`అలప్పుజ జింఖానా` మూవీ ఓటీటీ రివ్యూ.. స్పోర్ట్స్ కామెడీ డ్రామా ఓటీటీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?

Published : Jun 13, 2025, 09:10 AM ISTUpdated : Jun 13, 2025, 11:34 AM IST

మలయాళంలో ఘన విజయం సాధించిన `అలప్పుజ జింఖానా` చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
`అలప్పుజ జింఖానా` మూవీ రివ్యూ

మలయాళ చిత్రం `ప్రేమలు`తో ఆకట్టుకున్నాడు నస్లేన్‌. ఆయన హీరోగా నటించిన మరో చిత్రం `అలప్పుజ జింఖానా`. ఇది మలయాళంలో రూపొంది ఆకట్టుకుంది. తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. కానీ అంతటి ఆదరణ పొందలేదు.

 ఇందులో నస్లేన్‌తోపాటు లక్‌మన్‌ అవరన్‌, గణపతి ఎస్‌ పొడువల్‌, సందీప్‌ ప్రదీప్, అనఘరవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్‌, బేబీ జీన్‌ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఖలీద్‌ రెహమాన్‌ దర్శకత్వం వహించారు. 

ఈ మూవీ నేటి (శుక్రవారం -జూన్‌ 13) నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. థియేటర్‌ ఆడియెన్స్ ని మెప్పించిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేలా ఉందా? అనేది రివ్యూలో చూద్దాం.

26
`జింఖానా` మూవీ కథ ఏంటంటే

నస్లేన్‌, బేబీ జీన్‌, సందీప్‌ ప్రదీప్‌, ఫ్రాంకో ఫ్రాన్సిస్‌, శివ హరిచరణ్‌, గణపతి అలప్పుజాకి చెందిన ఆకతాయి కుర్రాళ్లు. వీరంతా ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ అవుతారు. ఒక్క షణవాస్‌ మాత్రమే పాస్‌ అవుతాడు. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీలో జాయిన్‌ అవ్వాలనుకుంటారు. 

దీంతో స్థానికంగా ఉన్న అలప్పుజా జింఖానా బాక్సింగ్‌ అకాడమీలో చేరతారు. లక్మన్‌ అవరన్‌ వీరికి కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆయన సారథ్యంలో బాక్సింగ్‌, కుస్తీ పోటీల్లో శిక్షణ తీసుకుంటారు. స్థానికంగా జరిగిన పోటీల్లో విజయం సాధిస్తారు. 

ఆ తర్వాత కేరళా స్టేట్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవుతారు. లోకల్‌గా గెలిచిన వీరు ప్రొఫేషనల్‌గా ఆడే స్టేట్‌ బాక్సింగ్‌ పోటీల్లో విజయం సాధించారా? అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? 

ఈ క్రమంలో వాళ్లు నేర్చుకున్నది ఏంటి? వారిలో వచ్చిన మార్పేంటి? అంతిమంగా పోటీల్లో విన్‌ అయ్యారా? డిగ్రీలో సీట్లు సంపాదించారా? అనేది మిగిలిన కథ.

36
`జింఖానా` మూవీ విశ్లేషణ

బాక్సింగ్‌ క్రీడా నేపథ్యంలోని చిత్రమిది. అలాగని సీరియస్‌గా సాగే స్పోర్ట్స్ డ్రామా కాదు. దానికి పూర్తి భిన్నంగా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌ వేలో రూపొందించారు. ఇదే ఈ సినిమా ప్రత్యేకత. ఆరుగురు ఆకతాయి కుర్రాళ్ల జర్నీ, వారు చేసే కొంట చేష్టలు, బాక్సింగ్‌ ఎక్స్ పీరియెన్స్ పొందడం, ఈ క్రమంలో వాళ్లు పొందే అనుభవాలు, వారు నేర్చుకున్న జీవిత పాఠాల సమాహారమే ఈ మూవీ.

సినిమాని సీరియస్‌గా కాకుండా ఆద్యంతం కామెడీ వే లో తీసుకెళ్లడం ఈ మూవీ స్పెషాలిటీ. అదే ఈ సినిమా సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు. ఆరుగురు ఆకతాయి కుర్రాళ్లు ఇంటర్‌ లో ఫెయిల్‌ కావడంతో సినిమా ప్రారంభమవుతుంది. 

ఫెయిల్‌ అయితే మన ఇంట్లో పేరెంట్స్ తో తిట్లు ఎలా ఉంటాయో, ఇది కూడా అలానే స్టార్ట్ అవుతుంది. అక్కడే ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తోంది. అక్కడి నుంచే కామెడీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఆకతాయి బ్యాచ్‌ చేసే అల్లరి చిల్లరి పనులు, కొంటె డైలాగ్‌లు ట్రెండీగా ఉంటాయి. ఇప్పటి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. 

దీంతో ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగుతుంది. ఇక బాక్సింగ్‌ ట్రైనింగ్‌ తీసుకునేటప్పుడు వీళ్లు పడే బాధలు, ఇబ్బందులు కామెడీగా ఉంటాయి. సందర్భానుసారంగా సాగే కామెడీ ప్రధానంగానే మొదటి భాగం మొత్తం సాగుతుంది. అందులో హీరో లవ్‌ ట్రాక్‌ లు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.

46
`జింఖానా` మూవీలోని హైలైట్స్, మైనస్‌లు

ఇక స్టేట్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనడం నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అయితే జనరల్‌గా స్టేట్‌ వైడ్‌ బాక్సింగ్‌ పోటీలంటే కథ సీరియస్‌గా మారుతుంది. కానీ దాన్ని కూడా వినోదాత్మకంగా రూపొందించిన తీరు బాగుంది. 

అదే సమయంలో బాక్సింగ్‌లోని అనుభవాలను, అనుభూతులను, జీవితానికి సంబంధించిన పాఠాలు వంటివి అంతర్లీనంగా చర్చించిన తీరు బాగుంది. అది కూడా ఏదో క్లాస్‌ చెప్పినట్టుగా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చూపించిన విధానం ఈ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఆరుగురు గ్యాంగ్‌ మధ్య జరిగే కన్వర్జేషన్‌, వారి కొంటె సమాధానాలు, కొంటె పనులు చివరి వరకు చూపించిన తీరు బాగుంది. 

క్లైమాక్స్ కాస్త సీరియస్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. బాక్సింగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆద్యంతం రసవత్తరంగా అనిపిస్తుంది. అదే సమయంలో అందులోనూ వినోదాన్ని వదల్లేదు. తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా అలేఖ్య చిట్టి పికిల్స్, బాలయ్య మాస్‌ డైలాగులు వంటి వాటిని ఇందులో వాడటం హైలైట్‌గా నిలిచాయి.

 అవి హిలేరియస్‌గా అనిపిస్తాయి. అదే సమయంలో కథనం కాస్త స్లోగా సాగుతుంది. ప్రచారం జరిగినంతగా కామెడీ లేదు. దీనికితోడు ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. ఇవే సినిమాకి  మైనస్‌గా చెప్పొచ్చు.

56
`జింఖానా` మూవీలోని నటీనటుల పర్‌ఫర్మెన్స్

నస్లేన్‌ లీడ్‌ రోల్ లో మెప్పించాడు. `ప్రేమలు` చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి దగ్గర అయ్యాడు. దీంతో ఈ మూవీలోని అతని పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. సహజమైన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ ఆయన వేసే పంచ్‌లు బాగా పేలాయి. తన ఫ్రెండ్స్ బేబీ జీన్‌, సందీప్‌ ప్రదీప్‌, ఫ్రాంకో ఫ్రాన్సిస్‌, శివ హరిచరణ్‌, గణపతి సైతం అంతే సహజంగా చేశారు. 

అల్లరి బ్యాచ్‌కి పర్‌ఫెక్ట్ గా సెట్‌ అయ్యారు. కోచ్‌గా లుక్మాన్‌ అవరన్‌ సహజమైన నటనతో మెప్పించారు. క్లైమాక్స్ లో మాత్రం అదరగొట్టారు. సినిమాలో హీరోయిన్లు ఉన్నారు, కానీ వారి పాత్రలకు ప్రయారిటీ లేదు. ఉన్నంతలో అనఘా రవి కాసేపు మెరిసింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

66
`జింఖానా` చిత్రంలోని టెక్నీషియన్ల పనితీరుః

విష్ణు విజయ్‌ సంగీతం బాగానే ఉంది. బీజీఎం కూడా ఆకట్టుకుంది. ఇక జిమ్‌ షి ఖలీడ్‌ కెమెరావర్క్, విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్‌ పరంగా కొంత కట్‌ చేయోచ్చు. దర్శకుడు ఖలీడ్‌ రెహమాన్‌ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది, కానీ స్లోగా సాగడం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. 

ఫస్టాఫ్‌లో కథనే ఉండదు, ఇక ఎమోషన్స్ లో సహజత్వం మిస్‌ అయ్యింది. దీంతో ఆయా సన్నివేశాలు చప్పగా అనిపిస్తాయి. తెలుగు డైలాగులు మాత్రం సినిమాకే హైలైట్‌. కేవలం సందర్భానుసారంగా సాగే కామెడీని, డైలాగ్‌లను నమ్ముకుని చేసిన ప్రయత్నమిది. సరదాగా టైమ్‌ పాస్ కి చూడొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories