ఇద్దరు హీరోయిన్లని డిమాండ్‌ చేస్తోన్న బాలకృష్ణ, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, రవితేజ..ఫ్యాన్స్ కి డబుల్‌ డోస్‌?

First Published | May 14, 2021, 7:56 PM IST

టాలీవుడ్‌ స్టార్స్ ఇద్దరు హీరోయిన్లని డిమాండ్‌ చేస్తున్నారు. బాలకృష్ణ మొదలుకొని పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, రవితేజ, నాని వంటి స్టార్స్‌ ఇద్దరు హీరోయిన్లు కావాల్సిందే అంటున్నారు. తమ ఫ్యాన్స్ కి డబుల్‌ డోస్‌ ఇవ్వబోతున్నారు. 

జనరల్‌గా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లంటే పాత్రకి ప్రయారిటీ కంటే గ్లామర్‌ పరంగానే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు ఇలా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంటారు. ప్రస్తుతం ఈ స్టార్స్ చేస్తున్న సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లని తీసుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఫైనల్‌ కాగా, మరికొన్ని చిత్రాలకు సంబంధించి చర్చల దశలో ఉన్నాయి.
ఈ విషయంలో బాలయ్య ముందున్నారు. ఆయన చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లుంటారు. అలాగే ఇప్పుడు నటిస్తున్న `అఖండ`లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని సమాచారం. ప్రగ్యా జైశ్వాల్‌ ఓ పేరు వినిపిస్తుంది. ఇక వేదిక మరోహీరోయిన్‌గా అనుకుంటున్నారని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దీంతోపాటు బాలకృష్ణ నెక్ట్స్ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులోనూ ఇద్దరు హీరోయిన్లని తీసుకోబోతున్నారట. రాయ్‌ లక్ష్మీని గ్లామర్‌ పరంగా తీసుకుంటున్నారని, మరో హీరోయిన్‌ బాలయ్య సరసన మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా అనుకుంటున్నారట. మీనా పేరు ఫైనల్‌ చేశారని సమాచారం.
పవన్‌ కళ్యాణ్‌ సైతం ఇద్దరు హీరోయిన్లని డిమాండ్‌ చేస్తున్నారట. పవన్‌ కళ్యాణ్‌.. క్రిష్‌ దర్శకత్వంలో `హరిహరవీరమల్లు` చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్‌ ఉందని సమాచారం. ఇందులో ఓ హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ ఫైనల్‌ అయ్యింది. మరో హీరోయిన్‌కి స్కోప్‌ ఉందని టాక్‌.
అయితే రెండో హీరోయిన్‌ ఇంకా ఫైనల్‌ చేయలేదు. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరు వినిపించింది. రకుల్‌ పేరు కూడా ఆ మధ్య చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రభాస్‌ సైతం ఇద్దరు హీరోయిన్లపై మోజు పడుతున్నారని సమాచారం. ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. `రాధేశ్యామ్‌`లో ఓ హీరోయిన్‌ పూజా హెగ్డే నటిస్తోంది. `ఆదిపురుష్‌`లో సీతగా కృతి సనన్‌ నటిస్తుంది.
`సలార్‌`లోనే మరో హీరోయిన్‌కి స్కోప్ ఉందట. ఇందులో శృతి హాసన్‌ ఇప్పటికే ఎంపికైంది. మరో హీరోయిన్‌గా `కేజీఎఫ్‌`ఫేమ్‌ శ్రీనిధి శెట్టిని తీసుకోబోతున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుందని టాక్‌.
మహేష్‌ కూడా ఇద్దరు హీరోయిన్లు కావాలంటున్నారట. మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట`లో నటిస్తున్నారు. ఆ తర్వాత ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. `అతడు`, `ఖలేజా` తర్వాత వీరి కాంబినేషన్‌లో రాబోతున్నసినిమా ఇది. త్రివిక్రమ్‌ రూపొందించే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లని తీసుకోవాలనుకుంటున్నారట.
జనరల్‌గా త్రివిక్రమ్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లుంటారు. `జల్సా`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అత్తారింటికి దారేదీ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంటపురములో` ఇలా అన్ని చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లని తీసుకున్నారు. అదే మాదిరిగా, మహేష్‌ తో చేయబోయే సినిమాలోనే గ్లామర్‌ డోస్‌ పెంచాలని భావిస్తున్నారు.
రవితేజ ఇప్పటికే `ఖిలాడీ` చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్లున్నారు. రమేష్‌ వర్మ రూపొందిస్తున్న ఈ చిత్రంలో డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని సైతం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ కి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న `శ్యామ్‌ సింగ రాయ్‌`లో సాయిపల్లవిని, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Latest Videos

click me!