`థగ్‌ లైఫ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబో `నాయకుడు`ని మించిన హిట్‌ కొట్టారా?

Published : Jun 05, 2025, 01:00 PM ISTUpdated : Jun 05, 2025, 01:16 PM IST

కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ `థగ్‌ లైఫ్‌`. ఈ చిత్రం నేడు గురువారం విడుదలయ్యింది. ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

PREV
16
`థగ్‌ లైఫ్‌` మూవీ తెలుగు రివ్యూ

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటించిన లేటెస్ట్ మూవీ `థగ్‌ లైఫ్‌`. దీనికి మణిరత్నం దర్శకత్వం వహించడం విశేషం. సుమారు 38 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ఇది. అప్పట్లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన `నాయకుడు` సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లకు మళ్లీ కలిసి పని చేశారు. 

ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్‌, అశోక్‌ సెల్వన్‌, జోజో జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ పతాకాలపై కమల్‌ హాసన్‌, మణిరత్నం, మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో సుధాకర్‌ రెడ్డి విడుదల చేశారు. 

ఈ మూవీ నేడు గురువారం(జూన్‌ 5)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. మరి కమల్‌, మణిరత్నం కాంబోలో వచ్చిన ఈ చిత్రం `నాయకుడు`ని మించిన విజయం సాధించిందా? ఇంతకి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

26
`థగ్‌ లైఫ్‌` కథ ఏంటంటే?

రంగరాయ శక్తిరాజు(కమల్‌ హాసన్‌)ది నెల్లూరు. కానీ ఢిల్లీలో ఒక గ్యాంగ్‌ స్టర్‌గా ఎదుగుతాడు. ఓ సెటిల్‌మెంట్‌ టైమ్‌లో పోలీసులు ఎటాక్‌ చేస్తారు. ఇందులో పేపర్‌ వేసే చిన్నోడు అమర్‌(శింబు) తండ్రి చనిపోతాడు. ఆ గొడవల్లోనే తన చెల్లి చంద్ర(ఐశ్వర్యా లక్ష్మి)ని మిస్‌ చేసుకుంటాడు అమర్‌. ఆ అమర్‌ని అడ్డుగా పెట్టుకుని పోలీసుల నుంచి తప్పించుకుంటాడు శక్తిరాజు. తన ప్రాణాలను కాపాడిన అమర్‌ని కొడుకులా పెంచుకుంటాడు. 

తాను చేసే మాఫియా పనుల్లోనూ అతన్ని భాగం చేస్తాడు. తన తర్వాత తనలా పెంచుతాడు. మాణిక్యం(నాజర్‌) కూతురుని మోసం చేసిన సదానంద్‌(మషేష్‌ మంజ్రేకర్‌) అల్లుడిని చంపిన కేసులో జైలుకి వెళ్తాడు శక్తిరాజు. దీంతో తన మాఫియా సామ్రాజ్యాన్ని చూసుకునే బాధ్యత అమర్‌కి అప్పగిస్తాడు. ఆయనకు మాణిక్యం, పాథ్రోస్‌(జోజూ జార్జ్) సపోర్ట్ గా ఉంటారు. అయితే శక్తిరాజు జైలు నుంచి వచ్చేలోపు అమర్‌ మనసు మార్చేస్తారు మాణిక్యం.

 తనపై ఎటాక్‌ జరిగిన నేపథ్యంలో అమర్‌నే అనుమానిస్తాడు శక్తిరాజు. దీంతో మాణిక్యం, పాథ్రోస్‌ కలిసి అమర్‌ని రెచ్చగొడతారు. తన తండ్రిని చంపింది శక్తిరాజునే అని చెబుతారు. దీంతో శక్తిరాజుని చంపేద్దామని ప్లాన్‌ చేస్తారు. కాశ్మీర్‌కి తీసుకెళ్ళి చంపేస్తారు. మరి శక్తిరాజు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు. తనని మోసం చేసిన వారిపై ఎలా పగతీర్చుకున్నారు. ఇందులో ఇంద్రాణి(త్రిష) పాత్రేంటి? అమర్‌కి మాటిచ్చినట్టు తన చెల్లి చంద్రని శక్తిరాజు వెతికి తెచ్చాడా? తనని చంపాలనుకున్న అమర్‌ని రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

36
`థగ్‌ లైఫ్‌` విశ్లేషణ

మాఫియా నేపథ్యంలో, గ్యాంగ్‌స్టర్‌ కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. `థగ్‌ లైఫ్‌` కూడా ఆ జాబితాలో వచ్చిన మూవీనే. కథ పరంగా కొత్తగా ఏం లేదు. తన సొంత కొడుకులా పెంచిన వాడే, తనని వెన్నుపోటు పొడిచి, తననే చంపాలనుకోవడం, వారిని క్లీన్‌ చేసేందుకు హీరో మళ్లీ రావడం, ఈ క్రమంలో ఆయన సర్వస్వం కోల్పోవడమే ఈ కథ. 

అయితే సినిమాని మాఫియా, గ్యాంగ్‌స్టర్‌ ఎలిమెంట్లు చుట్టూనే తిప్పకుండా ఫ్యామిలీకి, ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు మణిరత్నం. ఇక మాఫియాలో గొడవలు కామన్‌, మన అనుకున్నవాళ్లే మోసం చేయడం కామన్‌గానే జరుగుతుంది. ఇందులోనూ అదే చూపించారు. దీంతో కథ పరంగా ఊహించినట్టుగానే ఉంది. 

కథ ట్రైలర్‌లోనే అర్థమైపోయింది. థియేటర్‌లో మ్యాజిక్‌ చేయాలి. కానీ ఆ మ్యాజిక్‌ ఆశించిన స్థాయిలో లేదు. కాకపోతే కమల్‌ హాసన్‌ నటన, మణిరత్నం టేకింగ్‌ సినిమాకి బ్యాక్‌బోన్‌లా నిలిచాయని చెప్పొచ్చు. కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం కాకుండా ఫ్యామిలీ రిలేషన్స్ కి, ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. 

అదే ఇందులో కొత్త పాయింట్‌. ఆ ఎమోషన్స్ తో సినిమాని నడిపించిన తీరుబాగుంది. దీనికితోడు త్రిష పాత్రతో కమల్‌ రొమాన్స్, తన భార్యగా చేసిన అభిరామితో రొమాన్స్ యూత్‌ని ఆకట్టుకునే అంశాలు. సీరియస్‌ ఫిల్మ్ లోనూ ఇలాంటి రొమాన్స్ జోడించడం విశేషమనే చెప్పాలి.

46
`థగ్‌ లైఫ్‌` హైలైట్స్, మైనస్‌ లు

ఇక సినిమా పరంగా చూస్తే ఫస్టాఫ్‌ అంతా రంగరాయ శక్తిరాజు పాత్రని ఎస్టాబ్లిష్‌ చేశారు. 1994, 2016 లో తన జీవితంలో జరిగిన సంఘటనలు చూపించి సినిమాపై ఆసక్తిని, క్యూరియాసిటీని పెంచారు. సినిమా చాలా వరకు 2016 పీరియడ్‌లో జరిగినట్టుగా ఉంటుంది. 

కమల్‌ గ్యాంగ్‌స్టర్‌ గా ఎదగడం, జైలుకు వెళ్లడం, ఆ తర్వాత అమర్‌ తన స్థానంలోకి రావడం, త్రిష పాత్ర ఎంట్రీ ఇవ్వడం, త్రిషతో కమల్‌ రొమాన్స్ ఫస్టాఫ్‌లో వచ్చే ఎలిమెంట్లు. అయితే ఇవన్నీ కొంత సాగదీసినట్టుగా ఉంటుంది.

 కానీ ఇంటర్వెల్‌ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఊహించని ట్విస్ట్ తో కథ మొత్తం రివర్స్ అవుతుంది. దీంతో సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆ తర్వాత కమల్‌ కమ్‌ బాక్‌ ఇచ్చే సీన్లు కూడా కొంత షార్ట్ గా చూపించాల్సింది. సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. అదే సమయలో ఎమోషనల్‌గా ఉంటుంది. 

తన భార్య లక్ష్మిని చూసి కమల్‌ ఎమోషనల్‌ కావడం ఆకట్టుకుంది. క్లైమాక్స్ మాత్రం పీక్‌లో ఉంటుంది. అటు సీరియస్‌నెస్‌, ఇటూ ఎమోషన్స్ ని మేళవించి క్లైమాక్స్ ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఆయా సీన్లు గుండెని బరువెక్కిస్తాయి. దీంతో క్లైమాక్స్ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. 

అయితే సినిమాని సాగదీసినట్టుగా ఉండటం, కథ ఊహించేలా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. దీనికితోడు బీజీఎం కూడా ఆశించిన స్థాయిలో లేదు. కమల్‌, త్రిష సీన్లు.. త్రిష, శింబు సీన్లు, జైలు సీన్లు అనవసరంలా అనిపిస్తాయి. కమల్‌ కామెడీ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్‌ కాలేదు. కానీ తనకు అమ్మాయిల అలవాటు, వ్యాధి అంటూ చెప్పిన డైలాగ్‌ మాత్రం అదిరిపోయింది.

56
`థగ్‌ లైఫ్‌` నటీనటుల పర్‌ఫర్మెన్స్

కమల్‌ హాసన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్ర ఏదైనా అందులో జీవిస్తారు. పాత్రకి ప్రాణం పోస్తారు. ఆయన కెరీర్‌లో ఎన్నో పాత్రలకు లైఫ్‌ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో రాంగరాయ శక్తిరాజు పాత్రలోనూ అదరగొట్టారు. 

మూడు డిఫరెంట్‌ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక వృద్ధుడి పాత్రలో ఆయన విశ్వరూపం చూపించారు. పెద్ద వయస్కుడిగానూ అదరగొట్టాడు. ఆయన తెరపై ఉంటే మన కళ్లు ఆయన్ని తప్ప మరెవ్వరినీ చూడలేవు. 

ఇందులోనూ అలాంటి మ్యాజికే చేశారు కమల్‌. ఇక అమరన్‌ పాత్రలో శింబు సైతం మెప్పించాడు. వాహ్‌ అనిపించాడు. చాలా చోట్ల కమల్‌కి ధీటుగా చేశారు. ఇంద్రాణి పాత్రలో త్రిష కనిపించింది. ఉంపుడుగత్తెని తలపించే పాత్రలో, కమల్‌ కి రొమాంటిక్‌ ఇంట్రెస్ట్ గా కనిపించి మెప్పించింది. 

కమల్‌ భార్యగా అభిరామి సైతం ఆకట్టుకుంది. సహజమైన నటనతో అలరించింది. మాణిక్యం పాత్రలో నాజర్‌ జీవించాడు. పాథ్రోస్‌గా జోజూ జార్జ్ పాత్ర ఓకే అనిపిస్తుంది. కానీ అంతగా ప్రయారిటీ లేదు. పోలీస్‌ అధికారిగా అశోక్‌ సెల్వన్‌ పాత్ర బాగుంది. కాసేపు కనిపించి ఐశ్వర్య లక్ష్మి సైతం మెప్పించింది. తనికెళ్ల భరణి, మహేష్‌ మంజ్రేకర్‌, అలీ ఫాజర్‌ వంటి వారు తమదైన నటనతో మెప్పించారు.

66
`థగ్‌ లైఫ్‌` టెక్నీషియన్ల పనితీరు, రేటింగ్‌

ఏఆర్‌ రెహ్మాన్‌  పాటలు బాగున్నాయి. కానీ బీజీఎం విషయంలో రెహ్మాన్‌ న్యాయం చేయలేకపోయారు. ఆశించిన స్థాయిలో బీజీఎం లేకపోవడంతో కొంత నిరాశగా ఉంటుంది. ఇక రవి కె చంద్రన్‌ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ అదిరిపోయింది. విజువల్ గా కనువిందు చేస్తుంది.

 శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ ఓకే. కానీ ఇంకా కట్‌ చేయాల్సింది. దర్శకుడు మణిరత్నం తనకు ఇలాంటి కథలు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఇంకా బాగా చేయాల్సింది. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా చేస్తే బాగుండేది. 

అయితే సినిమాని చాలా వరకు ఎమోషనల్‌గా చూపించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమా వేరే లెవల్‌లో ఉంది.  టెక్నీకల్‌గా సినిమా  బాగానే ఉందని చెప్పొచ్చు.

ఫైనల్‌గాః కమల్‌ నటన, ఎమోషన్స్ కోసం సినిమా చూడొచ్చు. గ్యాంగ్‌స్టర్స్ చిత్రాల్లో ఓ డిఫరెంట్‌ మూవీగా `థగ్‌ లైఫ్‌` నిలుస్తుంది.

రేటింగ్‌.2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories