మహేష్ బాబు మ్యాజిక్ 'ముఫాసా: ది లయన్ కింగ్ ' (తెలుగు) రివ్యూ

First Published | Dec 19, 2024, 11:36 PM IST

వాల్ట్ డిస్నీ యానిమేటెడ్ చిత్రం "ముఫాసా: ది లయన్ కింగ్"కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం 2019 "ది లయన్ కింగ్"కి ప్రీక్వెల్‌గా వస్తుంది. ముఫాసా బ్యాక్‌స్టోరీని వివరిస్తూ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది చూడాలి.

Mahesh Babu,Mufasa: The Lion King Movie, Review


వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించే యానిమేషన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ఈ క్రమంలో ఆ సంస్ద నుంచి వచ్చిన తాజా యానిమేటెడ్ ఫిలిం “ముఫాసా ది లయన్ కింగ్”. 2019లో విడుదలైన “ది లయన్ కింగ్”కు ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. అప్పట్లో ది లయన్ కింగ్ కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలు టార్గెట్ గా తీసిన ఈ చిత్రం ఏమేరకు వారిని అలరిస్తుంది. ఫ్యామిలీకు ఈ సినిమా ఈ వారం ఆప్షన్ కానుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..!!

Mufasa


స్టోరీ లైన్


జీవన చక్రంలో భాగంగా సింబా , నాలా మరో బిడ్డను తమ జీవితాల్లోకి ఆహ్వానించటం కోసం అడవులోకి వెళ్లిపోతాయి. ఆ సమయంలో అడవికి వెళ్లే ముందు తమ కుమార్తె  కైరా ని టిమోన్, పుంబాకు అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమంటాయి. ఈ లోగా వర్షం మొదలయ్యే సూచన కనిపిస్తుంది. దాంతో బుజ్జి సింహం పాప కైరా భయపడుతుంది. అప్పుడు రఫీక్ అనే కోతి వచ్చి మీ తాత ముఫాసా ఎంత ధైర్యవంతుడో తెలుసా..అసలు భయపడేవాడు కాదా అని చెప్తాడు. అప్పుడు ఆ పాప..నిజమా ...మా తాత గురించి చెప్పు అంటుంది.

ఆ కోతి ..ముఫాసా స్టోరీ చెప్పటం మొదలెడుతుంది.సాధారణమైన ముఫాసా తన ధైర్య సాహసాలతో ఎలా అడవికి రాజు అయ్యింది. చిన్నప్పుడే తల్లి,తండ్రి నుంచి విడిపోయి ఎలా తన జీవితాన్ని కొనసాగించింది. తన సోదరుడుకు స్కార్ అనే పేరు ఎలా వచ్చింది. అసలు అతను ముఫాసా కు సొంత సోదరుడేనా , వాళ్లిద్దరి మధ్యా విరోధం ఏమిటి,ముఫాసా టీనేజ్ లవ్ స్టోరీ ఏ మలుపు తీసుకుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 


Mufasa-The Lion King, Mahesh Babu, Mufasa


ఎలా ఉంది

వరదల్లో చెల్లా చెదురైన కుటుంబం, హీరో ఒంటిరివాడు అవటం, తన కుటుంబం కోసం తీవ్రమైన వెతుకులాట, వేరే కుటుంబంతో కలిసి పెరిగి పెద్దవటం, టీనేజ్ ప్రేమ, సోదరుల మధ్య గొడవలు ఈ విషయాలతో ఎన్నో సినిమాలు తెలుగు తో పాటు ఎన్నో భాషల్లో వచ్చాయి. హిట్ అయ్యాయి. అయితే ఇంతకాలానికి మళ్లీ ఆ కథతో కాస్తంత యాక్షన్ కలిపి జంతువులతో నడుపుతూ తీసిన చిత్రం ముఫాసా. ప్లాట్ ట్విస్ట్ లు బాగున్నా, పాటలు, డాన్స్ లు ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తీసుకు వచ్చినా పిల్లలను ఆకట్టుకునే కంటెంట్ అయితే మిస్సైంది.
 


తెల్ల జాతి, నల్ల జాతి మధ్య జాతి వైరం లాగ ఈ సినిమాలో తెల్ల సింహాల డామినేషన్, నల్ల సింహాలు అన్ని ఏకమై పోరాడటం కూడా పనిలో పనిగా చూపెట్టారు. ఆఫ్రికా అడవుల్లో జరిగినట్లు చూపించిన ఈ సినిమా విజువల్ మాత్రం చాలా స్టన్నింగ్ గా ఉంది.

టెక్నాలజీ ముందుకు వచ్చి కథ వెనక్కి వెళ్లిపోయింది. అయితే లయిన్ కింగ్ సినిమా చూసిన వారికి అందులో స్కార్ బ్యాక్ స్టోరీ ఏమిటి, ముఫాసా అసలు ఎవరు వంటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తే అందుకు ఈ సినిమా సమాధానం ఇస్తుంది. ముఫాసా బ్యాక్ స్టోరీ చెప్తున్నాం కదా అని మరీ వెనక్కి వెళ్లి మరీ చెప్పినట్లు ఉన్నారు. అంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. 
 


టెక్నికల్ గా 

ఈ సినిమా సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంది. లైవ్ యానిమేషన్ సినిమాకు సహజత్వం తెచ్చింది.. అలాగే డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. మహేష్ బాబు డబ్బింగ్  లో ముఫాసా పాత్ర తాలూకు ఎమోషన్స్ ఫెరఫెక్ట్ గా దించేసారు.

ఆ పాత్రలో ఉన్న స్ట్రగుల్ & పెయిన్ ను ఆడియన్స్ ఓన్ చేసుకునేలా ఉంది. పుంబాకు బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్   టిమాన్ కు అలీ చెప్పిన డబ్బింగ్ ఫన్నీగా ఫెరఫెక్ట్ సింక్ . పిట్ట గొంతుకు షేకింగ్ శేషు వాయిస్ మంచి ఆప్షన్. ఇక టాకా క్యారెక్టర్ కు సత్యదేవ్ వాయిస్, వైట్ లయన్ రోల్ కి అయ్యప్ప శర్మ వాయిస్, రఫీకి క్యారెక్టర్ కి ఆర్.సి.ఎం రాజు వాయిస్ లు బాగా కుదిరాయి.
 

Mahesh Babu


ఫైనల్ థాట్

మహేష్ కోసం అని కాకుండా మంచి యానిమేషన్ మూవీగా ఈ సినిమా చూడవచ్చు. అయితే కథ పరంగా ఎక్కువ ఎక్సెపెక్ట్ చేయకపోతేనే బెస్ట్.

Rating: 2. 5

---సూర్య ప్రకాష్ జోశ్యుల
 

Latest Videos

click me!