#UrvasivoRakshasivo: అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ

First Published | Nov 4, 2022, 2:04 PM IST

స్నేహం, ప్రేమ మధ్య కన్ఫ్యూజన్ లో శారీరక సంబంధం దాకా వెళ్లిన ఓ అమ్మాయి అబ్బాయి కథ ఇది. లైన్ మరీ కొత్తేమి కాదు కానీ ఒరిజినల్ వెర్షన్ ట్రీట్ మెంట్ లో ఉన్న ఫ్రెష్ నెస్ వల్ల యూత్ కి కనెక్ట్ అయ్యింది. వాళ్లనే నమ్ముకుని శిరీష్ తో ఈ రిస్క్ చేసాడు.

Urvasio Rakshasivo movie review

కంటెంట్ బలంగా లేకపోతే ఓ మాదిరి హీరోలకు హిట్ టాక్ రావటం కూడా చాలా కష్టంగా ఉంది. గౌరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యిన అల్లు శిరీష్ ఎన్ని సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. చివరిగా సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో ఆయన ఏబీసీడీ అనే ఒక మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమా 2019లో రిలీజ్ అయినా అది పెద్దగా ఉపయోగ పడలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇదిగో ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. మొదట్లో ప్రేమ కాదంట అనే టైటిల్ తో ప్రమోట్ అయిన ఈ సినిమా టైటిల్ మార్చుకుని మన ముందుకు వచ్చింది. ఈ సినిమా అల్లు శిరీష్ కెరీర్ కు ఏమన్నా ఉపయోగపడిందా...టైటిల్ మార్చాక ఈ సినిమా ఫేట్ మారిందా..అసలు ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

Urvasio Rakshasivo movie review

కథాంశం

మిడిల్ క్లాస్ కుర్రాడు శ్రీ కుమార్ (అల్లు శిరీష్) చాలా కాలంగా  సింధూజ (అనూ ఇమ్మాన్యుయేల్)కి లైన్ వేస్తూంటాడు. కానీ ఆ ముక్క ఆమెతో చెప్పలేడు. ఈ లోగా అతని అదృష్టం పండి...అతని ఆఫీసులో జాయిన్ అవుతుంది. దాంతో ఆమె దృష్టిలో పడేలా నానా తిప్పలూ పడతాడు. ఆమె అతనితో జర్నీకు ఇష్టపడుతుంది. పబ్ కు పిలుస్తుంది. కలిసి బెడ్ షేర్ చేసుకుందామంటుంది.  అమెరికాలో చదువుకుని ఇండియా వచ్చిన సింధూజకు డేటింగ్, రొమాన్స్ ఇవన్ని చాలా మామూలు విషయాలు. కానీ శ్రీకుమార్ కు అలా కాదు.ఆమెతో సీరియస్ గా లవ్ లో పడిపోయి..ఆమెను లైఫ్ పార్టనర్ గా తన జీవితంలోకి ఆహ్వానించాలని ఫిక్సైపోతాడు. కానీ మోడ్రన్ గాళ్ సింధూజకు పెళ్లి అంటే ఇష్టం లేదు. పెళ్లి,పిల్లలు తన కెరీర్ గోల్స్ కు అడ్డం పెడతాయని, స్వేచ్చ కోల్పోతామని అంటూంటుంది. దాంతో శ్రీకుమార్ ని ఒప్పించి..లివ్ ఇన్ రిలేషన్ స్టార్ట్ చేస్తుంది.  


Urvasio Rakshasivo movie review


అందుకోసం.. తన ఇంటికి రెండు వీధుల అవతల ఇల్లు అద్దెకు తీసుకుని సహ జీవనం స్టార్ట్ చేస్తాడు శ్రీ కుమార్. అక్కడ నుంచి శ్రీకుమార్ టాస్క్...ఇంట్లో తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్)కు ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయడమే.మరో ప్రక్క శ్రీకుమార్ కు సంభందాలు చూస్తూంటారు వాళ్లు. సంభందాలు చూసే పెళ్లిళ్ల బ్రోకర్ (పోసాని) కంట్లో ఈ సహజీవనం వ్యవహారం పడుతుంది. మరో ప్రక్క ఇంటి నుంచి రహస్యంగా రాత్రిళ్లు వెళ్లి సింధూని కలిసే ప్రాసెస్ లో రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఎవరికైతే తెలియకూడదనుంటారో వాళ్లకే రివీల్ అయ్యే పరిస్దితి ఏర్పడుతుంది. అప్పుడు  శ్రీ కుమార్ ఏం చేశాడు? సింధుని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా? లేదంటే  సహ జీవనం కంటిన్యూ చేశాడా? చివరకు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ:
2018 లో వచ్చిన Pyaar Prema Kaadhal అనే తమిళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం దాదాపుగా అదే ఫార్మెట్ ని ,ఫీల్ ని క్యారీ ఫార్వర్డ్ చేసారు. అయితే తెలుగు కోసం చేసిన మార్పులు, ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి.  టీజర్ చూశాక అల్లు శిరీష్ మీద ఇంత హెవీ రొమాన్స్ వర్కౌట్ అవుతుందానే అందరికీ  అనుమానం మాట నిజం. అయితే శిరీష్ స్లో అయ్యినప్పుడల్లా.. అను ఇమ్మానియేల్ లీడ్ తీసుకుని లాక్కెళ్లిపోయింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సింపుల్ కథ ఉండటమే కలసి వచ్చింది. అందులోనూ కాస్మోపాలిటిన్ సిటీల్లో లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ కామన్ గా మారుతున్న నేపధ్యంలో కథాంశం సమకాలీన,సమస్యను డీల్ చేసినట్లు అయ్యింది. 

Urvasio Rakshasivo movie review


పరిష్కారం..ప్రేమ,పెళ్లి దగ్గరే ఆగింది కానీ సీన్స్ మాత్రం హాట్ గా ఉండి..యూత్ కు నచ్చేట్లు ఉన్నాయి. అలాగే  లీడ్ పెయిర్ మధ్య ఘాటైన కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది.  డైలాగులు కూడా అందుకు తగ్గట్లుగానే కలిసివచ్చాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి కామెడీ సీన్స్ సినిమాని మోసేసాయి. మరో ప్రక్క సునీల్ కూడా తనదైన పంచ్ లతో సాయిం పట్టాడు. స్నేహం, ప్రేమ మధ్య కన్ఫ్యూజన్ లో శారీరక సంబంధం దాకా వెళ్లిన ఓ అమ్మాయి అబ్బాయి కథగా ఇది జనాల్లోకి వెళ్లటమే కలిసొచ్చే అంశం. లైన్ మరీ కొత్తగా అనిపించకపోయినా ట్రీట్ మెంట్ లో ఉన్న ఫ్రెష్ నెస్ వల్ల యూత్ కి కనెక్ట్ అయ్యింది.కాకపోతే కాస్తంత ఎమోషన్స్ రైజ్ చేసే విషయంలో ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేది అనిపించింది.
 

Urvasio Rakshasivo movie review

దర్శకత్వం, మిగతా విభాగాలు
ఈ సినిమాకు ఉన్న ఇబ్బంది..గీత దాటితే బూతు...అలాగని ఈ కాన్సెప్టుకు మడికట్టుకు కూర్చోలేరు. దాంతో చాలా బాలెన్స్ గా సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి. అందులోనూ రీమేక్. తేడా కొడితే పాడు చేసారంటారు. ఇన్ని టాస్క్ లు మధ్య తన బలాలని చూపిస్తూ..   ద‌ర్శ‌కుడు రాకేష్ శ‌శి. కామెడీని స్ట్రాంగ్ గా వాడుకుంటూ ఎంగేజ్ చేసారు. ముఖ్యంగా సెకండాఫ్ ని బోర్ కొట్టించకుండా లాక్కెళ్లాడు.   అలాగే దొరికింది కదా అని ఓవర్ సెంటిమెంట్ ప్లే చేసి, విరక్తి పుట్టించలేదు. సీరియస్ సిట్యువేషన్స్ లో సైతం ఫన్ ని వెతికారు. అది డైలాగు కావచ్చు... సీన్ కావచ్చు. ఇక టెక్నికల్ గా మంచి సౌండ్ గా ఉంది ఫిల్మ్. అన్ని విభాగాల నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నాడు డైరక్టర్. పాటలు బాగున్నాయి. తీసిన విధానం కలర్ ఫుల్ గా ఉంది.  సినిమాటోగ్రఫీ క్లాస్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైలాగులు బాగా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.

 
నటీనటులు..
అల్లు శిరీష్ అద్బుతం అని చెప్పలేం. తీసి పారేయలేం. అతను గతంలో కన్నా నటనలో ఇంప్రూవ్‌మెంట్ చూపించాడు.  కామెడీ టైమింగ్‌లో కూడా బాగానే వర్కవుట్ అయ్యింది! ఇక ఈ సినిమాను మొత్తం మోసింది... మోడ్రన్ గాళ్‌ చేసిన అనూ ఇమ్మాన్యుయేల్. లిప్ లాక్ లు,  గ్లామర్ సీన్స్ తో దుమ్ము రేపింది. అయితే ఎమోషనల్ సీన్స్‌లో తేలిపోయింది.  సునీల్, 'వెన్నెల' కిశోర్, పోసాని కృష్ణమురళి కు ఫన్ టైమింగ్ కు తగ్గ కామెడీ సీన్స్ పడ్డాయి.  తల్లిగా ఆమని తనలోని నటిని చూపించింది. హీరోయిన్ తండ్రిగా పృథ్వీ ఓకే.


బాగున్నవి:
కుర్రాళ్లకు నచ్చే మసాలా సీన్స్ ని మోడ్రన్ గా తీయటం
అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్
పోసాని, వెన్నెల కిషోర్ కామెడీ

బాగోలేనివి
ఎమోషన్ సీన్స్ లో డెప్త్ క్రియేట్ చేయకపోవటం
రొటీన్ ఫార్మెట్ లో కొత్త మలుపులు లేకుండా కథ నడవటం


ఫైనల్ థాట్:
మూడు హగ్గులు..ఆరు కిస్సులు ఒక్కోసారి భాక్సాపీస్ కు కిక్ ఇస్తాయి.అయితే ఫ్యామిలీలు చూడ్డానికి హద్దుని ఏర్పడుస్తాయి.
Rating: 2.75
సూర్య ప్రకాష్ జోశ్యుల


ఎవరెవరు..

నటీనటులు : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, 'వెన్నెల' కిశోర్, ఆమని, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిల్లా, కేదార్ శంకర్ తదితరులు
కథ : ఎలాన్
ఛాయాగ్రహణం : తన్వీర్
పాటలు, నేపథ్య సంగీతం: అచ్చు రాజమణి (మాయారే సాంగ్ : అనూప్ రూబెన్స్)
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాతలు : తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం 
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : రాకేశ్ శశి
విడుదల తేదీ: నవంబర్ 4, 2022
 

Latest Videos

click me!