‘హిడింబ’ రివ్యూ.. B, C సెంటర్ల గుడుంబా

First Published | Jul 20, 2023, 8:49 AM IST

నరమాంస భక్షకులు అనగానే మనకు హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చాలా కళ్ళ ముందు కనపడతాయి. అయితే మన దేశంలోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారని ...


ఈ మధ్యకాలంలో మనకు విభిన్నతరహా చిత్రాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఆ మధ్యన జాంబీస్ చుట్టూ తిరిగే కథతో జాంబి రెడ్డి వచ్చినట్లు...ఇప్పుడు నరమాంస భక్షకులు చుట్టూ తిరిగే కథతో ఈ ‘హిడింబ’ని వదిలారు. ఈ విషయం మనకు ట్రైలర్ నో అర్దమైంది. పబ్లిసిటీలో కూడా రివీల్ చేసాసారు. దాంతో అసలు ఈ కాలంలో అర్బన్ లో జరిగే ఈ కథాంశానికి ఈ  నరమాంస భక్షకులను ఎలా యాడ్ చేసారనే ఆసక్తి మొదలైంది. దానికి తోడు రివర్స్ ట్రైలర్ రిలీజ్ చేసి మరింత క్రేజ్ పెంచారు. ఇంతకీ ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటి... మనకు నచ్చి,ఆదరించే  కాన్సెప్టేనా చూద్దాం.
 

Hidimbha movie REVIEW

స్టోరీ లైన్

హైదరాబాద్ లో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ లు. పోలీస్ లకు ఆ కేసు సవాల్ గా మారుతుంది.   ఇన్వెస్టిగేట్ ఆపీసర్ అభయ్(అశ్విన్ బాబు) వల్ల కావటం లేదు. ఎక్కడో చోట లింక్ తెగిపోతోంది. అతనికి సాయింగా  కేరళలో దాదాపు ఇలాంటి కేసును చేదించిన ఆద్య(నందితా శ్వేత)ను సీన్ లోకి తీసుకొస్తారు. ఇక్కడో చిన్న ప్లాష్ బ్యాక్ ఏమిటంటే...పోలీస్ ట్రైనింగ్ టైమ్ లో వీరిద్దరూ లవ్ లో ఉంటారు. తర్వాత బ్రేకప్ అవుతారు. ఇక ఇప్పుడు ఇద్దరూ కలిసి కేసుని ఇన్విస్టిగేట్ చేస్తూంటారు. ఈ క్రమంలో  కాలా బండ‌లోని బోయ అనే దుర్మార్గమైన కిడ్నాప్ ముఠాను ప‌ట్టుకుంటారు. వాళ్ల ఆధీనంలో ఉన్న అమ్మాయిలంద‌రినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసిపోయిందన్న ఆనందం ఎంతో సేపు ఉండదు. సిటీలో లో మ‌ళ్లీ మ‌రో అమ్మాయి కిడ్నాప్. దీంతో  అంతా ఎలర్ట్ అవుతారు.  కిడ్నాప్ లు చేసే బోయ పోలీస్ క‌స్ట‌డీలోనే ఉండ‌గా.. ఇదిలా జరిగిందని ఆలోచిస్తారు. 


Hidimbha movie REVIEW


అప్పుడు తాము సేవ్ చేసిన అమ్మాయిలు వేరు...కనిపించకుండా పోయిన అమ్మాయిలు వేరు అని అర్దమవుతుంది.అంతేకాదు ఓ క్లూ దొరుకుతుంది. కిడ్నాప్ చేసేటప్పుడు ఆ క్రిమినల్ కేవలం ఎర్ర డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నాడని అర్దమవుతుంది.  అక్కడ నుంచి  కథ కేరళకు షిప్ట్ అవుతుంది. కేరళ వెళ్ళిన అభయ్, ఆద్య కిడ్నాపులు ఎవరు చేస్తున్నారనే విషయం తెలుసుకుని షాక్ అవుతారు. అసలు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నది ఎవరు? కిడ్నాప్ చేస్తున్న అమ్మాయిలు ఏమౌతున్నారు ?  కిడ్నాపర్స్ కేవలం   రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే ల‌క్ష్యం చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?  అసలు ఇంతకీ హిడింబ? నరమాంసభక్షకులకు ఈ కథకు లింక్ ఏమిటి? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 
 

Hidimbha movie REVIEW

 
విశ్లేషణ
 
ఈ టైటిల్ వినగానే మనకు మహాభారతం గుర్తు వస్తుంది. హిడింబి  పాత్ర మనకు మహాభారతంలో ఆదిపర్వంలోని 18 వ ఆశ్వాసంలో కనపడుతుంది. ఆమె  భీముని భార్య. ఘటోత్కచుడు ఆమె కుమారుడు.  హిడింబి భీముని కలుసుకుంటుంది. వారి సంతానం  ఘటోత్కచుడు మహాభారత యుద్దంలో కీలక పాత్ర పోషిస్తాడు. హిమాచల్ ప్రదేశ్ లో హిడింబాదేవిని దేవతగా ఆరాధిస్తారు. మనాలిలొ ఆమెకు ఓ ఆలయం కూడా ఉంది. అయితే మహాభారత కథనానికి, ఈ సినిమాకు సంభందం ఏమీ లేదు. నరమాంస భక్షకుల చుట్టూ తిరిగే కథ కాబట్టి ఈ టైటిల్ పెట్టినట్లున్నారు.  అలాగే ఈ కథను స్టైయిట్ గా చెప్పకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ... ఒక సీన్ ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంటే ఆ తరువాతి సీన్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నట్టు చూపిస్తూ నడిపారు. దాంతో ఓ పజిల్ లా నడుస్తుంది. 

Hidimbha movie REVIEW


అయితే మారిన ప్రేక్షకుడు ఎంత స్క్రీన్ ప్లే మాయ చేసినా  ఎదర ఏం జరుగుతోందో పట్టేస్తున్నాడు.  అయినా నష్టమేమీ లేదు కానీ..సినిమాలో అసలు కథలోకి రావటానికి చాలా టైమ్ తీసుకున్నారు. అంటే దాదాపు ఇంటర్వెల్ దాకా ఫస్ట్ క్లూ దొరకదు. దాంతో తెరపై వరసపెట్టి సీన్స్ వెళ్తూంటాయి...అసలు విషయం రాలేదే అని పీకుకూంటుంది. ఎందుకుంటే చూసేవాళ్లకు తెలుసు..ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ నరమాంస భక్షకులు అని..వారి కోసమే ఎదురుచూస్తారనే విషయం మర్చిపోయినట్లున్నారు.  సెకండాఫ్ లో మొత్తం కథ పెట్టుకున్నారు. సినిమాలో రివీల్ అయ్యే ట్విస్ట్ అన్ని ఇక్కడే ఉన్నాయి. దాంతో ఫస్టాఫ్ కేవలం కథ ప్రారంభానికే ఉపయోగపడింది. దాంతో సోసో గా నడిచినట్లు అనిపించినా సినిమా ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగా పేలింది.  ఇక నరమాంస భక్షకులు అనగానే మనకు హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చాలా కళ్ళ ముందు కనపడతాయి. అయితే మన దేశంలోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారని చరిత్ర సాయింతో చెప్పే ప్రయత్నం చేసారు. అది కొంత సాగినట్లు అనిపించినా మంచి ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్.   ఇదే సినిమాని నిలబెట్టాలి. 

Hidimbha movie REVIEW


ఎవరెలా చేసారంటే...

అశ్విన్ బాబు ని పూర్తిగా యాక్షన్ మోడ్ లో చూపించిన సినిమా ఇది. ఫెరఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. నార్మల్ సీన్స్ లో పెద్దగా రాణించలేదు. ఫైట్స్ అదరకట్టాడు.  ఐపీఎస్ ఆద్య  గా నందితా శ్వేతా చాలా బాగా చేసింది. కీ రోల్ లో కనిపించే మకరంద్ దేశ్‌పాండే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనేలా చేసారు. రఘు కుంచె మరోసారి తనలోని నటుడుని ఆవిష్కరించారు. , సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ పిళ్ళై తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

Hidimbha movie REVIEW

టెక్నికల్ గా...

దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని తనకున్న ఆర్దిక వనరులతో టెక్నికల్ సపోర్ట్ తో బాగానే ప్రయత్నించాడని చెప్పాలి.  కొత్తదనం చూపాలి అనే తపన సెకండాఫ్ లో పూర్తిగా కనపడతుంది.ఇక  ఈ సినిమాకు హైలెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అది గుండెలు అదరకొట్టేలా ఉంది.  పాటలు మాత్రం బాగోలేదు. లెగ్త్ ఎక్కువ కాదు కానీ..రిపీట్ సీన్స్ ఎడిటింగ్ లో లేపాయిల్సింది. కెమరాపనితనం డీసెంట్ గా వుంది.  ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. కాస్ట్యూమ్స్, మేకప్ డిపార్టమెంట్స్ కష్టం కనిపిస్తుంది. ఈ సినిమాలో మరో పెద్ద  హైలెట్ ఫైట్స్.  స్టంట్ కొరియోగ్రాఫర్స్ కొత్తగా ట్రై చేసి మెప్పించారు.  

Hidimbha movie REVIEW


ప్లస్ లు 

సెకండాఫ్ లోవచ్చే ఫైట్స్
కొత్త తరహా స్టోరీ లైన్
ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 

Hidimbha movie REVIEW

మైనస్ లు 

పాటలు
ఇలాంటి కాన్సెప్టులుకు అవసరమైన టెక్నికల్ స్టాండర్డ్స్  తగ్గటం
ఫస్టాఫ్ లో బోర్ కొట్టించే ఇన్విస్టిగేషన్ సీన్స్
సిజ్జూ ఫ్లాష్ బ్యాక్ 

Hidimbha movie REVIEW


ఫైనల్ థాట్

ఇది B,C సెంటర్ల గుడుంబా. ఓ విభిన్న తరహా సినిమాగా చూడచ్చు. అయితే హింస, రక్తపాతం కు ప్రిపైర్ అయ్యి వెళ్లాలి.వాయిలెన్స్ ని కూడా క్రియేటివ్ గా, స్టైలిష్ గా చూపించిన విధానం కొందరికి నచ్చచ్చు

Rating: 2.5

Hidimbha movie REVIEW

తెర వెనుక..ముందు


న‌టీన‌టులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు, 
సంగీతం:  వికాస్ బాడిస‌, 
ఛాయాగ్ర‌హ‌ణం:  బి.రాజ‌శేఖ‌ర్‌, 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి, 
నిర్మాత‌:  గంగప‌ట్నం శ్రీధ‌ర్‌, 
స‌మ‌ర్ప‌ణ‌:  అనిల్ సుంక‌ర‌, 
విడుద‌ల తేదీ:  20-07-2023

Latest Videos

click me!