెండ్ లో వీరిని నాగార్జున సెట్ చేసి  క్లాస్ పీకితే కాని ఒక్కొక్కరు సెట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. 
 

Latest Videos

click me!