Pizza 3 The Mummy
హారర్ థ్రిల్లర్ 'పిజ్జా సినిమా తమిళ డబ్బింగ్ అయినా ఇక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఆ తర్వాత అదే ఫ్రాంచైజీలో వచ్చిన మరో సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. దాంతో ఇప్పుడు 'పిజ్జా 3'ని దించారు. ఈ మధ్యే తమిళంలో రిలీజైన పిజ్జా 3 మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మనవాళ్లకు నచ్చుతుందా..పిజ్జా సినిమాతో ఈ సినిమాకు కనిక్టివిటీ ఉందా వంటి విషయాలు చూద్దాం.
Pizza 3 The Mummy
స్టోరీ లైన్
రెస్టారెంట్ ఓనర్ అయిన నలన్(అశ్విన్ కాకుమాను)ది హ్యాపీ లైఫ్. కాయల్(పవిత్రా మారిముత్తు) అనే యాప్ డెవలపర్‌తో ప్రేమలో ఉంటాడు. తమ ప్రేమ విషయం ఆమె అన్నయ్యకు చెప్పి పెళ్లి ప్రపోజల్ పెడతాడు. అయితే ఆమె అన్నయ్య ...నలన్‌ని అవమానిస్తాడు. ఈ లోగా ఊహించని విధంగా నలన్ రెస్టారెంట్‌లో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. నలన్ కు తెలిసిన కొందరు వ్యక్తులు వరసగా అనుమానాస్పద రీతిలో చనిపోతుంటారు. అందుకు కారణం చిన్న సైజ్ ఈజిప్ట్ మమ్మీ బొమ్మ. ఆ బొమ్మ..ఓ కుటుంబం నుంచి అనుకోకుండా రెస్టారెంట్ నడుపుతున్న నలన్ దగ్గరకు చేరుతుంది. పనివాళ్లు దాన్ని తీసి ఓ చోట పెట్టడం, దీంతో రాత్రుళ్లు ఆ రెస్టారెంట్‌లో వింత వింత శబ్దాలు రావడం లాంటివి జరుగుతాయి. ఈ క్రమంలో నలన్‌కి తెలిసిన వ్యక్తులు చనిపోతారు. ఇంతకీ ఈ మరణాలకు ఆ బొమ్మకు ఉన్న లింక్ ఏమిటి... బొమ్మలో ఉన్న ఆత్మ అందరినీ చంపడానికి కారణమేంటి? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
Pizza 3 The Mummy
విశ్లేషణ
ఒక సినిమా హిట్ అయ్యిందంటే దానికి సీక్వెల్స్ రావటం కామనే. అయితే ఆ సీక్వెల్స్ అన్ని మొదటదానిలాగానే ఆడాలని రూల్ లేదు. చాలా సార్లు మొదట వచ్చిన చిత్రాన్ని క్యాష్ చేసుకునేందుకే ఈ సీక్వెల్స్ వస్తూంటాయి. అలా వచ్చిన చాలా చిత్రాలు మొదటి రోజు మార్నింగ్ షో కే మటాష్ అయ్యిపోతూంటాయి. ఓ రకంగా ఈ పిజ్జా 3 అలాంటిదే అని చెప్పాలి. 2012లో ఏ మాత్రం ఎక్సెపెక్టేషన్స్ లేకుండా రిలీజైన 'పిజ్జా' సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాతో నటుడిగా విజయ్ సేతుపతి, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ కెరీర్ సెటిలైపోయింది. ఆ తర్వాత ఏడాదే(2013) 'పిజ్జా 2' వచ్చింది. కానీ ఆ స్దాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో పార్ట్ 'పిజ్జా 3- ద మమ్మీ'. ఈ సినిమా తమిళంలో ఆల్రెడీ రిలీజైంది.
Pizza 3 The Mummy
తమిళం వాళ్లకు ఈ హారర్ సినిమా కొత్త అనిపించిందేమో కానీ మనవాళ్లకు మాత్రం ఇలాంటివి ఎన్నో చూసేసారు. ఇలాంటి దెయ్యాలుకు ఎన్నిటికో హాయ్ చెప్పి ఉన్నారు. దాంతో ఈ సినిమా చూస్తున్నప్పుడు నెక్ట్స్ ఫలానా సీన్ వస్తుంది కదా అని ఎదురుచూడటం తప్ప చేసేదేమీ ఉండదు. భయపడటం అనేది అసలు జరగదు. ఈ డబ్బింగ్ సినిమకు అదే జరిగింది. ఎక్కడా మన అంచనాలకు తగ్గకుండా రొటీన్ గా నడుస్తుంది. దానికి తగ్గట్లే ఇంట్రవెల్ దాకా దయ్యం కథలోకి రారు. సెకండాఫ్ లో అసలా దెయ్యం ఎవరనే ప్లాష్ బ్యాక్ కూడా కొత్తగా అనిపించదు. అలా ఈ పిజ్జా పాచిపోయింది. అలాగే పిజ్జా అనే టైటిల్ కు ఈ సినిమాకు సంభందం లేదు. ఆ రెండింటికి ఈ సినిమా సీక్వెల్ కానే కాదు.
Pizza 3 The Mummy
టెక్నికల్ గా ...
హారర్ సినిమాలకు అవసమైన మసాలా ...బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా మూవ్ మెంట్స్. ఇందులో bgm విషయంలో వందశాతం సక్సెస్ అయ్యారు. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం ఆ స్దాయిలో లేదు. ఎడిటింగ్ కూడా ఉన్న సీన్స్ ని ప్రక్కన ప్రక్కన పెట్టి కలిపేసినట్లు ఉంది కానీ షార్ప్ గా లేదు. ఫస్టాఫ్ చాలా ట్రిమ్ చేయాలనిపిస్తుంది. డైరక్టర్ ...పిజ్జా3 అనే టైటిల్ తప్పించి సినిమాలో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా దెయ్యం ప్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మరీ పాతగా అనిపించింది. స్క్రిప్టు లో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అప్పుడు తెరకెక్కించాల్సింది.
Pizza 3 The Mummy
నటీనటుల్లో ..
నలన్ గా అశ్విన్ కాకుమాను బాగా చేశాడు. హీరోయిన్ పవిత్రా మారిముత్తు జస్ట్ ఓకే . మిగతా కీ రోల్స్‌లో నటించిన అభి నక్షత్ర, అనుపమ కుమార్ పర్వాలేదనిపించారు. మిగిలిన వాళ్లందరూ ఓకే ఓకే. హీరోహీరోయిన్ దగ్గర నుంచి ఎవరి యాక్టింగ్ కూడా ఏమంత గొప్పగా అయితే లేదు.
Pizza 3 The Mummy
ఫైనల్ థాట్
హిట్ సినిమాకు సీక్వెల్ అని టైటిల్ పెట్టినంత మాత్రాన అది హిట్ సినిమా అయ్యిపోదు.ఆ సినిమాతో పోలిక వచ్చి ఇబ్బందే కలుగుతుంది.
Rating:2
Pizza 3 The Mummy
నటీనటులు: అశ్విన్ కాకుమాను, పవిత్రా మారిముత్తు, అభి నక్షత్ర, కాళీ వెంకట్ తదితరులు
నిర్మాణ సంస్థ: తిరుకుమరన్ ఎంటర్ టైన్‌మెంట్స్
నిర్మాత: సీవీ కుమార్
దర్శకుడు: మోహన్ గోవింద్
సంగీతం: అరుణ్ రాజ్
ఎడిటర్: అశ్విన్
సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్
విడుదల తేది: 2023 ఆగస్టు 18