నటి సురేఖా వాణి ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. తన కూతురుతో కలిసి పొట్టిడ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.
undefined
తాజాగా సురేఖ వాణి, నటి రజితతో కలిసి ఈటీవీలో కమెడీయన్ అలీ హోస్ట్ గా ప్రసారమయ్యే `అలీతో సరదాగా` కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో తన క్రేజ్, ఫ్యామిలీ, సెకండ్ మ్యారేజ్‌పై స్పందించింది. బోల్డ్ కామెంట్ చేసింది. భర్తని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది.
undefined
తన కెరీర్ ప్రారంభమై 22ఏళ్లు అవుతుందని తెలిపింది. సీటీ కేబుల్‌లో కెరీర్ స్టార్ట్ అయ్యిందని, చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు, ఈటీవీలోకి వచ్చానని తెలిపింది.
undefined
తన ఫోటోలంటే సోషల్ మీడియాకి, వెబ్‌సైట్ల వాళ్లకి చాలా ఇష్టమని తెలిపింది. డౌట్‌గా మాట్లాడుతున్నావేంటి? అని అలీ అడగడంతో మళ్లీ ఏం వివాదం అవుతుందో ఏమో అని చెప్పింది సురేఖా వాణి. దీంతో రజిత స్పందిస్తూ, తనకి సోషల్ మీడియాలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు. యమ ఉంది అని చెప్పింది.
undefined
రెండో పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలపై ఆమె స్పందిస్తూ, వాడెవరో మీరే చెప్పండి, చూస్తే కొంచెం డబ్బులున్న వాళ్లని చూడమని చెప్పానని తెలిపింది. డబ్బున్నవాడు కావాలా? డబ్బున్న వాడు కావాలా? అన్న దానికి స్పందిస్తూ, మనసు ఏం చేస్తదండీ, మనసుతో పనులు జరగవని అర్థమైపోయిందని చెప్పింది. దీంతో మీ వెనకాల పెద్ద స్టోరీ ఉందని అలీ అడగడంతో కచ్చితంగా ఉందని చెప్పింది. లవ్వేమో అన్న ప్రశ్నకి వేలు చూపించింది సురేఖ.
undefined
పెళ్లికాకముందు మిథున్ చక్రవర్తితోనూ, జాకీ ఛాన్‌తోనూ నటించానని చెప్పింది సురేఖ. మిథున్ చక్రవర్తితో ఓ ఫోటో చూపిస్తూ సెటైర్లు వేసింది.
undefined
ఈ సందర్భంగా తన భర్త చనిపోయిన తీరుని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఒక్కసారిగా షోని గుంబనంగా మార్చేసింది.
undefined
అత్తగారి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ పై స్పందిస్తూ, భర్త చనిపోయాక ఎవరూ హెల్ప్ చేయలేదని, ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని, పైగా తనని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారని, తాను, తన కూతురు మాత్రమే ఆ పెయిన్‌ని అనుభవించామని, తన ఫ్యామిలీని సెట్ చేసుకున్నామని చెప్పింది సురేఖ వాణి.
undefined